Skip Navigation Links


మా ఊరి వేసవి కబుర్లు

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 05-05-13 00:18:00

'వేసవిఅంటేనే పిల్లలకు ఆటవిడుపు. బోలెడన్ని శెలవులు, బోల్డంత కబుర్లు, బోలెడంత హంగామా. మా బాబాయిలు, వాళ్ళ పిల్లలు అందరూ పల్లెలోనే ఉండేవారు. దాంతో వార్షిక పరిక్షలైపోయిన దగ్గర్నుంచి ఎప్పుడెప్పుడు మా ఊరు వెళ్దామా అని ఉబలాటంగా ఉండేది.పొద్దున్నే చెఱువు గట్టుకు వెళ్ళడంతో దినచర్య మొదలయ్యేది (హి..హి..హి. ఆడువారి మాటలకు అర్థాలే వేరు లో వెంకటేష్ లా అన్నమాట). వస్తూ వస్తూ ఏ వేపపుల్లనో, కానుగ పుల్లనో నోట్లో ఆడిస్తూ,  ఆకాశం కడుపున అప్పుడే పుట్టిన పండటి ఎర్రటి సూరీన్ని  మ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రుద్రవీణ

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 30-03-13 20:12:00

'నేను సైతం విశ్వవీణపు తంత్రినై మూర్ఛనలు పోతానునేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మ్రోశానునేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను                                     -మహకవి శ్రీశ్రీ , జయభేరి.వయసుడిగిపోయి చిక్కిశల్యమైన ఒక అంధురాలు, కోనేటి మెట్ల పై కూర్చొని బిచ్చమెత్తుకుంటోంది. అటుగా వెళ్తున్న బ్రా(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పృథ్వీరాజ్ చౌహాన్‌ది ధృతరాష్ట్రుని అంశా?

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 17-02-13 08:45:00

'(   కురుపాండవుల తదుపరి జన్మలు తరువాయి భాగం )పరాక్రమవంతుడైన పృథ్వీరాజ్ చౌహాన్ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. ఢిల్లీ -అజ్మీర్‌లను రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన చేసిన ఆఖరి హైందవరాజు, రాజపుత్ర యోధుడు అతను. అతని భార్య సంయుక్త.  వారిద్దరి ప్రేమ, పరిణయం  చాంద్‌బార్దాయ్ వ్రాసిన ' పృథ్వీరాజ రాసో  ' సాక్షిగా జగద్వితం. మహమ్మదీయుల దండయాత్రను సమర్థవంతంగా తిప్పిగొట్టి తుదకు మళ్ళీ అదే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన పృథ్వీరాజ్ ధీరోద్ధాత్తత గురుంచి రకరకాల గాథ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కీచక సంతతి

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 20-12-12 19:37:00

''యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా' అని మనుస్మృతి చెబుతోంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నర్తిస్తారని దీని భావం. మన దేశం గురించి మన సంస్కృతి గురించి గొప్పగా ఎన్ని బాకాలు ఊదినా దేశ రాజధానిలోనే ఒక స్త్రీ మానప్రాణాలకు రక్షణ లేనప్పుడు అదంతా అపహాస్యం కాకమానదు.ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఉదంతాన్ని తలచుకుంటేనే నెత్తురు మరిగి మనస్సు విచలితమవుతోంది. మృగత్వం మూర్తీభవించిన ఆరు మంది మగాళ్ళు పశువాంఛతో ఒక అమ్మాయిని దారుణంగా మానభంగం చేసి ఆమెను, ఆమె స్నేహితున్ని ఇనుపరాడ్‌తో తీవ్రంగా గాయ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా మొదటి పద్యం

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 04-11-12 06:43:00

'ఇది నా మొదటి పద్యం. అమ్మవారిని స్తుతిస్తూ వ్రాశాను. పద్య నిర్మాణంలో సందేహ నివృత్తి చేసిన శంకరాభరణం బ్లాగు నిర్వాహకులు, గురుతుల్యులు శ్రీ కంది శంకరయ్య గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది సీస పద్యం. తేటగీతితో పద్యాన్ని పూర్తిచేశాను. రెఫరెన్స్ కోసం వాటి వాటి లక్షణాలు క్రింద పొందుపరచాను. సీసము - లక్షణాలునాలుగు పెద్ద పాదాలు . ప్రతి పాదానికి 6 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు. 4+ 4 గణాలుగా పాదం వ్రాస్తే ప్రతి పాదంలోనూ మూడవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతికి బదులు ప్రాసయతిని వాడవచ్చు. అ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సుందర దృశ్యరూపం శిరిడిసాయి

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 09-09-12 15:15:00

'నేను షిర్డీ సాయిబాబా భక్తున్ని కాను. దృశ్యరూపంగా సినిమాలలో గానీ సీరియల్స్‌లో గానీ ఆయన మహత్యాలు చూసిన సంఘటనలు గానీ, కర్ణాకర్ణిగా ఆయన చరిత్ర విన్న దాఖలాలు గానీ లేవు . అలాగని ఆయన పట్ల ఎటువంటి వ్యతిరేకత కూడా లేదు. మా ఆవిడ మాత్రం సాయిబాబా భక్తురాలు. గురువారాలు ఉపవాసాలు ఉండటం, సాయి సచ్చరిత చదవడం లాంటివి  క్రమం తప్పకుండా చేస్తూంటుంది. పూర్తిగా ఆమెకోసమే కాకపోయినా, ఇటువంటి సినిమాల పట్ల నాలో మాములుగా ఉన్న ఆసక్తి, నాగార్జున ఎలా చేశాడోనన్న ఉత్సుకత ఏమూలనో ఉండటం చేత మొదటిరోజే సినిమాకు (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కురుపాండవుల తదుపరి జన్మలు -1

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 18-08-12 10:55:00

'కురుపాండవులకు తదుపరి జన్మలున్నాయా? భవిష్య పురాణం ఉందనే చెబుతోంది.కురుక్షేత్ర సంగ్రామం చివరి దశకు చేరుకొంది. అటు పాండవ శిబిరంలోనూ ఇటు కౌరవ శిబిరంలోనూ యోధాగ్రేసరులందరో అశువులు బాశారు. కౌరవులు పరాజితులై పాండవులు విజేతలయ్యారు. యుద్ధం చివరి రోజైన పద్దెనిమిదవ రోజు సాయంత్రం, జరిగిన నష్టాన్ని తలచుకొని శ్రీకృష్ణుడు కాలస్వరూపుడైన  పరమేశ్వరున్ని స్తుతించాడు. పాండవులకు రక్షణగా ఉండమని ప్రార్థించాడు. నమ:శాంతాయ రుద్రాయ భూతేశాయ కపర్దినేకాలకర్త్రే జగద్భర్త్రే పాపహర్త్రే నమోనమ:పాండవాన్రక్ష భవన్మ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నన్నయ Vs పాల్కురికి సోమనాథుడు

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 08-08-12 23:41:00

'కచరా పుణ్యమా అని తెలుగులో ఆదికవి నన్నయా లేక పాలకురికి సోమనాథుడా అనే వివాదం బయలుదేరింది కాబట్టి ఎవరు ఎలాంటివారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నన్నయనన్నయ పదకొండవ శతాబ్దానికి చెందిన కవి.ఆయనకు ముందు ఆంధ్ర సాహిత్యం అధ్వాన్న స్థితిలో ఉండేది. సంస్కృత భాషలో రచింపబడిన వేదవేదాంగాలు, పురాణాలు, కావ్యాలు సామాన్య ప్రజానీకానికి సులభంగా బోధపడేవి కావు. ఈ విషయాన్ని గ్రహించిన జినుడు, గౌతమ బుద్ధుడు తమ బోధనలు జనబాహుళ్యానికి అర్థమయ్యే రీతిలో వ్యవహారిక భాషల్లోనే బోధించి విజయం సాధించారు. ఆరవ శతాబ్దం చివర్ల(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సమాజ జీవచ్ఛవం

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 15-06-12 20:31:00

' ఉప ఎన్నికల ఫలితాలు చుశాక నాకు గాయం  సినిమాలోంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వ్రాసిన ఈ క్రింది పాట గుర్తొచ్చింది . ఈ క్రింది వార్తలు చూశారా? నాకైతే మూడింటికీ పెద్ద తేడా కనబడలేదు.ఒకరు దేశాన్ని కుదిపేసిన 2జి కుంభకోణానికి ప్రధానసూత్రధారి.  ఇంకొకరు మతం ముసుగులో ఆశ్లీల కార్యకలాపాలకు అవకతవకలు పాల్పడ్డ స్వామీజీ.  మరొకరు తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని రాష్ట్రాన్ని నిలువునా దోచేసి అనతి కాలంలోనే వేలకోట్లకు పడగలెత్తి, మృతదేహం రాకముందే ముఖ్యమంత్రై పోదామని కలలు (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

శ్రీవాణీ వీణాజనితం

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 26-05-12 22:58:00

'నాకు బాగా నచ్చిన సంగీత దర్శకులలో ఎం.ఎస్.విశ్వనాథన్ ఒకరు. కే.బాలచందర్ ఎం.ఎస్.విశ్వనాథన్ కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. అంతులేని కథ ,ఇది కథ కాదు ,గుప్పెడు మనసు, మరోచరిత్ర, ఆకలిరాజ్యం, కోకిలమ్మ మచ్చుకు కొన్ని. వీటిలో కోకిలమ్మ సినిమాలోని ఒక మంచి పాట గురుంచే ఈ టపా (మొదట పాట వినాలనుకున్న వాళ్ళు చివరి వాక్యానికి వెళ్తే లింకు దొరుకుతుంది).1983లో విడుదలైన కోకిలమ్మ లో సరిత ప్రధాన పాత్ర పోషించారు.  ఈ సినిమా సమాచారం కోసం, వీడియో కోసం చాలా వెదికాను కానీ ఎక్కడా దొరకలేదు(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పెట్రోలు రాజకీయాలు..కాదంటారా ?!

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 23-05-12 22:48:00

'జనం నెత్తిన మళ్ళీ పెట్రోబాంబు పడింది. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 7.50 రూపాయిలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నింగినంటిన నిత్యావసర వస్తువుల ధరలకు నిచ్చెన వెయ్యలేక కాళ్ళు విరగొట్టుకున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది పిడుగుపాటు. షరా మాములుగా సవరించిన ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా వినియోగదారులంతా పెట్రోల్ పంపుల ముందు బారులు తీరి బూతులు తిట్టుకుంటూ నానా అవస్థలు పడ్డారు.   రాజకీయాలను బాగా వంటబట్టించుకున్న చమురు కంపెనీలు(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అంటరాని వసంతం

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 17-03-12 18:53:00

'వసంతం అంటేనే కొత్త శోభ, కొత్త ఉత్సాహం. అది అందరిదీ. చిగురించే మొక్కలోని కోమలత్వాన్ని , విరబూసిన  పువ్వులలోని స్వచ్ఛతని,  మత్తెక్కిన కోయిల సుస్వరాలని  ఎవరు మాత్రం ఆస్వాదించాలనుకోరు ? వసంతం, విషాదం ప్రతి మనిషి జీవితంలో ఉన్నాయి. అందరి అనుభూతులు మాత్రం ఒకేలా  పరిగణింపబడటం లేదు. కులం పేరుతో మనుషుల్ని వెలివేసి వాళ్ళ సంస్కృతిని కించపరచి, హక్కుల్ని కబళించి, ఆనందాలని కాలరాస్తే అదే అంటరాని వసంతమవుతుంది. ఎల్లన్నది ఎన్నెలదిన్నె అనే కుగ్రామం. అత్త పర్యవేక్షణలో (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రాత్రి కురిసిన వర్షం

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 10-02-12 19:19:00

'  రాత్రంతా కురిసిన వర్షంతడి జ్ఞాపకాలను మిగిల్చివెళ్ళిందిచివికిపోయిన కన్నులచూరు నుండిచుక్కలుగా తరలిపోతున్న దుఃఖంకాలప్రవాహంలో జారి కరిగిపోతోంది విరహ ఝంఝ ఉధృతవడిలోశాఖలు తరిగిన శిథిల తరువునైశోకనిశీధిలో చిక్కి ఉన్నానువిచ్చుకుంటున్న వెల్గురేఖవై నన్నక్కున చేర్చుకొనిశుష్కించిన నా చైతన్యానికి స్వస్థత  చేకూర్చవూ   నీ తలపులతోనే తలారస్నానం చేసి ఆరుబయట కురులారబెట్టుకున్నానువిభాతకాంతుల దువ్వెనతో   తడిసిన కురుల కరిమబ్బులనితాపీగా దువ్వుకుంటున్న వియత్సుందరిని(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను గుర్తించని పాఠశాలలు

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 26-01-12 10:20:00

'రిపబ్లిక్ డే వచ్చేసింది.  గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక నార్మల్ హాలిడే. సరదాగా ఇంటిపట్టున గడుపుతూనో లేక ఏ సినిమాతోనో, షాపింగ్‌మాల్ లోనో కాలం వెల్లిబుచ్చేస్తారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన త్యాగధనులని  ఈ రోజు ఎంత మంది ఎంతసేపు స్మరిస్తున్నారు, జాతీయ సెలవు దినాలలోనైనా ఎంత మంది  వారి ఆదర్శాలను వల్లించుకుంటున్నారు, దేశ స్వాతంత్ర్యం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది, అన్న విషయాల (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా ఉప్మా ప్రహసనం !!

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 07-01-12 20:53:00

'' ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్ '  అని ముక్క తిమ్మన అన్నాడు గానీ నిజానికి ఏ ముద్దూ మురిపెం లేకపోయినా ఎటువంటి విద్యనైనా చాలా వీజీగా ఔపోసన పట్టేసే ధీరోదాత్తులు కార్యశూరులు మగవాళ్ళని నా ప్రగాఢ విశ్వాసం. అలాంటిది వంట విషయమైతే ఇక చెప్పక్కర్లేదు. మగపుంగవుల సామర్థ్యత ముందు ఆడవాళ్ళ నైపుణ్యం ఏ పాటిది? పైగా దానికి తిరుగులేని సాక్ష్యాధారాలు మనకి ఉండనే ఉన్నాయి. నలభీమపాకం అన్నారు గాని సీతా, ద్రౌపదీ పాకాలని ఎవరూ అనలేదు కదా? అసలంతవరకూ దేనికి? తెలుగు టి.వీ. ఛానాల్స్‌లో మధ్(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రసరమ్య కావ్యం శ్రీరామరాజ్యం

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 19-11-11 04:26:00

'రామాయణం భారతీయుల జీవాత్మ. శ్రీ రాముని పితృవాక్య పరిపాలన, సీతారాముల అన్యోన్యత , భరత లక్ష్మణ శతృఘ్నుల భాతృ భక్తి,  ఆంజనేయుని స్వామి భక్తి తరతరాలకీ చిరస్థాయిగా గుర్తుండిపోయేవి. ఎన్ని సార్లు చదివినా, పాడినా తనివితీరని గాథ అది. ఎల్కేజి ప్రేమలు, వెకిలి నవ్వులు, విపరీతమైన హింస, విశృంఖలత్వం తెలుగు సినిమా సామ్రాజ్యాన్నేలుతున్న ఈ రోజుల్లో, ఆ ఉధృతిలో పడి వో గట్టు చేరే ప్రయత్నం చెయ్యకుండా, ఏటికి ఎదురీది రామయణ నేపథ్యాన్ని, అందునా శోక ప్రధానమైన ఉత్తర రామాయణ ఘట్టాన్ని ఎన్నుకొని ఒక సినిమా నిర్(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

థ్రిల్లర్

రచయిత : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్      బ్లాగు : భావ నిక్షిప్త      టపా తేది : 01-11-11 02:38:00

' ప్రేమంటే ఏమిటి ? దాని లక్షణాలేమిటి ? దానిలో నిజాయితీ ఎంత ? ఏది ప్రేమ? ఏది ఆకర్షణ ? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దేనికి ప్రేమిస్తాడు ?కఠోరమైన మనః ప్రవృత్తికి ఆహ్లాదకరమైన ముసుగు తొడిగి, తమ ప్రత్యేకతలను సద్గుణాలను మాత్రమే బయటికి ప్రొజెక్ట్ చేస్తూ,  అవతల వ్యక్తిని ఇంప్రెస్ చెయ్యటానికి తాపత్రయపడటమే  ప్రేమా ? ప్రేమకు పరమావధి పెళ్ళేనా ? పెద్దల్ని ఎదిరించి ప్రేమవివాహాలు చేసుకొని పెళ్ళాలను పుట్టింటికి పంపటానికి భీష్మించే భర్తలది, మెట్టినింటి చిన్న చిన్న సంప్రదాయాలని పాటించటానికి(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పుట 1 , మొత్తం 1 1

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦