వానలో హైదరాబాద్!
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 05-09-10 12:04:00
వొంటరి రాస్తా మీదచిట్టికప్పల్లా ఎగిరెగిరి పడ్తుంటాయి చినుకులుచినుకు వొక అల్లావుద్దీన్ అద్భుత దీపం. దీని బుడగ దేహంలోకి నేను జారిపోతానునగరపు పైపై మెరుగుల నా దేహంకాసేపు దీప కాంతిని ధరిస్తుంది. వొంటరి రాస్తా పక్కనకాసిన్ని వాన నీళ్ళు పిల్ల మడుగులయి ఎటో పారాలని చూస్తాయినా వొంటిని మడిచి కాయితప్పడవలాగా అందులోకి వదిలేస్తాను. అది ఎటు వెళ్ళి ఎటు వస్తుందా అని చూస్తూ వుంటాను. దాని రెక్కల మీద నా కన్ను అతికిస్తాను. అది కదలడం మరిచిపోయిందనికాసేపటికి అర్ధమవుతుంది నాకు. ఈ వూళ్ళో వానకి ఏ పనీ లేదుఅది ఎవ(...)
కొత్త ప్రపంచపు కవిత్వం "ఊరి చివర": చింతపట్ల సుదర్శన్ సమీక్ష
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 02-09-10 11:48:00
(వార్త ఆదివారం సంచిక నుంచి)
హైదరాబాద్ వొక కవి సమయం
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 01-09-10 23:04:00
ఇది నన్ను వెతుక్కుంటుందో లేదో నహీ మాలూం - లేకిన్-నేనెప్పుడూ దీని వేళ్ళ సందులోంచి చిరిగిన ఆకాశాన్నీ, చింపిరి జుత్తు నేలనీ, కొంకర్లు తిరిగే చలి చెట్లనీ వెతుక్కుంటూ వుంటా పొద్దస్తమానం. ఆ కాంపస్ కెళ్ళే దారిలో ఆ ఆకుపచ్చ మలుపు మీద వాలిపోయిన సాయంత్రం రెక్క మీద ఎటు ఎగిరి వెళ్ళానో నహీ మాలూం.. కానీ-జారిపోతున్న వొక రాత్రి దాని మోదుగు పూల ఎర్రదనంలో కరిగిపోతా ఇప్పటికీ. ఇప్పుడక్కడ పొద్దుటా సాయంత్రం ప్రతి రాత్రీ వొక కల వెయ్యి గులాబీ రేకులై దారిని ప(...)
ఒక నేను వెళ్లిపోయింది
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 27-08-10 14:19:00
వొక జీవిత కాలం తరవాత, నాన్నానువ్వు అర్ధం అవుతున్నావ్ నెమ్మదిగా. అతి నెమ్మదిగాఆగిపోయిన వేడి నిట్టూర్పులాగాసాయంత్రపు గూటిలో ఆరిపోవడానికో పారిపోడానికో నిరాకరించే గుడ్డి దీపంలాగా. వందల వుదయాలు ఇంకా కొన్ని వందల సాయంకాలాలు సడి సేయని కొన్ని రాత్రులూ స్నేహరాహిత్యపు నడి రాత్రులూద్రవించని చీకటి పగళ్ళూనేర్పలేని బతుకు పాఠం ఏదో కొత్త పేజీ తిప్పుతోంది ఈ పూటనువ్వు పూర్తిగా నా కంటిలోంచి జారిపోయాక ఈ ఇల్లు నీ అనంతర నిశ్శబ్దపు నదిలో పొగిలిపోతున్న పడవ. నువ్వు వెళ్ళాకనేనీ తలాపు దీపపు నీడలోనే నిన్ను ని(...)
చార్మినార్ సూర్యుడికి ఎదురుగా...
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 26-08-10 18:24:00
వొక సీతాకోక చిలకఆత్మహత్యకి ముందు విడిచి వెళ్ళినకోకల రంగులురోడ్డు మీద మెరుస్తూ కనిపిస్తాయివెయ్యి మందికిపైనేఈ రోడ్డుని తొక్కి వెళ్ళిపోయారుఎవరికెవరూ కనిపించకుండా. వొక మధ్యాన్నంచార్మినార్ సిగ మీద సూర్యుడు తెల్ల బంతి పువ్వై నవ్వుతున్నప్పుడుకాసేపు అతని వొకానొక చూపులోకినువ్వూ ప్రయాణించు.అంత కష్టమేమీ కాదుకణ కణ నిప్పుల కొలిమిలోకివొక కన్నుని వొంపిఅనేక చూపుల ద్రవాన్నిబయటికి లాగడం!వొక సీతాకోక చిలకతన రంగులన్నీ మరచిపోయినలుపులోకి నిష్క్రమించిందిఈ మలుపు దగ్గిరే. ఇక్కడి నించిజీవితాన్ని చూడుఅదెలా కని(...)
సంధ్యా వందనము
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 24-08-10 11:35:00
( మూలం- అఫ్సర్- అనువాదం- గన్నవరపు నరసిం హ మూర్తి )పిలువ రాదె నిన్ను పెందలకడ వేళచెవిటి చెవుల లోన చేసి రొదలుశ్వాస విడచి నీదు మూసిన కళ్లందుచాలు నిద్ర యనుచు మేలుకొనవెప్రాత విడుపు గాదె ప్రత్యూష వేళందుకాళ్ళు ముఖము కళ్ళు కడుగ జలముసంధ్య వేళ శృతులు స్మరణ చేయగ బూననొక్క దిక్కు కేల మ్రొక్కు లీయఒక్కటొక్క టంచు నొక్కయు దిక్కేలద్రవము నౌట నాదు దర్శనంబుపాఱు నన్ని దిశల ప్రాజ్ఙత గలిగుండి పవన రీతి నాదు ప్రార్ధనంబు ప్రొద్దు పొడుచు వేళ ముద్దు ముందటి మాటమాపటందు గూడు మలిన మూడెమొము వాయి పాడ మోహన రాగమ్ముహృదయ (...)
యిక్కడేదో వొక జాంచెట్టు...
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 21-08-10 19:56:00
1యెవ్వరికీ చెప్పలేదు కానీ యిక్కడ నేన్నిల్చున్న చోట వొక జాంచెట్టు పెరుగుతూ వుండేది అనాథలాగా. గాలీ, ఆకాశం, సూర్యుడూ దాన్ని అతి ప్రేమగా పెంచేవి యెవ్వరికీ తెలీకుండా ! 2 పొద్దున్న నిద్రమొఖంతో మబ్బు కళ్ళతో దాని ఆకుల్లోకి తీక్షణంగా చూసి దాని కొమ్మల్లోంచి రాలిపడే కిరణాల్ని కళ్ళలోపల దాచుకొని పొద్దుటా, మధ్యాన్నం, రాత్రి పూటా ఆ వొకే వొక్క జాంచెట్టు దాని నీడ నేనయ్యానో అది నా నీడ అయ్యిందో?! 3దాని లేలేత వగరు ఆకుల్ని అప్పుడప్పుడూ నవుల్తూ దాంతో మాట్లాడ్తున్నట్టొ, పోట్లాడ్తున్నట్టో అన్ని వయసుల యేడ(...)
హైదరాబాద్: కొన్ని వానలూ కొన్ని చలి గాలులూ!
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 19-08-10 13:02:00
1ఇక్కడ సాయంత్రం ఏనాడూ లేదు కాబట్టిప్రతి నిద్రలోవొక సాయంత్రాన్ని కలకంటాను ఇప్పటికీ. చెట్లకి నీడలు చెరిగిపోయాకఆకాశం ఎండనంతా ఆరేసుకున్నాకఒక చలి గాలిని కప్పుకొనిఏదో ఒక సాయంత్రంచీకటి పడేలోగాగూడులోకి రెక్కలు ముడుచుకోవాలి. 2వాన మధ్యాన్నమే మొదలయ్యిందోపొద్దుటి నించీ పడుతూందో తెలీదుమధ్యాన్నం మొదలయ్యే బతుక్కి ఉదయాలూ తెలియవు. మధ్యాన్నం లేచే సరికిగడియారం మోగీ మూల్గీవిసుక్కుంటూ వుంటుంది. కాలాన్ని తిరగేసి చూడడం అలవాటే!3వానలూ చలికాలాలూ వాటి భ్రమణ కాంక్షల్ని చంపుకున్నాకమొలిచిన అష్టావక్ర .4హైదరాబాద్ (...)
తెలంగాణా కథ గురించి మళ్ళీ...!
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 16-08-10 13:59:00
ప్రాంతం/ ప్రాంతీయత తెలుగు కథకి ఇవాళ కొత్త అంశాలు కావు. తెలుగు కథ పుట్టినప్పటి నించీ "ప్రాంతం" ఆ కథకి పునాది. ప్రాంతం నేపధ్యం లేకుండా తెలుగు కథ ఏ నాడూ లేదు. కాని, ప్రాంతాన్ని వొక దృక్పథాంశంగా తీసుకోవడం గత మూడు దశాబ్దాలుగా తెలుగు కథా నిర్మాణంలో, కథా సాహిత్య విమర్శలో కనిపిస్తున్న మార్పు. ఈ మార్పుని మరింత నిర్దిష్టంగా నిర్వచించడానికీ, లేదా, వివరించడానికీ "ప్రాంతం" "ప్రాంతీయ వాదం" అనే రెండు భావనల్ని చర్చించి, ఈ కొత్త "ప్రాంతీయ వాద" చర్చలో తెలంగాణా కథ స్థానాన్ని అంచ(...)
నిశీధిలో నిప్పు కణిక అఫ్సర్ "ఊరి చివర"
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 14-08-10 13:33:00
సాక్షి దినపత్రికలో పంతంగి రాంబాబు గారు రాసిన సమీక్ష.
పదహారో సదికి మళ్ళీ చలో!
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 13-08-10 02:28:00
కొన్ని శతాబ్దాలుగా అబద్ధంగానే బతుకుతున్నా.ఇప్పుడు నిజం చెబ్తున్నానేను పదహరణాల పదహారో శతాబ్దం బిడ్డని. జర సంజో..అంట గానిసంజాయిషీలు చెప్పనునిన్న మొన్న గాలికి కొట్టుకొచ్చిన నీకుఈ గల్లీల గుండె చప్పుళ్ళు వినిపిస్తయా?ఈ మసీదు గోపురాల మీదగిరికీలు కొట్టిఆజాదీని నిజం చేసుకున్న వాణ్ణినీ డబ్బు మొహం మోహాలతో ముంచెత్తలేవురాజ్యానికి మతం రంగు పులిమినప్పుడల్లానా పేగుల్ని ఎర్ర తాయెత్తుగా కట్టుకొనిగోలకొండ గుండెల్లో కూడా నిద్రపోయిన వాణ్ణినీ కులం కూతలతో నిద్రపుచ్చలేవు. జాగారాలు మస్తు చేసిన వాణ్ణి బిడ్డా,(...)
ఓ యుద్ధ గీతం తెగిపోయింది!
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 11-08-10 03:12:00
ఆగస్టు 9. ప్రసిద్ధ పాలస్తీనా కవి మహమూద్ దర్వీష్ చనిపోయిన రోజు. ఆయన మా పొరుగున వున్న హూస్టన్ లోనే కన్ను మూశారు. ఆయన వివిధ కవితల సంకలనం గత ఏడాది అచ్చయింది. అందులో కొన్ని కొత్త కవితలూ వున్నాయి. ఈ పంక్తులు ఈ మధ్య నన్ను బాగా వెంటాడుతున్నాయి. I see what I want of poetry: in ancient times, we used to parade martyredpoets in sweet basil then return to their poetry safely. But in this ageof humming,movies, and magazines, we heap the sand on their poemsand laugh. And when we return we find t(...)
మంచితనానికి “కోవెల”!
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 10-08-10 03:21:00
"రక్త స్పర్శ" కవితా సంపుటి వెలువడిన 1986 ల లో ఒక సారి అనుకోకుండా సంపత్కుమార గారిని కలవడం మరచిపోలేని జ్ఞాపకం. ఒక చిన్న ఇంట్లో మేడ మీద కొన్ని పుస్తకాల బీరువాల మధ్య ఆయన్ని కలిసాను. వచన కవిత్వం మీద ఆయన చేస్తూ వస్తున్న లక్షణ చర్చకి ఆయన అప్పుడు రక్తస్పర్శ కవితల నించి కొన్ని ఆధారాలు వెతుకుతున్నారు. అప్పటికే చేకూరి రామారావు (చే.రా) ఆంధ్రజ్యోతిలో “చేరాతల” కాలం లో రక్తస్పర్శ కవిత్వాన్ని "మంచి కవిత్వం మాబాగా వస్తోంది!" అనే శీర్షిక కింద రాసిన పరిచయ వ్యాసం తెలుగు సాహిత్య లోకంలో చర్చనీయాంశంగా మా(...)
భావకవిత్వం కాదు చదువుతూ మధుర ఊహలలో తేలిపోవటానికి.....
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 08-08-10 00:25:00
"ఊరి చివర" కవిత్వం మీద ఇంకా చర్చలు సాగుతూండగానే, పుస్తకం డాట్ నెట్ లో "దీప్తిధార" సి.బి. రావు గారు మరో సమీక్ష రాశారు.రావు గారికి ధన్యవాదాలు. ఆయన సమీక్ష నించి కొన్ని "మెచ్చు" తునకలు:-అఫ్సర్ కవితలు భావకవిత్వం కాదు చదువుతూ మధుర ఊహలలో తేలిపోవటానికి. అవి మనస్సుకు పదును పెట్టే చిక్కుముళ్లు. కవితను చదువుతూ చిక్కుముళ్లను విడదీస్తూ కవి ఏమి చెప్తున్నాడనే విషయం తెలుసుకోవటానికి మనస్సుకు పనిపెట్టాల్సిందే. భావ కవితలు, సులభ వచన కవితలు, ఉద్వేగ పరిచే కవితలు చదివే వారికి ఈ కవితలు ఒక పట్టాన అంతుచిక్క(...)
ఎవరీ ముసుగు నారి "రమా భరద్వాజ"?
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 06-08-10 06:15:00
"ఈమాట"లో తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ప్రతి రచనా సగమో అర సగమో చదివి తెగ కామెంట్ల పంట పండించింది ఈ రమా భరద్వాజ అనే ముసుగు నారి. ఆమెకి ఈమాట మీద కోపమో, ఈ లోకం మీదనో కోపమో తెలీదు గానీ, ఈమాటలోని ప్రతి రచన మీదా, చివరికి సమీక్షల మీద కూడా ఒక అట్ల కాడ విసిరితే తప్ప రోజు గడవదేమో అన్నంత తీవ్రమయిన విసురుతో ఆవిడ గారు కామెంట్ల మీద కామెంట్లు రువ్వి ఈ మధ్య ఎందుకో పాపం కాసింత శాంతించింది. "ఊరి చివర" మీద వేలూరి రాసిన సమీక్ష మీద ఆవిడ గారు ఎందు వల్లనో చింత నిప్పుల కళ్ళతో చిందులు తొక్కిం(...)
శ్రీ శ్రీ అంటే రెండక్షరాలు మాత్రమే కాదు!
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 05-08-10 11:05:00
కొండ గుర్తుఒక జీవిత కాలంలో ఎంత మందిని చూస్తాం? అందులో ఎంత మందిని గుర్తు పెట్టుకుంటాం? కొందరు మన జ్ఞాపకాల్లో ఎక్కువ కాలం ఎందుకు నిలిచిపోతారు? ఇలాంటి చిన్న ప్రశ్నలకి సమాధానం వెతుక్కునే ప్రయత్నం ఈ "కొండ గుర్తు" శీర్షిక. ఇది కేవలం వ్యక్తులూ, వారి జ్ఞాపకాల్లోంచి వారి కృషిని గుర్తు చేసుకునే శీర్షిక. అప్పుడప్పుడూ రాయాలని నా కోరిక.1980. అప్పుడు కాలేజీ అంటే వొక ఉద్యమం. రోజూ సాయంత్రాలు ఖమ్మంలోని రిఖాబ్ బజార్ స్కూలు ముందో వెనకో కూర్చొని, లోకం మీద ఆగ్రహాన్ని ప్రకటిస్తున్న రోజులు. పట్టలేని ఆగ్(...)
ఎరీనా
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 02-08-10 00:18:00
1ఆకుపచ్చ నదిలోంచి ఒక మొక్కజొన్న కంకిఅయిదారు నెలల కడుపుతో తెల్లగా నవ్విందిదారి పక్కన. 2పద్యాలు ఎలా వుంటాయి?ఒక్కటే ప్రశ్న దారి పొడవునా.అప్పుకి పుట్టవు పదాలు.కడుపు పండాలి రక్త మాంసాల కంకి.3కొన్ని పిట్టలూ కొందరు మనుషులూ కొన్ని మొక్కలూఇవి లేని ఆకాశం నాకెందుకు?అని గాలి చల్లగా గోల చేసింది. 4నలుగురు కలిస్తే నాలుగు పద్యాలుపద్యం ఎప్పుడూ వొంటరి కాదు.5కాయితమయినా ఇనప రేకు అయినామట్టి పొరయినా. అన్నం పళ్ళెం పళ్ళెమే! కడుపు నింపే కల దానికి తెలుసు!6పగలంతా దిక్కుల్ని ముద్దాడిన పిట్టలుసాయంత్రం బారన్(...)
"ఊరి చివరి" సూఫీ పాట!
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 30-07-10 20:47:00
(ఈ ప్రస్తావన avkf.org నించి. ప్రచురణకు అనుమతించిన అప్పాజోశ్యుల సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు) http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=1696
ఒక వీరశైవ, ధీర సూఫీ అర్ధనారీ"స్వరం" : నీలం మాయ
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 30-07-10 12:42:00
అయిల సైదాచారి మనకు కొత్త కాదు. అతని కవిత్వం ఇంతకు ముందే మనకు తెలుసు. అందరికీ తెలిసిన అందరూ మరచి పోవాలనుకునే వొక అనుదిన నేపథ్యం నించి సైదా చారి కవిత్వ అనుభవ మంటపంలోకి ప్రవేశించాడు. అతని కవిత్వం మొదటి సారి చదివినప్పుడు ఇది వొక భిన్నమయిన భాష అని మనకి వెంటనే అనుభవమవుతుంది. కాని, ఆ అనుభవం మనల్ని అంత తేలికగా వూపిరదనివ్వాడు. మనలోని నిబ్బరత్వాన్ని కాసేపు కల్లోలితం చేసి, అసహనానికి లిపి వెతుక్కున్నేలా చేస్తాడు. ఎంత దూరం, ఎంత లోతుల్లోకి వచ్చామనుకున్నా, తెలుగు కవిత్వం ఇంకా అనుభవాన్ని నిఖార్సుగా(...)
"వలస" నించి "ఊరి చివర" దాకా....!
రచయిత
Afsar'
బ్లాగు :అక్షరం
టపా తేది: 29-07-10 02:28:00
"ఈమాట" వెబ్ పత్రికలో వేలూరి నాకవిత్వ సంపుటి "ఊరి చివర" మీద రాసిన సమీక్ష ఇది. ఈ సమీక్ష మీదా, నా కవిత్వం మీదా ఇక్కడ కూడా విస్తృతంగా చర్చ జరిగింది. కాని, "ఈమాట"లో జరిగిన ఈ చర్చ ఏకపక్షంగా జరిగిందనీ, అనేక వ్యాఖ్యల్ని సంపాదకులు "ఎడిట్" చెయ్యడమూ, కొన్నిటిని అసలు ప్రచురించకపోవడమూ జరిగాయనీ చాలా మంది ఇప్పటికీ నాకు రాస్తున్నారు. ఈ విషయం మీద సమగ్రంగా, న్యాయంగా, భిన్నాభిప్రాయాలకి చోటు దక్కే పద్ధతిలో చర్చ జరగాలని అనేక మంది రాస్తున్నారు. వారి అభిప్రాయాలని గౌరవిస్తూ, అభిప్రాయ భేదాలని కూడా మనస్పూర్త(...)