తుమ్మేటి వీడియో కథలు - 1
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 03-09-10 00:40:00
తుమ్మేటి రఘోత్తం రెడ్డి గారు విజువలైస్ చేసిన ఏడు కథలను దశల వారిగా మీకందించే ప్రయత్నం లో ఇది మొదటి భాగం. తుమ్మేటి చెప్పినట్లు ఈ పక్రియ బహుశ మన సాహితి ప్రపంచంలో రాలేదనుకుంటా. ఇది ఒక నూతన ప్రక్రియ. రచయితే మనకు తన కథను దృశ్య పరంగా మనకు చెప్పడం అనేది కథను మన మనసుకు హత్తుకు పోయేలా చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. రఘోత్తం గారి కథలన్నీ ఈ వర్తమాన సమాజంలో అతని అనుభవాల నుంచి ఉద్భవించినవే.
నేనెరిగిన మా నాన్న .. రతీంద్రనాథ్ టాగూర్
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 31-08-10 02:52:00
ఆంద్ర భూమిలో రతీంద్రనాథ్ టాగూర్( రవీంద్ర నాథ్ టాగోర్ గారి కుమారుడు) రాసిన నేనెరిగిన మా నాన్న కు, జానమద్ది హనుమచ్ఛాస్ర్తి గారి అనుసరణ .....నాకు నచ్చి, చదవని వారి కోసం , మీ కోసం.......
రవీంద్రుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, అశేష శేముషీ ధురంధరుడుగు నాతడు కవి, తత్త్వవేత్త, దార్శనికుడు. అతడు ఆనంద రసామృతమూర్తి.బాల్యములోనే పెల్లుబుకుచున్న తన పుత్రుని ప్రతిభా
అంధ భిక్షువు
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 30-08-10 13:27:00
">
వానమ్మ, వానమ్మ, ఒక్క సారన్న వచ్చిపోవమ్మ, అంటూ ఎన్నో రోజులుగా రాని ఆ వానకోసం పడే తపన , అప్పడప్పుడు నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ బస్సు స్టాండ్ లోనో, లేదా ఏ చౌరస్తా లోనో వినిపించేది. ఆ పాట, ఆ గొంతు మనల్ని కట్టి పదేసేదిగా అనిపించేది. ఒక సారి ఎవరా అని చూస్తే , ఒక అంధుడు, తల్లి సాయం తో చేతిలో కంజర తో " వానమ్మ ..వానమ్మ " అని పాడుతూ కన్పించాడు. ఆ తర్వాత ఎప్పుడు ఆ బస్సు స్టాండ్ వద్దకు
గోరేటి వెంకన్న..పల్లె కన్నీరు పెడుతుందో
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 29-08-10 01:01:00
గోరేటి వెంకన్న గారు రాసి స్వంతంగా పాడిన ఈ "పల్లె కన్నీరు పెడుతుందో" వారి గొంతులోనుండి వచ్చిన పాట నిజంగా ఫీల్ ఇస్తుంది. అందుకే ఆ జానపదం మీరు ఆనందిస్తారని ఇక్కడ.......
భూమాత ఏడ్చింది నా బిడ్డ రైతన్నా....
ఏనాడు స్థిమితంగా తిండి తినదతంచు
చేతి వృత్తులు వారి చేతులిరిగి పాయె
పల్లె కన్నీరోడ్చే పనిపాటల వాండ్ల
ఉనికి కనపడదు నా ఉరిలోనా... ఆ...ఆ..
పల్లె కన్నీరు బెడుతుందో...కనిపించని కుట్రల
నా
పల్లె కన్నీరు పెడుతుంది
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 28-08-10 09:30:00
">
నాకు ఇష్టమయిన జానపదం , జన పదం "పల్లె కన్నీరు పెడుతుంది" అన్న గోరేటి వెంకన్న గారి పాట. నాకే కాదు తెలంగాణా లో ఈ పాట తెలవనివారు, ఈ పాటను హమ్ చేయని వారు ఉండరంటే అతిశయోక్తి ఏమి కాదనుకుంట. నేను మొదటి సారిగా. కుబుసం చిత్ర ఆడియో లో ఈ పాట విన్నాను. అప్పటినించి ఈ పాట నా ప్లే లిస్టు లో, నా గుండెల్లో కూర్చొని ఉంది.
పల్లెలలో చిన్నతనం లో గడిపిన వ్యక్తిగా, పల్లెవాతావరణం కల్మషం గాని రోజుల్లో ,
ఇదీ మన జీవితం
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 25-08-10 00:27:00
రాఖి శుభాకాంక్షలు. రాఖీ అన్న చెల్లెళ్ళ అనుబందానికి ప్రతీక. రాఖి అంటే ఒకప్పుడు కుటుంబ సబ్యులు అందరు ఒకచోట కలుసుకొని పొద్దున్నే తలంటు స్నానం చేసి చెల్లెళ్ళు రాఖి కడుతుంటే ఆ సమయo లో మనం ఏదో పెద్దవాళ్ళ లా అక్షింతలు జల్లి, దీవిన్చినట్లు ఓ ఫోసే కొట్టి! ఏదో సరదాగా పండగ ముగించేవాళ్ళం.
ఇప్పుడు మనం ఒకచోట, వాళ్ళు ఒకచోట. సెల్ లో లోనే పలకరింపులు, Email లో లేదా కొరియర్లో రాఖీలు,
తుమ్మేటి గారితో కాసేపు (2)
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 20-08-10 15:47:00
నేను ఇదివరకే చెప్పినట్లు నన్ను తుమ్మేటి గారిని మల్లి కలిసేలా వారి కథలు నన్ను పురిగొల్పాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. అవి చదివిన , క్షమించాలి చూసి విన్న మరునాడే, జోరున వర్షం పడుతుంది. అయినా అదే వాన లో వారికీ ఫోన్ చేసి వారి ఇంటికి వెళ్లి కలిసా. ప్రశాంతంగా ఉన్న ఇల్లు, పక్కనే ర్యాక్ లో ఎన్నో రకాల సాహిత్యం. వారితో మాట్లాడినంతసేపు నేను ఇంత పెద్ద రచయిత ముందు కుర్చున్ననా ,అని ఒక ఫీలింగ్.
ఆర్తితో ......., ఆరాటంతో......
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 15-08-10 14:11:00
ఎన్నో రోజులు.......ఎన్నో యుగాలనిపిస్తింది
నీవు రాక, నీవు లేక
నన్ను మరిచి పోయావా
నువ్వు వస్తావని ఆశతో, ఎదురుచూస్తూ
నా దేహం ఆణువణువూ , నీ స్పర్శ కొరకై
ఆర్తితో, ఆరాటంతో వేచి చూస్తూ
ఎన్నాళ్ళు ఇలా.....
.
నేను ఒంటరిగా పోతుంటే , ఒక్కసారిగా నాకు ఎదురై
నేను తేరుకొనేలోగా
ముద్దులతో మున్చేతావు
నా దేహాన్ని ఆణువణువూ ఆర్తితో స్ప్రుశించావు
నీ స్పర్శలో, నీ ప్రేమలో,తడిసి ముద్దయి
ఇంతలోనే
తుమ్మేటి గారితో కాసేపు (1 )
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 13-08-10 10:15:00
చాలా రోజుల క్రితం అనుకోకుండా ఒక దినపత్రిక లో సెజ్ లపై ఒక కథ చదివా. ఎందుకో ఆ కంటెంట్, రాసిన విధానం , సెజ్ లపై విబిన్న ఆలోచన ధోరణి నాకెందుకో బాగా నచ్చింది. ఎవరు రాసారు అని చూస్తే "తుమ్మేటి రఘోత్తం రెడ్డి" అని ఉంది. మా కొలీగ్ సర్ అతను ఇక్కడే ఉంటారు, నాకు తెల్సు, రోజు వాకింగ్ చేస్తూ ఇటు వస్తారు అని అంటే నేను కొంత ఆశ్చర్య పోయా. అంతటి రచయిత ఇక్కడే ఉన్నాడని నాకు తెలియనందుకు.
ఆ తర్వాత
మధుశాల
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 11-08-10 10:34:00
">
ఈ మధ్య పద్మభూషణ్ శ్రీ హరివంశ రాయ్ బచన్ చే రచించబడి తెలుగు లోకి దేవరాజు మహారాజు గారిచే అనువదించబడిన " మధుశాల" కవిత అనే పుస్తకం చదివా. ఇది సమీక్ష కాదు. నాకు నచ్చి ఏదో మీతో దానిగురించి పంచుకుందామని ఈ ప్రయత్నం....
హరివంశ రాయ్ బచన్ 1907 - 2003 మధ్య తొంబై ఆరేళ్ళపాటు జీవించి ఎన్నో రచనలు చేసినారు. 30 కవితః సంపుటిలు మరో 50 ఇతర గ్రంధాలు రచించాడు. 1935 లో రాసిన ఈ మధుశాల అతని కి ఎంతో ప్రక్యాతి ని
బాల్యం
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 11-08-10 03:18:00
బాల్యం .....చిన్నతనం.... ఏమి తెలియని వయస్సు, అయినా ఎంత హ్యాపీ గా గడిచాయి. ఇప్పుడు జ్ఞ్యాపకమొస్తే.....
మొదటి సారి మా ఇంటి దగ్గర ఉండే శుబ్రం అని ఒకతను అంటే మా మొదటిగురువు, మా ఇంటికి ఓ నాలుగు ఇండ్ల ఆవల ఉండేది వాళ్ళ ఇల్లు. మా ఉళ్ళో అప్పుడు అది మొట్టమొదట అ...ఆ...లు నేర్చుకోనేవారికి ప్రైమరీ స్కూల్ . ఇప్పుడు ఏవో ప్లే వే స్కూల్స్ ఉన్నాయిగా అల్లా అన్నమాట.చింతా చెట్టు కింద, చాపలు లేదా గోనే సంచులు
దేఖ ఏక్ క్వాబ్
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 07-08-10 08:17:00
లతాజీ, కిషోర్ పాడిన సిల్సిలా లోని ఈ పాట ఎంత మధరం , అందమయిన దృశ్యాలు, మధురానుభూతులు అందించే సాహిత్యం తులిప్ పూల అందాలూ అన్నింటికీ మించి , అమితాబ్ రేఖ ఎంత అందమయిన ప్రేమ జంట , మరీ మరీ, వినాలనిపిస్తుంది. మీకోసం..
కభి కభి మేరె దిల్ మే ఖయాల్ ఆతా హై
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 07-08-10 06:42:00
నాకు నచ్చిన ఈ పాట మీకోసం ఇక్కడ.....
">
కలలు కల్లలైన వేళ.
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 05-08-10 18:37:00
రోజు పేపర్ లో ఎన్నో చదువుతుంటాం. కొన్ని మనకెందుకులే అని వదిలేస్తాం . కొన్ని చదివి అయ్యో పాపం అని ఒక నిట్టుర్పు వదిలి మన పనిలో పడతాం. కాని ఈరోజు డెక్కన్ క్రానికల్ లో చదివిన ఒక వార్త మనసును కదిలించి, రోజంతా వెంటాడుతు ఉంది. అదేంటంటే " SCHOOL BUS RUNS OVER LKG BOY".
హైదరాబాద్ లో మనికంట అనే అయిదు ఏళ్ల ఎల్.కే.జి అబ్బాయి హరిహరా గ్రామర్ స్కూల్లో చదువుతూ రోజాటిలాగే పాపం , బస్సు దిగగానే అగుపించే
ధ్యానం
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 04-08-10 08:25:00
స్వామి జగదాత్మానంద గారి జీవనవికాసము నుండి "ధ్యానం" గురించి ...........
ఒక గిన్నెలో నుంచి మరొక గిన్నెలోకి నూనె పోస్తున్నప్పుడు ఏర్పడే తెగిపోని తైల ధార లాగ మనస్సు భగవంతుడి వైపు ప్రవహించే పద్ధతినే ధ్యానం అని అంటారు. జపం మరింత తీవ్రమైనప్పుడు అది ధ్యానం లో లీనమవుతుంది. శ్రీ రామకృష్ణులు ధ్యానం చేసేందుకు "హృదయం" చాల మంచి స్థానం అని చెబుతారు. కొన్ని సార్లు జ్ఞ్యానులు కనుబొమ్మల మధ్య, భక్తుల
మరిన్ని జ్ఞ్యాపకాలు.............
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 03-08-10 13:30:00
తొలకరి జల్లు పడితే రైతుల కళ్ళల్లో చూసిన ఆనందం.......జ్ఞ్యాపకం
ఆ చిరుజల్లుల్లలో ఎగిరి తడిసి ముద్దైన ఆనందం ......జ్ఞ్యాపకం
తెల్ల వారు ఝామున రెల్లు గడ్డిపై మెరిసే మంచు బిందువులను చూసిన ఆనందం..... జ్ఞ్యాపకం
గడ్డిలో ఆరుద్ర పురుకులకై పడిన ఆరాటం......జ్ఞ్యాపకం
చెరువులో రాళ్ళతో కప్పగంతులు వేయించిన ఆనందం....జ్ఞ్యాపకం .
అక్కడే పడమరకు వాలి పోతున్న సూరీడు ఎరుపు .......జ్ఞ్యాపకం
ఆకాశంలో ఎగిరే కొంగల
జ్ఞ్యాపకాలు
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 02-08-10 17:21:00
జ్ఞ్యాపకం .
మొట్టమొదట శుబ్రం దగ్గర అ...ఆ...లు నేర్చుకున్న . జ్ఞ్యాపకం
అయ్యవారి దగ్గర కోదండం చూస్తూ, అక్షరాలూ చివరి వరకు నేర్చ్కున్న జ్ఞ్యాపకం
ఇంటి పెరట్లో చింత చెట్టు కింద చింత కాయలు ఏరుకొని తిన్న.... జ్ఞ్యాపకం
ఎండాకాలం ఆరుబయట నాయినమ్మ పక్కన పడుకొని చుక్కలు చూస్తూ ఆమె చెప్పిన కథలు వింటూ నిద్రలోకి జారిన....జ్ఞ్యాపకం
పొద్దున్నే సద్దెన్నం తిని బడికి పోయిన ....జ్ఞ్యాపకం
తాతయ్య తో
నా మది నిన్ను పిలిచింది గానమై
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 30-07-10 15:42:00
నా మది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై.........ఎంత శ్రావ్యమైన, తీయటి గొంతు. బహుశా ఆ భగవంతుడు ఆయన్ని పుట్టిచ్చినప్పుడు గొంతులో అమృతం పోసాడేమో. మహ్మద్ రఫ్ఫీ సాహెబ్, హిందీ సిని జగత్తు ను దాదాపు ముప్పయి సంవంత్చరాలపాటు ఏలిన మహా గాయకుడూ. రేపటికి రఫ్ఫీ సాబ్ మనకు దూరమై ముప్పై సంవంత్చరాలు కావస్తుంది.
ఆ గళం లో మాటలకూ అందని మాధుర్యం ఉంది. ఆ గొంతు నుంచి జాలువారిన ప్రతి పాట యావత్ భారత దేశాన్ని
నా కళ్ళల్లో కన్నీళ్ళు
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 29-07-10 12:50:00
నాలుగు నెలల క్రితం.....
మా అబ్బాయి హైదరాబాద్ వెళ్తూ ప్రయాణం చేస్తూ ఎస్ .ఎం ఎస్.లో పంపిన సందేశం " ఐ మిస్ యు డాడీ" , సంతోశమనిపించింది. పదిహేనేళ్ళ వాడి కన్స్రన్. ముచ్చటేసింది. ఆ తర్వాత ఆఫీసు కి వెళ్తూ ఉండగా యథాలాపంగా మళ్ళి గుర్తొచ్చింది. ఇంకో రెండు నెలల తర్వాత వాడు పై చదువులకు హాస్టల్ కి పోతాడన్న ఆలోచన , వుయ్ విల్ మిస్ హిం ఫర్ సో మేని డేస్. ఎప్పుడు లేనిది ఒక్క సారిగా నాకు ఈ ప్రపంచానికి మధ్య
జీవితం
రచయిత
భాను'
బ్లాగు :నేను-మీరు
టపా తేది: 28-07-10 18:07:00
జీవితం, ఎవరో అన్నారు "అత్యంత వేగంతో పరుగిడే కాలం తో బాటు పరుగెడుతూ కాలం వేగానికి తట్టుకోలేక బెదిరే జింక జీవితం" నిజమే కదండీ. కాలం ఎవ్వరికోసం ఆగదు. నిరంతరం పరుగెడుతూ ఉంటుంది. ఎన్నో ఆటుపోట్లు కష్టాలు . మన ఘంటసాల గారి గొంతులో నుంచి జీవితమంటే " పడిలేచే కడలితరంగం, వడిలో జడిసిన సారంగం, సుడిగాలిలో.... సుడిగాలిలో ఎగిరే పతంగం , జీవితమే ఒక నాటక రంగం " అవును సముద్రపు ఆటుపోట్ల లాగా ఎప్పుడు ఏమి