Skip Navigation Links



మనలోని వారే ..!! "మనం" అన్న వారే..!!

రచయిత : సత్య      బ్లాగు :నీలహంస      టపా తేది: 25-04-12 06:16:00







మనలోని వారే ..!! "మనం" అన్న వారే..!!

హృదయార్ద్రత ని ఆవిరి చేసుకున్న వాల్లు
అంతరాల మధ్యలో శూన్యాన్ని నింపుతున్నారు ...
కారుణ్యాన్ని మరచి కఠినమైన వారు
అంతరంగం లో కన్నీటిని దాచుతున్నారు...

మనలోని వారే ..!! "మనం" అన్న వారే..!!

సంఘటిత సామర్థ్యాన్ని వదిలి స్వార్థానికి సహాయం చేసినవారు
అస్థిత్వపు పిచ్చిలో వ్యక్తిత్వాన్ని వదిలి తోటి వారిని మరచిపోయారు..
సంప్రదాయాన్ని మరచి అరువుతెచ్చుకున్న కుతంత్రాన్ని
బానిసలు కొందరు భోధనా-విధ్యగా భోస్తున్నారు ..

మనలోని వారే ..!! "మనం" అన్న వారే..!!

చరిత్రలు, గతాలు మరిచినవారు స్త్రీ-పురుషులకి,
సుకుమార-ఖఠినత్వాన్ని ఆపాదిస్తున్నారు ..
స్వేచ్చంటే భాధ్యతలని నెరవేర్చుకునే హక్కని మరచినవారు,
దాన్ని "నీరుగార్చి " చేతుల్లో నింపుతున్నారు....

మనలోని వారే ..!! "మనం" అన్న వారే..!!

సత్యానికున్న విరాట్‌స్వరూపాన్ని చూడలేని వారు
నగ్నత్వాన్ని చూసి కళ్ళు మూసుకుంటున్నారు...
మనసుల తలుపులు తట్టని మొండిమేధావులు
ఇరుకు గదుల్లో మేధోమధనం చేస్తున్నారు...

మనలోని వారే ..!! "మనం" అన్న వారే..!!

ప్రశ్నలన్నింటినీ సంఘర్షణనుండి సమాధానం వరకూ
ఓదార్పు నుండీ ఉధ్ధరణ వరకూ
ఓర్పుగా తీసుకెల్లాల్సిందీ మనమే
నేర్పుగా నెరవేర్చాల్సిందీ మనమే! మనమే!!

-సత్య




పై మాటలు క్రింది పోస్టు కి కామెంటు gaa peTTindi..
  
http://alochanalu.wordpress.com/2012/04/22/%E0%B0%8E%E0%B0%B5%E0%B0%B0%E0%B1%81/

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦