వరలక్ష్మి వ్రతం
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 18-08-10 13:39:00
వరలక్ష్మి వ్రతం గురించి చాలా మందికి తెలుసును. క్రిందటేడాది బ్లాగు లోకంలోకి ప్రవేశించిన కొత్తలో ఒక టపా వ్రాశాను. క్రింద లింకిస్తున్నాను ఉపయోగిస్తుందేమో ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చిన టపాలో క్రింద రెండు లింకులిచ్చాను. అవి ఓపెన్ అవడం లేదు.వాటిని బ్రౌజరులో కాపీ పేస్ట్ చేస్తే వస్తున్నాయి. కొద్దిగా శ్రమతీసికోండి.వరలక్ష్మి వ్రతం.
మా పుణె బాలాజి
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 08-08-10 17:24:00
ఆకాశంలో నల్లనిమబ్బులు మధ్య మధ్యలోమినుకుమినుకుమనే బాలభాస్కరుని కిరణాలు,వచ్చిరాని ఎండ,అంతలోనే చిన్న చిన్న చిరుజల్లుల మద్య ఎత్తైన సొగసైన సయ్యాద్రి కొండలు,వాటి మీద పచ్చని తివాసి పరఛినట్లుగా చెట్లు, కొద్దిగా కిందకి చూస్తే వంపులు తిరుగుతూ కవ్వించే లోయ, అందులో చెరవులు, మరోపక్క జొన్నతోటలు,మొలలోతు నీళ్ళలో వరినార నాటుతూ వయ్యారిభామలు,, అబ్బ! ఎంత చక్కని దృశ్యమండీ! నిజంగా రెండుకళ్ళు చాలలేదు చూసేందుకు,
నా తిప్పలెవరితో చెప్పుకోనూ?
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 29-07-10 17:59:00
శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం సినిమాలో చూసాము. ఓ ఆవు, ప్రతీ రోజూ ఠంచనుగా, మందనుంచి తప్పించుకుని, స్వామికి పాలివ్వడానికి ఒకే టైముకి వెళ్ళేదని. మరీ అలాగని కాదు కానీ, ఈ మధ్యన మా శ్రీవారు, ప్రతీ రోజూ ప్రొద్దుటేస్నానం, పానం, బ్రేక్ ఫాస్టూ పూర్తిచేసికుని, ఇంట్లోంచి బయటకు వెళ్ళి, మళ్ళీ భోజనానికే, 12.30 కి వస్తున్నారు. మరీ అలాగని ఈయనేమీ, నాకు తెలియకుండా ఉద్యోగమేమీ వెలిగించడం లేదు, ఎప్పుడైనా మిస్టరీ
మాశ్రీవారూ- Sixth Sense
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 19-07-10 11:41:00
మామూలుగా నాకు ఊరికే బయటకు వెళ్ళి తిరగడం అంత ఇష్టమూ ఉండదు. పోనీ అలాగని అస్తమానూ, కొంపా గోడూ అంటూ ఇంట్లోనే కూర్చుని అదీ ఇదీ సవిరిస్తూ కూడా కూర్చోలేం కదా. ఆ ఇంటికి ఎంతచేస్తేనేం, ఎవరికైనా పడుతుందా,పాడా ? ఎవరికి కావలసినది వాళ్ళకి వండి పడేస్తే చాలు,ఇంటిది ఏమైతేనేం, ఏ గంగలో దూకుతేనేం.ఇలా అప్పుడప్పుడు అనుకుని, ఎప్పుడో పున్నానికీ, అమాసకీ ఏ కిందనున్నవాళ్ళింటికో వెళ్ళేదాన్ని.ఈయన కి పొద్దున్నే డబ్బా
అయోమయం, అధ్వాన్నం !!
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 08-07-10 14:02:00
మా అబ్బాయి , Seth Godin , ISB హైదరాబాదు లో ఏదో లెక్చరు ఇస్తున్నారంటే, అక్కడికి వెళ్ళాడు. కోడలూ,పిల్లలూ ఒక్కళ్ళూ ఉంటారని, మేము మా ఇంటికి వెళ్ళాము.మా మనవడు అగస్థ్య తొ బాగా కాలక్షేపం అయింది. నవ్య స్కూలుకి వెళ్ళిపోయింది. మా కోడలైతే ఇంటినుండే పనిచేసికుంది. ఆయన సంగతి తెలుసుగా, కాలు కొంచెం బాగుపడింది, ఇంక ఇంట్లో ఎక్కడుంటారూ? మళ్ళీ మిస్టరీ షాపింగు కోసం, షాపర్స్ స్టాప్ కి వెళ్ళి,అగస్థ్యకి ఓ చొక్కా
మా శ్రీవారూ-దీక్షావస్త్రాలూ
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 06-07-10 05:16:00
మాశ్రీవారి దీక్షావస్త్రాలనిగురించి ఓ టపా రాయాలనుకున్నా. పెళ్ళైన కొత్తలో, ఓ పైజమాలాటి పాంటేసికుని కూర్చునేవారు ఇంటా బయటా కూడా. ఎవరైనా మాఇంటికి వచ్చేరంటే,'ఎక్కడికైనా బయల్దేరుతున్నారా'అనేవారు.కొంతకాలానికిఆ పైజమా పాంటుల్లోంచి, బెల్ బాటం లోకి దిగారు.ఇంట్లో మాత్రం ఏవో పాత పాంట్లే వేసికుని కూర్చునేవారు. మొత్తానికి ఎలాగోలాగ లుంగీలు కొనిపించాను.మాపాగుతుంది కదా అని ఓ రెండుమూడు గళ్ళ లుంగీలు (శంఖు
పేద్ద గొప్పే !!
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 04-07-10 17:05:00
మా శ్రీవారు క్రితం ఆదివారంనుండీ మూతి ముడుచుక్కూర్చున్నారు కారణం తెలుసుగా!మోకాలు బెణికిందని,బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కాలక్షేపం.మొన్న శుక్రవారం సాయంత్రం, మర్నాటికి కొబ్బరికాయ తెద్దామని, నేనే బయటకి వెళ్ళాను. ఈ లోపులో 'ఈనాడు' నుండి ఫోనొచ్చిందిట, ఈయనేం చెప్పారో ఆ భగవంతుడికే తెలియాలి.ఓ అరగంట పోయిన తరువాత వచ్చేటప్పటికి, 'అమ్మయ్యా, ఇప్పుడొచ్చావు బావుంది, ఓ అరగంట ముందర వచ్చుంటే, నా ప్రాణం పీకేదానివీ,
మా వారికి పథ్యం భోజనం !!
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 03-07-10 10:47:00
ట్రింగు ట్రింగ్ ట్రింగ్... హలో, ఫోన్ తీసేసరికి సుమతి , హాయ్ ఎలా వున్నావు? అంటూ కబుర్లు చివరికి వచ్చేసరికి వంటల దగ్గరికి సంభాషణ. మీ ఇద్దరికేగా, ఎంతసేపులే నీ వంట... అలా అనకు, ఇద్దరికయినా అన్ని చేయాలికదా అన్నాను.సుమతి: ఇంతకీ ఏం చేసావు?నేను : కొబ్బరి అన్నం , మొలకెత్తినపెసల కూర, ఖడీ, నిన్నటి షీరా వుంది,చపాతీలునూ,...సుమతి: ఎలా చేసావు?...నేను: అనుకుంటూనేవున్నాను, నువ్వు అడుగుతావని,సుమతి:
मै भी कभी बहू थी !
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 29-06-10 15:35:00
 ఈ వేళ మా అత్తగారి తిథి పెట్టడానికి రాఘవేంద్ర మఠానికి వెళ్ళాము. ఆవిడ వరసకి నాకు అమ్మమ్మకూడా అవుతారు.ఆవిడ 2007 లో 95 ఏట పోయారు.ఇప్పటికి 3 సంవత్సరాలయింది. ఏమిటో ఈవేళంతా ఆవిడగురించే ఆలోచనలు.నా పెళ్ళై 38 ఏళ్ళయింది.అంటే నేను 35 సంవత్సరాలు కోడలుగా ఉన్నానన్నమాట!ఒక్కవిషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాల్ని, ఆవిడ నాచేతిలోనే ప్రశాంతంగా కన్నుమూశారు.ఆవిడ దగ్గరనుండి ఎన్నో నేర్చుకున్నాను, జీవితం
అనామిక (హారం)
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 27-06-10 03:39:00
పైనిచ్చినది ఈవాళ్టి(27/06/10) ఈనాడు వసుంధర లో నాబ్లాగ్గుగురించి వచ్చినది. జ్యోతి గారు ప్రొద్దుటే ఫోను చేసి చెప్పారు. ఏదో నాకు తెలిసిన వంటకం గురించి వ్రాయడం,అది నచ్చడం,పైగా దానిగురించి పత్రికలో పడడం అబ్బో, చాలా సంతోషంగా ఉంది.సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జ్యొతి మాకు ఫోను చేసి చెప్పడం,తనబ్లాగ్గులో వ్రాయడం--అన్నీ ఈ ఆదివారం ఓ స్పెషల్ గా చేశాయి !
అదన్నమాట సంగతి!!
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 24-06-10 13:40:00
ఏడాదినుండి బ్లాగ్గులు వ్రాస్తున్నాను. ఎంతండీ, మాశ్రీవారు ప్రారంభించిన పది పదిహేను రోజులకి మొదలెట్టాను.నాకేమైనా రిటైరుమెంటా,ఆయనలా రోజూ ఒక్కో బ్లాగ్గు పోస్ట్ చేయడానికీ, ఇల్లంతా తుడుచుకోవడం,తడిగుడ్డతో మళ్ళీ తుడవడం,వంటా వార్పూ,పూజా పునస్కారం ఎన్ని పనులు? ఆయన ఛాన్సు దొరికితే కంప్యూటరు ముందర సెటిల్ అయిపోవడం.ఇంక నాకెక్కడదీ ఛాన్సూ? ఏదో సంసారపక్షంగా ఉంటుందీ అని ఏవేవో వ్రాసేదాన్ని.జనసంచారం ఎక్కువ
ఉత్తి ఉడుకుమోత్తనం !!!
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 23-06-10 16:59:00
మాశ్రీవారికి అలవాటేగా, ఛాన్సు దొరికితే చాలు, నన్నూ,మా ప.గొ.జి వాళ్ళనీ ఎత్తిపొడవడం. నిన్నంతా ప్రయాణం బడలికతో కంప్యూటర్ దగ్గరకే వెళ్ళలేదు. ఈయన గారికి పాపం మూడు రోజుల కంప్యూటరు ఉపవాసం తరువాత, పూణే ఇంకా వచ్చేమో లేదో, కంప్యూటరు దగ్గరకూర్చుని, తన 'ఖున్నస్' అంతా వ్రాసేసికున్నారు, ఈ బ్లాగ్గులో అసలు ఒకటి చెప్పండి-పెళ్ళికి పూర్వం ఇంట్లో నాన్నగారు 'అమ్మాయీ' అని పిలవడం, చెల్లెళ్ళు,తమ్ముడు 'పెద్దక్కా
ముగ్గురు పిల్లలతో...
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 16-06-10 13:13:00
మా అబ్బాయీ,కోడలూ ముంబై ఏదో పనిమీద వెళ్ళవలసివచ్చేసరికి, నవ్య,అగస్థ్య లను నేను చూస్తానూ అన్నాను.ఏదో, మా శ్రీవారుకూడా సహాయం చేస్తారనే సదుద్దేశ్యంతో. ఏదో నా తిప్పలేవో నేనే పడిఉంటే గొడవుండేదేకాదు.పైగా, 'పిల్లల్ని ఈ వర్షంలో తిసికెళ్ళడం కష్టం. నేను,ఈవాళ్టికి బయటకు ఎక్కడా తిరగడానికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటానులే' అని ఓ ఎష్యూరెన్స్కూడా ఇచ్చేశారు. పోనీ మనిషికి మనిషుంటే తోడూ అనుకొని బాగానే ఉందీ
చుట్టరికాల revival--part 2
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 12-06-10 05:58:00
చుట్టరికాల రివైవల్ ప్రస్థానంలో హైదరాబాదు వెళ్ళాము. ట్రైనులో మా శ్రీవారు అలవాటు ప్రకారం ఓ కుర్రజంటతో పరిచయం చేసికున్నారు.ముందుగా వారి పాప( ఏణ్ణర్ధం వయస్సు) తో కబుర్లు మొదలెట్టారు. నాకు ఎప్పుడూ ఈయనతో గొడవే. ఊరికే అందరితోనూ పరిచయం చేసికుంటారూ, వాళ్ళకి నచ్చుతుందో లేదో అని అంటూంటాను. పూణే స్టేషన్ లో తెలుగు పుస్తకాలు కొన్నారు, కానీ చదువుకోడానికి మాత్రం తీయరు, అదేదో రేషను కొట్లో ఇచ్చినట్లుగా, ఒక్క
చుట్టరికాల revival
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 05-06-10 03:11:00
గత 40 ఏళ్ళలోనూ బాగా దగ్గర వారి వివాహాలకు గానీ, ఇంట్లో శుభ కార్యాలకి గానీ ఏవేవో కారణాల వల్ల వెళ్ళలేకపోయాము.మా శ్రీవారు రిటైరు అయినప్పటినుండీ ఓ కొత్త వ్యవహారం మొదలెట్టారు.చుట్టాలందరితోనూ సంబంధాలు పునరుధ్ధరించడం. వాళ్ళు దగ్గరవారైనా సరే, దూరంవారైనా సరే,వారింట్లో శుభకార్యానికి వెళ్ళడం. ఆయనతో పాటే మరి నేను కూడా వెళ్ళాలిగా! దానికి ఓ పేరుకూడా పెట్టుకున్నారు--' చుట్టరికోధ్ధరణ అభియాన్' అని!( Operation
మాశ్రీవారు-- Break Faaaast !!!
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 11-05-10 03:23:00
మా శ్రీవారు ఫాక్టరీలో ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళూ, పూనాలో ఉన్నంతకాలం షిఫ్టుల్లో వెళ్ళేవారు.అప్పటిదాకా క్యాంటీన్ లో భోజనం చేసే మనిషి, ఇంక నేను వచ్చేశానుకదా అని,నన్నే డబ్బా(మనవైపు క్యారీరు) చేసి ఇమ్మనేవారు.పోనీ ఎండలో ఇంటికి రావడం కష్టమౌతుందీ అని, ప్రొద్దుటే లేచి, ముందుగా బ్రేక్ఫాస్టూ, ఆ తరువాత నాలుగు గిన్నెల్లోకీ కూర,పచ్చడి,పులుసూ, అన్నం పెట్టి ఇచ్చేదాన్ని.కొన్నిరోజులు ఓ కుర్రాడిని పెట్టుకున్నాము,12.30
ఆవకాయ--The other side of the coin !
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 09-05-10 12:39:00
నేను ఈ మధ్య మా మనవడు చి.అగస్త్య తో చాలా బిజీ అయ్యాను.తనని చూడడానికి ఓ పిల్లని పెట్టారు, అయినా అదేం అదృష్టమో, ఆ పిల్ల నన్ను చూడగానే, బాబుని వదిలేసి, ఇంకేదో పని చూసుకోవడానికి వెళ్ళిపోతుంది! దానితో రోజులో సగం భాగం,నేనే చూడావలసివస్తోంది.పాపం వాడేమీ ఏడవడం అదీ లేదు కానీ, మెళుకువగా ఉన్నప్పుడు వాడితో కబుర్లు చెప్పకపోతే అరుస్తాడు! దీనికి సాయం ఊరగాయలు పెట్టడం ఒకటీ. ఈ హడావిడిలో పడి, మా శ్రీవారు
ఆదివారం వెరైటీ లంచ్ !!
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 11-04-10 15:00:00
కుటుంబం అందరం కలిసి భోజనం చేసి చాలా కాలం అయిందని, మా కోడలు ఈ వేళ మా అమ్మాయీ, అల్లుడూ, పిల్లల్నీ భోజనానికి పిలిచింది. ముందరే కండిషన్ ఏమిటంటే, రోజూ ఉండేవాటికి విభిన్నంగా ఉండాలని. మా శ్రీవారికి మొదట్లోనే గుండెలో రాయి పడింది. హొటళ్ళకెళ్ళినప్పుడు, ఏదో తింటూంటాము కదా, మళ్ళీ ఇంట్లో కూడా ఎందుకూ అని నస మొదలెట్టారు. అయినా మెజారిటీ అభిప్రాయానికి తల వంచవలసి వచ్చింది పాపం ! మెనూ ఏమిటంటే 1.జల్
దిన దిన గండం
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 25-02-10 08:38:00
నిన్న మద్ద్యాన్నం మా కోడలు కంప్యూటర్ మీద పని చేసికొంటూ సడన్ గా బయటకు వెళ్తూ, 'బాబుని చూసుకోండి, నేను స్కూలికి వెళ్ళి నవ్యని తీసుకొస్తాను,ఇప్పుడే మెయిల్ వచ్చింది'అని. వెళ్తూ వెళ్తూ, మా అమ్మాయికి కూడా ఫోన్ చేసింది.మా మనవడు ఆదిత్య కూడా ఆ స్కూల్లోనే ఉన్నాడు. స్కూలువాళ్ళు ఏం మెయిల్ చేశారంటే, ' పిల్లలందరినీ, పెద్ద స్కూలికి తీసికెళ్ళిపోతున్నాము,పేరెంట్స్ అందరూ వచ్చి, వాళ్ళవాళ్ళ పిల్లల్ని కలెక్ట్
నా అల్లికల ప్రస్థానం
రచయిత
భమిడిపాటి సూర్యలక్ష్మి'
బ్లాగు :ఇదీ సంగతి
టపా తేది: 14-01-10 06:00:00
బాల్కనీ లో నిలబడి, చక చకా చేతులు ముందుకూ, వెనక్కూ తిప్పుతూ స్వెట్టర్లు అల్లుతున్న ఉత్తర భారతీయ స్నేహితుల్ని చూసి, చీపురు పుల్లలతో,పురుకొస తో, అల్లిక విధానం పుస్తకాలతో మొదలయిన నా ' అల్లిక ప్రస్థానం' నిరాటంకంగా 15 సంవత్సరాలు బాగా నడిచింది. చిన్న చిన్న స్కార్ఫ్( చెవులకి కట్టుకునేవి) తో మొదలయి ఎన్నెన్నో స్వెట్టర్లూ, ఫ్రాకులూ, షర్టులూ, బ్లౌజులూ అన్నీ పూర్తి అయి ఓ పెద్ద షాల్ తో ఇంచుమించు