కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(18)

manyasima(13)

eflutsa.blogspot.com(6)

keerthika karlapudi(4)

srikaaram(4)

శ్రీనివాస బాబు(3)

కంది శంకరయ్య(3)

praveensarma(3)

బాబు(2)

Admin(2)

vartha-vyaakhya(2)

పంతుల జోగారావు(2)

తెలుగిల్లు(2)

viplove(2)

madhu's(2)

AMMA ODI(2)

SPLENDOR OF YOGA(2)

భమిడిపాటి ఫణిబాబు(2)

ఎన్.వేణుగోపాల్(1)

Amar(1)

తృష్ణ(1)

chandamama(1)

hanu(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

నీహారిక(1)

seenu(1)

Giridhar Pottepalem(1)

కమల్(1)

శరత్ 'కాలమ్'(1)

శ్రీనివాస్(1)

చింతా రామకృష్ణారావు.(1)

విహారి(KBL)(1)

Zilebi(1)

అరుణాంక్(1)

మాలా కుమార్(1)

మురళి(1)

చింతా రామకృష్ణారావు.(1)

భావకుడన్(1)

durgeswara(1)

వెన్నెల రాజ్యం(1)

CCKRao(1)

చదువరి(1)

jeevani(1)

మేఘ(1)

కత్తి. మహేష్ కుమార్(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

Shiva Bandaru(1)

అలేఖ్య(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

venkatoons(1)

మోహన(1)

madhavaraopabbaraju(1)

పరుచూరి వంశీ కృష్ణ .(1)

3g(1)

Chandramouli Malleda(1)

వసుంధర(1)

we3ours3(1)

రాధిక(నాని )(1)

Prakash chowdary(1)

jois(1)

పుస్తకం.నెట్(1)

సావిరహే(1)

సావిరహే(1)

shiva(1)

AMMA ODI(1)

anrd(1)

beereddy nagesh reddy(1)

krishnavamshi(1)

nagseenu(1)

బ్లాగు బాబ్జీ(1)

చావాకిరణ్(1)

prasad(1)

సుభగ(1)

rentala jayadeva(1)

naa-maata(1)

మురళి కృష్ణ(1)

రహ్మానుద్దీన్ షేక్(1)

Naveen(1)

ప్రసూన(1)


వెలుగు (కథ)

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 11-08-10 15:09:25


అమావాస్య చీకట్లని చీల్చుకుని వెలుగురేకలు నాలుగు దిక్కులా పరుచుకుంటున్నాయి నింపాదిగా. వల్లిరి పక్కమీంచి లేచి, వెనకవరండావేపున్న తలుపు బార్లా తీసి, వంటింట్లోకి వెళ్లింది. ఫిల్టరులో కాఫీ పొడేసి, నీళ్ళు కాచి పోసి, స్నానాలగదిలోకెళ్ళి టూత్ పేస్ట్ బ్రష్షుమీద పెట్టుకోబోతూంటే వచ్చిపడిందో పురుగు. హఠాత్తుగా ఎక్కడినుంచి వచ్చిందో అది, ఆవిడమొహంమీదుగా ఎగిరి ఎదురుగా ఉన్న అద్దంమీద వాలింది ఒయ్యారంగా. ఆవిడ ఓ క్షణంసేపు దీక్షగా ఆ పురుగువేపు చూసి, తరవాత అటూ ఇటూ చూసి, పక్కనున్న తువాలందుకుని దాన్ని [...]




నాకథ రంగుతోలుకి శ్రీలలిత విశ్లేషణ

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 08-08-10 16:23:38


ఇది నాకొక అసాధారణమైన గౌరవం. తమంత తాము రచయితలు నాకథ ఎంచుకుని విశ్లేషణకి పూనుకోడం చాలా చాలా అరుదు. శ్రీలలిత నాకథ రంగుతోలు విశ్లేషణకి కథాజగత్ బహుమతి ప్రకటించడం నాకు ఇంకా ఎక్కువ ఆనందాన్ని కలిగించింది. ఆ విశ్లేషణ ఇక్కడ చూడగలరు. శ్రీలలితగారూ, ధన్యవాదాలు. మాలతి Filed under: కథలు Tagged: సమీక్షావ్యాసాలు




ఊసుపోక – అడక్కండి మరి

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 04-08-10 15:43:44


(ఎన్నెమ్మకతలు 57) అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అని మనకో సామెత. అంటే అడగడం తేలిక అని. ఆమాటకొస్తే చెప్పడం కూడా తేలికే. పుట్టి, బుద్ధెరిగి ఎన్నిసార్లు విన్నానో ఆడి తప్పకు, చెప్పుడుమాటలు వినకు లాటివి. “చెప్పినట్టు వినకపోతే చెడిపోతావురా నాయనా” అంటూ అడిగినా అడగకున్నా చెవినిల్లు కట్టుకుని పోరేవారిమాట సరే సరి. చెప్పడం తేలికే చెయ్యడం కష్టం కానీ. మాటవరసకి నాకే దారినపోయే దానయ్యమీద కోపం వచ్చిందనుకోండి. “అలా కోపం తెచ్చుకోకూడద”ని చెప్పేవాళ్లు కనీసం రోజుకి నలుగరయినా [...]




మహా కవయిత్రి ఆతుకూరి మొల్ల 2వ భాగం

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 30-07-10 17:10:22


నన్ను ఆకట్టుకున్న మరో రచనావైచిత్రి ఆమె మాటలతో ఆడుకున్నట్టు కనిపించే సమయాలు. నిత్యజీవితంలో మనం మాటాడుకునేతీరు కనిపిస్తుంది ఆమె రచనలో. ఒకొకప్పుడు మనం చెప్పదల్చుకున్నది స్పష్టం చెయ్యడానికి “అది కాదు ఇది” అంటూ సాగదీస్తాం. బాలకాండంలో సాకేతపురం ఎలా ఉందో చెప్తూ ఆమె చేసిన వర్ణన చూడండి.మదనాగయూధసమగ్రదేశము గాని కుటిలవర్తనశేషకులము గాదు. ఆహవోర్వీజయహరినివాసము గాని కీశసముత్కరాంకితము గాదు సుందరస్యందనమందిరంబగు గాని సంతతమంజులాశ్రయము గాదు మోహనగణికాసమూహగేయము గాని యూధికానికరసంయుతము గాదు సరససత్పుణ్యజననివ(...)




మహా కవయిత్రి ఆతుకూరి మొల్ల

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 30-07-10 14:10:14


“కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ లేని కథలు చాలానే ఉన్నాయి. నిజానికి రాధికాస్వాంతనం రాసిన ముద్దుపళనిని తప్పిస్తే, పూర్వకవయిత్రులలో ఇంతటి ప్రాచుర్యం పొందిన స్త్రీలు లేరేమో.మొల్ల రామాయణం ఒక్కటే అందరికీ తెలిసిన ఆమెరచన. ఆమె ఇంకా ఏమైనా రచనలు చేసిందో, లేదో, అవి దొరుకుతాయో లేదో తెలీదు. కానీ తెలుగుకవయిత్రులలో మొల్ల తెలుగులు కాని పండితులదృష్టిని ఆకర్షించడం విశేషం. తొలిసారిగా నేను [(...)




నేటి విద్యార్థులు (ఆడియో)

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 26-07-10 22:47:12


అనిల్ అట్లూరి ప్రోత్సాహంతో ఒక ఆడియో చేసి చూద్దాం అనుకుని, ఇది చేశాను. నిజానికి, ఆడియో చెయ్యడానికి గళంలో నాటకీయత కావాలి. మాఅమ్మాయికి తెలుగొచ్చి ఉంటే ఎంత బాగుండును అనిపించే క్షణాలన్నమాట. రెండోది కథలో వివిధస్వరాలు పలికించే అవకాశం ఉండాలి. అలా ఉన్నవి ప్రాప్తంలాటి కథలు కానీ అవి ప్రచురించడం అయిపోయింది కనక, మళ్లీ వినే సరదా ఉండకపోవచ్చనీ ఇది ఎంచుకున్నాను. ఈ స్కెచ్ (నిజంగా కథ కాదు కదా) నేను ఇంటర్ చదివేరోజుల్లో రాసింది. ఇప్పటికింకా [...]




ఆచంట శారదాదేవికథల్లో శిల్పసౌందర్యం రెండోభాగం

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 22-07-10 14:55:45


(కల్పనా, నువ్వు కోరినందున ఇప్పుడే పెట్టేస్తున్నాను రెండోభాగం. ఇది నీకు -:)) కారుమబ్బులు కథలో మబ్బులు ప్రతీకగా ఆవిష్కరించడంలో శారదాదేవి ప్రత్యేకత కనిపిస్తుంది. ఉత్తమపురుషలో చెప్పిన ఈ కథలో ఆమెపేరు మనకి తెలీదు. ఆమె, శ్రీధర్ ఆఫీసులో కలుసుకుని, ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరిమధ్య ఎనలేని అన్యోన్యం. ఆమెకి ప్రమోషన్ వచ్చిందని తెలిసినతరవాత అతని ప్రవర్తన మారిపోతుంది. అతను ఉద్యోగం వదులుకోడానికి సిద్ధపడుతున్నాడని తెలిసి తను అంతకుముందే ఉద్యోగం మానేయడానికి నిశ్చయించుకున్నాననీ, కారణం తమకి పుట(...)




ఆచంట శారదాదేవి కథల్లో శిల్పసౌందర్యం -మొదటిభాగం

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 21-07-10 16:29:04


రాసినవి చిన్నకథలే అయినా, అవి ఆరు డజన్లకి మించకపోయినా, తెలుగు కథాసాహిత్యంలో ఒక విశిష్ఠ స్థానాన్ని సంపాదించుకున్న రచయిత్రి ఆచంట శారదాదేవి. రాసి కాదు వాసి ప్రధానం అనడానికి సాక్ష్యం ఆవిడ సాహితీ ప్రస్థానం. 50వ దశకంలో అతులిత కీర్తిని ఆర్జించిన తెలుగురచయిత్రులలో కొంతమంది ఈనాటి కొలమానాలకి నిలవరన్న సంగతి నాకు ఈమధ్యనే బోధపడింది. ఎలా రాసి పంపినా పత్రికలు ప్రచురించుకునే రోజుల్లో కాలం, కర్మం కలిసొచ్చి కొందరికి తగని, తరగని కీర్తి వచ్చిందంటే తప్పులేదేమో. కానీ [...]




ఊసుపోక – ఎలా చదవడమో ఈకథ?!

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 16-07-10 18:08:44


(ఎన్నెమ్మకతలు 55) ఆమధ్య విశేష ప్రచారం పొందిన ఓ కథని ఎలా అర్థం చేసుకోవాలో తెలీక సతమతమవుతున్నా. అందరూ తెగ పొగిడేస్తున్నారు కానీ నాకేమో అయోమయంగా ఉన్నాయి కథా, పొగడ్తలూ కూడా. మీదినించి కిందకీ, కిందనించి మీదకీ, కుడినించి ఎడమకీ, ఎడమనించి కుడికీ – అన్ని కోణాల్లోంచీ తీక్షణంగా పరిశీలించి చూశాను. … కొంచెంసేపు కుడి ఎడమైతే పొరపాటులేదోయ్ అని పాడుకున్నాను కూడా. ఎలా చూసినా ఏదో వెలితి. నాకు తెలీని రహస్యాలేవో ఈకథలో ఏమూలో దాక్కుని [...]




అవ్యక్త మధురం

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 13-07-10 16:40:19


సాయంత్రం నాలుగయింది. పుస్తకం మూసి కిటికీవేపు చూసింది. బయట మంచు సన్నగా పడుతోంది. రాత్రి పడ్డ మంచు తియ్యడానికి ఇంకా సిటీ బండి రాలేదు. వాళ్ళకి ఈ చిన్నవీధులంటే నిరసన, సవతిపిల్లలనుకుంటారో ఏమో, ఖర్మ! రాత్రి బాగానే పడినట్టుంది. సిటీ బళ్ళన్నీ పెద్దవీధులమీద పడ్డాయి. కిటికీకి దగ్గరగా వెళ్లి మరోసారి తొంగి చూసింది. రోజూ ఇదే సమయానికి ఆవిడ వీధిలో కనిపిస్తుంది పడమటిదిక్కుగా నడుస్తూ. ఎండలో వానలో చలిలో గాలిలో … ఏరోజూ ఆవిడ మానలేదు. ఏడాదిగా [...]




ఊసుపోక – కలలు, నిజాలు

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 07-07-10 17:44:33


(ఎన్నెమ్మ కతలు 55) “అరెరే. మంచికల, తెలివొచ్చీసింది,” అంటుంది పాప అర్థరాత్రివేళ లేచి కూచుని. “నీకు తెలివి రావడమేమిటే. నోర్మూసుకుని పడుకోక,” అంటుంది అక్క తన కల కరిగిపోయిందన్న బాధతో. నేను సన్నగా నవ్వుకుంటాను – నాకలల్లోంచి. కలలు కలలే అని తెలిసినా ఎందుకో అభిమానపుత్రుణ్ణి ఆదరించినట్టు. నిజానికి స్వప్నసుఖం పసిపిల్లల జన్మహక్కు. చిన్నతనంలో వెన్నెల వెండితీగెలతో మల్లిపందిరి అల్లినవేళ ఏ అమ్మమ్మో కథలు చెప్తుంటే, అవి వట్టి కలలే అన్న బాధ ఉండదు. చెదిరిపోతాయన్న చింత [...]




పలుకు తేనియలొలుకు

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 01-07-10 03:27:51


Before daybreak లేచి Breakfast చేసి Freshen upప్పయి Officeకెళ్లి Late evening ఇల్లు చేరి Daddyకో hugయ్యమ్మా అంటే పో, నాన్నా, నిద్దలొతూందంటూ ఒత్తిగిలి నిద్దరోయింది చక్రాలబండి తొక్కి తొక్కి అలసిపోయిన పాపాయి. 000 కాలం అపురూపం ఎక్కడయిపోతుందోనని కొసరి కొసరి కొరుకుతూ తింటోందామె అమ్మమ్మ పెట్టిన అరిసెల్లా. అనుభవించకపోతే అరచేతిలో స్వర్గంజారిపోతుందని ఉరుకులూ పరుగులూ పెడుతున్నాడతను వగరుస్తూ. కాలం కదులుతోంది తనమానాన తాను. 000 అవ్యక్తమధురం కొందరిజీవితాల్లో ఆత్మస్ఫర్శలు సాగుతాయి సమాంతరంగా. అవి కల(...)




హరివిల్లులు రెండు విరిసేముందు

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 26-06-10 16:15:03


ఏభావం, ఏభాష – కొన్ని తెలుగులో బాగుంటాయి. కొన్ని ఇంగ్లీషులో బాగుంటాయి. కొందరికి ఇంగ్లీషులో చెప్తే ఇష్టం. కొందరికి తెలుగులో చెప్తే ఇష్టం. ఈ కవిత రెండు భాషల్లోనూ మీముందు పెడుతున్నాను. మీకు ఏది బాగుందో మీరే చెప్పండి. ఇంగ్లీషు వెర్షనుకి లింకు, ఇక్కడ చూడండి. తెలుగులో – “చూడు, చూడు, నేనేం కనుగొన్నానో“ అంటూ తెచ్చి పరిచింది మాఅమ్మాయి నాముందు నాచిన్ననాటి ఇత్తడి బొమ్మలు బేస్మెంట్ చీకటి కొట్ట్లో అట్టపెట్టెల్లో ఏమూలో మూలుగుతున్న అనర్ఘ రత్నాలు [...]




పరీక్ష

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 24-06-10 14:44:36


కాంతకి తెలుగు పాఠాలు చెప్పే ఉద్యోగం దొరికింది అమెరికాలో. వచ్చి ఒళ్లో వాలింది అక్షరాలా! ఆవిడ అమెరికా వచ్చి ఆరేళ్లయింది జాగ్రఫీ ప్రొఫెసరు మూర్తికి ఇల్లాలిగా. తరవాత మూడేళ్ల బాలకృష్ణుడికి అమ్మస్థానం కూడా సంపాదించుకుంది. అమెరికాకొచ్చేక అదనంగా కలిగిన వసతి హోమ్మేకరు స్థానం. అంటే ఇళ్లు కట్టడం కాదు, కాపురం నిలబెట్టుకోడం. అంచేత ఆవిడ ఉద్యోగాల వేటకెళ్లలేదు. అలాటి శుభసమయంలో ″తెలుగు చెప్తావా?″ అంటే కాంతకి హాచ్చర్యమ్ ముంచుకొచ్చేసింది. దానివెనకున్న కథా కమామీషు మొదలెట్టాలంటే కొండవీటి చాంతాడంత [...]




కల్పన కథానుభవంలో “నవ్వరాదు”

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 17-06-10 14:02:22


కల్పన రెంటాల కథానుభవంలో నాకథ “నవ్వరాదు” చూడగలరు. Filed under: కథలు




వ్యాసమాలతి.పిడియఫ్, పరిపూర్ణంగా!

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 12-06-10 16:28:13


సౌమ్య పరిచయం చేర్చి, మరొకసారి ప్రూఫు దిద్దుకుని సంపూర్ణంగా తయారు చేసిన పిడియఫ్ ఇది. స్ప్రబ్డ్.కాం, ఇస్సూ.కామ్, ఓపెన్ ఆఫీసు.ఆర్గ్ – అన్నిటితో కుస్తీ పట్టి, ఆఖరికి ఈ కొలిక్కి తెచ్చేను  ఇందులో కూడా చిన్న చిన్న అసౌకర్యాలు ఉండొచ్చు. ఒక సాఫ్టువేరు పని చేసినట్టు మరొకటి పని చేయదు. ఒకదానిలో ఒక సౌకర్యం, మరొకదానిలో మరొక సౌకర్యం. ఇంక నాకు ఓపిక చచ్చి, ఇంతటితో ముగిస్తున్నాను. మీరు సహనంతో ఈ సంకలనాన్ని ఆదరించగలరని ఆశిస్తూ . [...]




thulika.net June 2010

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 01-06-10 17:24:05


Thulika.net is updated with new articles and stories. Thanks for visiting my site. Your comments are welcome. Nidadavolu Malathi Filed under: Uncategorized Tagged: Telugu stories in English




వ్యాసమాలతి.పిడియఫ్.

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 26-05-10 02:53:52


ఇది నావ్యాసాల సంకలనం. అందులో నా ముందుమాట ఇక్కడ చూడండి ————- ఈ సంకలనంగురించి నావ్యాసాలు సంకలనం పిడియఫ్ చెయ్యడంలో వి.బి. సౌమ్య చెయ్యి ఉంది. నేను రాసేనని దాదాపు మరిచిపోయేక, “మీవ్యాసం చదివేను” అంటూ మెయిలిస్తుంది తను నాకు. ఈమధ్య మూడువారాలక్రితం అలా రెండు వ్యాసాలు చదివి“ఇవన్నీ పిడియఫ్ చెయ్యండి” అంది సౌమ్య. “ఇంకా రాయవలసినవి ఉన్నాయి. అవి కూడా అయేక చూస్తాను” అన్నాను. అన్నానే కానీ మళ్లీ ఆలోచిస్తే, నేను రాయడం ఎప్పుడు అయిపోతుంది [...]




ఊసుపోక – నాన్యెకడమీకం

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 24-05-10 14:08:16


(ఎన్నెమ్మ కతలు 54) అమెరికాలో బ్రాహ్మణ్యం ఉంది. అంటే తెలుగుదేశంలో బ్రాహ్మణుడిగా పుట్టి ఏ ఇంజినీరింగో చదివి, అమెరికాలో నిత్యానుష్ఠానకర్మలాచరిస్తూ తమ బ్రాహ్మణీకాన్ని నిలబెట్టుకుంటున్న సద్బ్రాహ్మణుల మాట కాదు నేను చెప్తున్నది.ఎవరికైనా ఏదో ఓ రకం నిష్ఠ ఉండడం మంచిదే. అది వేరే విషయం. ఈకత నాన్యెకడమీకంగురించి. ఈ బ్రాహ్మణ్యం వేరు. ముందు ఎకడమీకం అంటే ఏమిటో చెప్తాను. అమెరికాలో కొందరు పదహారణాల లేక నూటికి రెండువందల శాతం మహాశ్వేతలు ఉన్నారు. బ్రిటన్ నించీ వలస వచ్చి [...]




ఉత్తమాయిల్లాలు

రచయిత మాలతి'      బ్లాగు :తెలుగు తూలిక      టపా తేది: 15-05-10 15:44:28


భార్యశవంముందు కూర్చుని, కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు శ్రీరంగశయనంగారు. ఆయనచుట్టూ అయినవాళ్లూ, కానివాళ్లూ, దారేపోయేవాళ్లూ చేరి, సర్వవిధాలా అనునయవాక్యాలు చెబుతూ, తమవిధిని నిర్వర్తించుకుంటున్నారు. కొడుకు చక్రధరం వారిని యధావిధి పలకరిస్తూ, వారి ప్రశ్నలకి తోచినట్టు జవాబులిచ్చుకుంటూ, తండ్రినో కంట గమనిస్తూ ఉన్నాడు. శ్రీరంగశయనం పైపంచెతో కళ్లొత్తుకుంటూ చెప్తున్నారు. “పదహారేళ్లు దానికి పెళ్లినాటికి.. … నాకు ఇరవైమూడు. ఎంత మర్యాద, ఎంత మప్పితం అంటూ మా అమ్మా, నాన్నా ఎంత మురిసిపోయేరో పిల్లని చూసి! … మ(...)

వార్తా హారం
పత్రికా హారం
పుట 1 , మొత్తం 2 1 2 తరువాత తుది పుట