గుర్తించగలిగే వృత్త పద్యాలు
1) భ ర న భ భ ర వ - ఉత్పలమాల
2) న జ భ జ జ జ ర - చంపకమాల
3) మ స జ స త త గ - శార్దూలము
4) స భ ర న మ య వ - మత్తేభము
5) ర స జ జ భ ర - మత్తకోకిల
6) న భ ర స జ జ గ - తరలము
7) మ ర భ న య య య - స్రగ్ధర
8) స త త న స ర ర గ - మహా స్రగ్ధర
9) య య య య - భుజంగ ప్రయాతము
10) జ ర జ ర జ గ - పంచ చామరము
11) త భ జ జ గగ - వసంత తిలకము
12) ర ర ర ర - స్రగ్విణి
13) స స స స - తోటకము
14) న న మ య య - మాలిని
15) భ భ భ భ భ భ భ గ - మానిని
16) భ జ స న భ జ స న భ య - లయగ్రాహి
17) ర న భ గ గ - స్వాగత వృత్తము
18) మ భ న త త గగ - మందాక్రాంతము
19) న జ జ జ జ జ జ వ - కవిరాజ విరాజితము
20) న న భ న వ - ప్రహరణకలిత
21) ర జ ర జ ర - సుగంధి
22) భ జ స న గగ - వనమయూరము
23) న య స స - మనోహరిణి
24) త త జ ర - ఇంద్రవంశము
25) న జ జ జ జ భ ర - వనమంజరి
26) న న న న గగ - కమల విలసితము
27) భ న భ న భ న ర - కరిబృంహితము
28) న భ భ న ర స వ - వసంతమంజరి
29) స జ స జ గ - మంజుభాషిణి
జాతులు
1) కందము
ఉపజాతులు
1) తేటగీతి
2) ఆటవెలది
ఇందులో ఉన్న లిమిటేషన్స్
1) ఈ ఉపకరణి సమాస పదాలను గుర్తించలేదు. ఈ కారణంగా ద్విత్వాక్షర, సంయుక్తాక్షరములు కలిగివున్న సమాసాలు ఒకటే పదంగా వ్రాయాలి. అంటే మధ్యలో space ఇవ్వకూడదు.
ఉదా : "నఖక్షతము" ను నఖ క్షతము గా వ్రాస్తే ఈ ఉపకరణి క్షతము కు ముందున్న ఖ ను గురువు గా గుర్తించలేదు.
2)పాద విరుపుల సమాసాల ద్వారా ముందు పాదాల్లో అయ్యే గురువు ( U ) ను గుర్తించలేదు. ఉదాహరణ గా ఈ క్రింది మత్తేభ పద్యపాదాలను తీసుకుంటే
ఇది కర్ణాటధరాధృతిస్థిర భుజాహేవాకలబ్దేభరా
డుదయోర్వీధర తత్పితృవ్యకృత నవ్యోపాయనోష్ణీష ర
త్నదృగంచత్పద కృష్ణరాయవసుధాధ్యక్షోదితాముక్తమా
ల్యద నాశ్వాసము హృద్యపద్యముల నాద్యంబై మహింబొల్పగున్..
ఇందులో రెండవపాదంలో చివరనున్న "ర" తరువాత పాదంలో నున్న సంయుక్తాక్షరం "త్న" ద్వారా గురువుగా మారుతుంది. కారణం "రత్నదృగంచత్పద" ఒకటే సమాసం. ఇలాంటి ప్రయోగాలను ఈ ఉపకరణి గుర్తించలేదు.
3) యతి/ప్రాస లను గుర్తించలేదు
|
గుర్తించగలిగే సంస్కృత సంధులు
సవర్ణదీర్ఘ్హ సంధి
సకారాంత సంధి
శ్చుత్వ సంధి
ష్టుత్వ సంధి
ఛత్వ సంధి
తుగాగమ సంధి
గుణ సంధి
వృద్ధి సంధి
యణాదేశ సంధి
జస్త్వ సంధి
అనునాసిక సంధి
విసర్గ సంధి ( కొంత వరకు మాత్రమే )
తెలుగు సంధులు
అకార సంధి
ఉకార సంధి
ద్విరుక్తటకార సంధి
టుగాగమ సంధి
ఇక మీరనుకున్న రెండు పదాలను పైనున్న (దీర్ఘచతురస్ర పెట్టె) లో విడివిడిగాకానీ + గుర్తునుపయోగించికానీ తెలుగు లో టైపుచేసి ఛాలెంజ్ అనే బటన్ ను నొక్కండి. ఈ ఉపకరణి తనకు తోచింది చెప్తుంది. ఎలాగంటే మనము తెలుగయ్యవారు ప్రశ్నఅడిగితే చెప్పినట్టు ;౦).
సరైనదయితే మరో సారి ఛాలెంజ్ చేయండి. తప్పయితే నెత్తిమీద ఓ మొట్టికాయ వేసి సరైన సంధి పదాన్ని, సంధిని తెలుపండి.
ఉదాహరణగా టెక్ష్ట్ బాక్స్ ఈ క్రింద ఇచ్చిన ఏరూపాన్నైనా స్వీకరిస్తుంది.
రామ ఆంజనేయులు
రామ+ఆంజనేయులు
ఇక మిగిలిన సంధి సూత్రాలను తెలియచేసి ఈ ప్రయత్నానికి సహాయము చేయగోరువారు సంధి నియమాలతో పాటి కొన్ని ఉదాహరణలను, సంధిపదాల ప్రత్యేక లక్షణాలతో హారం వారికి ఇ-మెయిల్ చేస్తే మిక్కిలి సంతోషిస్తాము. మా ఇ-మెయిల్
support@haaram.com
ఈ సంధి రూపం మీకు తప్పుగా తోచినట్లైతే దయచేసి సరైన పదాన్ని హారం వారికి తెలిపి సహకరించి, తెలుగు భాషా వ్యాప్తికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తూ
మీ హారం.
|