అద్భుత సేకరణ::శభాష్ శంకర్ నారాయణ్
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 29-08-10 10:00:00
(శ్యాం నారాయణ్ గారి చిత్ర సౌజన్యం ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం 22 08 2010)హాబీలలో అనేక రకాలు. కొందరు స్తాంపులు సేకరిస్తే, మరి కొందరు పాత పత్రికలు సేకరిస్తారు. మన శ్యాం నారాయణ్ గారు పాత పాటలు, సినిమాలు ఒక ఉద్యమం లాగ సేకరిస్తారు. ఆయనేమీ సాహితీ వేత్తా కాదు, ఆల్ ఇండియా రేడియోలో పనీ చెయ్యటంలేదు. ఒక సామాన్య వ్యాపార వేత్త. హైదరాబాదులో ఫొటో ఫ్రేముల వ్యాపారం. తన వ్యాపారపు పనులు చూసుకుంటూనే, ఓపికగా ఎన్నెన్నో పాటలు, చిత్రాలు, ఆడియో పుస్తకాలు, సినిమాలు సేకరించటం అంటే మాటలు కాదు. అలా సేకరి(...)
తెలుగులో కొత్త మాటలు :: తెలుగు భాషా దినోత్సవం
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 29-08-10 06:50:00
తెలుగు భాషాభివృధ్ధికి, గ్రాంధికంలోనే వ్రాయలన్న కొంతమంది పిడివాదుల వాదన, ఎంతగానో చేటు చేసింది. ఈ పండిత పిడివాదుల కోరల్లోంచి తెలుగు భాషను రక్షించే ప్రక్రియ శ్రీ గిడుగు రామ్మూర్తిగారు చేబడితే, తన అద్భుత శైలితో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకట చలం గారు చేసి చూపించారు.తన రచనా శైలి గురించి చలంగారు తన ఆత్మ కథలో ఈ విధంగా వ్రాసుకున్నారు: "నేను రచనలు సాగించేటప్పటికి నాకు తెలీకుండానే, నేను మాట్లాడే భాషలోనే వ్రాశాను. తక్కిన కథలని పుస్తకాల భాషలో వ్రాశాను. అసలు ఆనాడు భాషా ఉద్యమం అనేది ఒకటి ఉం(...)
మానసిక కాలుష్యం
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 26-08-10 02:13:00
మీరు తప్పించుకోలేరు, అవకాశమే లేదు తప్పించుకోవటానికి, కళ్ళు మూసుకున్నా, చెవుల్లో దూదులు పెట్టుకున్నా, ఏమి చేసినా తప్పించుకోలేరు ఈ కాలుష్యం నుండి. ఇది శబ్ద కాలుష్యం కాదు, రసాయన కాలుష్యం కాదు. అదే మానసిక కాలుష్యం. ఇదేదో ఫ్యాక్టరీలు కలిగిస్తున్నది కాదు. మరేవరో, ఇంకెవరో కలిగిస్తున్నది కాదు.సమాజాన్ని ఉత్తేజితులను చేసి, సమాజంలో ఉండే తప్పుడు భావాలను, అపనమ్మకాలను వమ్ముచేసి విద్యావంతులను ( ! ! ) చేయటానికి కంకణం కట్టుకుని, ప్రజా స్వామ్యానికి నాలుగో స్తంభంగా తమకు తామే పేరు పెట్టుకున్న, ఘనతవహ(...)
పౌరసత్వం
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 25-08-10 02:54:00
ఈరోజున పౌరసత్వం పేరిట మన చదరంగపు మేటి ఆటగాడు శ్రీ విశ్వనాథన్ ఆనంద్ కు జరిగిన అవమానం తలుచుకుంటేనే మనసు రగిలిపోతోంది.మనదేశంలో పుట్టని, ఒక ఫాసిస్టు దేశంలో పుట్టి పెరిగి, మనదేశాని చెందిన ఒక పైలట్టును వివాహమాడినంత మాత్రాన భారతదేశపు పౌరసత్వం వచ్చేసిందని నానా యాగీ చేసి, దేశ ప్రధాని పట్టం కట్టబెట్టటానికి ఇదే నాయకులు 2004 లో ఎంత తాపత్రయపడ్డారు. ఆ సమయంలో దేశభక్తి కల, భారతీయ రాష్ట్రపతి ఉండటంవల్లకదా మనకా ముప్పు తప్పింది.అదే నాయకమన్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈనాటి ప్రభుత్వం, విశ్వనాథన్ ఆనంద్ ప(...)
రేడియో అభిమానులకు శుభవార్త
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 24-08-10 14:28:00
అవును శుభవార్తే!రేడియో మనకు దైనందిన కార్యక్రమంలో ఒక భాగం. ఇప్పుడు కాదు లెండి. ఒకప్పుడు అంటే, ఒక ముఫ్ఫై ఏళ్ళపైమాట. పొద్దున్నే భక్తీ రంజనితో నిద్ర లేచిన రోజులు మళ్ళి వస్తే బాగుండును అనిపించక మానదు. రేడియోలో వార్తలువినని రోజున ఏదోగా అనిపించేది. రేడియోలో నాటికలు వచ్చే సమయం గుర్తు పెట్టుకుని, ఎక్కడున్నా సరే ఇంటికి పరుగుపరుగున వచ్చి, రేడియో ముందు కూచుని, ఆ నాటికను ఆ సాంతం విని ఎంతగానో ఆనందించిన రోజులు ఎంత గొప్పవి! అవ్వొక హాయి ఐన రోజులు. రేడియో తో ఒక చక్కటి సులువు ఉన్నది (టి.వికి ఈ సౌ(...)
పి బి శ్రీనివాస్ మొహమ్మద్ రాఫి జుగల్ బందీ
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 22-08-10 16:29:00
తెలుగు హిందీ సినిమాలలోని పాటలు, ఒకచోట హిట్ అయినవి మరోకచోటకు ప్రేక్షకులకు అందించటం లో మన సినిమా వారు అందే వేసిన చెయ్యి .అనేకానేక పాటలు తెలుగులోంచి హిందీలోకి అలాగే హిందీలోంచి తెలుగులోకి వచ్చి ప్రేక్షక శ్రోతలను అలరించాయి.
ఆ విధంగా వచ్చిన ఒక హిందీ పాట తెలుగు పాట సాహిత్యం ఏ కింద ఇస్తున్నాను. తెలుగులో మదన కామరాజు కథ సినిమాలోది, హిందీలో చౌద్వీ కా చాంద్ సినిమాలోది. తెలుగులో పాడిన గాయకుడు శ్రీ ప్రతివాద భయంకర శ్రీనివాస్ ( పి బి శ్రీనివాస్), హిందీలో పాడిన గాయకుడు శ్రీ మొహమ్మద్ రఫీ.
(...)
ఒక చక్కటి బ్లాగ్
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 20-08-10 04:01:00
మనకు తెలుగులో అనేకానేక బ్లాగులు కనపడుతూ ఉంటాయి. సామాన్యంగా బ్లాగులో ఎవరి అభిరుచినిబట్టి వారు వ్రాస్తూ ఉంటారు. అన్ని బ్లాగుల్లోనూ తప్పనిసరిగా ఉండేవి, ఆయా బ్లాగు యజమానుల గురించిన వివరాలు, ఈ మెయిలు వగైరా. కాని ఈరోజున ఒక తెలుగు పాట సాహిత్యం వెతుకుతూ ఉంటే ఒక మంచి తెలుగు బ్లాగు కనపడింది. ఎక్కడా ఏవిధమైన ఆర్భాటం, సొంత డబ్బా లేకుండా శ్రీ చింతలపాటి శ్రీధర్ గారు తెలుగులో ఉన్న అపురూపమైన పాటల సాహిత్యాన్ని అందిస్తున్నారు. మొత్తం మీద నాలుగైదు పాటలకి మాత్రమె అటువంటి సాహిత్యాన్ని అందించినా, నాకు (...)
పురాణాల నిధి
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 15-08-10 15:12:00
పురాణ ప్రవచనాల మీద ఆసక్తి అభిరుచి ఉన్నవారికి ఈ వెబ్ సైటు పెన్నిధి. పురాణ గాధలను శ్రీ చాగంటి కోటేశ్వర , మల్లాది చంద్రశేఖర శాస్త్రి , శ్రీ ఉషశ్రీ వంటి పురాణ ప్రవక్తలు చేసిన పురాణ ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ఈ కింది లింకు నొక్కి హాయిగా వినవచ్చు. పురాణాల నిధి
టాప్ ఆఫ్ ది వరల్డ్
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 15-08-10 06:31:00
మనకు అనుకున్నది జరిగినప్పుడు, మనం ఇష్టపడిన వారిని కలుసుకోబోయే ముందు ఇంకా ఇలా అనేక సంతోషకర సమయాలలో అనుభవించే ఆనందం చెప్పనలవి కాదు. అటువంటి ఆనందాన్ని ఒక పాటగా వ్రాసి పాడుకోగాలిగితే! అదేపని చేసారు కార్పెంటర్స్. వారి పేరు చూసి అదేదో చేక్కపని చేసి చూఇమ్చారని అనుకోకండి. "కార్పెంటర్స్" వారి ఇంటిపేరు. అన్నా చెల్లెళ్ళు అయిన రిచర్డ్ కార్పెంటర్, కారెన్ కార్పెంటర్ లు కలిసి "కార్పెంటర్స్" అన్న మ్యూజిక్ గ్రూప్ నెలకొల్పి అనేక పాటలు పాడారు. 1970 లలో పాశ్చాత్య సంగీతం అంటే పెద్దగా చప్పుడు హ(...)
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 14-08-10 18:31:00
అరవై మూడు సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్రం వచ్చిందట. అందుకనే ఈ రోజు పండుగ. వీధి వీధినా పోటీలుపడి జెండా ఎగరవేతలు, జెండా వందనాలు వగైరా వగైరా. ఉన్న స్వాతంత్రాన్ని అనుభవిస్తూ, ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగ పరిచే వాళ్ళను ఆపగలిగే ధైర్యం, శక్తి అందరికీ రావాలని కోరుతూ, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒకప్పుడు సినిమా అయిపోగానే జాతీయ పతాక ప్రదర్సన ఉండేది. ఆకాశవాణి కార్యక్రమాలు జాతీయ గీతాలాపనతో ఆపేవారు. ఈ చక్కటి ఆనవాయితీ దశాబ్దాల క్రితమే ఆపేయవలసి వచ్చింది. కారణం!!??ఇప్పుడు కొన్ని కొన్ని(...)
అబ్బ ఏమి హింస!
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 13-08-10 19:07:00
చాలా కాలం తరువాత అనుకోకుండా తేజా చానెల్ లో ఒక సినిమా వస్తుంటే ఆగి చూడటం మొదలు పెట్టాను. అదిసిద్ధం" సినిమా. కథనం బాగుంది అలా చూస్తూ ఉన్నాను. కాని ఉన్నట్టుంది, పంటి కిందికి ఇంగువ ముక్కలాగా ఆచానెల్ వాడు విరగబడి ప్రకటనలు దంచటం మొదలు పెట్టాడు. ఒక పావు గంట సినిమా మరొక పావుగంట ప్రకటనలు. ఆప్రకటనలు కూడా చాలా నేలబారువి. ఒక సినిమా చూద్దామని కూచుంటే,ఇంత హింస పెట్టాలా ప్రేక్షకుల్ని.అదేదో సంఘం వాళ్ళు అప్పుడప్పుడూ గొడవ చేస్తూ ఉంటారు, జంతువుల పట్ల హింస మానండి అని. ఆ సంఘంవాళ్ళుప్రేక్షకులని కనీసం జం(...)
ఇంటర్నెట్ రేడియో
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 12-08-10 01:19:00
రేడియో మనకు అందుబాటులో ఉన్న ఏకైక వినోద సాధనం. ఆ మాట ఒకప్పుడు. ప్రస్తుతం రేడియోని టి.వి పడగొట్టి రకరకాల వేషాలు వేస్తున్నది. రేడియో పేరిట వస్తున్నా లోకల్ చానెల్స్ అవే ఎఫ్ ఎం రేడియోలు కూడ తామర తంపరగా పుట్టి వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నాయి. డిస్క్ జాకీ పేరిట నా నా అల్లరి చేస్తూ ఊరికే వాగటమే కనిపిస్తుంది నాకు. "జనరేషన్ గ్యాప్" అయ్యి ఉండచ్చు. అదే నా పాయింటు . ఇవన్ని కూడ 40 ఏళ్ళ వయస్సు లోపలివారికే కాని, పాత తరం రేడియో తెలిసి అప్పట్లో ఎంతో ఆనందింఛి ప్రస్తుతం ఎభాయ్యోపడిలో పడిన నా లాంటి వా(...)
మరొక్క ప్రయత్నం - వాళ్ళని చూడండి!
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 05-08-10 17:40:00
ఈ రోజునే మిత్రులు రంజని గారు పంపిన లింకు సహాయంతో ఈ చక్కటి హిందీ బ్లాగు చూడగలిగాను. హిందీ మాత్రు భాషగలవారు, తమ భాషలో వచ్చే రేడియో కార్యక్రమాల గురించి ఒక ప్రత్యెక బ్లాగు ఎప్పుడో 2007 లోనే మొదలు పెట్టి కొన్ని వందల పోస్టులు వెశారు. ఎన్నెన్నో రికార్డింగులు, పరిచయాలు, పాత జ్ఞాపకాలు,ఇంకెన్నో. ఎంతో బాగుంది.పైగా ఈ బ్లాగు ఎవరో ఒక్కరే నిర్వహించటం లేదు! ఇరవై మందికి పైగా కలిసి ఈ చక్కటి బ్లాగు నిర్వహించి హిందీ రేడియో ప్రేమికులను అలరిస్తున్నారు.మనం మన తెలుగు రేడియో కార్య క్రమాల గురంచి, రేడియో (...)
విజ్ఞప్తికి స్పందన
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 05-08-10 02:19:00
నేను ఇటీవల రేడియో కళాకారుల గురించి చేసిన విజ్ఞప్తి బ్లాగు లోకం నుంచి స్పందన రాలేదు. ఒక్క రామూ గారు మాత్రమె (AP మీడియా కబుర్లు) స్పందించారు. ఆయన ఏకంగా నేను నా బ్లాగులో వ్రాసినది యధాతధంగా వారి బ్లాగులో ప్రచురించి నా విజ్ఞప్తికి మంచి ప్రాచుర్యం కలిగించారు. ఆయన బ్లాగులో ప్రస్తుతం బ్లాగర్లు కానివారి వద్దనుండి చక్కటి స్పందన వచ్చింది. ఆ స్పందనలను ఇక్కడ అందరికీ తెలియచెప్పటానికి ఇక్కడ పున:ప్రచురిస్తున్నాను.
AP మీడియా కబుర్లు బ్లాగులో స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు. సహాయ సహకారాలు అందించ(...)
రేడియో కళాకారులు - ఒక విజ్ఞప్తి
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 30-07-10 02:01:00
నాటక లేదా సినీ కళాకారులను చూస్తూ వింటూ వినోదాన్ని పొందుతాము. సినీ కళాకారులైతే వారి నటనకు జోడించి మరింత ఆకర్షణీయంగా చేయగలరు. రేడియో కళాకారులు, పూర్తి శబ్దం మీద మాత్రమె ఆధారపడుతూ అద్భుతమైన కార్యక్రమాలను తయారు చేసి (మనకు ఈ టి వి పూనకాలు రాకముందు) ఎంతో ఆరోగ్యకరమైన వినోదాన్ని దశాబ్దాల పాటు అందచేసారు. ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది కళాకారులు వారి వారి ప్రావిణ్యాన్ని పూర్తి పాటవంతోరంగరించి చక్కటి కార్యక్రమాలతో వినోద విజ్ఞానాలను సమపాళ్ళల్లో అందచేసారు. అటువంటి కళాకారులగురించి రాబొయ్యే(...)
అలనాటి అద్భుత గాయకుడు
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 29-07-10 00:18:00
అవ్వొక రోజులు, ఆ సంగీతం, ఆ సాహిత్యం, పాట పాడే పద్ధతిలో ఉన్న సొగసు. ఇప్పటి తరానికి సాలూరి రాజేశ్వర రావుగారి పేరు తెలిస్తే, ఆ తెలియటం సంగీత దర్సకునిగానే. ఆయన అద్భుతమైన గాయకుడని తక్కువమందికి తెలుసు. 1940 - 1950 లలో ఆయన పాడిన లలితా గీతాలు బహుళ ప్రాచుర్యం పొందినాయి. 1980 లలో ఆయన అమెరికా వెళ్ళినప్పుడు లైవ్ కంసర్టులో పాడిన కొన్ని పాటలు ఇంటర్నెట్ వెతుకులాటలో దొరికినాయి. దొరకటమే కాదు మనకు కావలిసిన పాటలను ఒక ప్లే లిస్టు చేస్కుని ప్లేయర్తో సహా మన బ్లాగులో ప్రచురించే ఆవకాశం టాలీ నేషన్.కాం వారు (...)
"చూసిందే మళ్ళి చూడు" సినిమా ట్రైలర్
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 24-07-10 03:14:00
మనకు తెలుగులో సినిమా ట్రైలర్లు తయారు చెయ్యటం వాటిని విడుదలకు ముందుగా ఇతర సినిమాలలో విశ్రాంతి సమయంలో చూపటం, తక్కువ. ఏవో అతి కొద్ది సినిమాలకు ట్రైలర్లు ఉన్నాయి. కానీ ఆంగ్ల సినిమాలకు దాదాపు ప్రతి సినిమాకు ట్రైలర్ ఉండి తీరుతుంది. అవి తయారు చెయ్యటం కూడ ఒక కళ, నైపుణ్యం ఉమ్తెకాని చెయ్యలేరు. కాని ఈ ట్రైలర్లు తయారు చేసేవారు చాలా భాగం అభూత కల్పనలతో దాంబికమైన మాటలతో తమ ట్రైలర్లను నింపేసి, ప్రేక్షకులను ఆ సినిమా తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి డాంబికాలను , అభూత కల్పనలను ఎద్దేవా చే(...)
పాటలో ఒక చక్కటి కథ
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 23-07-10 20:15:00
నా దగ్గర ఉండి ఇప్పటి వరకు వినని పాటలను వెతుకుతుంటే (అలా కొని CD/DVD లు దాచేస్తుంటాను) ఒక మంచి పాట నన్ను కట్టి పడేసింది. నాలుగు సార్లు విన్నాను ఇప్పటికి. ఈ పాట పేరు గిడ్డి అప్ గో (GIDDY UP GO). అమెరికా జానపద శైలిలో పాడిన పాట. ఈ పాటను పాడినది రెడ్ సోవైన్ అనే అమెరిక గాయకుడు. ఈ పాటను మీ కోసం ఇక్కడ అందిస్తున్నాను.ఈ పాట సాహిత్యం ఈ కింది విధంగా ఉన్నది.The highways that wind and wander over mountain and valleys deserts and plainsI guess I've drove about all of 'emCause for the past 25 ye(...)
మా మంచి మాష్టారు
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 22-07-10 03:00:00
మా మాష్టారు శ్రీ భగవాన్ దాస్ (ఎడమ పక్కన) ప్రకుఖ కార్టూనిస్టు శ్రీ బాబు తో** ** ** ** ** **మనం చదువుకునేప్పుడు అనేక మంది మాష్టార్లు మనకి చదువు చెప్పి ఉండవచ్చు. కాని వారిలో కొద్ది మందినే జీవితకాలం గుర్తు పెట్టుకుంటాము. సామాన్యంగా, ఆ చిన్న వయస్సులో మన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడిన గురువునే ఎక్కువ గుర్తుంచుకుంటాము.అది డిసెంబరు 15 వ తారీకు 1972 సంవత్సరం (అప్పుడే మూడు దశాబ్దాల పైన గడిచి పోయింది!!! నిన్నో మొన్నో జరిగినట్టు జ్ఞాపంకం వస్తున్నది) మా నాన్నగారు మధ్యాహ్నం ఆయన నిద్రలేవంగానే "తయా(...)
మా కిషోర్ కుమార్ అన్నయ్య
రచయిత
శివ'
బ్లాగు :సాహిత్య అభిమాని
టపా తేది: 21-07-10 00:36:00
మా చిన్నతనంలో మా మురళి అన్నయ్య అంటే మాకు ఒక హీరో. నా కంటే 15 - 20 ఏళ్ళు పెద్ద అనుకుంటాను. మా కజిన్. మేము విజయవాడలో ఉంటే వాళ్ళు పక్కనే ఉన్న గుడివాడలో ఉండే వాళ్ళు. మాకు, మా మురళి అన్నయ్య ఎప్పుడు వచ్చినా సందడే. మార్కెట్టులోకి కొత్తది ఏదివచ్చిన వాడి చేతిలో ఉండేది. అప్పట్లో క్రేజు ట్రాన్సిస్టర్ (భుజాన తగిలించుకునేది), లేకపోతె కెమెరా వంటివి మాకు మొదటిసారి చూపించింది ఈయనే. వాళ్ళింట్లో జరిగే శుభ కార్యాలకు దగ్గరుండి మమ్మల్ని తీసుకుని వెళ్ళేవాడు.అద్భుతంగా పాటలు పాడేవాడు. కాలేజీలో చదివే రోజుల(...)