తొలకరి తూటాలు
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 09-05-13 13:45:00
'తొలకరి తూటాలు గాలి వాటాన తనపై దుమ్మెత్తి పోస్తున్న ఆ బీడు పైకి! గురిపెట్టి మరీ తొలకరి తూటాలను పేల్చిందా ఆకాశం. ఆహా! యుద్ధమూ లాభాసాటేనోయ్ అప్పుడప్పుడు. ********మరణం ఇంతకాలము నే తోడున్నానన్న స్వాంతనతో విరబూసిన కాలానికి,మాయని గాయం! నా మరణం. *******మజిలీ మజిలీని నీ మనసు మరచింది గనుకే బిజిలీ పోయింది జీవితాల్లోంచి. *******కాలం చేయి తిరిగిన వైద్యుడవు నీవని అనిపించుకోవడానికి నాపై ఇన్ని గాయాలు పూయించాలా నీవు?ఓ కాలమా!********'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
వెన్నెల
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 02-05-13 12:40:00
'వెన్నెల అలంకరించుకోవడం నేర్చిన చీకటే వెన్నెల. *****నీడ బ్రతకడానికని కాలంతో పాటూ పరుగెడుతున్న నన్ను చూసి ఆయాసపడుతుంది నా నీడ. అవును! నా కన్నా నా బ్రతుకు విలువ దానికే తెలుసు మరి. ******* కాట్వాక్ కొన్ని దాంపత్యాలు కూడా ఫాషన్ గా కాట్వాక్ చేస్తున్నాయి కోర్టు మెట్లపై. *******పరిమళం మనసుతో ఆ దేవుణ్ణి వెదకాలని తనువు శిలపై వాల్చి గుడిని దాటిందా పరిమళం. *******'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పానుపు
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 30-04-13 12:42:00
'ఇటుగా వచ్చిన వేళ ఆమె పాదాలను తాకవచ్చని కాబోలు ఆ గడ్డిపూలన్నీ ఆమె దారిలో పానుపైనాయి. *******గోదారి ఓ నాడు ఆకాశపు కన్య తారల ముందు నర్తిస్తుంటే ఆమె పైట జారి వెన్నెల సంద్రాన పడి తడిచిందట కన్నె ఆ పైట తీయబోవ వెన్నెల సంద్రం కసరి ఆ పైటను నేలకు విసిరిందట ఆకాశపు గానం తనలో కలుపుకుని గలగలా సాగిందా పైట గోదారిలా వెన్నెలంటిన కస్తూరిలా. ********మిణుగురులు తానో నాడు జాబిలో చేయిపెట్టి గుప్పెడు వెన్నెలను బయటకు తీసింది, గాభారాపడి నేను ఇదేమిటని(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ముక్కుపుడక
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 28-04-13 14:40:00
'ముక్కుపుడక తావిని మోయలేకా గాలికి పట్టిన స్వేదబిందువొకటి జారి ఆ పువ్వుకు ముక్కుపుడకైంది అదిగో అలా .... *******ప్రకృతి జీవిత ప్రాంగణంలో మనిషి వేగంగా పరుగెత్తడం మొదలెట్టిన చోటే ఆగిపోయింది అసలు ప్రకృతి. ********తోడు సుఖదుఃఖాలను చెప్పుకోవడానికి ఆ రాదారికి కూడా కుడిఎడమల మానులున్నాయి కానీ బ్రతుకు రాదారిపై నీకో ....?********మగత తానెవరిని మత్తెక్కించాలని మగతగా అడుగుతుందా నిద్ర పబ్బుల వెంట తి(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మేజువాణి
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 26-04-13 12:25:00
'మేజువాణి నవ్వే నీ పెదవికి తెలుసు నిన్నెంతలా కవ్వించిందో నా మనసని మోడును కానంటూ విరబూసిన నా హృదయానికి తెలుసు నాలోని మౌనాలను పాటలుగా ఎలా వసంతించిందో నీ మనసని అలలెగసి పడే సంద్రంలా నీ ఆలోచనలతో నిండిన నాదు అంతరంగానికి తెలుసు నీవు కాని అనుభూతి నా అనుభవానికి రాదనీ, నా మనసుకు అవధి వీవని గగనమంతటి నీ వలపుతోటన తేటులై తామాడే ఆటన హరివిల్లులెన్ని విరిశాయో, విరజాజులెన్ని కురిశాయో!పుడమిన అణువణువునూ పలకరించే కిరణాలకు తెలుసు నీ, నా సంగమ సంకేత నిక(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మనసుఆకలి
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 25-04-13 13:12:00
'మనసుఆకలి చెరువంత విస్తరిలో కొసరి కొసరి వెన్నెల వడ్డించే ఆ జాబిలింట విందందుకున్నావేమిటోయ్ ఎపుడైనా అన్నానని కాదుగానీ అప్పుడప్పుడూ మనసు ఆకలి కూడా తీర్చాలోయ్ ఏమంటావ్?*******ఏకాంతశిల్పి నన్నానందింపజేయడానికి నా ఏకాంత శిల్పి నిన్ను చెక్కి నా మనసు నింపి తానెక్కడికో వెళ్ళిపోయాడు. ********పిలవని పేరంటం తలుపులన్నీ మూసేసినా పిలవని పేరంటానికి ఎంత దర్జాగా వచ్చిందో చూడా చీకటి. ******మెరుపు సుందరి చీకటిలోనూ ఆ మబ్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
వెన్నదొర
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 22-04-13 13:31:00
'వెన్నదొర పున్నమి నాడు, తను కవ్వమై!వెన్నెలను చిలికి, ఆ వెన్నను నాదు మనసుకు తినిపిస్తూ 'వెన్నదొర' అంటే వీడేనని అందరితో అనిపిస్తుంది!నా పెరటి కొబ్బరిచెట్టు. ********ఎదురుచూపురాలిపడే పూలతో, తానేమి సౌరభించగలనని కాబోలు జారిపడే వాన చినుకులకై ఎదురు చూస్తుందా మన్ను. ********శిరస్త్రాణాలు ఉదయ వాహ్యాళి వేళ నీ, నా పదఘట్టనల తామెక్కడ గాయపడతామోనన్న జాగ్రత్తతో శిరస్త్రాణాలను ధరించి ఎలా కూర్చున్నాయో చూడా పచ్చికలు. *********జలతారుమేఘాలు బురదింటి (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 20-04-13 15:09:00
'బిరుదు పుట్టిన నాటి నుండి! కవిత్వాన్ని కొంగున ముడేసుకుని తిరుగుతున్నా ఏ ఒక్క బిరుదూ ఇవ్వవేమిటోయ్ నువ్వు ఆ అలలకు. *********మార్గదర్శకత్వం అనంత ఐశ్వర్యం తనలో ఉన్నా తనకంటూ ఓ హద్దు కావాలనుకుని తీరాన్ని ముద్దిడే కదలే మార్గదర్శకత్వం చేయలేకపోతోంది అనంతానంత అనుభూతులను ఆనందబాష్పాలుగా రెప్పల జారుతున్న ఈ వేళ నాదు మనసు. *********లోకకళ్యాణం లోకకళ్యాణమన్నది ఎప్పటికీ రేపటి మాటేనోయ్!ఎందుకంటే ఆ విలువలతో ఏడడుగులు వ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అందాలవిందు
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 18-04-13 12:40:00
'అందాలవిందు అద్దంలాటి మనసు , ఆతిథ్యమీయాలన్న ఆశ!ఈ రెండూ చాలవా? ఆకాశం కూడా మురిసిపోయేంత అందాలవిందును ఆ నిండు జాబిలికి వడ్డించ నేనంటూ చూడు ఎలా మిడిసిపడుతోందో అందాల ఈ పల్లెచెరువు. *********అందమైన అలజడి నాలుగు రాళ్ళను లోనికేసుకుంటూ!అలజడిలో కూడా అందముంటుందంటుందా చెరువు నిజమేనంటావా?*******కొంగ పుల్లంత కాళ్ళతో ఇంతటి దేహాన్ని ఎలా మోసుకొస్తున్నావంటూ తనను వెక్కిరించేలోపే ఇంతిల్లున్నా దాక్కోవడమే రాని నిన్ను నా గొంతులో దాస్తానంటూ గుటుక్కున చేపను మ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కాంతిహారం
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 17-04-13 12:43:00
'కాంతిహారం రాతిరికలా నింగి లో అన్ని పూలు పూసి వాడిపోవాల్సిందేనేమిటోయ్? ఎంచక్కా నాలా ఆ సాలెగూటి తీగలను పేని దారంగా చేసి ఆ పూలతో కాంతిహారమల్లడం నేర్పు నీ ఊహలకి. *******కరగబోతున్న అందాలు కరగబోతున్న తమ అందాలు నాకు చేరాలని మెరుపు తీగలతో చేవ్రాలు చేస్తున్నాయా మేఘాలు. *********కొమ్మ కొమ్మ ఒకటి ఒయ్యారంగానలుగురిలోకి నడచి వచ్చి తనపైని ఆకులను పూవులను రాల్చుకుంటూ మళ్ళీ అంతే ఒయ్యారంగా నడిచెళ్లిపోయింది ఫ్ల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బిడియం
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 16-04-13 12:04:00
'బిడియం దాటనా? వద్దా? అంటూ బిడియపడుతూ నీ పెదవిని దాటేసి, నాకెంత గాయంచేసి కూర్చుందో చూడు ఆ నీ చిరునవ్వు. ********వసంతం నల్లది పిలిస్తే వచ్చిన పచ్చది తెల్లని నా కంటిని ఎరుపెక్కించి బహుమతిగా నాలుగు ఆనందబాష్పాలు రాల్చుకుంది ఈ తోటలో. ********రాయికీ మనసు.... నా మెడలో చేరిన పూలహారంతో అందరూ నన్ను మొక్కేరు. నన్ను నిలిపిన నా దేవుణ్ణి నే మొక్కలేక పోతున్నానంటూ వాపోతోందా శిల్పం. రాయికీ మనసుందోయ్. **(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
విప్లవ బావుటా
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 14-04-13 11:32:00
' విప్లవ బావుటా నాపైనే నా మనసు విప్లవబావుటా ఎగరేస్తుంది నీకు చేరువ కమ్మంటూ. ******** దాహం ఎంత దాహమై నాపై పడ్డావో నా హృదయమంతా కరిగించి నీ దాహం తీర్చాలనుకున్నా పాడు గాలి ఒక్క క్షణం ఆగితేగా!అంటుంది ఆ చెరువు తనపై పడిన చెట్టు నీడతో. *********కాలిబాట నా నడకల్లో తాను మొలిచి నా అడుగుల నలుగుతూ కూడా అంతకంతకు అందంగా తాను తయారై నా గమ్యాలను చేరువ చేస్తుంది ఆ కాలిబాట. *********మధురసంగీతం మనసుని తాకే&nb(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చేను
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 10-04-13 16:22:00
'చేను శ్రావ్యమైన సంగీతమైందో లేదో ఆ గీతానికెంతటి కమనీయ రుపునాపాదిస్తోందో చూడా చేను. *******వాగు పొంగుతూ! తాను పాడుతున్న వాన పాటను, ఒళ్లంతా చెవులు చేసుకుని వింటున్న ఆ మాను పాదాలను కడుగుతూ సాగుతుందా వాగు. *******పూలతెల్లవారే వేళ తమపై మంచు బొట్లను మోస్తూ కొమ్మే కాదు!తాము కూడా, పూలను పూయించగలమంటున్నాయా పూలు!*******మనసు నీలో తానున్నానని కన్నీటిలో పడి కొట్టుకుపోతూ చెబుతుందేమిటోయ్ నీ మనసు. *******(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సంగమస్థానం
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 09-04-13 12:51:00
'సంగమస్థానం ఎవరి కంటా పడని సంగమస్థానం కోసం వెదుకుతూ కాబోలు ఆ నింగి ఈ నేల ఇంకా సంగమించనిది. ********జయకేతనం కలలన్నీ గెలిచాయని కంటి నుండి జారిన బిందువులో నీ రూపాన్నే నిలిపి మళ్ళీ మళ్ళీ జయకేతనం ఎగురవేస్తుంది నా మనసు. ********వసంతం ఒకింత ఓపికతో తనకై నిరీక్షిస్తూ ప్రాణాలను నిలుపుకున్న ఆ వనాలకు తన పంచ ప్రాణాలు పంచేసింది ఆ వసంతం. ******యుగళగీతం జడివాన వదిలేసిన ఒంటరి రాతిరితో యుగళగీతం పాడుతున్నాయి (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మృదువైన పరిచయాలు
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 08-04-13 12:53:00
'మృదువైన పరిచయాలు మృదువైన పరిచయాలు ఎక్కువైతే,మధుధారలు పొంగి పారవేమిటోయ్ జీవితాంతమని అంటున్నాయి ఆ తేనెటీగలు నిజమేనేమిటోయ్?*******పురుటినొప్పులు లెక్కలేనన్ని వాన చినుకులను కనడానికి ఆ మేఘాలు పడుతున్న పురుటినొప్పులేనోయ్ ఈ ఉరుములు. ********చిరునవ్వుల వడ్డీ అడగ్గానే ఇంత అందాన్ని అరువిస్తుందని!అడక్కుండానే చిరువన్నుల వడ్డీ కడుతుంటాను ఆ అద్దానికి. ********* గూడు కిలకిలమంటూ సందడిగుండే ఎన్ని ఇళ్ళకు ఒంటి గడపో ఈ కొమ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మనసైన బానిసత్వం
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 05-04-13 13:35:00
'మనసైన బానిసత్వం నోరు తెరిచి అడగ్గానే స్వాతంత్ర్యమిచ్చి ఆకాశాన్ని తన పాలు చేసిందని కాబోలు ఎంత ఎదిగితే అంత గట్టి సంకెళ్ళను తనకు తానే తయారు చేసుకుని ఈ మట్టితో బానిసత్వమూ తనకిష్టమేనని అంటుంది ఆ విత్తు. *******మెరుపు తీగతనను తాను మీటుకోవడం వల్లనే ఇన్ని అందాలొచ్చాయీ పుడమికని ఎంత అతిశయాన్ని ప్రదర్శిస్తుందో చూడా మెరుపుతీగ. *******పండుటాకులు ఓ పూట ఆకలి తీర్చిన ఎండుటాకులు గర్వంతో అలా ఎగిరి పడుతుంటే ఇన్నేళ్ళ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నిశ్శబ్ద గగనం
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 04-04-13 13:02:00
'నిశ్శబ్ద గగనం అలిగి కూర్చున్న ప్రేయసిని కదిలించాలని కాకపోతే నిశ్శబ్ద గగనానికా ఉరుమెందుకు?******** పుస్తె పుత్తడి వర్ణానికి తిరిగిందా చేను పుస్తె కరిగించా రైతు ఇల్లాలిది. *******నలుసు గుండె బద్దలై కంటిలో నలుసౌతుందేమో లేకుంటే కన్నీళ్ళెందుకలా...... *******అద్దం ఎంత యావో చూడా అద్దానికి ఎప్పుడూ ఏదో ఒకటి తలపోస్తూనే ఉంటుంది. ********కన్నీటి బొట్లు కరిగి విరిగిన రెండు సందర్భాలలో నా మనసుకు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
వేణువు
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 02-04-13 12:43:00
'వేణువు ఊపిరి జత చేశానంతే నా మనసునిలా ఖైదు చేసిందేమిటోయ్!ఈ వేణువు ******చెక్కిళ్ళు వాలిన రెప్పల పైనుండి జారుతున్న నునుసిగ్గును ఎంతందంగా పట్టుకున్నాయో చూడామె చెక్కిళ్ళు ******తొలకరి ఆడుతున్న ఆ నెమలి కాళ్ళకు గజ్జె కట్టింది నా పాట ఇక కరిగి నీ గుండె తొలకరిగా కురవక తప్పదు నేస్తం ******మేటి జవరాళ్ళు ముద్దులలోని మాధుర్యాన్ని మొదట ఆ రాతి గుండె వాడికి రుచి చూపించి, ఆనక ప్రణయ పారవశ్యాన కరిగి ప్రియున(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రావోయీ
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 01-04-13 13:31:00
'రావోయీ ఉన్నపాటుగా రావోయీ ఊహల్లో విహరిద్దాం కాసిని కలలను పండిద్దాం క్షణానికో అనుభవం విరియిద్దాం యుగాలదాకా అది నిలిచే దారిన పయనిద్దాం ఉన్నపాటుగా రావోయీ ఊహల్లో విహరిద్దాం కాసిని కలలను పండిద్దాం అంతులేనిదై ఆ ఆకాశం వేచియున్నది మనకోసం రివ్వున ఎగిరిపోదామా?రెక్కలివ్వమని ఈ పూవులనడిగి! చప్పున తిరిగొచ్చేద్దామా?నీటి ముత్యాల మూటలు దోచి మబ్బులింటినే లూటీ చేసి ఉన్నపాటుగా రావోయీ ఊహల్లో విహరిద్దాం కాసిని కలలను (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఉదయ వాహ్యాళి
రచయిత
: skvramesh
బ్లాగు
: skvramesh
టపా తేది
: 30-03-13 12:59:00
'ఉదయ వాహ్యాళి లేలేత వలపుల తొలికిరణాల పలకరింపులలో పై సొగసులనే దాచిన! పైటన ఈ సీమ అందాలు చూస్తుంటే నా మనసు విరిసింది మధువని వోలె హృదయం పొంగి పారింది ఒదిగి కూర్చున్న స్వేచ్ఛ రెక్క సాచి సంధ్యకై హారతి పడుతున్న చిత్రాలవిగో సద్దుమణిగిన నిన్నటి హ్లాద వేణియను మీటా వికసిత కిసలయత్వాన! కళ్ళు తెరచిన పూబాలలవిగో ఆ చిత్రాల ఛాయన ఈ వేణియ పాటల నా మనసు విరిసింది మధువని వోలె హృదయం పొంగి పారింది నిన్న పున్నమి రాతిరి ఒళ్లంతా వెన్నెల విభూతి పూసుకు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి