రష్యన్ల భారతీయ మూలాలు
రచయిత
ధర్మస్థలమ్'
బ్లాగు :ధర్మస్థలమ్
టపా తేది: 05-09-10 13:35:00
ఈనాడు రష్యన్లు సుమారు 14 కోట్లమంది ఉంటారు. వారు భాషాపరంగా భారతదేశానికి మిహతా అందఱు ఐరోపేయుల కంటే నేదిష్ఠులనే సత్యం చాలా మందికి తెలియదు. ఎక్కువమంది జర్మన్ భాషే సంస్కృతానికి అన్నిటి కంటే దగ్గఱ అనుకుంటారు. అలాంటివారు ఇహ రష్యన్ తెలిస్తే ఏమంటారో ? రష్యన్ తెలిసిన భారతీయులకు సంస్కృతం రాకపోవడం, అసలు ఇతర ఐరోపేయ భాషలతో పోలిస్తే రష్యన్ భాష నేర్చుకునేవారి సంఖ్య భారతదేశంలో అల్పాత్యల్పం కావడం - బహుశా ఈ వాస్తవం ఇంతవఱకు బయటపడకపోవడానికి కారణాలనుకుంటా.రష్యన్ భాష ఇండో-యూరోపియన్ భాషాకుటుంబానికి చెందినద(...)
పచ్చబొట్టూ చెఱిగీ పోదూలే....
రచయిత
ధర్మస్థలమ్'
బ్లాగు :ధర్మస్థలమ్
టపా తేది: 24-08-10 14:10:00
సుఖదుఃఖాలకూ, దూషణ-భూషణలకూ, శీతోష్ణాలకూ మఱియు అటువంటి పరస్పర విరుద్ధ అనుభవాలకు అతీతంగా ఉండడమే ద్వంద్వాతీత స్థితి అని వేదాంతశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ద్వంద్వం అంటే రెండిటి సమాహారం. రెండిటికీ అతీతమైన స్థితే ద్వంద్వాతీతస్థితి. మోక్షానికి ఆవశ్యకమైన సాధనాసంపత్తిలో ద్వంద్వాతీత స్థితి కూడా ఒకటని మనం బాల్యమాదిగా వింటున్నాం. ఈ ద్వంద్వాతీత భావన (concept) అత్యంత ప్రాచీనకాలంలో పాశ్చాత్య అధ్యాత్మిక లోకంలో కూడా ప్రాచుర్యంలో ఉండేది. గ్రీకులు దీన్ని stoicism అనే పేరుతో వ్యవహరించేవారు. Stoicism గలి(...)
దేవుడు మెచ్చే సంబంధం
రచయిత
ధర్మస్థలమ్'
బ్లాగు :ధర్మస్థలమ్
టపా తేది: 18-08-10 03:45:00
నాలుగింటికి అనుగుణంగా మనిషి తన శృంగార జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. మొదటిది, తన స్వభావమూ, ఇష్టానిష్టాలు. రెండోది ప్రకృతి. మూడోది దేవుడు. నాలుగోది సమాజం. ఈ నాలుగూ పూర్తిగా సమకూడనప్పుడు కనీసం ఏవో రెండు విషయాలకైనా అనుగుణంగా మనిషి ప్రవర్తించాలి. కేవలం ఒక అంశంలోనే "సై" అనుకుంటే ఆ నిర్ణయం శుద్ధ తప్పుడు నిర్ణయమని వేఱే చెప్పనక్కఱలేదు.ముఖ్యంగా స్త్రీపురుష సంబంధాల విషయంలో ఈ విధమైన ఆత్మసరిచూడ్కి (self-check) చాలా అవసరం.తన యిష్టానిష్టాలేవో తనకు తెలిసే ఉంటాయి. కనుక అందులో పెద్దగా మానస(...)
రామునికీ రావణునికీ తేడా ఏంటి ?
రచయిత
ధర్మస్థలమ్'
బ్లాగు :ధర్మస్థలమ్
టపా తేది: 29-07-10 11:08:00
రామాయణంలో ప్రధానపాత్రలు శ్రీరామచంద్రమూర్తి, సీతా అమ్మవారు. మిగతావారంతాఅవాంతరపాత్రలే. కనుక వారి గుఱించి అవసరమైనంత మేఱకే కవి వర్ణించాడు. ఆపాత్రల్ని హీరోలు అనడానికి ఆ సమాచారం చాలదు. పోనీ లభిస్తున్న సమాచారంప్రకారం చూసినా వారు హీరోలు కారు. శ్రీరామచంద్రమూర్తితో పోల్చదగ్గవారుఅంతకంటే కారు.వాలినే తీసుకోండి. ఆ వానరుడి దగ్గఱ శరీరబలాధిక్యం తప్ప ఇంక ఏ గొప్పతనమూలేదు. దశాబ్దాల అతరబడి విశ్వాసపాత్రుడుగా సేవ చేశిన తమ్ముణ్ణి అకారణంగాఅనుమానించి వెళ్ళగొట్టాడు. అతని భార్యని బలాత్కారంగా అనుభవించాడు. అతనుఅ(...)
దాతలు సంతానమౌతారు, గ్రహీతలు తల్లిదండ్రులవుతారు
రచయిత
ధర్మస్థలమ్'
బ్లాగు :ధర్మస్థలమ్
టపా తేది: 11-07-10 02:30:00
కీ.శే. మధిర సుబ్బన్నదీక్షితులు రచించిన కాశీమజిలీకథల్లో ఒక కథ ఉంది. కాశీలో ఒక మాదిగకి సంతానం లేకపోతే అందునిమిత్తం తాను చెప్పినట్లు చేయమని ఒక బ్రాహ్మణుడు అతనికి చెప్పాడట. ఆ ప్రకారంగా అక్కడ ఒక యోగి వేసవికాలపు మండుటెండలో స్నానఘట్టానికి వెళ్ళే దారిలో ఆ మాదిగ కొత్తచెప్పులు వదిలాడట. ఆ యోగి ఎండచుఱుక్కి కాళ్ళు కాలిపోతూంటే తట్టుకోలేక ఆ చెప్పులు తొడుక్కొని వెళ్ళాడట. ఆ ఋణం తీర్చుకోవడానికి అతను చనిపోయి ఆ మాదిగ ఇంట్లో అతని కొడుకుగా జన్మించాడట. పునర్జన్మలో కూడా అతనికి యోగవాసనలు పోలేదట. అందుకని, త(...)