కొన్ని తెలుగు సినిమాలు-వాటి ఒరిజినల్స్
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 07-08-10 04:59:00
హోమం-Departed విశాఖ ఎక్స్ ప్రెస్ -Stranger on  a  Train గేం-Changing Lanes గజిని -Memento పోకిరి-Departed (de  Caprio 's ) ఖతర్నాక్-హాంగ్ కాంగ్ మూవీ ,InfernalAffairs and  the  punisher సత్యభామ-Fifty  First  Dates అమరావతి-కొరియన్ మూవీ 'H 'ఓయ్-కొరియన్ మూవీ 'A millionaire 's Love Story 'కావ్యా's డైరీ-The Hand That Rocks the Cradle 16 డేస్-Lucky number Slevin ఇందుమతి-Psycho మీ శ్రేయోభిలాషి-జపనీస్ మూవీ 'Ikinai 'జగడం-బ్రజిలియన్ మూవీ 'City (...)
చిన్ననాటి తీపి గురుతులు-1 ...సినిమా కష్టాలు
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 05-08-10 06:30:00
మా వూళ్ళో సినిమా హాల్ లేదు.సినిమా కు వెళ్ళాలంటే రేవేంద్రపాడు అనే ఊరు వెళ్లి చూడాలి .ఆ ఊరికి బస్సు లేదు కనుక మూడు మైళ్ళు నడిచి వెళ్ళాలి.లేదంటే తెనాలో,విజయవాడో వెళితేనే సినిమా చూసేది.నా చిన్నప్పుడు పాపం పసివాడు అనే సినిమా వచ్చింది.అది చిన్న పిల్లల సినిమా ,పిల్లలకు సినిమా చూపించాలని పెద్దవాళ్ళు అనుకున్నారు.కానీ పెద్దవాళ్ళేవరూ ఆ సినిమా చూడటానికి రెడీ గా లేరు.అందుకని మా పిల్లముఠాని ఒక అక్కకు(మాణిక్యమ్మ) అప్పజెప్పి సినిమాకు తీసుకువెళ్లమన్నారు.మాకు ఎవరికి ఆ అక్క తో వెళ్ళటం ఇష్టం లేదు.(...)
చిన్ననాటి తీపి గురుతులు
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 03-08-10 09:28:00
నేను సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు ,మా స్కూల్ రైల్వే స్టేషన్ కు పది అడుగుల దూరం లో ఉండేది.అసలు పేరు (ప్రభుత్వ ఉన్నత పాఠశాల)తో ఎవరూ పిలిచేవారు కాదు.అందరూ మా స్కూల్ ను  రైలు కట్ట బడి అని పిలిచేవారు.మా స్కూల్ వదిలే టైం కి ఎప్పుడన్నా ఒకసారి గేటు పడుతూ ఉండేది.ఒంగోలు వెళ్ళే ప్యాసెంజర్ ఆ టైం లో వచ్చేది.(ఇండియన్ రైళ్ళు రైట్ టైం కి ఎప్పుడు వస్తాయి కనుక)గేటు పక్కనుంచి వెళ్ళేదారున్నా,మేము వెళ్ళకుండా ఆ గేటు దగ్గరే నుంచునేవాళ్ళం.రైలు వచ్చే లోపు పట్టాల పైన&n(...)
కోపం
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 29-07-10 13:09:00
తన కోపమే తన శత్రువు అన్నాడు సుమతీ శతక కర్త.కోపం వలన నష్టం తప్పించి ,లాభం ఏమీ ఉండదని తెలిసినప్పటికీ ,జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు కోపం తో చిందులు వేయని వారు ఉండరేమో.కోపం గురించి నాకు నచ్చిన quotes కొన్ని.Holding  on to anger is like grasping a hot  coal  with the intent of throwing it at someone elseyou are the one who gets burned-BuddhaAnger is an acid that can do more harm to the vessel in which it is stored than to anything on which it i(...)
Foodles
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 25-07-10 09:49:00
నిన్న మా అమ్మాయి స్కూల్లో ఇచ్చారని foodlesప్యాకెట్ ఒకటి తీసుకు వచ్చింది. సేమ్, నూడుల్స్   లాగానే ఉన్నాయి.కాకపొతే నూడుల్స్ ని గోధుమ పిండి తో తయారు చేస్తే ఈ ఫూడుల్స్ ని గోధుమ పిండి,వరిపిండి,రాగి,మొక్కజొన్న పిండులతో తయారు చేశారు.ఆ ప్యాకెట్ ని చూడగానే నా చిన్నప్పటి సంగతి ఒకటి గుర్తుకు వచ్చింది.నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ,మా స్కూల్ లో maggiపాకెట్స్ ఇచ్చారు.ఒక్కో స్టూడెంట్ కు రెండు పాకెట్స్ ఇచ్చారు.వాటిని ఇంటికి తీసుకు (...)
మునగాకు-పోషక విలువలు
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 23-07-10 07:17:00
జ్యేష్ట మాసపు ఎండల తరువాత వచ్చే ఆషాడపు జల్లులకు శరీరం లో ముఖ్యం గా ఉదరం లో జీర్ణ ప్రక్రియలో జరిగే మార్పులకు మునగాకు మేలు చేస్తుందని ,ఆషాడ మాసం లో మునగాకు తప్పక  తినాలని అంటారు.అయితే ఒక్క ఆషాడం లోనే కాదు,ఏడాది పొడవునా లేత మునగాకు వండుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణుల అభిప్రాయం.మునగాకులో శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు,(కాల్షియం,ఫాస్ఫరస్,ఇనుము,పొటాషియం )విటమిన్ 'A ','C' ఎక్కువగా ఉన్నాయి.మునగాకుల  లో కాల్షియం ఎక్కువ గా ఉంటుంది కనుక ,మునగాకు రసం ఒక చెంచాడు .(...)
Garbage Truck Psychology
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 21-07-10 04:30:00
మన మూడ్ ఎక్కువ గా ఎదుటివాళ్ళు మనతో ప్రవర్తించే విధానం పైనే ఆధారపడి ఉంటుంది.మన బాస్ మనల్ని అకారణం గా తిట్టినా/విసుకున్నా ,ఎవరైనా మనతో దురుసుగా ప్రవర్తించినా ,వెంటనే మన మూడ్ పాడవతుంది.ఏ పని చేయబుద్ది అవదు.వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు అనే ఆలోచిస్తూ మన పనులు పాడు చేసుకుంటూ ఉంటాము.వాళ్ళు వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్,కోపం,అసంతృప్తి అనే చెత్తను  మన మీద వేసి వదిలించుకుంటే మనం ఆ చెత్తను తీసి అవతల పారవేయాలా?లేదా ?ఆ చెత్తను పదిలంగా దాచుకోము కదా?అందుక(...)
సక్సెస్
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 19-07-10 06:25:00
జీవితం లో సక్సెస్ అనేది కొంతమంది నే వరిస్తుంది.మరి మిగతా వాళ్ళు సక్సెస్ కాకపోవటానికి కారణం ఏమిటి?జనరల్ గా మనం అనుకునేదేమిటంటే సక్సెస్ అవటానికి కారణం వాళ్ళు అదృష్టవంతులు అవటం ,కాకపోవటానికి దురదృష్టం కారణం అని.నిజం గా అదృష్టం ,దురదృష్టం అనేవి ఉంటాయా?ప్రయత్నలోపం వల్ల కూడా సక్సెస్ సాదించలేకపోవచ్చు కదా?ఫెయిల్ అవుతామన్న భయం వల్ల అసలు ప్రయత్నమే చేయకపోవచ్చు.Many of  life's failures are people who didnot realize how close they were to success when they gave up-Thomas Edison.A winner is (...)
విందుభోజనం
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 13-07-10 10:31:00
ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు ఎవరూ ఎదుర్కొని ఉండకపోవచ్చు.చదివినాక నిజంగా జరిగిందా అని కూడా అనిపించవచ్చు.ఎవరైనా నాకు చెప్పితే నేను నమ్మేదాన్ని కాదేమో కానీ ,ఆ పరిస్థితి నాకే ఎదురైంది కాబట్టి ,ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని నమ్మక తప్పటం లేదు.మేము అద్దె కుండే ఇంట్లో మొత్తం నాలుగు పోర్షన్ లు ఉన్నాయి.గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు,ఫస్ట్ ఫ్లోర్ లో రెండు.గ్రౌండ్ ఫ్లోర్ లో,సునీత,వాణి వాళ్ళు అద్దె కుంటే , ఫస్ట్ ఫ్లోర్ లో ఒక పోర్షన్ లో ఇంటి ఓనర్ ,ఇంకొక దాంట్లో మేము ఉండేవాళ్ళమ(...)
సంస్కారం -కథా జగత్ పోటీ
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 08-07-10 06:15:00
మానవ సంబంధాలు డబ్బు తోనూ ,సమాజం పట్ల భయం తోనూ ఎలా ముడిపడి ఉన్నాయో చూపించిన ...కాకాని చక్రపాణి గారు రాసిన 'సంస్కారం 'కథ నాకు నచ్చింది.మొదటి వాక్యమే 'పోయాడు ,పీడా పోయింది అని అనుకుని ఆమె స్వాంతన పొందే అవకాశం లేదు.ఎందుకంటే ఏడవకపోతే ,సమాజం ఆడిపోసుకుంటుంది.'మనం చాలానే పనులు సమాజానికి భయపడి చేస్తుంటాము,కానీ ఇష్టపడి చేయం అనే దాన్ని విశదపరుస్తుంది.హరినారాయణ కూతురు,కొడుకుల సంభాషణలు ,తండ్రి పోయాడన్న బాధ కన్నా ఇంటిని దక్కించుకోవాలన్న ఆత్రం -కూతురికి,తనకు రావలసిన డబ్బు దక్కించుకోవాలన్న ఆరాటం-కొ(...)
బంద్ చేస్తే ధరలు తగ్గుతాయా?
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 07-07-10 09:40:00
నిన్న ,నేను సరుకులు తెచ్చుకోవటానికి షాప్ కు వెళ్ళాను.అప్పుడే ఒక ఆవిడ monthly కార్డు(పాలు) కు డబ్బులు పే చేయటానికి వచ్చింది.ఎనిమిది వందలు ఇచ్చి కార్డు తీసుకుని చిల్లర కోసం నుంచుంది.షాప్ అతను డబ్బులు  సరిపోయాయి అని అన్నాడు. ఏడు వందల అరవయ్యి కదా ,ఎనిమిది వందలు తీసుకున్నారేంటి ?అని అడిగింది.పాల రేటు పెరిగిందమ్మ అన్నాడు షాప్ అతను.దానికి ఆమె... నిన్ననే కదా షాప్ బంద్ చేయిన్చినాము ,రేటు తగ్గించాలి కానీ ,ఎలా  పెంచుతావు అని అడిగింది.(...)
హెల్త్ చెకప్
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 03-07-10 04:53:00
జనరల్ గా మనందరమూ వ్యాధి బాగా ముదిరిన తరువాత ,ఇక వెళ్ళక తప్పదు కాబట్టి డాక్టర్ దగ్గరకు వెళతాం.అంతే కానీ, ముందు జాగ్రత్త గా ఏలాంటి కేర్ తీసుకోము.రొటీన్ చెకప్ లాంటివి  అసలు చేయించుకోము.కాన్సర్ లాంటి జబ్బులు ,ఎర్లీ స్టేజి లోనే గుర్తిస్తే ,జబ్బు పూర్తి గా నయమవటానికి అవకాశం ఉంది.కుటుంబం లో ఎవరికైనా గుండె జబ్బులు,మధుమేహం,కాన్సర్,పక్షవాతం లాంటివి ఉన్నట్లయితే ,మిగతా కుటుంబ సభ్యులు తప్పకుండ ఈ క్రింద పేర్కొన్న టెస్ట్ లు రెగ్యులర్ గా చేయించుకుంటూ ఉండాలి.అలాంటి జబ్బుల హి(...)
Marina Bay Sands resort
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 02-07-10 11:23:00
55 అంతస్తుల పైన స్విమ్మింగ్ పూల్ ను మీరు ఎప్పుడైనా చూసారా?ఒలింపిక్స్ స్విమ్మింగ్ పూల్ కంటే మూడు రెట్లు పెద్దదైన(150మీ)స్విమ్మింగ్ పూల్ Marina Bay  Sands resort, సింగపూర్ లో ఉంది.ఆ ఫోటోలు ఇక్కడ చూడండి.
ప్రాణాలు తీసే గొంగళి పురుగు
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 02-07-10 05:08:00
దక్షిణ అమెరికా లోని రెయిన్ ఫారెస్ట్ లో ఉండే లోనోమియా ఓబ్లికా (Lonomia obliqua) అనే గొంగళి పురుగు ను తాకితే చాలు ,ఇంటర్నల్ haemorrhage,renal failure ( కిడ్నీ పని చేయక పోవటం )లాంటి లక్షణాలు కనిపిస్తాయంట.ఎక్కువ గొంగళి పురుగులు తాకినట్లయితే  ప్రాణాలు పోయే అవకాశం ఉందంట.ఇలాంటి మరణాలు దక్షిణ బ్రెజిల్ లో ఎక్కువ గా సంభవిస్తున్నాయంట.
కాన్సర్ కి ,సెల్ టవర్ లకు సంబంధం ఉందా?
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 30-06-10 13:15:00
 జనరల్ గా మన అందరికి ....సెల్ ఫోన్  టవర్ లకు  దగ్గరలో నివసిస్తున్నట్లయితే  కాన్సర్ సోకే అవకాశం ఎక్కువ      అనే అభిప్రాయం ఉంది.కానీ అది తప్పని ఇటీవల పరిశోధనలు తెలుపుతున్నాయి.ఇంపీరియల్ కాలేజ్,లండన్ వారి పరిశోధన ఫలితాలు ..... చిన్న పిల్లలకు వచ్చే కాన్సర్ కు ,సెల్ ఫోన్ టవర్ లకు దగ్గర లో నివసించటానికి సంబంధం లేదని తెలుపుతున్నాయి.మరిన్ని వివరాలకు ఇక్కడ  చూడండి.
రావణ్
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 20-06-10 06:40:00
రావణ్ సినిమా విడుదలైన మరుసటి రోజే నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసాము.నేను అతి కష్టం మీద ఒక పావు గంట మాత్రమే చూసాను.సినిమా అంత దరిద్రంగా ఉంది మరి(ప్రింట్ అనుకునేరు,ప్రింట్ కాదు).విక్రం ఐ న్యూస్ లో ఇంటర్వ్యు ఇస్తూ ఒక్క బాష లో కాదు,మూడు బాషల్లోనూ సినిమా ను చూడండి అని చెప్పాడు.ఒకటి చూడటమే కష్టం అయితే  ఇక మూడూ బాషల్లోనూ ఏమి చూస్తాము?  సినిమాలో  రాంజా,రాంజా ,బెహనేదో ....ఈ రెండు పాటలు నాకు బాగా నచ్చాయి.
బ్లాగుల్లో కమ్మ వారి ఆధిపత్యం తగ్గించటం ఎలా?
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 12-06-10 09:17:00
భాస్కర రామిరెడ్డి గారికి,మా స.కు.బ్లా.సం.(సర్వ కుల బ్లాగర్ల సంఘం,కమ్మవారు తప్పించి)మీకు సంఘీభావం తెలుపుతున్నది.మీకు ఉన్న బ్లాగర్ల బలం తో మీరు అనుకున్నది సాధించలేరేమో అని చిన్న అనుమానం.బ్లాగ్లోకం లో కమ్మవారి ఆధిపత్యం తగ్గించటం కోసమే మా సంఘం ఆవిర్భవించింది.కమ్మవారి ఆధిపత్యం తగ్గించటం కోసం మా సంఘం తీసుకున్న కొన్ని నిర్ణయాలు....  గూగుల్,వర్డ్ ప్రెస్ లో బ్లాగ్ క్రియేట్ చేసుకునేటప్పుడు ,కాస్ట్ డీటైల్స్ తీసుకొని కమ్మ వారైతే బ్లాగ్ క్రియేట్ చేసుకోవటానికి పర్మిష(...)
జోక్స్
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 11-06-10 12:46:00
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి: నీ బర్త్ డేట్ ఏమిటి?అభ్యర్ధి:   అక్టోబర్  13   ఇంటర్వ్యూ చేసే వ్యక్తి: ఏ సంవత్సరం?అభ్యర్ధి: ప్రతి సంవత్సరంఇంటర్వ్యూ చేసే వ్యక్తి:మీరు మూడో ఫ్లోర్లో ఉన్నారని ఊహించు కోండి .అప్పుడు   అకస్మాత్తుగా ఆ ఫ్లోర్ కు నిప్పంటుకున్దనుకోండి.అక్కడనుంచి ఎలా తప్పించుకుంటారు?అభ్యర్ధి:ఏముంది?సింపుల్ .ఊహించుకోవటం మానేస్తాను.ఇంటర్వ్యూ చేసే వ్యక్తి:మీకు M .S .office  తెలుసా?అభ్యర్ధి:మీరు అడ్రస్ ఇస్తే తెలుసుకుంటాను సర(...)
పేరు తో తంటాలు
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 09-06-10 04:23:00
పేరు లో నేముంది టపాలు చదివాకా నాకు కూడా నా పేరు వల్ల పడ్డ ఇబ్బందులు రాయాలనిపించింది.మరీ చారి గారు పడినన్ని ఇబ్బందులు కాకపోయినా ,కొద్దో గొప్పో కష్టాలు పడ్డాను.నాకు అనూరాధ అని పేరు పెట్టినప్పుడు ,మా అమ్మ వాళ్ళ వదిన ,అనూరాధ ఏంటి?మనోబాధ లాగా!అయినా నక్షత్రాల పేరు పెట్టుకుంటారా ఎవరైనా ? పేరు బాగోలేదు ,వేరే పేరు పెట్టమన్నారు అంట.కానీ మా అమ్మ కు ఆ పేరు బాగా నచ్చినందువల్ల,మరియు ఆ టైం లో అనూరాధ అనే పేరు హవా నడుస్తుండటం తో ఆ పేరే ఉంచేశారు.నా పేరు తో మొట్టమొదటిసారి గా ఇ(...)
అసూయ-ఆడవాళ్లు
రచయిత
anu'
బ్లాగు :ఊహలు-ఊసులు
టపా తేది: 07-06-10 03:24:00
అసూయ ముందు పుట్టి ఆడవాళ్లు తరవాత పుట్టారు అని అంటూ ఉంటారు కదా!అలా ఎందుకంటారు అని ఆలోచించగా ,చించగా నాకు ఈ సమాధానం తట్టింది.అసూయ.....మొదటి అక్షరం తెలుగు అక్షరమాల లోని మొదటి అక్షరం తో మొదలయ్యింది.ఆడవాళ్లు.....మొదటి  అక్షరం తెలుగు అక్షరమాల లోని రెండో అక్షరం తో మొదలయ్యింది.అందుకనే అలా అంటున్నారు అని నేను అనుకుంటున్నాను.మరి అది కరక్టే నంటారా?