తెలంగాణ కోరడం దేశద్రోహమట!!
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 13-08-10 05:12:44
ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ ఆగస్ట్ 9, 2010 తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఉపఎన్నికలు జరిగిన పన్నెండు నియోజకవర్గాల వోటర్లు తమ ఆకాంక్షను దిక్కులు పిక్కటిల్లేలా ప్రకటించిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఎవరికైనా ఇంకా సందేహాలు మిగిలి ఉంటాయా అని అనుకుంటున్న తరుణం ఇది. అయినా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, రెండు రెళ్లు నాలుగు అన్న సత్యాల్ని కూడ ప్రశ్నించగలిగిన మహానుభావులున్న తెలుగునేలలో తెలంగాణ ప్రజా ఆకాంక్షల పట్ల అనుమానాలు పొడసూపడంలో ఆశ్చర్యం లేదు. [...]
తేలిపోయిన ప్రభుత్వ కుట్ర
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 11-08-10 04:23:37
ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ ఆగస్ట్ 2, 2010 ఐదు సంవత్సరాల కింద ఐదుగురు సహచరులనూ నన్నూ అరెస్టుచేసి మామీద ఔరంగాబాద్ కుట్రకేసు బనాయించారని ‘ఆఖరిపేజీ’ పాఠకులకు తెలుసు. ఆ అబద్ధపు కేసు గురించీ, అప్పటి పాలకులు, పోలీసులు ఆడిన అబద్ధాల గురించీ అప్పుడే ‘ఆఖరిపేజీ’లో రాశాను. “ఆ అరెస్టు, కేసు, నిర్బంధం వ్యక్తిగతంగా నాకు సంబంధించినవి మాత్రమే కావు. అవి బహిరంగ ప్రజాజీవిత వ్యవహారాలు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, పోలీసు వ్యవస్థ, పాలనా విధానాలు [...]
చిన్నారి దేశంలో ప్రకృతి బీభత్సం
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 07-08-10 08:18:22
అది మనకు సుదూరమైన దేశమే కావచ్చు. ప్రపంచ రాజకీయాలలో పెద్ద ప్రాముఖ్యత లేని దేశమే కావచ్చు. విస్తీర్ణంలో గాని, జనాభాలో గాని అది మన రాష్ట్రాల కన్న, జిల్లాల కన్న చిన్నదే కావచ్చు. కాని ఒక్క ప్రకృతి విలయంతో అక్కడి జనాభాలో మూడు శాతం తుడుచిపెట్టుకుపోయిన మహా విషాద సమయంలో ఆ దేశం గురించి ఆలోచించవలసి ఉంది. ఇవాళ జరిగినది ప్రకృతి బీభత్సమే గాని ఐదు వందల సంవత్సరాలకు పైగా పెద్ద దేశాల పాలకులు ఆ చిన్నారి [...]
ఒక్క బుల్లెటూ కాల్చలేదట!!!
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 05-08-10 06:24:07
ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ, జూలై 27, 2010 ప్రభుత్వాధినేతల అబద్ధాలకు అంతూ పొంతూ ఉన్నట్టులేదు. వినేవాళ్లకు కొంత అవగాహన ఉంటుందనీ, తమ మాటలు విని నవ్వుకుంటారనీ కూడ ఏలికలకు తెలుస్తున్నట్టులేదు. గత శనివారం నాడు ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో అటు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాటలు గాని, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య మాటలు గాని పచ్చి అబద్ధాలు. నిజంగా జరిగిన సంగతులతో, వాస్తవాలతో ఒక్కదానితో కూడ సరిపోయేవి కావు. [...]
మాట్లాడడం నేరం కాదు, అది మానవ స్వభావం! మానవ సహజాతాన్ని నేరంగా భావించే హంతక రాజ్యం ఇది!
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 03-08-10 08:09:09
సి ఆర్ పి సి సెక్షన్ 313 కింద ఔరంగాబాద్ కుట్రకేసు (నిజామాబాదు I టౌన్ క్రైం నం. 214/09) లో అసిస్టెంట్ సెషన్స్ జడ్జి, నిజామాబాద్ ముందు మూడో ముద్దాయి ఎన్ వేణుగోపాల్ ప్రకటన గౌరవనీయులైన న్యాయమూర్తి గారూ, మూడో ముద్దాయినైన నా మీద, నా సహ ముద్దాయిలు ఐదుగురి మీద కలిపి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120 (బి) (నేరస్వభావంగల కుట్ర), సెక్షన్ 121 (ఎ) (భారతప్రభుత్వంపై యుద్ధం చేయడానికి, లేదా యుద్ధాన్ని [...]
కొరతలేని దారిద్ర్య కొలతలు
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 02-08-10 00:50:47
మన దేశంలో పేదలు ఉన్నారా, లేరా? ఉంటే ఎంతమంది ఉండవచ్చు? అసలు పేద అంటే నిర్వచనం ఏమిటి? పేదలు ఎంతమంది ఉన్నారో ఎట్లా లెక్కపెట్టాలి? ప్రతిక్షణం ఎక్కడ చూసినా కనీస అవసరాలు కూడ తీరని, చాలీచాలని బతుకులీడుస్తున్న కోట్లాది మంది ప్రజలతో పేదరికం సర్వాంతర్యామిగా కనబడుతూనే ఉంటుంది గనుక మామూలు మనుషులకు ఈ ప్రశ్నలు రాకపోవచ్చు. కాని మహాఘనత వహించిన భారత ప్రభుత్వానికి మాత్రం వెయ్యిన్నొకటోసారి ఈ సందేహాలే తలెత్తాయి. దేశంలోని దరిద్రుల సంఖ్యను లెక్కించడంలో ఇప్పుడు [...]
అంకెల మాయ – అసలు నిజాలు
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 30-07-10 02:45:00
‘అసత్యాలు మూడు రకాలు: అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, గణాంకాలు’ అని పందొమ్మిదో శతాబ్దపు బ్రిటిష్ ప్రధానమంత్రి బెంజమిన్ డిజ్రాయిలీ అన్నాడని అమెరికన్ వ్యంగ్య రచయిత మార్క్ ట్వెయిన్ రాశాడు. గణాంకాలనేవి సామాజిక వాస్తవికతను క్లుప్తంగా, సారభూతంగా వివరించే రూపాలు గనుక, గణాంకాల సహాయంతో సామాజిక వాస్తవికతను అర్థం చేసుకోవడం సులభం గనుక, గణాంకాలను వాడక తప్పదు. కాని వాటిని తగినంత జాగ్రత్తగా వాడకపోతే అవి పచ్చి అబద్ధాలుగా, సమర్థనయోగ్యం కాని వాదనలను సమర్థించుకునే ఆధారాలుగా మారిపోతాయి. ఇటీవల [...]
ధరల గురించి ధరాధిపతుల అబద్ధాలు
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 28-07-10 04:17:54
ఫిబ్రవరి 23, 2010, ఈభూమి కోసం తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అని ఒక పెద్దమనిషి జవాబిచ్చాడని మనందరికీ తెలిసిన సామెత. పొంతనలేని అబద్ధాలు చెప్పే వ్యవహారాన్ని సూచించడానికి ప్రాచీన వివేకం ఈ నుడికారాన్ని తయారు చేసింది. దూడగడ్డికోసం ఎక్కవలసింది తాటిచెట్టు కాదని, అక్కడ గడ్డి దొరకదని, ఆ రెండిటికీ సంబంధం లేదని ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా తాడిచెట్టు ఎక్కదలచిన తాగుబోతు తనను తాను వంచించుకుంటూ ఇతరులను వంచించడానికి ప్రయత్నిస్తుంటాడు. డా. మన్మోహన్ సింగ్ [...]
శ్రీకృష్ణ కమిటీని ఏం చేద్దాం?
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 27-07-10 03:06:44
కాకతీయ విద్యార్థుల బులెటిన్ కోసం ఫిబ్రవరి 12న కేంద్రప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ విచారణాంశాలను ప్రకటించినప్పటినుంచీ తెలంగాణ ఉద్యమంలో, రాజకీయాలలో మరొకసారి పెద్దఎత్తున చర్చ, ఆందోళన మొదలయ్యాయి. అసలు ఈ కమిటీని గౌరవించాలా లేదా, ఈ కమిటీ ఏమి చేస్తుంది, ఈ స్థాయిలో కమిటీ విచారణాంశాలు మార్పించే ప్రయత్నం చేయవచ్చునా, ఈ విచారణాంశాలతో విచారణలో పాల్గొనడం మంచిదా, బహిష్కరించడం మంచిదా, పాల్గొనకపోతే మన వాదనలు వినిపించే అవకాశం కోల్పోయినట్టవుతుందా, బహిష్కరించకపోతే ఈ బూటకపు కమిటీని గౌరవించినట్టు కాదా, పాల్గ(...)
ఆత్మహత్యలు కావు, మనం చేస్తున్న హత్యలు
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 25-07-10 09:21:58
వీక్షణం మార్చ్ 2010 ఇది ‘ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీద సంప్రదింపులు జరిపే జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణ కమిటీ’ గురించి చర్చించడానికి కాదు. ఆ కమిటీ సూచన వెలువడిన జనవరి 5న జరిగిన ఒక ఆత్మహత్య నుంచి ఆ కమిటీని బహిష్కరించమనే పిలుపుతో చలో అసెంబ్లీ సాగిన ఫిబ్రవరి 20న జరిగిన మరొక ఆత్మహత్య దాకా పరిస్థితులను చర్చించడానికి. తెలంగాణలో చెలరేగుతున్న ఉద్రేకాలను ఈ కమిటీ చల్లార్చగలదా అని చర్చించడానికి. ఈ కమిటీ తెలంగాణ ప్రజలలో, విద్యార్థులలో [...]
శ్యామలక్క అకాల మృతి
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 23-07-10 04:29:23
ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ జూలై 20, 2010 ఇవాళ్టి భారతసమాజంలో, మరీ ముఖ్యంగా తెలంగాణలో సహజ మరణాలుగా కనబడేవి నిజంగా సహజమరణాలేనా? ఎన్నో దశాబ్దాలపాటు అనేకానేక రూపాలలో మౌన హింసకూ, బహిరంగ హింసకూ, వేదనకూ గురయినందువల్ల మనుషులు క్రమక్రమంగా శిథిలమై మరణిస్తే దాన్ని అసలు సహజమరణం అనవచ్చునా? అసలు కారణాలను పక్కనపెట్టి ప్రకృతిమీదా, ఆరోగ్యంమీదా నింద మోపవలసిందేనా? నిజానికి ఇటువంటి మరణాలన్నీ వ్యవస్థ చేస్తున్న హత్యలు కాదా? జూలై 20 ఉదయం రామంతపూర్ లో శ్యామలక్క [...]
చిన్నరాష్ట్రాలు – అభివృద్ధి
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 21-07-10 05:54:03
వీక్షణం మార్చ్ 2010 కొరకు ఒకపక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి, ఆంధ్రప్రదేశ్ ను యథాతథంగా ఉంచడం గురించి వాదనలు, ఆందోళనలు జరుగుతుండగానే, మరొకపక్క చిన్నరాష్ట్రాల బాగోగుల గురించి చర్చ కూడ మొదలయింది. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిగా ఉన్న పి. చిదంబరం 2003లో ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ లో రాస్తుండిన వారం వారం శీర్షికలో చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఒక వ్యాసం రాశారని, అందులో తెలంగాణ ఏర్పాటు చేయాలని సూచించారని, అందువల్ల ప్రస్తుతం ఆయనకు తెలంగాణ [...]
హైదరాబాద్ అభివృద్ధి – నిజానిజాలు
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 18-07-10 23:23:09
ఉస్మానియా విద్యార్థుల బులెటిన్ కోసం… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతున్నదని కేంద్ర హోంమంత్రి డిసెంబర్ 9న ప్రకటించిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో చిత్రవిచిత్రమైన సన్నివేశాలు కనబడుతున్నాయి, వాదనలు వినబడుతున్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మాటమార్చి కుట్రలు సాగిస్తున్నా, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలలో రాష్ట్ర సాధన వాంఛ నానాటికీ ఉవ్వెత్తున ఎగసిపడుతున్నది. ఇంత విశాల ప్రజా ఉద్యమాన్ని దమననీతి ద్వారా అణచివేయగలుగుతానని ప్రభుత్వం పగటికలలు కంటున్నది. అదే సమయంలో రా(...)
పరాయి ఖాతాలో ఖమ్మం ఖనిజం
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 16-07-10 07:04:19
(ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ జూలై 13, 2010) ఎక్కడైనా నిధినిక్షేపాలు ఉన్నాయంటే, ఆ ప్రాంతవాసులు అదృష్టవంతులనీ, వారు సంపన్నులవుతారనీ, వారి దగ్గరికి పరిశ్రమలు పరుగెత్తుకొస్తాయనీ, అక్కడ నిరుద్యోగం అనేది మచ్చుకైనా ఉండదనీ, అక్కడంతా ఇక పాలూ తేనే ప్రవహిస్తాయని ఒక మూఢనమ్మకం వ్యాపిస్తుంది. ఆ నిధి నిక్షేపాలు తవ్వి అమ్ముకుంటే ఎన్నెన్ని నిధులు, ఎన్నెన్ని డాలర్లు, ఎన్నెన్ని పరిశ్రమలు, ఎన్నెన్ని వెలుగులు వస్తాయో కట్టుకథలు ప్రచారమవుతాయి. ఆ గనుల తవ్వకం మీద ఎవరయినా అనుమానాలు వ్యక్తంచేస్తే, [...]
జనం మాయ, లాభమే సత్యం ‘వేదాంత’ సారమింతేనయా
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 13-07-10 07:13:56
(ఈభూమి మాసపత్రిక ఏప్రిల్ 2010 సంచిక కోసం..) ‘మాయంటావా? అంతా మిథ్యంటావా? నా ముద్దుల వేదాంతీ! ఏమంటావు? మరఫిరంగి, విషవాయువు మాయంటావూ? ఏం, ఏమంటావు? పాలికాపు నుదుటిచెమట, కూలివాని గుండెచెరువు, బిచ్చగాని కడుపుకరువు మాయంటావూ?’ అని మన మహాకవి ప్రశ్నించి డెబ్బై ఐదు సంవత్సరాలయింది. ఇప్పుడొక ‘వేదాంతి’ వచ్చి భూమి మిథ్య, అడవి మిథ్య, అడవిబిడ్డలు మిథ్య, పర్యావరణం మిథ్య, ప్రభుత్వాలు మిథ్య, చట్టాలు మిథ్య, న్యాయస్థానాలు మిథ్య, స్వతంత్ర పరిశీలకులు మిథ్య అని చెపుతున్నాడు. ‘ఉన్నదొక్కటే [...]
రాజపక్ష రక్తపిపాస
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 10-07-10 18:29:46
(ఈభూమి మాసపత్రిక, మార్చ్ 2010 కోసం) తమ తమిళ ఈలం ఆకాంక్షలు అతి దుర్మార్గంగా అణచివేతకు, జాతి హననానికి గురయిన తర్వాత ఆశోపహత స్థితిలో ఉన్న శ్రీలంక తమిళులు తమను ఎవరు పాలిస్తే బాగుండునని కోరుకుంటున్నారు? తోడేళ్ళమంద కకావికలు చేసివెళ్లిన తర్వాత రెండు తోడేళ్లు, తమలో ఎవరో ఒకరిని ప్రతినిధిగా ఎన్నుకొమ్మని వస్తే రక్తసిక్తమయిన, క్షతగాత్రమయిన మేకలు ఏం ఎంపిక చేసుకుంటాయి? మనం ఈ ప్రశ్నలు అడిగేలోపే ఆ తోడేళ్ల మధ్య పోరాటం భీకరంగా మారిపోయింది. ఒకతోడేలు [...]
జర్నలిస్టులకు ఎవరి సర్టిఫికెట్ కావాలి?
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 09-07-10 07:48:27
(ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ, జూలై 6, 2010) వర్తమాన ఘటనలు జరగగానే గత ఘటనలు గుర్తు రావడం మన జ్ఞాపకశక్తికి చిహ్నమైతే కావచ్చు గాని సమాజం ముందుకు పోతున్నదనడానికి మాత్రం చిహ్నం కాదు. ఇప్పుడు కూడ అప్పటిలాగనే జరుగుతున్నదనో, అప్పటికన్న ఘోరంగా జరుగుతున్నదనో అనిపించడం సామాజిక పరిణామానికైతే మంచిది కాదు. కాని తెలుగు సమాజానికి ఇది నిత్యకృత్యమయిపోయింది. అవే అవే విషాద, దుస్సహ దృశ్యాలు మళ్లీ మళ్లీ కనబడుతున్నాయి. ఇవాళ జరుగుతున్న సన్నివేశాలన్నీ ఇదివరకే అనుభవించిన [...]
నిశాంతపు వెలుగురేఖ ఆజాద్(Updated)
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 08-07-10 07:27:19
కృష్ణా జిల్లాలో పుట్టి, ఈ దేశపు దక్షిణ, పశ్చిమ, మధ్య రాష్ట్రాలలో బహుశా మరెవరికన్నా ఎక్కువగా నడయాడిన చెరుకూరి రాజకుమార్ అతి దుర్మార్గంగా హత్యకు గురయ్యాడు. నూజివీడు బిడ్డ కాజీపేట, హనుమకొండ, వరంగల్, విశాఖపట్నం, బెంగళూరు రహదారుల మీదినుంచి పడమటి కనుమలనూ తూర్పు కనుమలనూ కలిపిన దండకారణ్యమంతా విస్తరించాడు. అక్కడి ప్రత్యామ్నాయ ప్రజాపాలన గురించి ప్రపంచానికి తెలియజేసే వాహికా, వ్యాఖ్యాతా అయ్యాడు. ఈ దేశ పీడిత ప్రజాకాశంలో కనిపిస్తున్న నిశాంతపు వెలుగురేఖ అయ్యాడు. ఆ వేకువరేఖను తుడిచేసి, [...]
Justice, A Reading List!
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 06-07-10 07:01:58
(The New Indian Express, Hyderabad March 5, 2010) The Committee for Consultation on the Situation in Andhra Pradesh (CCSAP), popularly known as Justice B N Srikrishna Committee, will, in all probability, receive hundreds, if not thousands, of petitions in favor of creating a separate Telangana state or maintaining status quo of Andhra Pradesh, and it [...]
నిశాంతపు వెలుగు రేఖ
రచయిత
ఎన్.వేణుగోపాల్'
బ్లాగు :KadaliTaraga : a wave in the Ocean !
టపా తేది: 04-07-10 09:59:06
కృష్ణా జిల్లాలో పుట్టి ఈ దేశపు దక్షిణ, పశ్చిమ, మధ్య రాష్ట్రాలలో బహుష మరెవరి కన్నా ఎక్కువగా నడయాడిన చెరుకూరి రాజకుమార్ అతి దుర్మార్గంగా హత్యకు గురయ్యా డు. నూజివీడు బిడ్డ కాజీపేట, హనుమకొండ, వరంగల్, విశాఖపట్నం, బెంగుళూరు రహదారుల మీది నుంచి పడమటి కనుమలను, తూర్పు కనుమలను కలిపిన దండకారణ్యమంతా విస్తరించాడు. అక్కడి ప్రత్యామ్నాయ ప్రజాపాలన గురించి ప్రపంచానికి తెలియచేసి వాహికా, వ్యాఖ్యాతా అయ్యాడు. ఈ దేశ పీడిత ప్రజాకాశంలో కనిపిస్తున్న నిశాంతపు వెలుగు రేఖ [...]