బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-జనతా జనార్ధన్ క్లాసులో…2
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 09-09-10 21:00:46
మొత్తానికి అన్ని తిప్పలూ పడి స్లీపరు కోచ్ లోకి చేరుతాము.ముందుగా మన సామాన్లు పెట్టుకోడానికని చూస్తే, సీట్లక్రిందెక్కడా చోటు కనిపించదు. ఆ ట్రైను మరెక్కడినుండో వస్తూంటె, అప్పటికే దాంట్లో ఎక్కేసినవాళ్ళు, వారి వారి సామాన్లన్నీ దొరికిన ప్రతీ చోటా సద్దేసికునుంటారు.అప్పుడు, మనకి ఎలాట్ చేసిన సీటుక్రింది సామాన్లెవరివీ అని అడిగినా ఒక్కడూ సమాధానం చెప్పడు.కొండొకచో, ఇంకో సీటు వాడుకూడా అక్కడే సర్దేసికుంటాడు.మనం మరీ అమాయకంగా ఉండకుండా,మన సీటు క్రింద పెట్టిన సామాన్లు తీయడం మొదలెట్టేసరికి, అప్పుడు(...)
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-జనతా జనార్ధన్ క్లాసులో ప్రయాణం
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 07-09-10 20:06:08
చెన్నై కి రాకా పోకా,ఏ.సి2,3 లలో చేసిన తరువాత, భాగ్యనగరానికి ప్రయాణం జనతా జనార్ధన్ క్లాసు స్లీపరు లో చేశాను.ఏ.సి దొరక్క కాదు.ఏదో మన ‘ఆంఆద్మీ’ లు ఎలా ఉన్నారో ఓసారి దగ్గరనుంచి చూద్దామని! ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళూ,వీటిల్లోనే ప్రయాణం చేశాము.ఏ.సీ లూ అవీ మనకొచ్చే జీతాల్లో అందుబాటులో ఉండేవి కావు!రిటైరు అయ్యేసరికి, పిల్లలు ఉద్యోగాల్లోకి వచ్చాక,ఈ ఏసీ లూ అవి అలవాటుచేసి ‘చెడగొట్టారు’ ! దాంతోటి ఏమయ్యిందేమిటంటే, ప్రయాణం చేయాలంటే, ఏ.సీ దొరక్కపోతే, అదేదో చాలా [...]
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏమిటో ఇలా అయిపోయింది పాపం !!
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 07-09-10 09:44:53
ఇక్కడ ఇచ్చిన లింకులో’సాక్షి’ దినపత్రిక వార్తలో బాక్స్ లో పెట్టిన, వార్త చదవండి-మన ఇదివరకటి హైటెక్ ముఖ్యమంత్రి శ్రీ నాయుడుగారు, పోలీసులతో తను ‘ఇదివరకు ముఖ్యమంత్రి గా చేశానూ’ అని చెప్పుకోవాలిసివచ్చింది పాపం! మరేమౌతుంది అస్తమానూ, పాదయాత్రలూ, ధర్నాలూ అంటూ తిరిగితే మరిలాగె ఉంటుంది! ఓ బ్యాడ్జీ పెట్టేసికుంటే సరి!
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఈ నెలలో రైళ్ళలో ప్రయాణాలు–2
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 06-09-10 20:47:02
క్రిందటి టపాలో ఏ.సి 2 లో నేను చూసినవాటిగురించి వ్రాశాను. చెన్నై నుండి పూణె తిరుగు ప్రయాణం ఏ.సి.3 లో చేశాను. మరీ ఎక్కువ ఖరీదు కాదు కాబట్టి, చాలామంది దీంట్లో ప్రయాణం చేయడానికి చాలామంది ఉత్సాహం చూపుతారు.అందుకనే ఎప్పుడు చూసినా waiting list కొల్లేటి చేంతాడంత ఉంటుంది!దానితో, పాపం చాలామంది తత్కాల్ లో చేసేసికుంటూంటారు. ఇదో దోపిడీ! లాలూ ప్రసాద్, తన దారిన తను తింటూ, ప్రభుత్వానికి కూడా అదనపు రాబడి ఏర్పాటు చేశాడు! [...]
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైం పాస్
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 05-09-10 21:29:42
ఇంటినిండా ఉపాధ్యాయులతోనే జీవించడం ధర్మమా అని, వారంటే ఓ భక్తీ, ఆరాధనా ఉన్నాయి నాకు.చెప్పానుగా, మా ఇంటావిడ కూడా ఒకానొకప్పుడు, ఈ ఉద్యోగమే చేసింది, దానికి సాయం వీలున్నప్పుడల్లా, క్లాసులు తీసికుంటూంటుంది, ‘అలా మాట్లాడేరెందుకూ, ఇలా అంటే బాగుండును కదా, మరీ అంతలా మాట్లాడితే అవతలివాళ్ళేమనుకుంటారూ…’ వగైరా వగైరా… మన టి.వీ.. చానెల్స్ వాళ్ళు, ప్రతీ సంవత్సరం, ‘ఉపాధ్యాయ దినం’ సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చూపించేవారు. పోన్లే ఈవేళకూడా చూడొచ్చూ అనుకుని, టి.వీ. [...]
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఒకే నెలలో అన్ని క్లాసుల్లోనూ ప్రయాణం
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 03-09-10 20:58:29
ఆగస్టు నెలలో నాకు మన భారతీయ రైల్వే లో ఉన్న ఏ.సి 2, ఏ.సి.3 మరియు సాధారణ స్లీపరులో ప్రయాణం చేసే అదృష్టం కలిగింది.ఆ ప్రయాణాలమీద, నా అభిప్రాయం, అనుభవాలూ మీతో పంచుకుందామని ఈ టపా.. చెన్నై వెళ్ళేటప్పుడు, చెన్నై ఎక్స్ ప్రెస్ లో అర్ధరాత్రి 12 దాటిన తరువాత, పూణె లో ఎక్కాను.నా Landmark Quiz టపా లో, మొదటగా నేను ఏ.సి 2 లో పడ్డ బాధలు మీతో పంచుకున్నాను.నా హక్కున్న [...]
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– భాగ్యనగరం లో… 2
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 02-09-10 21:08:33
ఈసారి భాగ్యనగరంలో మూడు రోజులు గడిపే భాగ్యం కలిగింది. మొదటిరోజు శుక్రవారం, నా టపాలనభిమానించే ఒక అమెరికా తెలుగాయన, అబ్బులు ఎప్పుడో ఓ మెయిల్ పంపించారు- నన్ను కలుసుకుందామనుకుంటున్నానని.సరే బాగుందీ, నా బ్లాగులతోనే ఎలాగూ విసిగెత్తిస్తున్నాను, స్వయంగా ఒకసారి కలిసికుంటే ఇంకొంచెం బోరు కొట్టొచ్చూ, మంచి అవకాశం అనుకున్నాను!నేను భాగ్యనగరం చెరేనని, చెప్దామని, అతనిచ్చిన నెంబరుకి ఫోను చేసి,’అబ్బులు ఉన్నారా’ అని అడగ్గానే, ఆవిడెవరో ‘ లేదండీ, ఇక్కడ అలాటిపేరున్నవారెవరూ లేరూ’ అని ఫోను పెట్టేయబోతుంటే,(...)
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-భాగ్యనగరంలో….
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 01-09-10 21:58:16
నాకు ఈ సారి భాగ్యనగరం వచ్చినప్పుడు తెలిసింది- కొంతమందికి భాషాభిమానం ఎలా ఉంటుందో! మేము ప్రారంభించిన టెండర్ లీవ్స్ గ్రంధాలయం కోసం, కాచిగూడా నవోదయా కి వెళ్ళాను.అక్కడ ఓ అరవై పుస్తకాలు, ఎంపిక చేసి, ఇంకా మిగిలినవి చూస్తున్నాను. ఇంతలో ఒకాయన వచ్చి,కొట్టాయనని కథావిమర్శ పైన ఏమైనా పుస్తకాలున్నాయా అని అడిగారు. అక్కడ ఎలాగూ నేను కూడా పుస్తకాలకే చూస్తున్నాను కదా అని, ఏదో పుస్తకం గురించి చెప్పాను, అది కాదూ అని ఇంకో పుస్తకం [...]
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–http://tenderleaves.com/
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 31-08-10 21:49:04
పూణె లోని తెలుగువారందరూ,ఏ గ్రంధాలయానికీ వెళ్ళఖ్ఖర్లేకుండా, హాయిగా మీ వద్దకే వచ్చే ఓ సదవకాశం.ఒక్కసారి అందులోని పుస్తకాల జాబితా చూశాక మమ్మల్ని సంప్రదించండి. Online Library
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పూణె లో తెలుగువారికి సదవకాశం.
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 31-08-10 21:34:25
నేను పూణె లో గత 47 సంవత్సరాలనుండీ ఉంటున్నాను.నాకు తెలుగు అంటె విపరీతమైన అభిమానం. వచ్చిన కొత్తలో అంటే 1963 లో అప్పుడప్పుడు తెలుగు వార, మాస పత్రికలొచ్చేవి.కొంతకాలం తరువాత, తెలుగు దిన పత్రికలు రెండో రోజుకి వచ్చేవి.రైల్వే స్టేషనులో ఒక్కొక్కప్పుడు, డిటెక్టివ్ నవలలు దొరికేవి.ఎప్పుడైనా మనప్రాంతానికి వెళ్ళినప్పుడు మాత్రమే, తెలుగు పుస్తకాలు( నవలలలాంటివి) కొనుక్కుని, వాటినే మళ్ళీమళ్ళీ చదుకోవలసివచ్చేది.ఆంధ్రా అసోసిఏషన్ కి వెళ్దామంటే, బాగా దూరం. అయినా అక్కడ తెలుగు గ్రంధాలయం ఉందో లేదో [...]
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– తెలుభాషా దినోత్సవం
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 30-08-10 20:59:06
ఆ మధ్యనెప్పుడో ఓ టపా వచ్చింది.ఈ నెల 29 న మాతృభాషోత్సవం సందర్భంగా, తెలుగుబాట కార్యక్రమం జరుపుతున్నారని.ఏదో మన భాషమీదుండే అభిమానం కొద్దీ, తెలుగుబాట కార్యక్రమంలో, నేనూ పాలుపంచుకుందామనే సదుద్దేశ్యంతో, భాగ్యనగరానికి వెళ్ళాను.వారిచ్చిన లింకులో నా పేరు నమోదుకూడా చేశాను.అందులో,వారు చెప్పిన ప్రకారం, కార్యక్రమంలో మార్పులూ, చేర్పులూ ఉంటే తెలియచేస్తామన్నారు. నా ఐ.డి.,సెల్ నెంబరూ ఇచ్చాను. శుక్రవారం 27 కే చేరుకుని, రామూ తో మూడుగంటలు గడిపాను( ఆ విషయాలన్నీ ఇంకో టపాలో)వాళ్ళ కార్యాలయంలో.శనివా(...)
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- భాషకొచ్చిన తిప్పలు !!
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 24-08-10 21:03:50
నేను ఈ మధ్య చెన్నై ట్రైనులో వెళ్ళానుగా, అప్పుడు పగటి ప్రయాణం అంతా ఆంధ్రదేశం చూస్తూ గడపగలిగాను.నాతో ప్రయాణం చేస్తున్న ఓ తమిళమాయన, ప్రతీ పెద్ద స్టేషనూ దేనికి ప్రసిధ్ధో చెప్తూ వచ్చారు( తినే వస్తువులు!). గుంతకల్లు లో ఉప్మా చాలా బాగుంటుందన్నారని, ప్లాట్ ఫారం మీదకొచ్చాను. దగ్గరలో విజయా డైరీ వారి కౌంటరు కనిపిస్తే, అక్కడికి వెళ్ళాను.చూస్తే ఏముందీ? పైన చూపించినది కనిపించింది!ముందుగా అనుకున్నాను- అహో మన తెలుగువారు ఎంత ధార్మికులో పేడ ని [...]
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–”ఇంకోతికొమ్మచ్చి”
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 23-08-10 20:46:27
శ్రీ వెంకటరమణగారితో, మూడు గంటలు గడిపి, వారిరువిరి ఆశీర్వచనాలూ తీసికొని, క్రిందకు వచ్చాము. రమణగారు చెప్పిన ప్రకారం, రెండో రోజు వచ్చి శ్రీ బాపూ గారిని కలవ్వొచ్చూ అని.ఒకవైపున చాలా నిరుత్సాహం చెందాము-అయ్యో బాపు గారిని చూడలేకపోతున్నామే అని.తిరుమల దాకా వెళ్ళి ఆ శ్రీవెంకటేశ్వరుని దర్శనం అవకపోతే మరెలాగుంటుందండీ? శ్రీ రమణగారి ని చూడకలిగాము, అయినా అదో feeling of emptiness , ఇద్దరినీ ఒకేరోజున కలిస్తే ఉండే సంతోషం, ఆనందం వేరు. క్రిందకొచ్చేసరికి, [...]
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–”Paid News”-PCI Report
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 22-08-10 21:46:42
www.outlookindia PCI report అందరికీ తెలుసు, మన మీడియా ఎన్నెన్ని ‘నిజాల్ని’ చెప్తుందో !!దానిమీద Outlook పత్రిక లో వచ్చిన ఇంటర్వ్యూ ఒకసారి అందరూ చదివితే బాగుంటుంది.
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 21-08-10 19:11:06
నిన్నటినుండి చానెల్స్ లో మొదలెట్టారు- వాడెవడి దగ్గరో డ్రగ్స్ పట్టుకున్నామనిన్నూ,తెలుగు హీరో తమ్ముళ్ళట, వాళ్ళని పట్టుకున్నామనిన్నూ. ఈ వేళైతే కొన్ని చానెల్స్ కొంతమంది రాజకీయనాయకుల వారసులూ, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న నటులూ,వాళ్ళ పేర్లు ప్రొద్దుటినుంచీ చూపిస్తున్నారు. మధ్యాన్నం, ఆ హీరోలు లైవ్ లో వచ్చి, మాకేం తెలియదు మొర్రో అంటున్నారు. ఎం.పీ. అయితే అసలు మాకొడుక్కి డ్రగ్ అంటేనే తెలియదు పొమ్మన్నాడు. ఒకవైపున ప్రభుత్వం ఆంధ్రదేశం లో రేషను షాపుల్లా,left ,right and centre మద్యం షాపులు [...]
బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ‘కోతికొమ్మచ్చి’-Live
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 18-08-10 20:29:45
చెన్నై వెళ్ళడానికి ముందురోజు నుండీ, పూణె నుంచే బాపూ గారి ఇంటి నెంబరు ప్రయత్నించగా, మొత్తానికి వారి అబ్బాయి దొరికారు. శ్రీ బాపూ రమణగార్లు హైదరాబాదు వెళ్ళారనిన్నూ, శుక్రవారానికి చెన్నై తిరిగి రావొచ్చనీ చెప్పారు. శుక్రవారం నాడు ప్రయత్నిస్తే, ఇంట్లో లేరనీ, మత్నాడు (శనివారం) ప్రొద్దుటే ప్రయత్నించమనీ చెప్పారు. మరీ ప్రొద్దుటే ఎందుకులే అనుకుని, 9.00 గంటలు దాటిన తరువాత శ్రీ రమణ గారికి ఫోను చేసి, ‘గురువుగారూ, నేను ఫలానా, నాకు జీవితంలో ఉన్న [...]
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- Landmark Quiz National Finals
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 17-08-10 21:29:43
మా అబ్బాయి హరీష్, తన ఇద్దరు partners తో ఫైనల్స్ కి క్వాలిఫై అయినప్పుడే నిశ్చయించుకున్నాను, నేను కూడా తనతో చెన్నై వెళ్దామని, ఎంతైనా పుత్రోత్సాహం కదా!కార్యక్రమంలో కొద్దిగా మార్పేమిటంటే, మా కోడలూ,ఇంటావిడా,మనవరాలు, మనవడూ కూడా వచ్చారు! వాళ్ళు flight లో వెళ్తూ నన్నుకూడా రమ్మన్నారు. తెలుసుగా, నాకు గాలిలో ఎగరడం కంటె, భూమిమీదే రెండు కాళ్ళూ ఉంచుకోడం ఎక్కువ ఇష్టం.అంతేకాదు,నాకు ఎత్తులంటే భయం మూలంగా, నామానాన్న నన్ను train లో రమ్మని, వాళ్ళు ముందర [...]
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Swine Flu, etc..etc..
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 10-08-10 20:43:21
మెము రాజమండ్రి లో ఉన్న ఏణ్ణర్ధం లోనూ, ఆంధ్రదేశానికి సంబంధించి మూడు ముఖ్యమైన సంఘటనలు- ఎలక్షన్లూ,వై.ఎస్ గారి మరణం, రామలింగరాజు అందరి నెత్తిమీదా శఠగోపం పెట్టడం- వీటికంటే, మాకు సంబంధించినంతవరకూ జరిగినదేమిటంటే Swine flu epidemic in Pune. మీరు రాజమండ్రీ లో ఉన్నారుకదా, పూణే లో Swine flu వస్తే మీకేమయిందీ అంటారు. అక్కడే వచ్చింది గొడవంతా. మేము వెళ్ళిన మొదట్లో అడిగినవాడికీ, అడగనివాడికీ, కనిపించి పరిచయం అయిన ప్రతీవాడికీ,చెప్పడం- నేను రిటైరు [...]
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ధరలు
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 05-08-10 21:26:36
ఎవడు ఎంత గొడవ పెట్టినా సరే ప్రభుత్వాలు, ధరలు పెంచుతూనే ఉంటారు. పెంచకపోతే, ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందీ, ఏవేవో ప్రాజెక్టులపేర్లూ, సంక్షేమపధకాల పేర్లూ చెప్పి, మన మంత్రులూ, రాజకీయనాయకులూ వాళ్ళ ఆదాయం పెంచుకోవద్దూ! పాపం వాళ్ళంతా ఎంత డబ్బుఖర్చుచేశారో ఎన్నికల్లో నెగ్గడానికి.అదంతా తిరిగి పూడ్చుకోవద్దా? ధర్నాలూ, బందులూ, పార్లమెంటులో అరవడాలూ, అవన్నీ మనందర్నీ ఊరుకోపెట్టడానికే. ఆ మధ్యన పెట్రోలు ధరలు పెంచారు, మననాయకులందరూ ‘హాత్తెరీ, అలా పెంచేస్తారా, ఆం ఆద్మీ ఏమౌతాడు?’అని ఓ రెండురోజులు (...)
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- రాకపోకలు
రచయిత
భమిడిపాటి ఫణిబాబు'
బ్లాగు :PHANI BABU -musings
టపా తేది: 04-08-10 21:40:02
ఇదివరకటి రోజుల్లో ఒకరితో ఒకరికి, సంబంధ భాంధవ్యాలు ఉండేవి. ఎవరింట్లోనైనా మంచికీ, చెడుకీ, ఎవరూ పిలవ్వలసిన అవసరం ఉండేది కాదు. ఎవరింటిలోనైనా కష్టం వచ్చిందని తెలిస్తే చాలు, కబురు పెట్టకపోయినా వచ్చేసి, వారి కష్టాల్లో పాలు పంచుకునేవారు. అలాగే ఏ శుభ కార్యమైనా సరే, బాధ్యతంతా తమమీద పెట్టుకుని, పని పూర్తిచేసేవారు.ప్రత్యేకంగా అడిగే అవసరం ఉండేది కాదు.పైగా,థాంక్స్ చెప్తే ‘ సర్లేవోయ్, మేమైనా పరాయివాళ్ళమా ఏమిటీ, నీ పిల్లోటీ,నాపిల్లోటీ నా ఏమిటీ’ అనేవారు.ఇప్పుడో సీనే పూర్తిగా మారిపోయింది. [...]