పరిశోధనా తృష్ణ – బంగోరె
రచయిత
పుస్తకం.నెట్'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 06-09-10 06:30:37
[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
’ఇటీజ్ నాట్ మై షర్ట్ దట్ ఐ క్యాస్ట్ ఆఫ్ టుడే బట్ స్కిన్ విత్ మై ఓపెన్ హ్యాండ్స్’ - అన్న ఖలీల్ జిబ్రాన్ కవిత్వ చరణాలతో ఒక దౌర్భాగ్య పత్రికకు అద్భుతమైన సంపాదకత్వాన్ని నిర్వహించిన బం(...)
నత్తలొస్తున్నాయ్! జాగ్రత్త!
రచయిత
అతిథి'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 05-09-10 05:30:58
రాసిన వారు: పీవీయస్
*************
మల్లాది వె౦కట కృష్ణమూర్తి – అక్షరాలతో హడలెత్తి౦చిన జూలాజికల్ ఫా౦టాసీ….. నత్తలొస్తున్నాయ్! జాగ్రత్త!
ఆఫ్రికా ఖ౦డ౦లోని కెన్యా దేశ౦లో దొరికే రాక్షస నత్తలు hermaphrodites. అ౦టే, తెలుగులో ముచ్చటగా ఒక్క మాటలో చెప్పాల౦టే అర్థనారీశ్వర జీవులు. స్త్రీ, పురుష జననా౦గా లు రె౦డూ ఒకే జీవిలో ఉ౦టాయన్నమాట. కాబట్టి ఈ అర్థనారీశ్వరులు స౦తానోత్పత్తి కోస౦ మరో జీవి దగ్గరకు వెళ్ళి, పిల్లిమొగ్గలు వేస్తూ ఎలా౦టి డ్యూయెట్లు పాడనవసర౦ లేదన్న మాటే కదా!
కెన్యాదేశ౦లో భారత రా(...)
మునిపల్లె రాజు – ‘ అస్తిత్వనదం ఆవలి తీరాన’
రచయిత
అతిథి'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 03-09-10 05:30:49
అతిథి: బెల్లంకొండ లోకేశ్ శ్రీకాంత్
******************
మేజికల్ రియలిజం ఒక విలక్షణమైన సాహితీ ప్రక్రియ. సృష్టిలో జరిగే దైనందిన కార్యక్రమాలని అధ్యాత్మిక కోణంలో అన్వయించి చూసి మానవుడికి, జరుగుతున్న సంఘటనలకు మధ్యనున్న మార్మిక సంబంధాలని ఆవిష్కరించి, విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది.కథలో ముఖ్యమైన సంఘటనలకు మధ్య తార్కికమైన వివరణ గానీ, సైకలాజికల్ వివరణ గానీ ఉండదు.రచయిత రియాలిటీనీ కాపీ కొట్టటం కానీ,దాని చుట్టూ కథను అల్లుకునే ప్రయత్నం గానీ చెయ్యడు.సాధరణ విషయాలని అద్భుతంగా,అద్భుతమైన వాటిని సా(...)
అనామిక (హారం)
రచయిత
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 31-08-10 15:06:36
వంద నీతులు చెబితే ఎవరూ వినరు. ఒక్క ఉదాహరణ చూపిస్తే అందఱికీ నమ్మ బుద్ధేస్తుంది. ఈ సత్యాన్ని మన పూర్వీకులు బాగానే ఆకళించుకున్నారు. అందుకనే ప్రపంచంలో ఎక్కడా లేనంత కథాసాహిత్యం భారతదేశంలో పోగుపడింది. మన ౧౮ పురాణాలూ, ౧౮ ఉపపురాణాలూ, ఇతిహాసాలూ, కథాసరిత్సాగరం, పంచతంత్రం అన్నీ కథామయం. ఇతరుల్ని ఒప్పించడంలో దృష్టాంతానికున్న ప్రాధాన్యాన్ని గమనించినవారు కనుకనే కథనీ, కవిత్వాన్నీ వేఱుచేసి చూడడానికి మన పూర్వీకులు అంగీకరించలేదు. వారు కథల్ని ఆలంబనగా చేసుకొని వాటి చుట్టూ రసమయ కావ్యాల్ని అల్లారు. ముఖ్యం(...)
పుస్తక సమీక్ష – సౌశీల్య ద్రౌపది
రచయిత
అతిథి'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 30-08-10 05:30:30
రాసిన వారు: ఎమ్బీయస్ ప్రసాద్
(ఈ వ్యాసం మొదట జులై 2010 ’ఈభూమి’ పత్రికలో ప్రచురితమైనది.)
******************
మనకు పురాణాలలో లభించేదంతా అక్షరసత్యాలు కానక్కరలేదు. పురాణం అంటే జనశ్రుతంగా వస్తున్న కథ. మనిషి బతికుండగానే ఎన్నెన్ని అతిశయోక్తులు పుడుతున్నాయో, కళ్ళెదురుగుండా జరిగే సంఘటనకే టీవీ ఛానెల్సు వేర్వేరు తరహాలుగా ఎలా వ్యాఖ్యానాలు చెపుతున్నాయో చూస్తున్నాం. వేల ఏళ్ళ క్రితం గ్రంథస్తం అయిన గాథల్లో కూడా ఇలాటివి చోటు చేసుకోవచ్చని సులభంగా వూహించవచ్చు. అలా గ్రంథస్తం అయినవి ఇన్ని తరాలూ దాటుకున(...)
ఒక కన్నడ పుస్తకాల ఆవిష్కరణ సభ -ఆహ్వానం, కథాకమామిషూ
రచయిత
సౌమ్య'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 29-08-10 08:30:04
కన్నడ పుస్తక ప్రపంచంలో విశిష్టమైన ఉదంతంగా వర్ణిస్తున్న – సంధ్యా పాయ్ గారి పదిహేను పుస్తకాల ఆవిష్కరణ తాలూకా ఆహ్వాన పత్రం ఈ టపాతో జతచేస్తున్నాము. ఆహ్వానం అంతా కన్నడలో ఉంది…. కనుక, అసలు విషయం ఏమిటంటే –
’స్నేహా బుక్ హౌస్’, బెంగళూరు వారు ప్రచురించిన 15 పుస్తకాల ఆవిష్కరణ సభ రవీంద్ర కళాక్షేత్ర లో రాబోయే శుక్రవారం (సెప్టెంబర్ మూడు, 2010) న సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య జరగనుంది. ఈ పుస్తకాలను రాసినది సంధ్యా పాయ్ (ప్రముఖ కన్నడ వారపత్రిక ’తరంగ’ నిర్వాహకురాలు, మణిపాల్ గ్రూపు యజమానురాలు(...)
అనామిక (హారం)
రచయిత
పుస్తకం.నెట్'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 28-08-10 19:15:43
అగస్టు 29, తెలుగుభాషాదినోత్సవం రోజున తెలుగుభాషకోసం అందరం కలిసి నడుద్దాం. మీరు తప్పకరండి అందరికీ తెలియజేయండి. వివరాలకోసం ఇక్కడ చూడండి -
(మురళీధర్ నామాల గారి మాటల్లో)
తెలుగుజాతి మనది. నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు,యాసలు,వేషాలు వేరయినా మన భాష తెలుగుభాష. పాశ్చాత్యులు మురిసి అధ్యయనం చేసిన ముత్యాలభాష. పొరుగురాజులు మెచ్చి “లెస్స”యని జేజేలు పలికిన సుందరభాష. కవులు కీర్తించిన కమ్మని భాష. లోకనీతిని ముచ్చటగా మూడు ముక్కల పద్యాల్లో చెప్పి, బాల్యాన్ని తీర్చిదిద్దిన గొప్పభాష.
ఇది నిన్న (...)
తిరుమల రామచంద్రగారి “హంపీ నుంచి హరప్పా దాకా”
రచయిత
అతిథి'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 28-08-10 05:30:21
రాసిన వారు: విష్ణుభొట్ల లక్ష్మన్న
*****************
ఇప్పటి దాకా ఈ పుస్తకం పై పుస్తకం.నెట్‌లో సమీక్ష రాకపోటంతో నాకు కొంత ఆశ్చర్యం, కొంత ఆనందం కలిగాయి. ఎందుకంటే, గొప్ప పుస్తకాల పేర్లు ఒక వంద చెప్పమంటే, ఎవ్వరి జాబితాలో అయినా తప్పకుండా ఉండే ఈ పుస్తకం పై సమీక్ష ఇక్కడ లేనందుకు ఆశ్చర్యం, నాకు ఈ పుస్తకాన్ని ఇక్కడ పరిచయం చేసే అవకాశం వచ్చినందుకు ఆనందం. ఈ పుస్తకం పరిచయం చెయ్యటంలో ఒక పాఠకుడిగానే కాక నాకు మరో పాత్ర కూడా ఉంది. అదేమిటో తరవాత మీకు మనవి చేస్తాను.
1996 సంవత్సరంలో అనుకుంటా, ఆంధ్ర(...)
నేనూ తయారుచేశానొక జాబితా….
రచయిత
సౌమ్య'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 27-08-10 05:30:20
నేనూ ఓ జాబితా తయారు చేయడం మొదలుపెట్టాను. ఒక సంఖ్య అని అనుకోలేదు కానీ, ఇప్పటిదాకా చదివినంతలో నాకు నచ్చినవి మాత్రం రాద్దామనుకుంటూ మొదలుపెట్టాను. అదే ఇది.
గమనిక: అనువాదాలను లిస్టుల్లో చేర్చలేదు.
వ్యాసాలు:
కొ.కు. వ్యాసాలు (అన్ని రకాలవీనూ) : విషయ పరిజ్ఞానానికి …
నండూరి రామ్మోహనరావు (నరావతారం, కొన్ని ఆంధ్రజ్యోతి సంపాదకీయాలు) : అరటిపండు వొలిచి నోట్లో పెట్టినట్లుంటాయన్న బాపూ గారి కార్టూన్ ను గుర్తు తెచ్చుకుంటూన్నాను..
మహీధర నళినీమోహన్ రచనలు (దాదాపు అన్నీ) : ఇవి చదువుతూనే ఎన్నో ప్రశ్నల(...)
జనాభిప్రాయాన్ని విరోధించి, ఔన్నిజమే అనిపించే కవితా వ్యూహం
రచయిత
అతిథి'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 25-08-10 04:30:39
రాసిపంపినవారు: హెచ్చార్కె
విన్నకోట రవిశంకర్ ఇటీవల వెలువరించిన కవితా సంపుటి: ‘రెండో పాత్ర’
సమకాలికుల్లో నాకు ఇష్టమైన కవి విన్నకోట రవిశంకర్. సన్నిహిత స్నేహం వల్ల పుస్తకం మీద సమీక్ష వంటిది రాయడానికి నేను అర్హుడిని కాను. ఇది నా ఇష్టాన్ని విశ్లేషించుకుంటూ రాస్తున్న మెచ్చికోలు.
రాయల సీమ పలుకుబడిలో చెప్పాలంటే, రచనలో రవిశంకర్ ఎప్పుడూ ‘ఎచ్చులకు పోడు’. ఢమఢమలు ఉండవు. భాషలోనే కాదు, చెప్పే విషయం లోనూ అంతే. మనందరి రోజు వారీ జీవితమే, మనం అలా చూడలేదంతే. భావాలు చిక్కులు పడవు. కల్పించే దృశ్(...)
మాలతి గారి రీడింగ్ లిస్టు
రచయిత
అతిథి'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 24-08-10 06:30:48
[నిడదవోలు మాలతి గారి గురించీ, ’తూలిక’ గురించీ - ఆన్లైన్ తెలుగు చదువరులకి పరిచయం అక్కర్లేదు కదా. మాలతి గారి రీడింగ్ లిస్టు ఇదిగో! ఈ వ్యాసం నుండి తూలిక/తె.తూలిక కు గానీ వరదల్లా వెళ్ళే లంకెల గురించి మేము నిస్సహాయులం - ఎందుకంటే, కొందరి కథలు/కొందరి గురించిన వ్యాసాలూ - ఆన్లైన్ సెర్చ్ లో తూలికల తీరానికే చేరుస్తున్నాయి మరి! -పుస్తకం.నెట్]
ఈ జాబితా తయారు చెయ్యడం నాకు చాలా కష్టమయింది. ఎందుకంటే అసలు నాకు చదువే తక్కువ. ఆపైన గుర్తున్నవి మరీ తక్కువ. అందులోనూ నాకు చిన్నకథలంటే మక్కువ ఎక్కువ. అం(...)
మూడు జీవితచరిత్రలు
రచయిత
అసూర్యంపశ్య'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 23-08-10 06:30:27
ఇటీవలి కాలంలో రెండు మోనోగ్రాఫులు, ఒక బయోగ్రఫీ చదివాను (వ్యక్తులపై రాసిన మోనోగ్రాఫులకీ, బయోగ్రఫీలకీ తేడా ఏమిటీ? అన్నది అర్థం కాలేదింతకీ!). చదివాక, అసలు మొనోగ్రాఫులు ఎలా ఉండాలి? జీవిత చరిత్ర రాస్తే ఎలా రాయాలి? ఇత్యాది ప్రాథమిక సందేహాలు మొదలయ్యాయి. ఒకటి విసుగు పుట్టించింది. రెండోది పర్లేదనిపించింది కానీ – నేను ఊహించిన సంగతుల్లేవు. మూడోది మాత్రం నాకు అన్ని విధాలా నచ్చింది. ఆ పుస్తకాల గురించీ, వాటిలోని విషయాల గురించీ, అవి రాయబడ్డ విధానం గురించీ – ఈ టపా.
పుస్తకాలు:
Pusapati Ananda Gaj(...)
నెల్లూరియుని సృష్టి – పెద్దబాలశిక్ష
రచయిత
పుస్తకం.నెట్'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 22-08-10 08:40:04
[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
అక్షరాలు నేర్చుకోవడం, అ,ఆలు దిద్దుకోవడం అంటే నేలమీద, ఇసుకమీద, రాళ్ళమీద నేర్చుకునే రోజుల్లో పెద్దబాలశిక్ష సరస్వతీ పుత్రుల పాలిట వరమైంది. తెలుగుభాషలోనే బాలలకు ప్రథమశిక్షణకై ఉపయోగపడే(...)
కారా మాష్టారు రచనలు
రచయిత
chavakiran'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 20-08-10 06:30:31
కారా మాష్టారు,
కథలను ఇష్టంగా కష్టపడి చెక్కేవారు,
విరసంతో సరసం, విరసం నెరపినవారు,
ఆత్మాభిమానం, అంతరాత్మ సాక్షిగలవారు,
అంతర్ముఖులు, కథాముఖులు,
కథా నిలయమనే కల కని సాకారం చేస్తున్నోరు,
లక్షలాది తెలుగు కథలు చదివినవారు,
లక్షణాలు – తెలుగు కథకు చెప్ప చూసినవారు,
కుర్ర కారుతో కథలు చెప్పించినవారు,
గండరగండడు, ఉద్దండుడు
సీకాకులం చిన్నోడు,
లోగుట్టు తెలిసి తెలిపిన యజ్ఞ పెరుమాలుడు
తెలుగు జాతి పుణ్య ఫలం,
తెలుగు తల్లి స్వేదం తుడిచిన వారు,
కారామాష్టారు.
ఒక రచయిత జీవిత కాలం మొత్తం చేసిన (...)
గొల్లపూడి గారి రీడింగ్ లిస్టు
రచయిత
అతిథి'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 18-08-10 06:30:25
[ప్రముఖ రచయిత, నటుడు, మంచి చదువరీ అయిన గొల్లపూడి మారుతీరావు గారికి నచ్చిన తెలుగు పుస్తకాల లిస్టు ఇది. అడగ్గానే స్పందించినందుకు మారుతీరావు గారికి అనేకానేక ధన్యవాదాలు. ఆయనను పోయిన సంవత్సరం పుస్తకం.నెట్ లో ఇంటర్య్వూ చేసిన విషయం సైటు వీక్షకులకు గుర్తుండే ఉంటుంది.. (మొదటి భాగం, రెండో భాగం).]
ఇదిగో ఆయన సూచించిన తెలుగు పుస్తకాల జాబితా:
1.నా యెరుక – ఆధిభట్ల నారాయణదాసు
2.అనుభవాలు-జ్ఞాపకాలూనూ – శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
3. నా స్మృతి పథంలో – అచంట జానకీరామ్
4. కృష్ణపక్షము – దేవులపల్లి కృష్(...)
తెలుగులో ముప్పై ప్రముఖ పుస్తకాలు – నా ఎంపిక
రచయిత
రవి'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 17-08-10 07:40:26
నా ఎంపిక ఇది. నేనో సామాన్య పాఠకుడినే అని అనుకుంటున్నాను. ఇందులో చదవనివి కూడా ఉన్నాయి. అయితే వాటి రెఫరెన్సులు ఇతర పుస్తకాలలో చూడటం, అదే రచయిత మిగిలిన పుస్తకాలను చదవటం ద్వారా ఇందులో చోటు కల్పించటం జరిగింది.
కవితాసంకలనాలు, నవలలు, వ్యాసాలు, జీవితచరిత్రలు, కథల సంపుటాలు, 19,20 శతాబ్దాల రచనలు – ఇవి పరిగణనలో తీసుకొన్నవి.
కావ్యాలు, అనువాద రచనలు, రామాయణ, భారత, పురాణాది రచనల ఆధారితాలు – ఇవి విస్మరించినవి.
ఈ లిస్టులో లోపాలను సహృదయంతో మన్నిస్తారని ఆశిస్తాను.
1. సమగ్రాంధ్రసాహిత్యం – ఆరుద్ర ((...)
తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు – మీ ఎంపిక
రచయిత
పుస్తకం.నెట్'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 15-08-10 17:44:04
రీడింగ్ లిస్టులు ఎన్ని చూడలేదని – ఇరవైల్లో చదవల్సినవి, అరవైల్లో చదవల్సినవి, చనిపోయేలోపు చదవాల్సినవి – ఉఫ్! ఊపిరాడనివ్వకుండా ఇన్నేసి రీడింగ్ లిస్టులు! వాటిని చూసినప్పుడల్లా చదవాల్సిన మహాసాగరం చాలా ఉందే అని బెంబేలు పడిపోవడం. అన్నీ కాకపోయినా, అప్పుడొకటి అప్పుడొకటి తెలీని ఆణిముత్యాలు చదవడం వీటి వల్ల లాభం.
ఇంగ్లీషులో రీడింగ్ లిస్టులు బాగా కనిపిస్తున్నాయి. వాటిని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా, “మరి, మన తెలుగులో?!” అన్న ప్రశ్న ఉదయించకతప్పదు.
ఇంతకీ అందరూ తప్పక చదవవలసిన అత్యుత్తమ పుస్(...)
చెక్ లిస్ట్ మేనిఫెస్టో
రచయిత
అతిథి'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 13-08-10 06:30:40
రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్
************************
పుస్తకం వివరాలు:
The Checklist Manifesto, Atul Gawande
New York: Metropolitan Books, 2009
రైలు కదిలే ముందు కిటికీ దగ్గర నిలబడి – ‘ నీ టికెట్ బాత్రూం లో చూసినట్టు గుర్తు. జేబులో పెట్టుకొన్నావు కదా’ ?? స్వరం పెంచి అడిగే వాడు నాన్న . బోగీలో సగం మంది కంగారుగా టికెట్ ఉందా లేదా అని చెక్ చేసుకొనేవారు. నాకిది అలవాటైన ప్రశ్నే కాబట్టి తాపీగా ‘ఉంది ‘ అనేవాణ్ణి. స్నేహితుని ఇంట భోజనాల దగ్గర ఈ సంఘటన చెబితే అందరూ నవ్వుతుంటే , జీన(...)
కొన్ని కథలతో అనుభవాలు
రచయిత
అసూర్యంపశ్య'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 12-08-10 07:30:01
ఈ వ్యాసం ఉద్దేశ్యం – సమీక్షా, పరిచయం ఏదీ కాదు. గత మూణ్ణాలుగు నెలల్లో అప్పుడొకటీ, ఇప్పుడొకటీ అంటూ, భిన్న రచయిత(త్రు)ల కథలు చదివాను. ఇటీవలే డైరీ తిరగేస్తూ, ఒక్కోళ్ళ గురించీ నెమరువేసుకున్నాను. ఆ పఠనానుభవాల తాలూకా సంగతులను ఇక్కడ పంచుకోవాలనుకుంటున్నాను. అంతకుమించి ఈ వ్యాసానికి పరమార్థమేం లేదు.
రాచమల్లు రామచంద్రారెడ్డి కథలు – అలసిన గుండెలు:
ఈ పుస్తకం, ఈ-పుస్తకంగా చదివేందుకు ఇక్కడే ఎవరో లంకె ఇచ్చినట్లు గుర్తు. రా.రా. విమర్శ వ్యాసాలు చదివాక, ఆయన కథలెలా రాస్తాడో – అన్న కుతూహలం కలిగి చదివా(...)
Multiple City – Writings on Bangalore
రచయిత
సౌమ్య'
బ్లాగు :పుస్తకం
టపా తేది: 11-08-10 06:30:23
ఆ మధ్యోమారు బెంగళూరు ఫోరం మాల్ లోని లాండ్మార్క్ షాపులో తిరుగుతూ ఉంటే, కనబడ్డది – ’మల్టిపుల్ సిటీ’ -రైటింగ్స్ ఆన్ బెంగళూర్ అన్న పుస్తకం. పేరు చూడగానే – సుకేతు మెహతా రాసిన ’మాక్జిమమ్ సిటీ’ గుర్తొచ్చింది (మొదలుపెట్టి, పుస్తకం బాగున్నాకూడా రకరకాల కారణాల వల్ల మధ్యలో ఆపేసిన ఎన్నో పుస్తకాల్లో ఇదొకటి!!). కింద …ఆన్ బెంగళూరు అని చూడగానే ఇంక కొనేయాలనిపించింది. గత సంవత్సర కాలంలో – దీర్ఘకాల బెంగళూరు వాసులెవరన్నా తగిలితే, వాళ్ళీ నగరం గురించి బోలెడు కబుర్లు చెప్పడం, నాకూ ఈ నగరం నచ్చడం, నాకలాంటి పా(...)