భగవద్గీత గురించి భజగోవిందం ఏమంటొంది?
రచయిత :
సురేష్ బాబు
బ్లాగు :భగవద్గీత (Bhagavad gita)
టపా తేది: 25-04-12 09:31:00
భజగోవింద శ్లోకం:
భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికాపీతా|
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన స చర్చా||
శ్లోకం అర్ధం :
భగవద్గీతను ఏ కొద్దిగా అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా త్రాగినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు. అలాంటివాడికి యముని వలన ఏ మాత్రమూ భయము ఉండదు(దీనర్థము చావు అంటే భయం పోతుందని).