ఈ రోజు నా బ్లాగ్ పుట్టిన రోజు.....ధన్యవాదములు
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 07-09-10 04:47:00
అప్పుడెప్పుడో ఇలా నా సుత్తి ధాటికి పారిపోయిన చిలుకలు మళ్ళా ఇలా కలుసుకున్నాయి ..వీటి సంభాషణ చూడండిమొదటి :: ఒకటీ ,.........రెండూ.......... ,మూడు........నాలుగు ......నలభై నాలుగు ......రెండవ :: ఏంటి లెక్క పెడుతున్నావ్ ?మొదటి :: ఏమీ లేదు ! ఈ సుత్తి గారు ఉదయం నుండి అటూ ఇటూ కాలు గాలిన క్యాట్ లాగా తిరుగుతుంటే అర్ధం కాక లెక్క పెడుతున్నారెండు :: ఒహ్హో అదా ! ఇవాళ కొంచెం ఏందో తేడా గా కూడా ఉన్నాడే ! అసలు సంగతి చెప్తాను విను బ్లాగ్ మొదలెట్టి సంవత్సరం అయింది ట ఇప్పుడు దాన్ని నమ్మలేక పోతున్నాడు ట !(...)
మీపై నాకు అభిమానం అందుకే ఈ ఆహ్వానం ( అంత్య ప్రాస తో సరదాగా )
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 12-08-10 16:06:00
మీపై నాకు అభిమానం ........................... (మాటల్లో చెప్పలేని )దానికి లేదు కొలమానం..............................(చెప్పలేనంత పెద్దదో చెప్పకూడనంత చిన్నదో )అందుకే చేద్దామని సన్మానం...................... ( సుత్తి తో కాదు సుమీ )ఇద్దామని ఒక బహుమానం....................... (ఇది మాత్రం సీక్రెట్ )వలదు నాపై అనుమానం.......................... (నమ్మండి నన్ను )రాకపోతే నాకు అవమానం..............(...)
ఆకాశం నా కోసం ( అందలపుటందాలు మీకందిస్తున్నా ! )
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 08-08-10 13:29:00
ఈ ఫోటో చూడటానికి మామూలు గా ఉన్నా ఒకసారి జూమ్ చేసి చూడండి ......పావురాలు ఎలా క్రమ శిక్షణ గా ఉన్నాయో ! సూరీడు అస్తమించబోయే ముందు ఇలా రక రకాల వర్ణాలతో ఆకాశం శోభిల్లడం చూసారా ఎప్పుడైనా ! వెండి మబ్బులు ....వర్షం పడ్డట్టు గానే వెండి కూడా అలా మన ఇంటి ముందు పడితే ఏల ఉంటుందో ఆలోచించండి...............కొబ్బరాకుల మధ్యలోనుండి కొంచెం కొత్త గా ..........................నెల రాజు ఈ రోజు ఎలా ఉంటాడు అని ముందుగానే మేఘాలు ఇలా చెప్తున్నాయి కదా !
బ్లాగ్మిత్రులకి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే .....( మా కాలేజీ రోజుల్లో సరదాగా రాసుకున్న ఒక చిన్న సుత్తి )
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 01-08-10 03:30:00
బ్లాగ్మిత్రులకి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే .....స్నేహం గురించి రాయడం కష్టం అంటారు కదా ! గొప్ప భావన అనీ మాటల్లో చెప్పలేం అనీ ! ఇప్పుడు చెప్పి కష్ట పెట్టే పని పెట్టుకోలేదు .... సరదాగా ఒకప్పుడు మా కాలేజీ రోజుల్లో మా ఫ్రెండ్ వరసగా కాలేజీ కి సెలవు పెట్టి రాకపోతే వాడికోసం సరదాగా రాసినది మీ ముందు ఉంచుతున్నాను ....ఆల్రెడీ ఇంతకు ముందు ఇది పోస్ట్ చేసినా సరదా గా ఈ రోజు మళ్ళా .........మిత్రమా ! ఓ మిత్రమా !నీవు లేని క్లాసునీళ్ళు లేని గ్లాసు నీవు లేని బెంచిపుస్తకాల్లేని సంచి .నిన్ను చూడ(...)
నేను ఒక వేళ కవిత రాస్తే ........
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 29-07-10 13:20:00
కవిత లంటే నాకు చాల ఇష్టం ..కానీ రాయడం రాదు కదా ! అందుకని ఒక వేళ రాస్తే ఎలా ఉంటుందో చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటో అని ఎదో ఒక సుత్తి రాస్తున్నా ! నేను రాస్తే కవిత చదివేటప్పుడు కలత ఆపై కొంచెం నలతఇక ఆపై ఉండదు భవిత ఇదంతా వారి తలరాతవారికి దిక్కు విధాత************************** ఇంకొక సుత్తి ************************నా కవిత కి ఉండదు అర్ధం తెలుసుకోవాలనుకోవడం వ్యర్ధం తెలుసుకుంటే అనర్ధం మొత్తానికి అది సుత్తి పదార్ధం******************* మరి దీన్ని ఎమంటారో నాకు తెలీదు **************** కల కాలం(...)
ఎవరికి వారే యమునా తీరే ..అంటే వివరించరూ .....చిన్న సందేహం
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 27-07-10 08:03:00
ఎవరికి వారే యమునా తీరే ..అంటే ఎవరి దారి వారిది అనే అర్ధం లో వాడతారు కదా ! మరి యమునా తీరానికీ ఎవరి గోల వారిది అనటానికీ సంబంధం ఎమిటి? లేకపొతే తీరు - -విధము అనే అర్ధం లో వాడారా ? యమునా నది కీ దీనికీ సంబంధం ఎమిటో ? తెలియక అడుగుతున్నాను ....అసంబద్ధం అనుకోకుండా కొంచెం మీకు తెలిస్తే వివరించగలరు ....ధన్యవాదములు
అంత్య ప్రాస తో సొంత డబ్బా (సుత్తి గారి డబ్బా పోస్ట్ )
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 14-07-10 09:52:00
వంశీ కృష్ణ నా పేరుచేర్చకండి దాని వెనుక గారు గీరు ఎందుకంటే పెద్ద వారు మీరు నా బ్లాగ్ లో సుత్తి మహా జోరు డబ్బా మోతలతో హోరు అవి చూసి మీరు బేజారు నేనెప్పుడూ ఇలాగే హుషారుచేస్తుంటా కలల షికారుసుత్తి విన్న వాళ్ళు ఉసూరు మారదెపుడూ నా తీరుకొట్టేస్తోందా ఈ సుత్తి బోరుసరే ! ఈ లైనే ఇక ఆఖరు
అలుగు వెలుగు ( ఈ పోస్ట్ చదివిన వారికి ఆనందం కలుగు ఇది నా 50 వ పోస్ట్ .... )
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 19-06-10 10:29:00
అలుగు ట అన్నది ఒక కళ...అరవై నాలుగు కళలు అన్న పదం లోనే అలుగు అన్నది ఉన్నది ...ఆ లిస్టు లో కళ ఉందొ లేదో నాకు తెలియదు ..... మనిషి చిన్నప్పుడు సాధించాల్సిన వి చాలా ఉంటాయి బొమ్మలు చాక్లెట్లు ఐస్ క్రీములు ...ఇలా ఏది కనపడితే అది అన్న మాట మరి అవి సాదించుకోవాలంటే రెండు ఆయుధాలు ఉన్నాయి ఒకటి గోల చెయ్యడం ఐతే రెండోది అలగటం ఈ రెండు కూడా పుట్టుక తోనే మనకు దేవుడిచ్చే ఆయుధాలు మరి ఈ రెంటినీ ఒక పధ్ధతి ప్రకారం వాడుకోవాలి వాడుకోవాలి...నాకు పదేళ్ళ వయసు వచ్చే సరికి నాకు ఈ రెంటి లో అపారమైన అనుభ(...)
చిన్న పిల్లల సంఘం జిందాబాద్ ..తమ్ముళ్ళు చెల్లెళ్ళు జిందాబాద్ ( చి.పి.సం పార్ట్ -2)
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 14-06-10 05:51:00
నమస్కారం ....చాలా రోజుల క్రితం ఒక ఇంట్లో చిన్న పిల్లలు గా పుట్టిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు పడే బాధల గురించి ఒక పోస్ట్ రాయడం జరిగింది ..మేమందరం కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం ...ఇన్నాళ్ళ తర్వాత చిన్న పిల్లల గొప్పతనం గురించి ఒక రెండు మాటలు రాద్దాం అనిపించింది ఈ సంఘం గురించి తెలియని వాళ్ళు పాత పోస్ట్ కోసం ఇక్కడనొక్కండి ( http://suttinaasottu.blogspot.com/2009/11/blog-post_30.html) (...)
కనుక్కోండి చూద్దాం ! ఫొటోలతో ఒక చిన్న పజిల్
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 04-06-10 05:27:00
మరి ఇలా చూసామా ! ఈత చెట్టు పొడుగు గా ఉంది కదా ధ్వజ స్థంభం కంటే !కొంచెం ముందు కి ఫోటో వెళ్లి తీస్తే మరి ఇలా వచ్చింది మరి ఇలా చూసామా ధ్వజ స్థంభం ఎత్తు గా ఉంది గా ఈత చెట్టు కంటే ! మరి ఇంతా చేసి ఈ రెంటి లో ఏది ఎక్కువ ఎత్తోమీరే చెప్పండి చూద్దాం.......(ఇందులో నేను ఏమీ ఎడిట్ చెయ్యలేదండీ తీసిన ఫోటోలు అలా నే పెట్టేశా )
అంత్య ప్రాస తో సొంత డబ్బా ( సుత్తి గారి డబ్బా పోస్ట్ )
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 20-05-10 05:47:00
ఇంటి పేరు పరుచూరి మారు పేరు మురారి నేనొక పెద్ద మాటకారి అలాగే కొంచెం చమత్కారి నా కవిత్వం కావేరి నా సుత్తి మరి మహమ్మారినా ఆలోచనలు భారీప్రస్తుతానికి నేనొక బ్రహ్మచారి హింసించి ఉంటే సారీఈ పూట కి ఉంటా మరి !మీరలా మౌనంగా వెళ్ళిపోతే కామెంట్ కొట్టే వారు ఏరి ?
అంత్య ప్రాస తో సొంత డబ్బా :-) ...( సుత్తి గారి డబ్బా పోస్ట్ )
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 19-05-10 09:45:00
ఇంటి పేరు పరుచూరి మారు పేరు మురారి నేనొక పెద్ద మాటకారి అలాగే కొంచెం చమత్కారి నా కవిత్వం కావేరి నా సుత్తి మరి మహమ్మారినా ఆలోచనలు భారీప్రస్తుతానికి నేనొక బ్రహ్మచారి హింసించి ఉంటే సారీఈ పూట కి ఉంటా మరి !మీరలా మౌనంగా వెళ్ళిపోతే కామెంట్ కొట్టే వారు ఏరి ?
ఆకాశం నా కోసం ఇలా -- ఫోటోగ్రఫి ( శ్రీ సుత్తి గారి కెమెరా పనితనం )
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 01-05-10 11:11:00
నిర్మలమైన నా మనసులా నిర్మల మైన ఆకాశం (సొంత డబ్బా ) ...........................................చెదిరిన ఆకాశం............................... ఎండాకాలం అంటే ఇలాగే ఉంటుంది మరి .....................................................అమ్మో భయం కలిగించేలా ..............................................................ఇంద్ర ధనుస్సు తో ముస్తాబై............................ నేటి పగలుకిక టాటా చెప్తూ అస్తమించ బోతున్న సూరీడుతో ....ఆకాశం వెన్నెల నాటి రాత్రి చందమామ తో అందం గా ముస్తాబై ఇలా....ఇలా ఒక్కో (...)
ఈ చిత్రం ఏంటో చెప్పండి ? :-) ( సమాధానం కావాలంటే డెస్క్ టాప్ తల క్రిందులుగా తిప్పి చూడం డి -- సొంత డబ్బా )
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 27-04-10 11:36:00
పై చిత్రం లో మీకు ఏమి కనపడుతుంది ? ఏమీ అర్ధం కావడం లేదా ? ఒక్కసారి ఆలోచించండి..........! !!ఓడిపోయారు గా ............................ఇప్పుడు డెస్క్ టాప్ తిప్పి చూడండి ................................... ఇది ఒక రకమైన డబ్బా .........సొంత డబ్బా ..నే కానీ కొంచెం డబ్బా కొట్టే విధానం తేడా ! ఎలా ఉంది ఈ కొత్త ( లేకపొతే చెత్త ) ప్రయోగం ?
కృష్ణుడు ,విష్ణుమూర్తి ( సుత్తి గారు మంచి ఫోటోలు కూడా తీయగలరు )
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 24-04-10 09:33:00
చిత్రాలు తీసిన విధానం బావున్నదా ? వెనుక నీలి మేఘాలు రావటం కోసం చాలా సేపు ఎదురు చూసాను
నాలుగేళ్ల పాటు నా సుత్తి భరాయించినందుకు ధన్యవాదములు ( ఇంజనీరింగ్ అయిపొయింది గా ! )
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 22-04-10 13:45:00
కాలేజీ అయిపొయింది ..అందరం విడిపోయాం .......సరదాగా రోజూ నా హింస పడే వాళ్ళకి ప్రాప్తి దొరికింది ..చివరిలో కూడా మా వూరు గురిం చి డబ్బా కొడుతూ సరిపోయింది ..కాలేజీ అంటే చదువు తో పాటు సరదా ! రాత్రి పూట ఏదో ఒక పుట లో చదివిన విషయం తీసుకెళ్ళి నాకు కనపడిన వాళ్ళం దరికీ సరదాగా చెప్పేస్తూ హాయి గా గడిచిపోయేది ..ఉదయాన్నే నాలుగు కిలో మీటర్లు సైకిల్ తొక్కి హై వే దగ్గరకి వచ్చి చాలా కష్టపదిపోయినా ఫీలింగ్ తో ఆర్డినరీ బస్సు ఎక్కి లాస్ట్ సీట్ లో కూర్చుని నా సుత్తి ఒక ఇద్దరు ముగ్గురికి వినిపించే వాడిని ఈ (...)
నా ఇంజనీరింగ్ టపాలన్నీ ఒక చోట
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 12-04-10 13:30:00
ఒక చిన్న పుస్తకం పై రాసిన అసలు సిసలైన సూపర్ సుత్తిసిలబస్ బుక్ పై అసలు సిసలైన సూపర్ సుత్తి ( ఇంజనీరింగ్ జీవితం పై సూపర్ సుత్తి )సుదీర్ఘ సుత్తి ఇదిగోబి టెక్ స్టూడెంట్ గుండెల్లో "ల్యాబ్" డబ్ (అడ్డు అదుపూ లేని సుదీర్ఘ సుత్తి prolonged hammering)( ఇది కేవలం మొదటి సంవత్సరం ల్యాబ్ ల పై మాత్రమే రాసాను ఇంకా మిగిలిన వాటి పై త్వరలో )మిత్రుడు రాయి గారిచ్చిన గిఫ్ట్ సుత్తి గారి బొమ్మసుత్తి గారికి రాయి గారి గిఫ్ట్ ( మీరు తప్పక చూడాలి )ఇంజనీరింగ్ లో తొలి సుత్తినేను ఫోర్త్ ఇయర్ ...ఫైనల్ ఇయర్ కాదు ..(...)
నా బ్లాగ్ లో పోస్టులు పోయాయి ( సుత్తి గారికి సహాయం చెయ్యగలరు )
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 08-04-10 08:04:00
నా బ్లాగ్ లో మొత్తం నలభై కి పైగా పోస్టులు ఉండేవి ......నవంబర్ లో ఎనిమిది పోస్టులు ఉండేవి ఆ నెల లో పోస్టులు అన్నీ పోయి నవంబరు లో కి డిసెంబర్ టపాలు ,డిసెంబర్ లోకి జనవరి టపాలు ,జనవరి లోకి ఫిబ్రవరి టపాలు వచ్చేసాయి ....ఇపుడు పరిస్థితి ఏంటి ? కానీ నా బ్లాగర్ ప్రొఫైల్ లో అన్ని టపాలు కనపడుతున్నాయి వాటి ద్వారా ఆ టపాలు కనపడుతునాయి ...కేవలం బ్లాగ్ లో పోస్టులు కనపడటం లేదు అంతే ...................ఇంతా చేసి నా బాధ మీకు అర్ధం అయిందా ?
కొంత కాలం సెలవు ( ఒక చిన్న సుత్తి తో బై బై )
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 23-03-10 11:11:00
పరీక్షల సమయం వచ్చేసింది కదా ! ఇక బుద్ధి గా చదువుకోవాలి ..సో కొంత కాలం నా సుత్తి బ్లాగ్ కి సెలవు ఈ సమయం లో ఒక చిన్న సుత్తి నా ఈ సుత్తి బ్లాగు కొంత కాలం ఆగు ఆ తర్వాత మళ్ళా సాగు మీరంటారు అప్పుడు బహు బాగు అన్నట్టు చెప్పటం మరిచాను మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
మా వూరికి కరెంటు సూర్యుడు గారి దగ్గర నుండి నేరుగా :-) ( ఫోటోగ్రఫి )
రచయిత
పరుచూరి వంశీ కృష్ణ .'
బ్లాగు :సుత్తి నా సొత్తు
టపా తేది: 19-03-10 11:10:00
చూసారా ? అలా సూర్యుడి గారి దగ్గర నుండి కరెంటు తీగలు మా వూరి లోకి వస్తాయన్నమాట :-) మా వూరు ఎంత అభివృధ్హి చెందిందో కదా !