Skip Navigation Links


శ్రీ విద్యా వజ్ర పీఠమున పద్యం - మహామంత్రి తిమ్మరుసు నుండి

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 05-04-13 01:37:00

'1962 లో గౌతమీ ప్రొడక్షన్‌స్ పతాకంపై, పౌరాణిక బ్రహ్మ  కమలాకర కామేశ్వర రావు దర్శకత్వంలో నిర్మింపబడిన చారిత్రాత్మక చిత్రం మహామంత్రి తిమ్మరుసు. విద్యారణ్య స్వామి ఆశీర్వాదంతో సంగమ వంశానికి చెందిన హరిహర (హక్క) రాయలు, బుక్కరాయలు కర్ణాటకలో గల హంపి సమీపంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. విద్యారణ్య స్వామి పేరున దీనిని విద్యా నగరం లేక విద్యా పురం అని కూడ అంటారు. విజయనగర సామ్రాజ్యానికి రాజైన శ్రీకృష్ణ దేవరాయలకు సాళువ తిమ్మరుసు అమాత్యునిగా వుండి పరిపాలనలో చాల కీలకమైన పాత్ర వహిస్తాడు. (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఘంటసాల మాస్టారి పై 2011 లో వచ్చిన డాక్యు మెంటరీ

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 02-04-13 07:50:00

'   మొదటి భాగం రెండవ భాగం Thanks to Raghava for the wonderful videos and Saptagiri for an excellent program without commercials.*ఈ బ్లాగు page ను PDF గా save చేసుకోవడానికి పోస్టు దిగువన గల printfriendly button నొక్కండి.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కావ్. కావ్. మ్యావ్. మ్యావ్. అనే ఘంటసాల-సుశీల పాట విన్నారా?

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 28-03-13 01:51:00

'   ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ప్రభ ప్రొడక్షన్సు వారు 1958 లో అంజలీ దేవి, ఎ.ఎన్.ఆర్. నాయికా నాయకులుగా నిర్మించిన చిత్రం ఆడ పెత్తనం. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు నాలుగు పాటలు పాడారు. ఇది వరకు ఈ చిత్రంలో మహాకవి శ్రీ శ్రీ వ్రాసిన "పసిడి మెరుగుల బాలల్లారా" విన్నారు.  మిగిలిన మూడు కొసరాజు గారి రచనలు. చిత్రమేమిటంటే ఈ చిత్రంలోని ఎనిమిది పాటలలో ఆరింటికి సాలూరి రాజేశ్వర రావు, రెండింటికి మాస్టర్ వేణు సంగీత దర్శకత్వం వహించారు. మాస్టారు రేలంగికి పాడిన పాటలు విలక్షణంగా వుండి(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వందే శంభుముమాపతిం సురగురుం - పరమానందయ్య శిష్యుల కథ నుండి

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 09-03-13 14:12:00

'ఘంటసాల సంగీత దర్శకత్వంలో శ్రీదేవి ప్రొడక్షన్సు వారు పి.పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన హాస్యభరిత చిత్రం పరమానందయ్య శిష్యుల కథ. పరమానందయ్య శిష్యుల కథలు ఎంతో ఉల్లాసాన్ని కలుగుజేస్తాయి. టైటిల్ పాత్రలో పరమానందయ్యగా నాగయ్య, వారి శ్రీమతి గా ఛాయాదేవి, శిష్యులుగా అల్లు రామలింగయ్య, పద్మనాభం, రాజబాబు, సారధి, రామచంద్ర రావు, నందివర్ధన మహారాజుగా ఎన్.టి.ఆర్. నటించారు. నంది వర్ధన మహారాజు పరమ శివభక్తుడు. శివ పూజలో సాంప్రదాయకమైన వందే శంభుముమాపతిం శ్లోకాన్ని మాస్టారు హిందోళంలో ఆలపించగా ఎన్.టి.ఆర్. పై(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

గిలిగింతలు పెట్టే హాస్య జంట 'గిరిజ-రేలంగి' లకు ఘంటసాల, జిక్కీ పాడిన అల్లరి పాట

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 01-03-13 02:54:00

'ఆ రోజుల్లో ఆంగ్ల పదాల వాడుక తెలుగు పాటలలో అరుదుగా వుండేది. సాధారణంగా అది హాస్య గీతాలలో సన్నివేశానికో, సమయానికో అనుకూలంగా ఉపయోగించేవారు. ఈ రోజుల్లో అది ఒక సాంప్రదాయమై పోయింది. అప్పట్లో హాస్య గీతాలు కూడ అర్ధవంతంగా వుండేవి. ఆరుద్ర అప్పుడప్పుడు హాస్య రచనలు చేసారు. ఆరుద్ర-రేలంగి-ఘంటసాల కాంబినేషనులో ఆంగ్ల పదాలతో వచ్చే పాట ఆరాధన చిత్రం నుండి "ఇంగ్లీషులోన మారేజి, హిందీలొ అర్ధము షాది". ఘంటసాల మాస్టారు రేలంగికి పాడినపుడు చక్కని వైవిధ్యం చూపేవారు. మాస్టారు రేలంగి కి పాడిన మరికొన్ని గీతాలు "జేబ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

దేవ దేవా జీవాత్మకా - భీష్మ చిత్రం నుండి పద్యం

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 20-02-13 18:30:00

'అష్టవసువులలో ఒకడైన ప్రభాసుడు ("ద్యు") అనే వసువు తోటి వసువులను ప్రేరేపించి వశిష్ట మహర్షి ఆశ్రమంలోని కామధేనువు "నందిని" ని హరించిన కారణంగా శాపగ్రస్తుడై గంగా-శంతనులకు దేవవ్రతుడుగా జన్మించి, తండ్రి మనసుపడిన దాశరాజు కుమార్తె మత్స్యగంధిని కలుసుకుని, దాశరాజు కోరిక మేర ఆజన్మ బ్రహ్మచర్యం వహిస్తానన్న భీషణ ప్రతిజ్ఞ మూలంగా భీష్ముడైనాడు. మహాభారతం లో భీష్ముడు కీలకమైన పాత్ర వహిస్తాడు. ఆయన కారణ జన్ముడు.   కొడుకు చేసిన త్యాగానికి సంతసించి, పుత్రవాత్సల్యం తో శంతనుడు భీష్మునికి స్వచ్ఛంద(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఘంటసాల 39వ వర్ధంతి పై ETV కార్యక్రమం 2013

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 19-02-13 00:43:00

'మొదటి భాగం చివరి భాగం*ఈ బ్లాగు page ను PDF గా save చేసుకోవడానికి పోస్టు దిగువన గల printfriendly button నొక్కండి.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఘంటసాల 39 వ వర్ధంతి: శ్యామలా ఘంటసాల, గంగాధర్ లతో ఇంటర్వ్యూ

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 13-02-13 02:27:00

'అమర గాయకుడు కీర్తి శేషులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు 39 వ వర్ధంతి సందర్భం గా ఏ.బి.ఎన్‌. నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇక్కడ చూడగలరు.పాల్గొన్న వారు:మాస్టారి కుమార్తె -  శ్రీమతి ఘంటసాల శ్యామల, రచయిత్రి, జర్నలిస్టుశ్రీ గంగాధర శాస్త్రి, ప్రముఖ గాయకుడు శ్రీ జగదీశ్, నాటక రచయిత      Thanks to ABNTeluguTV for posting the You Tube Video*ఈ బ్లాగు page ను PDF గా save చేసుకోవడానికి పోస్టు దిగువన గల printfriendly button నొక్కండి.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చకారాలు లేని పద్యం చెప్పిన 'మహాకవి కాళిదాసు' - ఘంటసాల గళంలో

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 10-02-13 18:30:00

''కవికుల గురువు' మరియు అభిజ్ఞాన శాకుంతలము, వంటి నాటకము కుమార సంభవము,  మేఘ సందేశము , రఘు వంశము వంటి కావ్య త్రయాన్ని రచించిన సంస్కృత పండితుడు మహాకవి కాళిదాసు. ఒక సందర్భంలో కాళిదాసు మహాభారత రచయిత అయిన వేదవ్యాసుని విగ్రహం చూసి, విగ్రహం బొడ్డులో వ్రేలుపెట్టి,  ఈయన "చకార కుక్షి" అని ఎగతాళి చేస్తాడు. అంటే పొట్ట (కుక్షి) నిండా చ'కారములున్నవాడు అని అర్ధం. దీనికి కారణం ఒకటుంది. మహాభారతం వ్యాసుల వారు చెబుతూ వుంటే వినాయకుడు వ్రాయడానికి ఒప్పందం కుదురుతుంది. అయితే వినాయకుడు వ్యాసునికి ఒక(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

శ్రీరామా! జయరామా! - భీమాంజనేయ యుద్ధం నుండి ఘంటసాల

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 02-02-13 12:42:00

'శ్రీరామ నామం కడు మధురం. రామునిపై ఎన్ని పాటలు విన్నా తనివితీరదు. ఇంకా వినాలని వుంటుంది. అది శ్రీరామ నామ మహిమ. అందులోను ఘంటసాల గళంలో వింటే మేను పులకించి, మనసు పరవశిస్తుంది. శ్రీ రామా! జయరామా! అనే ఈ పాట భీమాంజనేయ యుద్ధం లోనిది. ఇద్దరు ప్రముఖ వెయిట్ లిఫ్టర్లు ఈ చిత్రంలో భీమునిగా (దండమూడి రాజగోపాల్) మరియు ఆంజనేయునిగా (కామినేని ఈశ్వర రావు) పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో ఎక్కువగా విన్న పాట 'జయజయ జానకి రామ', ఇదివరలో పోస్టు చేశాను. ఈ చిత్రంలో మాస్టారు పాడిన పద్యాలు, పాటలు ఎన్నో ఉన్నాయి. ఎక్కు(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మన దేశం (1949) నుండి 'జయ జననీ పరమ పావని'

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 30-01-13 18:30:00

'స్వాతంత్ర్య సముపార్జనలో ఎందరో నేతలు చేసిన త్యాగాలు, అవిరామ కృషి వలన మనకు 1949 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వరాజ్యం వచ్చింది. అందులో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి, మన 'జాతిపిత' మోహన్‌దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ. అహింసను ఆయుధంగా చేసుకుని అపూర్వ విజయాన్ని సాధించాడా మహానుభావుడు. అందుకే మహాత్ముడైనాడు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా హింస పెచ్చుపెరిగి పోయింది. హింసతోనే అన్నీ సాధించగలమనే విద్రోహ శక్తులు ఉధృతంగా ఉన్నాయి. ఈ ప్రపంచానికి గాంధీజీ గొప్పతనం గాని, ఆయన ఆశయాలను గౌరవించడం తెల(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వెడలిపో వెడలిపో తెల్లదొరా - ఘంటసాల, బృందం 'మన దేశం' (1949) నుంచి

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 25-01-13 23:30:00

'క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక మరపురాని ఘట్టం.  ఇది 1942 ఆగస్టులో జరిగింది. తెల్ల దొరల పాలన ఎప్పుడంతమొందుతుందా అని యావద్భారత దేశం ఎదురుచూస్తోంది ఆ రోజుల్లో. దేశమంతా ఒకటే నినాదం. జాతి యావత్తూ ఒకటే సందేశం. "కొల్లగొట్టినది చాలు, తెల్లదొరా వెనుకకు వెళ్ళిపో" అని. ఎందరో నిస్వార్ధ నాయకులు తరతమ భేదాలు మరచి, తమ త్యాగాలతో దేశమంతటిని ఒకే త్రాటిపై నడిపించారు. మనకు స్వరాజ్యం వచ్చింది. అయితే రాజ్యాంగ నిర్మాణం, లేఖనం జరిగి జనవరి 26, 1950 కి భారత దేశం సర్వసత్తాక, సామ్యవాద,(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఘంటసాల గానంలో హిందోళ రాగ వైభవం - ఆఖరి భాగం

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 19-01-13 05:00:00

'ఘంటసాల తన సంగీతదర్శకత్వంలో చిత్ర కథా సన్నివేశాలకు, పాత్ర స్వభావాలకు అనుగుణంగా రాగాలను ఉచితరీతిగా సంయోజించినా, తనకు ప్రియమైన రాగాలు ఎలాగో ఒక విధంగా, నేపథ్యంలో, గీతాలలో, పద్య రూపాలలో వెలువరించే తీరు గమనీయం.           లవకుశ చిత్రసంగీతంలో మాస్టారు చేసిన హిందోళరాగ ప్రయోగాలను ఈ వ్యాసం మొదటిభాగంలో గమనించాము. ఘంటసాల సంగీతదర్శకత్వం వహించిన అన్ని చిత్రాలలోనూ అలాంటి ప్రయోగాలు మనకి కనిపిస్తాయి. ఘంటసాల హిందోళ రాగాలాపన సంకలనం;;; "పరమానందయ్య శ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ప్రబోధాత్మక శ్రీశ్రీ గీతం 'పసిడి మెరుగుల బాలల్లారా' - ఘంటసాల, సుశీల గళాలలో 'ఆడ పెత్తనం' చిత్రం నుండి

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 12-01-13 16:54:00

';నేటి బాలలే రేపటి పౌరులు, కొందరు భావి నేతలు. బడాయి తెలియని బడి పిల్లలకు దైనందిన విషయాల మీద ఆసక్తి, అవగాహన ఎక్కువ. తమ చుట్టూ జరుగుతున్న సంఘటనలు, జరిగిన సందర్భాలు వారిని ఎంతో ప్రభావితులను చేస్తాయి. "పిట్ట కొంచెము కూత ఘనము" అన్నట్లు లౌక్యమెరుగని ఆ చిన్న వయసులోనే తమకే అధికారం ఇస్తే ఎలా పరిపాలించగలరో, సమాజంలో ఏయే మార్పులు చేస్తారో నిర్భయంగా చెప్పగలరు. నేటి విద్యార్ధులను చక్కని భావి పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత గురువులది. అధ్యాపకులకు విద్యార్ధులకు మధ్య గల అనుబంధాన్ని ప్రశ్నోత్తరాల రూపంలో(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఋణానుబంధ రూపేణ - ఋణానుబంధం నుండి ఘంటసాల

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 06-01-13 05:52:00

'కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఎవరికైనా బాకీ ఉంటె ఆ బాకీ ఈ జన్మలో తీర్చ లేక పొతే, రాబోయే జన్మలో ఋణపడి వున్న వారి కడుపున పుట్టి లేదా వారింట చేరి ఆ ఋణం తీర్చుకుంటామని మనవాళ్ళ నమ్మకం.  అందువలన ఆ ఋణం వేరొకరి యింట పిల్లలుగా పుట్టి, లేదా పశువులుగానో,  పెంపుడు  జంతువులు గానో పుట్టి తల్లిదండ్రులకు లేదా యజమానికి సేవ చేసి తీర్చుకుంటాము. అందుకే అన్నారు "రుణానుబంధ రూపేణ పశుపత్నీ సుతాలయా!" అని. ఈ ఇతివృత్తంతో తీసిన అంజలీ పిక్చర్సు చిత్రం రుణానుబంధం. అనుకోని పరిస్థితులలో (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తల్లిదండ్రులపై మాస్టారి పద్యం 'ఏ పాదసీమ కాశీ ప్రయాగాది' - పాండురంగ మహాత్మ్యం నుండి

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 01-01-13 20:49:00

'తల్లిదండ్రులు మనకు పూజ్యనీయులు, ప్రత్యక్ష దేవతలు. 1946 లో విడులయిన 'హరిదాసు' అనే తమిళ భక్తిరస చిత్రాన్ని చూసి స్పందించి, ఆ స్ఫూర్తితో ఎన్‌.టి.ఆర్., వారి సోదరుడు త్రివిక్రమ రావు తెలుగుదనాన్ని జోడించి, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో, తోటకూర వెంకటరాజు (టి.వి.రాజు) సంగీత నేతృత్వం లో నిర్మించిన భక్తిరస చిత్రం పాండురంగ మహాత్మ్యం. ఈ చిత్రానికి చక్కని సాహిత్యం అందించారు సముద్రాల రామానుజాచార్య (జూనియర్).. ఇక్కడ చెప్పవలసినదేమిటంటే సాహిత్యం లోని పదాలపై, ముఖ్యంగా పద్యాలపై మాస్టారికున్న పట(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

శ్రీరామునిపై చక్కని భక్తి గీతం 'జయజయ జానకిరామ' - భీమాంజనేయ యుద్ధం నుండి

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 29-12-12 04:48:00

'1966 లో పతాకం పై కాంతారావు, రాజశ్రీ జంటగా నిర్మించబడిన పౌరాణిక చిత్రం భీమాంజనేయ యుద్ధం. ఈ చిత్రం లో ప్రముఖ వెయిట్ లిఫ్టర్ మరియు  నటుడు దండమూడి రాజగోపాలరావు భీముని పాత్ర పోషించారు.  ఆయన ఇదే పాత్రను నర్తనశాల, వీరాభిమన్యు, శ్రీకృష్ణపాండవీయం చిత్రాలలో చేశారు. ఈ చిత్రానికి జయజయ జానకి రామా అనే పాటను రచించినది "రాజశ్రీ" పేరున అనువాద చిత్రాలకు సంభాషణలు, పాటలు పకడ్బందీగా వ్రాయగలిగిన దిట్ట, విజయనగరలో పుట్టిన ఇందుకూరి రామకృష్ణం రాజు. ఈ పాటను గానం చేసినది ఘంటసాల, ఉడతా సరోజిని. సం(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మేకతోకకు మేకతోక - తెనాలి రామకృష్ణ చిత్రం నుండి ఘంటసాల

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 28-12-12 05:21:00

'వికట కవిత్వానికి పెట్టింది పేరు అయిన ఒకానొక కవి దిగ్గజం యొక్క చరిత్రను మధురమైన పద్యాలు, పాటలతో తెనాలి రామకృష్ణ (1956) పేరున తెరకెక్కించారు బి.ఎస్.రంగా దర్శకత్వంలో విక్రమ్‌ ప్రొడక్షన్‌స్‌ సంస్థ వారు. చారిత్రాత్మకమైన సంఘటనలతో, సన్నివేశాలతో కూడిన ఈ చిత్రం ద్వారా తెలుగు తన మాతృభాష కానప్పటికీ, తనకు గల మక్కువను  "దేశ భాషలందు తెలుగు లెస్స" అని నొక్కి వక్కాణించిన శ్రీ కృష్ణదేవరాయల వంటి కవి-సార్వభౌముని గురించి, వారి ఆస్థాన కవి కూటమియైన "భువనవిజయం"లోని కవిదిగ్గజాలలో రామకృష(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఘంటసాల గానం చేసిన సుబ్రహ్మణ్య పంచరత్నం లోని శ్లోకం

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 25-12-12 16:33:00

'శ్లోకం: షడాననం చందనలిప్త గాత్రం మహౌజసం దివ్య మయూర వాహనం రుద్రస్యసూనుం సురలోకనాథం బ్రహ్మణ్య దేవం శరణం ప్రపద్యే..ఏ...ఏ… *ఈ బ్లాగు page ను PDF గా save చేసుకోవడానికి పోస్టు దిగువన గల printfriendly button నొక్కండి.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చతుర్భుజే చంద్రకళావతంసే - భట్టి విక్రమార్క నుండి ఘంటసాల

రచయిత : Suryanarayana Vulimiri      బ్లాగు : ఘంటసాల      టపా తేది : 25-12-12 03:54:00

'చిత్రం:  భట్టి విక్రమార్క  (1960)రచన: కాళిదాస కవిసంగీతం: పెండ్యాల  గానం: ఘంటసాల Thanks to cjhsv04 for up loading the video to You Tubeఆడియో మూలం: ఘంటసాల గాన చరిత చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే.. నమస్తే జగదేకమాతః ఆ..ఆ.. *ఈ బ్లాగు page ను PDF గా save చేసుకోవడానికి పోస్టు దిగువన గల printfriendly button నొక్కండి.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apdistricts.com(7)

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి(4)

Sravani Nalla(3)

మోహన(3)

పల్లా కొండల రావు(2)

SPLENDOR OF YOGA(2)

Hymavati Devi(2)

కంది శంకరయ్య(2)

pendem(2)

Narasimha Rao Maddigunta(1)

మన తెలుగు పదాలు(1)

Murthy(1)

Vellala Neeha(1)

తెలుగు భావాలు(1)

పల్లా కొండల రావు(1)

nihar(1)

Sharma(1)

Sudhakar(1)

Purnachand Gangaraju(1)

Manam Bharatiyulam(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

SRI P.V.RADHA KRISHNA ( PARAKRI )(1)

బివిడి ప్రసాదరావు(1)

K V V S Murthy(1)

గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు(1)

పంతుల జోగారావు(1)

భండారు శ్రీనివాస రావు(1)

సాహితి (1)

kn murthy(1)

వనజవనమాలి(1)

గోలి హనుమచ్ఛాస్త్రి(1)

Srikanth K(1)

శ్యామలీయం(1)

మిస్సన్న(1)

NS Murty(1)

Padmarpita(1)

swatee sripada(1)

వేణూశ్రీకాంత్(1)

ప్రేరణ...(1)

Dr.Seshagirirao-MBBS(1)

C.Chandra Kanth Rao(1)

మాగంటి వంశీ మోహన్(1)

jeevani(1)

Narayanaswamy S.(1)

ఎం. ఎస్. నాయుడు(1)

http://www.koumudi.net(1)

వెంకట్ శిద్దారెడ్డి(1)

Jampala Chowdary(1)

చెప్పాలంటే......(1)

swarajyam(1)

Addanki Anantharam(1)

nagarani yerra(1)



భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦