కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(10)

madhu's(5)

srikaaram(5)

seenu(3)

శరత్ 'కాలమ్'(3)

శ్రీనివాస బాబు(3)

Sadhu.Sree Vaishnavi(3)

బాబు(3)

we3ours3(3)

SPLENDOR OF YOGA(2)

rentala jayadeva(2)

బ్లాగు బాబ్జీ(2)

viplove(2)

మురళి కృష్ణ(2)

CCKRao(2)

శ్రీనివాస్(2)

gpawansir(2)

raki(2)

praveensarma(2)

ఆత్రేయ(2)

Rajesh(2)

Chandu(1)

Naveen(1)

అరుణాంక్(1)

Sitaram Vanapalli(1)

AMMA ODI(1)

"Osaamaa....."(1)

నీహారిక(1)

శ్రీధర్(1)

Vijay Bhaskar(1)

భమిడిపాటి ఫణిబాబు(1)

ఎన్.వేణుగోపాల్(1)

తృష్ణ(1)

chandamama(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

Hemalatha(1)

జ్యోతి(1)

Srujana Ramanujan(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

భావకుడన్(1)

durgeswara(1)

ఏకాంతపు దిలీప్(1)

బ్లాగాగ్ని(1)

మాలతి(1)

సూర్యుడు(1)

'Padmarpita'(1)

భాస్కర్ రామరాజు(1)

Sujata(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

keerthika karlapudi(1)

కోడీహళ్ళి మురళీ మోహన్(1)

madhavaraopabbaraju(1)

రఘు(1)

చిన్ని ఆశ(1)

చెప్పాలంటే....(1)

geetika(1)

Weekend Politician(1)

హరే కృష్ణ(1)

హెచ్చార్కె(1)

Admin(1)

chanakya(1)

రుక్మిణిదేవి(1)

మనసు పలికే(1)

ఇందు(1)

శరత్ 'కాలమ్'(1)

సనారాజు(1)

jois(1)

Ramakrishna Reddy Kotla(1)

C.ఉమాదేవి(1)

డింగరి (Dingari)(1)

కె. శ్రీనివాస్(1)

Sreenivasa Gargeya(1)

కంది శంకరయ్య(1)

శ్రీలలిత(1)

Kamal(1)

రాధిక(నాని )(1)

AVS POST.....(1)

సావిరహే(1)

తార(1)

AMMA ODI(1)

anrd(1)

kannaji e(1)

beereddy nagesh reddy(1)


ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొని ఇద్దరు మృతి

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 06-09-10 16:51:21


హైదరాబాద్‌: హైదరాబాద్‌లో పాతబస్తీ కందికల్‌గేట్‌ వద్ద ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. తరచూ ఇటువంటి ప్రమదాలు జరగుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రమాదాలను నిలువరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. Filed under: వార్తలు




ఖమ్మంలో తెరాస, తెదేపా మధ్య ఘర్షణ

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 06-09-10 16:50:49


ఖమ్మం: ఇల్లెందు బైపాస్‌ రోడ్డులో జెండాల విషయంలో తెదేపా, తెరాస మధ్య ఘర్షణ ఏర్పడింది. తెరాస నేతలు ఈటెల రాజేందర్‌, విజయరామారావులతో తెదేపా నేతలు వాగ్వివాదానికి దిగారు. ఈరోజు ఖమ్మంలో తెరాస ‘కథనభేరి’ సభ జరగనున్న నేపథ్యంలో జెండాలను ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ ఘర్షణ తలెత్తింది. Filed under: వార్తలు




విశాఖలో ఆస్తిపన్నుపై తలొగ్గిన అధికారపక్షం

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 06-09-10 16:50:20


విశాఖపట్నం: ఆస్తిపన్ను పెంపునకు నిరసనగా విశాఖలో విపక్షాలు చేస్తున్న ఆందోళనకు అధికారపక్షం తలొగ్గింది. ఆస్తిపన్నును ఏకంగా 300 నుంచి 500 శాతం వరకూ పెంచడంపై నగరవాసులతో పాటు విపక్షాలు గత పది రోజులుగా విశాఖలో ఆందోళన నిర్వహిస్తున్నాయి. పన్నుల పెంపు హేతుబద్దంగా ఉండాలని… మొదట నగరపాలక సంస్థ తీర్మానించిన విధంగా 50 శాతం వరకే పన్నులు పెంచాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. విపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో మొదట అనుకున్న విధంగా ప్రస్తుతమున్న [...]




బీహార్‌లో పట్టాలు తప్పిన ప్యాసింజర్‌ రైలు

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 06-09-10 16:49:55


పాట్నా: బీహార్‌లోని రక్సాల్‌నక్తియాగంజ్‌ వద్ద ఓ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పలువరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. Filed under: వార్తలు




ఇంద్రకీలాద్రిపై రిటైనింగ్‌ వాల్‌కు పగుళ్లు

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 06-09-10 16:49:23


విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై రిటైనింగ్‌ వాల్‌కు భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. గోడ నుంచి ఇటుకలు భారీగా వూడి పడ్డాయి. ఓంకారం మలుపు వద్ద స్లాబ్‌పై భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. స్లాబ్‌ కూడా కుంగిపోయింది. దీంతో పగుళ్లు కనబడకుండా అధికారులు పట్టాలు కప్పారు. రిటైనింగ్‌ వాల్‌ భద్రతపై ఇప్పటికే తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో రిటైనింగ్‌ వాల్‌ నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. Filed under: వార్తలు




తెలంగాణ ఎంపీల వ్యవహారశైలిపై సోనియాకు ఫిర్యాదు

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 06-09-10 16:48:54


హైదరాబాద్‌: తెలంగాణ ఎంపీల వ్యవహారశైలిపై సోనియాకు ఫిర్యాదు చేస్తామని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. సీమాంధ్ర ఎంపీలంతా ఈనెల 9న సమావేశమై సోనియాకు ఫిర్యాదు చేసి చర్యలకు పట్టుబడతామని చెప్పారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే శక్తులతో పార్టీ తెలంగాణ ఎంపీలు చేతులు కలుపుతున్నారని వ్యాఖ్యానించారు. గత ఉప ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు తెరాసకు లోపాయికారిగా సహకరించారని ఆయన ఆరోపించారు. Filed under: వార్తలు




ప్రమాదవశాత్తూ తూటా తగిలి వ్యక్తి మృతి

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 06-09-10 16:48:21


విశాఖపట్నం: విశాఖ జిల్లా పద్మనాభం మండలం యానాది చెరువులో ప్రమాదవశాత్తూ తూటా తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. చెరువులోని బాతుల్ని న్యాయవాది తుపాకీతో వేటాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. Filed under: వార్తలు




ప్రభుత్వం, పార్టీపై విమర్శలు తగవు: పాల్వాయి

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 06-09-10 16:47:58


హైదరాబాద్‌: మంత్రి పదవిలో ఉంటూ ప్రభుత్వం, పార్టీపై విమర్శలు తగవని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి రోశయ్యను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ ముఖ్యమంత్రి కావాలనేవారు ముందు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. బాలినేనిలాంటి వారిని అధిష్ఠానం ఇక ఉపేక్షించదని వెల్లడించారు. Filed under: వార్తలు




ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరిగిన నీటిమట్టం

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 06-09-10 16:47:27


రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరిలో నీటిమట్టం పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ నుంచి 11.84 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. Filed under: వార్తలు




కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 06-09-10 16:46:56


విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషాలను ఆనుకొని ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఒడిషావైపుకు మళ్లింది. దీని కారణంగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా… తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్ర మీద చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా 45 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు [...]




నల్ల బ్యాడ్జీలతో ఆయుష్‌ వైద్యుల ఆందోళన

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 06-09-10 16:43:53


హైదరాబాద్‌: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయుష్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ నేటి నుంచి మూడు రోజుల పాటు ఆందోళన చేపట్టనున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా 6, 7, 8 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని వైద్యుల సంఘం ప్రకటించింది. సిబ్బందికి జీతాలు చెల్లించాలని, డిస్పెన్సరీలకు మందులు సరఫరా చేయాలని తదితర డిమాండ్లతో వారు ఆందోళన చేపడుతున్నారు. Filed under: వార్తలు




నేటి నుంచి అక్షరాస్యత దినోత్సవాలు

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 06-09-10 16:43:23


హైదరాబాద్: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాలను సోమవారం నుంచి బుధవారం వరకు 3 రోజుల పాటుహైదరాబాద్‌లో జరగనున్నాయి. కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి పురందేశ్వరి వీటిని శిల్పాకళా వేదికలో ప్రారంభిస్తారు. దేశంలోని 365 జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల తరఫున వెయ్యి మంది దీనికి హాజరవుతున్నారు. Filed under: వార్తలు




రేపటి నుంచి భాజపా సమాలోచనలు

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 06-09-10 16:42:44


విశాఖపట్నం, న్యూస్‌టుడే:రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి దశ దిశ నిర్ణయించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు కంభంపాటి హరిబాబు అన్నారు. ఈనెల 7, 8, 9 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్రస్థాయి ‘సమాలోచన సమావేశాలు’ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాబోయే మూడేళ్ల కోసం ఈ సందర్భంగా వ్యూహరచన చేస్తామన్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం రూపాల(గుజరాత్‌) రాష్ట్ర పరిశీలకుడిగా, ఓమనచార్య (కర్నాటక) సహ పరిశీలకుడిగా హాజరవుతారన్నారు. వెంకయ్యనాయుడు, బంగారు లక్ష్మణ్‌, వి.రామ(...)




నియంత్రణ రేఖ వద్ద శక్తిమంతమైన పేలుడు

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 01-09-10 12:01:14


శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌ పూంచ్‌ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి శక్తిమంతమైన పేలుడు సంభవించింది. మంగళవారం సాయంత్రం కన్‌గిరి పోస్టు సమీపంలోని సరిహద్దు వెంబడి పేలుడు సంభవించిందని… ఈ ప్రాంతంలో మరో రెండు ఐఈడీ పేలుడు పదార్థాలను గుర్తించినట్లు సైనికాధికారులు బుధవారం తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. సరిహద్దు వెంబడి పెట్రోలింగ్‌ చేసే సైన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉగ్రవాదులు ఈ పేలుడు పదార్థాలను అమర్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. Filed under: వార్తలు




చిన్న పెండ్యాలలో శ్రీకృష్ణకమిటీ

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 01-09-10 12:00:49


వరంగల్‌: రెండు రోజుల పర్యటనలో భాగంగా శ్రీకృష్ణ కమిటీ వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం చిన్న పెండ్యాల గ్రామాన్ని సందర్శించింది. విద్య, వైద్య, ఉద్యోగాలు ఇలా అన్ని విధాలుగా తాము నష్టపోయామని ఈ సందర్భంగా గ్రామస్థులు కమిటీకి తెలిపారు. గోదావరి నిది పక్కనే ఉన్న తమకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. వేల కోట్లతో నిర్మించిన భారీ ఎత్తిపోతల పథకం దేవాదుల ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు పారలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక [...]




తిరుపతి చేరుకున్న ప్రధాని

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 01-09-10 11:59:29


తిరుపతి: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తిరుపతి చేరుకున్నారు. గవర్నర్‌ నరసింహన్‌, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రధానికి స్వాగతం పలికారు. మన్నవరం ప్రాజెక్టు, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇదిలాఉండగా పద్మావతి అతిథి గృహం వద్ద చెట్టు కూలింది. ఈ అతిథి గృహంలో మధ్యాహ్నం ప్రధాని బసచేయనున్నారు. కూలిన చెట్టును అధికారులు తొలగిస్తున్నారు. Filed under: వార్తలు




వెస్ట్‌బ్యాంకులో కారుపై తీవ్రవాదుల దాడి

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 01-09-10 11:59:08


జెరూసలెం: ఇజ్రాయెల్‌లోని వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతంలో ఓ ఇజ్రాయెలీ కారుమీద పాలస్తీనాకు చెందిన వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గర్భిణి సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు తామే కారణమంటూ తీవ్రవాద సంస్థ హమాస్‌ ప్రకటించుకుంది. వాషింగ్టన్‌లో బుధవారం నుంచి మధ్య తూర్పు దేశాల శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. Filed under: వార్తలు




జగన్‌ ఓదార్పు యాత్ర మానుకోవాలి

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 01-09-10 11:58:35


గుంటూరు: జగన్‌ ఓదార్పు యాత్ర మానుకోవాలని మంత్రి మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏఐసీసీ ప్రకటించిన రూ. లక్ష పరిహారంపై జగన్‌ సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. ఏఐసీసీ నిర్ణయం, జగన్‌ ఓదార్పుయాత్ర వేర్వేరుగా ఉండడం సరికాదని మాణిక్య వరప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే మైనింగ్‌ పాలసీ మార్పుకోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ నినాదంతో గొంతుకలపాలని అన్నారు. Filed under: వార్తలు




సిలిండర్‌ పేలి వ్యక్తి మృతి

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 01-09-10 11:58:07


విశాఖపట్నం: మల్కాపురం ఇండస్ట్రియల్‌ కాలనీలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు మహిళలు తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడిన మహిళలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. Filed under: వార్తలు




హెచ్‌ఆర్సీ తాత్కాలిక ఛైర్మన్‌గా పేరిరెడ్డి

రచయిత manyasima'      బ్లాగు :మన్యసీమ      టపా తేది: 01-09-10 11:57:31


హైదరాబాద్‌: రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్‌ బాధ్యతలను ప్రభుత్వం తాత్కాలికంగా కాకుమాను పెదపేరిరెడ్డికి అప్పగించింది. ప్రస్తుత ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి పదవీకాలం ఆగస్టు 12తో ముగిసింది. నూతన ఛైర్మన్‌ నియామకం పూర్తయ్యే వరకు పేరిరెడ్డి తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆయన ప్రస్తుతం హక్కుల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. Filed under: వార్తలు

పత్రికా హారం