Skip Navigation Links


నీ చిరునవ్వు జ్ఞాపకాలతో...

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 26-03-13 10:09:00

'మాట్టాడటంలేదు అనుకుంటే మౌనమే చాలు అనుకున్నాను!.నువ్వు మౌనంగా ఉన్నావంటే నేను సహనంగా ఉండాలనుకున్నను!.కలవడం లేదు అనుకుంటే కళ్ళల్లోనే ఉన్నాననుకున్నాను!.చేతల్లో చికాకు చూసి మనసులోనే ఉన్నాననుకున్నాను!.నీ జ్ఞాపకాలతో,నీకై ఎదురుచూపులతో,ఆశతో బ్రతుకుతున్నాను!..నన్ను మరచిన నీచిరునవ్వు జ్ఞాపకాలతో కాలం గడుపుతున్నా!...'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఏమని చెప్పను?

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 02-02-13 10:40:00

'నలుగురిలో నేను ఉన్నపుడు,పదేపదే నువ్వు గుర్తుకొచ్చినపుడు,దిగులుతో మనసు బరువెక్కినపుడు,మాట్లాడేందుకు మాటలు రానపుడు,ఏమయిందని అందరు అడిగినప్పుడు,ఎంచెప్పాలో తెలియక తడబడుతున్నప్పుడు,నా అవస్థ నాకే నవ్వు తెప్పించినపుడు,ఆనవ్వు నీతో పంచుకోవాలనిపించినపుడు,ఎంత వెతికిన నువ్వు కనిపించనపుడు,అది నీ జ్ఞాపకమని నాకు అనిపించినపుడు,నా కన్నీళ్ళను ఆపేందుకు ప్రయత్నిచినపుడు,నా కళ్ళల్లో  కన్నీరు ఆగనపుడు,నా మనసుపడే వేదన నీకేమని చెప్పను???గుండె బరువై,మనసులో గుబులై,మమత కరువై,నీ ప్రేమ దూరమై,ఇంకేమని చెప్పను.(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ప్రేమంటే!!!

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 23-01-13 12:49:00

'వర్షంలో ఒకే ఒక్క గొడుగులో నడిచినమన పాదాల అడుగులకు తెలుసు ప్రేమంటే!మేఘల ఘర్షణ లో ఉరుముల మెఱుపుకుకలిసిన మన కనులకు తెలుసు ప్రేమంటే!కంటి సైగతో పలకరిస్తే బదులు పలికేచిరునవ్వుకు తెలుసు ప్రేమంటే!మమత నిండిన నీచేతి స్పర్శతోస్పందించే నామదికి తెలుసు ప్రేమంటే!మల్లే, సన్నజాజి పూల పరిమళానికినిన్ను ఆకర్షిచే మైకానికి తెలుసు  ప్రేమంటే!కలలు నిజమై మన మనసులు ఒక్కటైమమతానురాగానికి తెలుసు ప్రేమంటె!అల్లిబిల్లి కబుర్లతో, చిలిపి సరసాలతోనన్ను ఆట పట్టించే, అమాయకత్వమే ప్రేమంటే!నా ఆశ, శ్వాశ, తల్లి, తండ్రి, (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ప్రేమంటే!!!

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 23-01-13 12:46:00

'వర్షంలో ఒకే ఒక్క గొడుగులో నడిచినమన పాదాల అడుగులకు తెలుసు ప్రేమంటే!మేఘల ఘర్షణ లో ఉరుముల మెఱుపుకుకలిసిన మన కనులకు తెలుసు ప్రేమంటే!కంటి సైగతో పలకరిస్తే బదులు పలికేచిరునవ్వుకు తెలుసు ప్రేమంటే!మమత నిండిన నీచేతి స్పర్శతోస్పందించే నామదికి తెలుసు ప్రేమంటే!మల్లే, సన్నజాజి పూల పరిమళానికినిన్ను ఆకర్షిచే మైకానికి తెలుసు  ప్రేమంటే!కలలు నిజమై మన మనసులు ఒక్కటై,మమతానురాగానికి తెలుసు ప్రేమంటె!అల్లిబిల్లి కబుర్లతో, చిలిపి సరసాలతో,నన్ను ఆట పట్టించే, అమాయకత్వమే ప్రేమంటే!నా ఆశ, శ్వాశ, తల్లి, తండ్రి(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఎవ్వరు నువ్వు?

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 17-01-13 11:30:00

'మబ్బుల చాటున చంద్రుడివా? మల్లెపూలతో మంచెం వేస్తా... మిల మిల జిలుగుల వెలుగుల నెలరాజువా?మధిలో ప్రేమతో మందిరం కడతా...మధువుల తేనెల పలుకుల చిలిపి క్రిష్ణుడివా?ఫ్రియసఖి రాధనై ప్రేమను పంచుతా...ఇంతకి ఎవ్వరు నువ్వు???'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సంక్రాంతి శుభాకాంక్షలు...

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 12-01-13 10:31:00

'రంగు రంగుల హరివిల్లు,ముత్యాల ముగ్గులు,రత్నాల గొబ్బెమ్మలు,తీయటి చెరుకు గడలు,మసాలా వడలు,గాలిపటాల రెపరెపలు,బావా మరదళ్ళ సరదాలు,గంగిరెద్దుల గలగలలు,తంబుర నాదాలు,ధాన్యపు రాశుల లోగిళ్లు,పసిపిల్లల బోసినవ్వులు,మీ ఇళ్ళు, వాకిళ్లు కిలకిలలాడాలని,మీ శృతి స్వాగతం పలుకుతూ,నిత్యం ఆ సంక్రాంతి లక్ష్మి కరుణ కటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ....సంక్రాంతి శుభాకాంక్షలు...'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చిన్న మాట, ఇది న్యామంటావా....

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 05-01-13 09:48:00

'తలంటు స్నానంపోసి ,కళ్ళకు ఐటెక్స్ కాటుక పెట్టి,నుదుటిన సింగార్ బొట్టు పెట్టి,ముక్కున బంగారు పుడక పెట్టి,మెడలోన వజ్రాల హారం వేసి,నడుముకు వడ్డనం పెట్టిజడగంటలు జడలు కట్టి,మల్లేపూలు జడలో తురిమి,కాల్లకు పట్టిలు తొడిగి,పట్టంచు చీరకట్టి,చిన్నంచు రవిక తొడిగి,వళ్ళంతా సెంటుకొట్టి,మేనంతా సింగారిచి,నీకోసం ఎదురుచూస్తూ పరధ్యనంలో నేనుంటే,నువ్వొచ్చావని తలుపుదగ్గరికి,వయ్యారంగా నడిచి వస్తుంటే,అలా నన్ను చుడగానే,నీ మీసం మెలేసి,నా జడ లాగి,నా కొంగు లాగి,నడుమొంపు అందాలను స్పర్షించి,నీ కౌగిలిలో బిగించి,నా ప(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా పరువం నీకోసం!.. నీకేసొంతం...

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 01-01-13 10:31:00

'ఓ నా చిలిపి బావ!అలిగావా?నాకోసం రమ్మంటే రానంటావా?సరసమాడరమ్మంటే కుదరంటావా?నీ చిత్రాంగి మరదలిమీద కోపం తగునంటావా?నా పాలరాతి వంతి మేము,ఎరుపెక్కిన చెక్కిళ్ళు,కోటేరు ముక్కు,ఎరుపెక్కిన పెదాలు,నీకేసొంతం...నా హంస నడక,నడుమొంపు సొగసు,లేలేతని సొగసు,తడి ఆరని అందాలు,నీకేసొంతం...వాటన్నింటికి మించి,నా పరువం,నా చిరునవ్వు,మా చిలిపితనం,నా అమాయకత్వం,నా స్నేహం,నా ప్రేమ,నా ప్రాణం,నీకేసొంతం...ఇన్ని చెప్పినా రానటావా???'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 31-12-12 12:49:00

'కొత్త ఆలోచనలు,కొత్త ఆశయాలు,కొత్త విజయాలు,ప్రేమాభిమానాలు,ఆప్యాయత, అనురాగాలుమీ అందరి సొంతం కావాలని ఆశిస్తూ,ప్రతి ఒక్కరి జీవితం రంగులమయం కావని ఆశిస్తూ,భారతదేశం లోని ప్రతిఒక్కరు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ,పల్లేటుర్లు సస్యశ్యామలంగా ఉండాలని ఆశిస్తూ,మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.బ్లాగ్ మిత్రులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు...'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నాకు తెలియదు...

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 25-12-12 11:20:00

'పెదవి పలికేది కాని,ఆ పలుకులు ఇంత మధురమైనదని,నీ పేరు పలికేవరకు తెలియదు!గుండె కొట్టుకునెది కాని,అది నీ తలపుతోనే అని,నిన్ను ప్రేమించేవరకు తెలియదు!మన ఇద్దరి మధ్య స్నేహం ఉంది కాని,ఆ స్నేహం ప్రేమకు దారి తీస్తుందని,నీ ఓరచూపులతో నన్ను చూసేవరకు తెలియదు!వయసు మొగ్గెసింది కాని,అది పుష్పించిందని,నువ్వు తాకేంతవరకు తెలియదు!నాలో బావం ఉంది కాని,సిగ్గు మొగ్గలేసుందని,నువ్వు తొలిముద్దు ఇచ్చేవరకు తెలియదు!నా తడి ఆరని అందాలు,నీకు మాత్రమే సొంతమని,నీలో కలిసేవరకు తెలియదు!ఊపిరి ఆగిపోయెవరకు నిన్ను మరచిపోలేనని,(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా ఆవేదన!

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 20-12-12 11:37:00

'నీ ప్రేమలో నన్ను నేను వెతుక్కోవాలనుకుంటాను,నువ్వే కనిపించకుండా పోతావు...నీ సాన్నిహిత్యంలో సేద తీరాలనుకుంటాను,ఎండమావివై  వెక్కిరిస్తావు...నా కాలిమువ్వల సవ్వడితో నిన్ను పిలవలనుకుంటాను,ఆ మువ్వల సవ్వడే వినిపించదంటావు...నీ ప్రేమరాహిత్యంలో ఘనీభవించిన హృదయాన్ని నీ వెచ్చటి కన్నీటి జల్లుతో కరిగిస్తావు,కరిగి కన్నీరయిన నన్ను మండుటేండగా  మారి మరిగిస్తావు...హృదయం చాలని అనుభూతివనుకుంటే,జన్మకు చాలని ఆవేదన మిగిలిస్తావు...'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఎలా చ్చెప్పను???

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 13-12-12 12:52:00

'నాలో ఉన్న నమ్మకానికి,నను నడిపించే ధైర్యానివి నువ్వేనని నీకెలా చ్చెప్పను?నాలో ఉన్న శ్వాస ఉచ్చ్వాసకి,నను బ్రతికించే ఆశవి నువ్వేనని నీకెలా చ్చెప్పను?నీపేరే పలకాలను కోరే నా పెదాలకి,నా చిరునవ్వే నువ్వని నీకెలా చ్చెప్పను?నిన్ను ఆశగా వెతికే చుపులకు,నా కంటిపాపవు నువ్వేనని నీకెలా చ్చెప్పను?నీ ఆలోచనలో  మునిగిపొయిన నా మనసుకి,నా మనసాక్షివి  నువ్వేననినీకెలా చ్చెప్పను?నేను పెట్టిన మువ్వల సవ్వడికి,నా అడుగుల సవ్వడి నువ్వేనని నీకెలా చ్చెప్పను?నాలోని ప్రతి జ్ఞాపకానికి,నా గుండే చప్పుడు నువ్వ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఎవరు నువ్వు?

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 27-11-12 12:51:00

'అనుక్షణం వెంటాడుతుంటే నా నీడవనుకున్నాకున్నా,కానీ ప్రత్యేకమైన రూపం నీకుంది...ప్రతిక్షణం నీ తలపులే చుట్టుముడుతుంటే నువ్వే నా ఊహానుకున్నా,కానీ అందమైన జీవితం నీకుంది...నా చెక్కిళ్ళు ఎరుపెక్కి, చిరునవ్వుతో పెదాలుంటె అదంతా నా పరధ్యాసేననుకున్నా,కానీ ఆలోచన నీకుంది...నా నడుమొంపుల్లోని వయ్యారాలు  నన్ను మైమిరిపిస్తుంటే నీస్పర్శే అనుకున్నా,నీ కార్యక్రమం నీకుంది...నీ జ్ఞాపకాల జడిలో నన్ను బంధిచేసి, నీకై ఎదురుచూసే నన్ను ఒంటర్నిచేసిన నువ్వెవరివి మరి?నా నీడవా?నా ప్రతిబింబానివా?నా మిత్రుడివ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఒంటరి బ్రతుకు!...

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 24-11-12 13:03:00

'జ్ఞాపకాల అడుగిడిన ఒక మడతని విప్పితే,ఆశ్చర్యమో? అహ్లాదమో?నిన్ను ప్రేమించిన నా మనసు ఎగతాలిగా నవ్వినట్టు అనిపించింది.మరల తడిమి చూస్తే భాదతో నలిగినట్టు కనిపించింది.ఎక్కడో దాగి ఉన్న దుఖ్ఖం కళ్ళల్లో పెళ్ళుబికింది.నవ్వు లేని పెదాలతో జీవం లేని బ్రతుకులా అనిపించింది.నాకు నేనుగా వేసుకున్న బందాలు మనసుకి సంకెళ్ళులా అనిపించాయి.నువ్వు లేకుండా నాకు ఒంటరి బ్రతుకు అనిపించింది.మరల మడత పెడుతుంటే కను చివర కన్నీటి ముత్యం మెరిసినట్టే మెరిసి చీకటిలో కలిసిపోయింది!...'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఏక్కడని వెతకను నిన్ను???

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 23-11-12 10:18:00

'నువ్వెక్కడని ఆకాశాన్నడిగా,ఉరుములు మేరుపులు తప్ప నీ ప్రియుడి జాడ నాకేల తెలుసు సఖి!...నువ్వెక్కడని మేఘాలనడిగా,వర్షం మబ్బులు తప్ప నీ ప్రియుడి జాడ నాకేల తెలుసు సఖి!...నువ్వెక్కడని సెలయేరునడిగా,గల గల ప్రవహించడం తప్ప నీ ప్రియుడి జాడ నాకేల తెలుసు సఖి!...నువ్వెక్కడని సముద్రాన్నడిగా,అలల శబ్ధంతో ప్రకృతి మాతను ఆరధించడం తప్ప నీ ప్రియుడి జాడ నాకేల తెలుసు సఖి!...నువ్వెక్కడని వీచే చల్లటి గాలినడిగా,చల్లదనంతో అందరిని మైమరిపించడం తప్ప నీ ప్రియుడి జాడ నాకేల తెలుసు సఖి!...నువ్వెక్కడని బోసి నవ్వుల బుజ్జ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జైహింద్!...

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 20-11-12 11:13:00

'మతం వద్దు గితం వద్దు మారణహోమం వద్దు.హిందు అని ముస్లిం అని బేదం అసలేవద్దు.క్రిస్టియన్ అని సిక్కు అని కౄరత్వం మనకొద్దు.పిడికిలెత్తి బిగించి జైహింద్ అని చాటుదాం!..కులం వేరని, మతం వేరని రాజకియాలు అసలు వద్దు.మనసులో మర్మంతో హింసజోలికెల్లోద్దు.యువకుల జీవితంతో స్మోకింగ్ అని డ్రింకింగ్ అని దుర్వ్యసనాలసలొద్దు.కలిసి మెలిసి సోదర సోదరి భావంతో ఐక్యతను చాటుదాం!...జైహింద్ జైహింద్ అని భారతమాతకు దేశభక్తిని చాటుదాం!...నోట్:-ఎవరు దిన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు,ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన గొడవల్లో ప్రజల(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నీ స్నేహం ...

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 09-11-12 08:17:00

'దేవుడు మనిషి జీవితం లో పూర్తి ప్రేమతో ఒక వ్యక్తి ఉండాలని అనుకున్నాడు.అందుకనే "అమ్మని" తయారు చేసాడు..మనిషి జీవితం లో పూర్తి సహాయం, బాద్యత తో ఒక వ్యక్తి ఉండాలని అనుకున్నాడు.అందుకనే "నాన్నని" తయారు చేసాడు..మనిషి జీవితం లో పూర్తి సహాయంగా ఒక వ్యక్తి ఉండాలని అనుకున్నాడు.అందుకనే "అన్నయ్యని" తయారు చేసాడు..మనిషి జీవితం లో ఆట పాటలు సంతోషాలు ఉండాలని అనుకున్నాడు.అందుకనే "చెల్లిని" తయారు చేసాడు..ఇంక ఇవన్ని లక్షణాలు ఉన్న ఒక వ్యక్తికి ఉండాలని దేవుడు అనుకున్నాడు.అందుకనే "స్నేహితున్ని" తయారు చేసాడు.(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నువ్వే ఫ్రియతమా....

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 08-11-12 09:16:00

'కల ఒక జ్ఞాపకం లాంటిది.గుర్తుకొచ్చి రాక తికమక పెడుతుంది...జ్ఞాపకం ఒక కల  లాంటిది.నిజమో భ్రమో తెలియని అయోమయంలోకి నెడుతుంది...కలలాంటి జ్ఞాపకం,జ్ఞాపకం లాంటి కల,నువ్వే ఫ్రియతమా....'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నీకై నీ ప్రేమకై!!!

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 06-11-12 06:02:00

'ముగ్దమైన మది మందిరంలోంచి నేనూ నాకై ఆలోచిస్తున్నా,అన్ని దారుల్లోంచి నా ఉనికిని నే వీక్షిస్తున్నా,నిన్నటి నేడు లోంచి, నా రేపుకై వేచి చూస్తున్నా,పూ రేకుల మాటున దాగిఉన్న నీటి బిందువులా.. నీ మౌనం నన్ను శిలను చేసింది...ఆవిరిలా కరిగిపోక, ఈ శిలపై కరుణ చూపు.తుమ్మెదనై  నీ చెంత చేరిపోతాను... '

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

దసరా శుభాకాంక్షలు...

రచయిత : శృతిరుద్రాక్ష్      బ్లాగు : నీ జ్ఞాపకాలే నా ప్రాణం....      టపా తేది : 22-10-12 07:59:00

'బ్లాగ్ మిత్రులకు దసరా శుభాకాంక్షలు...ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వే(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦