నా సెల్ ఫోన్ కెమెరాలో బందీలయిన హిమాలయాలు (Mighty Himalayas in my Mobile) Photos
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 10-05-13 20:10:00
'గత వారం మనాలీ వెళ్ళినప్పుడు నేను నా Sony Xperia Z ఫోన్ కెమెరాతో తీసిన ఫోటొలు ఇవి. అన్నీ కూడా ఆటో మోడ్ వాడి తీసినవే. స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ టెక్నిక్స్ కానీ ఏమీ లేవు.ఈ ఫోటో మేము దిగిన మౌంటెన్ టాప్ హోటల్ టెర్రాస్ నుంచి తీసింది. శీతాకాలంలో ఆ టెర్రాస్ పైన కూడా మంచు నిండి పోయి ఉంటుందని ఆ హోటల్ స్టాఫ్ చెప్పారు. మా రూము కిటికీలోంచి కూడ మంచుతో కప్పబడిన హిమాలయాలు దర్శనమిచ్చాయి. నిప్పుల కొలిమిలోనుండి వెళ్ళిన మాకు ఆ శీతల వాతావరణం బాగా నచ్చింది.ఈ ఫోటొ కూడా పైన ఉన్న ఫోటో తీసిన చోట తీసిందే, కొంచెం(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కోట్ల ఆస్తితో పిల్లనిచ్చిన మామగారిమీద సుబ్రావ్ ఎందుకు అలిగాడంటే .........(ఒక జోకు)
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 07-02-13 18:14:00
'అల్లుడు అలక పాన్పు ఎక్కాడని తెలియగానే పరంధామం ఆశ్చర్యపోయాడు. తన ఒక్కగానొక్క కూతురు, ఆస్తి పాస్తులు, లక్షల కట్నం అంతా ఇచ్చిన తరువాత అల్లుడికి ఏం తక్కువయ్యిందని అలక పూనాడో ఆయనకి అర్ధం కాలేదు. అస్సలు సుబ్రావ్ ఆయనకి అల్లుడు అయిన విధమే ఒక విచిత్రం. అదేమంటే...... ఇంజనీరింగ్ పూర్తి చేసి, బెంగుళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుబ్రావ్ ఒకసారి పండగకని సెలవు పెట్టి తన ఊరొచ్చాడు. పిసినారిగా పేరున్న సుబ్రావ్ కూడా ఊరిలో పొద్దు పోక సినిమాకి వెళ్దామని బయలు దేరాడు. ఊరిలో ఉన్న ఒకే ఒ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఒరిజినల్ చంద్రముఖి (లక లక లేదు)
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 05-02-13 19:02:00
'తెలుగు తమిళ బాషల్లో వచ్చిన చంద్రముఖి ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పని లేదు. బాబా సినిమా దెబ్బకి కుదేలయిన రజనీ కాంత్‌కి కొత్త ఊఫు ఇచ్చింది పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా. కన్నడంలో ఆప్త మిత్ర పేరుతో, బెంగాలీలో రాజ మహల్ పేరుతో, హిందీలొ భూల్ భులయ్యా పేరుతో రీమేక్ అయి అన్ని చోట్లా విజయం సాధించింది. అయితే ఈ సినిమాకి మాతృక 1993లో మళయాళంలో నిర్మితమయిన మణిచిత్రతాళ్ అన్న సినిమా. దీనికి దర్శకుడు ఫాజిల్. నాగార్జున హీరోగా, నగ్మా హీరోయిన్‌గా వచ్చిన కిల్లర్ సినిమా దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Google తో ఈ గమ్మత్తులు చేసి చూడండి
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 03-02-13 20:01:00
'Google space bar లో Do a Barrel Roll అని టైప్ చేసి Enter నొక్కండి. ఏం జరుగుతుందో చూడండి.Google ని వెనకనుంచి అంటే elgooG అని టైప్ చేసి Enter నొక్కి చూడండి.Google space bar లో Zerg Rush అని టైప్ చేసి Enter నొక్కి రెండు నిముషాలు చూడండి.Google space bar లో Funny Google అని టైప్ చేసి వచ్చిన మొదటి లింక్ ఓపెన్ చేయండి. అప్పుడు వచ్చిన బాక్స్‌లో మీ పేరు టైప్ చేసి Enter నొక్కండి. Google స్థానంలో ఆవే రంగుల్లో మీ పేరు వస్తుంది.'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
1942లో పోలీసు స్టేషన్ ముందు వందే మాతర నినాదం చేసి తప్పించుకున్న సుబ్రావ్ కథ (కామెడి)
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 02-02-13 11:30:00
'1942. మహాత్మా గాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపు నందుకొని అందరు భారతీయులూ స్వాతంత్ర్య ఉద్యమంలో దూకి పరాయి పాలనకి వ్యతిరేకంగా పోరాడుతున్న రోజులు. ఉద్యమ తీవ్ర రూపం చూసి బ్రిటీషు వారు బెంబేలెత్తిపోయి తమ అణచివేతని తీవ్రతరం చేశారు. అయినా ఉద్యమం ఏమాత్రం చల్లారలేదు. వందే మాతరం అన్నది భారతీయులకి రణ నినాదమయింది. అలాంటి రోజుల్లోనూ సుబ్బారావు తన పనేమిటో తాను చూసుకోవడమె కానీ ఇలాంటి పనులకి దూరంగా ఉన్నాడు. తానొక్కడు పోరాటం చేసినంత మాత్రాన స్వాతంత్ర్యం ఒకరోజు ముందు రావడం కానీ, తాను చేయనంత మాత్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఈ వృద్ధ కన్యలతో పెట్టుకుంటే మటాషే
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 31-01-13 18:37:00
'మానవ జీవితంలో గృహస్థ దశ అతి ముఖ్యమయినది. అందుకే ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలి అంటారు. పెళ్ళి చేసుకొని ఒక భాగస్వామితో, ఆ తరువాత పిల్లలతో వేగడం వల్ల ఇచ్చి పుచ్చుకోవడం, అవసరమయినపుడు అధికారం చెలాయించడం, కొన్ని సార్లు తలొగ్గడం ఇలాంటివన్నీ అలవాటు అవుతాయి. కానీ కొంతమంది జీవితాలలో ఇది జరగదు. కొన్ని కారణాల చేత కానీ, ఏవో ఆదర్శాలు, ఆశయాలను సాధించాలన్న ప్రయత్నంలో కానీ భాగస్వామి తోడు లేకుండా ఒంటరి ప్రాయాణాలు చేస్తుంటారు కొందరు. వీరికి తమ మాటే చెల్లుబాటు కావాలన్న భావం ఉంటుంది. తాము నమ్మిన వాటి కో(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్, తిరుపతి ఫోటోలు
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 29-01-13 17:41:00
'తిరుపతిలో అలిపిరికి సమీపంలో ఉంది శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్. మన రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖ పట్టణం తరువాత ఉన్న మూడవ జూ ఇది. వారంలో మంగళవారం సెలవు. నూట యాభయి రూపాయలు టిక్కెట్‌తో ఇక్క డ కారులో నేరుగా లోపలికి వెళ్ళవచ్చు. ఇందులో పక్షుల విభాగంలో తెల్ల నెమలితో బాటు అనేక రకాల పక్షులు ఉన్నాయి. పులుల విభాగంలో తెల్ల పులి కూడా ఉంది. లయన్ సఫారీ ఉంటుంది. ఇరవై అయిదు రూపాయల టిక్కెట్‌మీద ఇరవై సీట్లున్న వాన్‌లో తీసుకు వెళ్తారు. చుట్టూ ఇనుప ఫెన్సింగ్ ఉన్న విశాలమైన ఎన్‌క్లోజర్‌లో సింహాలు ఉ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
భయ పడకు. మనం కుక్కలం, మనుషులం కాదు.
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 18-01-13 18:50:00
'ఒక ఆడ కుక్క ఒక రాత్రి వేళ బయటకి వచ్చింది. దానిని కొన్ని మగ కుక్కలు చూశాయి. ఆ మగ కుక్కల గుంపుని చూసిన ఆడ కుక్క మనసులో డిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన మెదిలింది. దానితో అది భయంతో వణికి పోయింది. ఆ కుక్క భయాన్ని గమనించిన ఒక మగ కుక్క దాని దగ్గరికి వచ్చి ఇలా అంది: "భయ పడకు. మనం కుక్కలం, మనుషులం కాదు."'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నమ్మి తీరాలి అందమైన ఈ పువ్వులు మనుషులే! PHOTOS
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 26-12-12 17:55:00
'జాగ్రత్తగా గమనించండి ఈ పుష్పాలలో రెక్కలు, కాడలు అన్నీ మనుషులే!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బహుళ జాతి కంపెనీల దాడి నుంచి మనని మనం ఇలా కాపాడుకోవచ్చు
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 26-12-12 04:52:00
'బహుళ జాతి కంపెనీలు చాపకింద నీరులా విస్తరించి జాతి సంపదని, దేశ వనరులనీ దోచుకొంటున్నాయన్నది ఏమాత్రం ఆలోచనా శక్తి ఉన్న వారయినా ఒప్పుకొనే సత్యం. బాగా బలిసిన ఈ కంపెనీలతో పోరాటం చేయడం అంత తేలిక కాదు, అందరివల్లా అయ్యే పని కూడా కాదు. అయితే వ్యక్తిగతంగా వీటితో పోరాటం కాకపోయినా ఈ కంపెనీల దోపిడీ బారి నుండి ఎవరికి వారు కొంత మేరకయినా తప్పించుకొనే ప్రయత్నం చేయవచ్చు. ముందుగా అందరి జేబులకి చిల్లు పెట్టి ఆరోగ్యానికి చిచ్చు పెడుతున్నవి శీతల పానీయాలు. "మా డ్రింకుతో దాహాం తీర్చుకోండి: అని "భుజాయే (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మూర్ఖత్వం రాక్షసత్వం కలగలిసిన నేల
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 23-12-12 11:43:00
'పాకిస్తాన్‌లోని కరాచికి ఉత్తరాన దాడు జిల్లాలోని సీట గ్రామంలోని ఒక మసీదులో ఈ గురువారం ఉదయాన ప్రార్ధనలకోసం వచ్చిన వారికి ఖురాన్‌లోని కొన్ని కాగితాలు తగలబడి కనిపించాయి. మరెక్కడయినా అయితే అది అంతగా చెప్పుకోవలసిన విషయం కాదు కానీ పాకిస్తాన్‌లో దైవ దూషణ(Blasphemy) చట్తం ప్రకారం అది చాలా పెద్ద నేరం. ఆ రాత్రి ఆ మసీదులో ఒక యాత్రికుడు విశ్రాంతి తీసుకున్నాడు. అతను తప్ప మరెవ్వరూ ఆ మసీదులో లేరని ఆ మసీదు ఇమామ్ చెప్పాడు. దానితో అక్కడ గుమి కూడిన ప్రజలు అతన్ని తీసుకెళ్ళి పోలీసు స్టేషనులో అప్పగించారు.(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
డిల్లీ గ్యాంగ్ రేప్ నిందితులని శిక్షించకూడదు
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 21-12-12 17:42:00
'అవును వాళ్ళకి శిక్ష పడకూడదు. ఒక వేళ శిక్ష పడితే ఏం పడుతుంది. ఏడాదో, రెండేళ్ళో మహా అయితే ఏ మూడు నాలుగేళ్ళో జైలు. అంతే. ఆ రాక్షసులు జరిపిన అమానుష హింసకి అది సరిపోతుందా? నిస్సందేహంగా సరిపోదు. అంతకు మించి శిక్ష వేయడానికి మన చట్టం ఒప్పుకోదు. అయితే వాళ్ళని ఏం చేయాలి. కాల్చి పారేయాలి. ఆ మధ్య అమ్మాయిల మీద ఆసిడ్ దాడి ఘటనలో వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి తీసుకొన్న నిర్ణయాన్ని షీలా దీక్షిత్ కూడా తీసుకొని వాళ్ళని కాల్చి పారేయమని పొలీసులకు చెప్పాలి. దానికి ఓ చిన్న పిట్టకథ అల్లి మీడియాకి చెప్పవచ్చు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
2000 MP ఫోటోలో ఎవరెస్టు అందాలను చూడండి
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 20-12-12 18:10:00
'2000 mega pixels ఫోటోలో ఎవరెస్ట్ అందాలను బంధించిన ఈ ఫోటోలో ఎర్ర వృత్తంలో శిఖరాన్ని అధిరోహిస్తున్న వారిని, పసుపు వృత్తంలో బేస్ కాంపునీ చూడవచ్చు. మీ ఓపికని బట్టి జూమ్ చేసుకొని ఈ అద్భుతమైన శిఖరంలో ఇంకా ఎన్నో అందాలని చూడవచ్చు. పూర్తి ఇంటరాక్టివ్ ఫోటో కోసం ఈ లింకుని క్లిక్ చేయండి. https://s3.amazonaws.com/Gigapans/EBC_Pumori_050112_8bit_FLAT/EBC_Pumori_050112_8bit_FLAT.html'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పిచ్ గురించ్ అంత రగడ ఎందుకురా పిచ్చి నా ---------
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 11-12-12 00:04:00
'పిఛ్ గురించి ఈసారి జరిగినంత రగడ గతంలో ఎప్పుడూ జరగలేదేమోననిపిస్తోంది. అయితే ఈ రగడ భారత్ చేతిలో ఓడిపోయిన పర్యాటక జట్టు కెప్టెన్ నుండి కాక మన కెప్టెన్ దగ్గరనుండి కావడం ఇందులో విశేషం. క్రికెట్ జట్టు కెప్టెన్ అంటే మన దేశంలో శ్రీ మహా విష్ణువు పదకొండవ అవతారంతో సమానం. కాబట్టి అతను ఏం కోరితే అదల్లా దక్కడం ఇక్కడ ఆనవాయితీ. జట్టులో కోరుకున్న ఆటగాళ్ళు, మైదానంలో తనకు నచ్చిన పిచ్ ఇవన్నీ అలా వస్తూ ఉంటాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో మన స్పిన్నర్లు రెచ్చిపోవడంతో, ముంబాయిలో జరిగిన రెండవ మ్యాచ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
THE CURSE OF JAGAN MOHAN REDDY
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 08-12-12 18:51:00
'1922లో లార్డ్ హోవార్డ్ కార్టర్ టుటాన్‌ఖామున్ పిరమిడ్‌లోని మమ్మీని పెట్టిన శవపేటికని తెరిచినప్పుడు చాలామంది ఆ మమ్మీని తెరిస్తే ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుందని, ఆ మమ్మీ తన శాపాన్ని ఆ తెరిచిన వారిమీద ప్రయోగిస్తుందని భయపెట్టినా ఆ పురావస్తు శాస్త్రవేత్త భయపడలేదు. అయితే ఆయనకి ఏమీ కాకపోయినా ఆయన బృందంలోని కొంతమంది అనూహ్యంగా మరణించడమో ప్రమాదాలకి గురికావడమో జరిగింది. The Curse of Tutankhamun అని దీనిని వర్ణిస్తారు. అలాగే The Curse of Hope Diamond అని మరొకటి ఉంది. దక్షిణ భారతదేశంలోని ఒక గ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శభాష్ కిరణ్ కుమార్ రెడ్డి
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 03-12-12 17:54:00
'హైదరాబాద్ పాత బస్తీలో ఎంఐఎం వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా చాలాకాలంగా సాగుతూ వస్తుంది. రాష్ట్రంలో మైనారిటీ ఓట్లన్నీ వీళ్ళ కనుసన్నల్లో ఉంటాయన్న తప్పుడు అభిప్రాయంతో పాలకులు వీరి అడుగులకు మడుగులు ఒత్తారు. కాంగ్రెస్ పార్టీ దీనిని ఎక్కువగా చేసింది. ఇక రాజ శేఖర్ రెడ్డి సీఎం అయ్యాక వీరికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఎన్ని కబ్జాలు చేసినా దందాలు చేసినా ఏమీ అనకుండా చట్టాన్ని, న్యాయ వ్యవస్థనీ అదుపు చేశారు పాలకులు. తస్లీమా నస్రీన్‌ని టీవీ కెమెరాల సాక్షిగా దాడి చేసి గాయపర(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ధోనీ చిన్నప్పుడు మీ టీచర్ నీకు ఈ నీతి వాక్యాలు చెప్పలేదా?
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 27-11-12 19:08:00
'ప్రతి ప్రాధమిక పాఠశాలలోనూ పిల్లలకి బోధించే నీతి వాక్యాలలో చెరపకురా చెడేవు, ఎవరు తీసిన గొయ్యిలో వారే పడతారు అన్నవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చదువుకున్న స్కూలులో ఇవి చెప్పినట్లు లేదు. అలా చెప్పి ఉంటే ముంబయిలో నిన్న ముగిసిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో మన వాళ్ళు అంత దారుణంగా దెబ్బ తిని ఉండే వాళ్ళు కాదేమో. ముంబయిలో పిచ్ తయారు చేసే క్యూరేటర్‌కి స్పిన్ మ్యాచ్ కావాలని ధోనీ ఆర్డరేశాడు. మొదటి మ్యాచ్‌లో మన వారి స్పిన్ ఎదుర్కోలేక ఇంగ్లాండ్ బ్యాట్స్ (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఓట్ల జడి వాన కురిపించే స్కాము శ్రీ పథకం
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 25-11-12 00:17:00
'రాజ శేఖర్ రెడ్డి ఎన్నికలలో గెలిచి రెండవసారి అధికారంలోకి రావడానికి ఆరోగ్యశ్రీ పథకం చాలా ఉపయోగపడిందని అందరూ ఒప్పుకుంటారు. ఈ పథకం ద్వారా లాభపడ్డవాళ్ళే కాకుండా వారి చుట్టుపక్క కుటుంబాలవారిమీద కూడా దీని ప్రభావం బాగా పని చేసింది. ఇందులో మరొక గొప్పతనం ఏమిటంటే ఈ పథకం వల్ల ప్రజారోగ్య వ్యవస్థ దెబ్బతిని పొయినా అది ఎవరికీ కనిపించక పోవడం. ఎన్నికలలో ఎలాంటి పథకాలే ఓట్లు రాలుస్తాయి. ఆరోగ్య శ్రీలో లాభపడ్డవారిలో పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓట్లు వేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. హైటెక్ సిటీలూ, ఐటీ కంపెనీల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సవితా బాబీని తగులుకోబోతున్న రామ్ గోపాల్ వర్మ
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 24-11-12 17:52:00
'గత కొన్నేళ్ళుగా సరయిన హిట్ లేక విజయం కోసం మొహం వాచిపోయిన రామ్ గోపాల్ వర్మకి అర్జంటుగా ఒక సూపర్ హిట్ కావాలి. హిందీలో లాభం లేదని తెలుగులోకి వచ్చి కామెడీ పండిదామని అనుకుంటే అప్పల్రాజు ట్రాజెడీనే మిగిల్చాడు. ఎన్నాళ్ళుగానో తనకి కలిసివచ్చిన మాఫియా కూడా తనని ఆదుకోకపోయేసరికి రూటు మార్చి ఫాక్షన్ డైరెక్షన్‌లో పోయినా కలిసి రాలేదు. ఇలా లాభం లేదని తనకి ఇష్ట దైవాలయిన భూతాలని ఆశ్రయించినా వర్మ గారికి కలిసిరాలేదు. దానితో ఈ సారి ఎలాగయినా హిట్టు కొట్టాలన్న పట్టుదలతో ఇంటర్‌నెట్‌లో సంచలనం రేక(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
హిందుత్వాన్ని, రాముడి తత్వాన్నీ బద్ధలు కొట్టడం ఈ పింజారీ వెధవల వల్ల అవుతుందా?
రచయిత
: KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
బ్లాగు
: చెప్పు దెబ్బలు-పూలదండలు
టపా తేది
: 14-11-12 23:04:00
'దీపావళి రోజు నేను ఊహించినట్లే టీవీ9 వాళ్ళు ఒక నరకాసురుడి భక్తుడినీ ఒక హిందుత్వ వాదినీ పిలిచి చర్చ పెట్టారు. పోయిన సంవత్సరం కూడా ఇదే చానల్‌లో ఇదీ చర్చ చూశాను కాబట్టి ఈ సారి కూడా ఈ పెంట ఉంటుంది అని నేను ఊహించింది నిజమయింది. మొన్నామధ్య ఒక చానల్‌లో రావణాసురుడి భక్తుడు ఇన్నయ్య అనే మేధావి రావణుడు, శూర్పణఖ అసలయిన పూజ్యనీయులనీ, రాముడు, లక్ష్మణుడు గర్హనీయులనీ నోరు పారేసుకోవడం చూశాక ఈ సారి ఈ పింజారీ మూక నరకాసురుడిని నెత్తికెత్తుకోవడం నాకు ఆశ్చర్యమనిపించలేదు. ఈ చర్చలో పాల్గొన్న నరకాసురుడి(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి