కల్మాడీ.....
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 28-08-10 16:09:00
........కామన్వెల్తూవేలకోట్ల రూపాయలతో ముడివడిన కామన్వెల్తు క్రీడల నిర్వహణ వ్యవహారం లో, ఆ కమిటీ చైర్మన్ కల్మాడీనే పాపాల భైరవుణ్ని చేస్తున్నారందరూ.కానీ, అసలు వాస్తవాలు వేరే వున్నాయట.కల్మాడీ చేతిలో కేవలం 670 కోట్లు మాత్రమే వున్నాయట.ఢిల్లీ ముఖ్యమంత్రిణి చేతిలో అక్షరాలా 16,560 కోట్లు పెట్టారట. జైపాల్ రెడ్డి చేతిలో మరిన్ని కోట్లు వున్నాయట.షీలా సర్కారు పూలు, పూల కుండీల పైనే రూ.135 కోట్లు వెచ్చిస్తోందట!కేంద్ర క్రీడల మంత్రి మనోహర్ సింగ్ గిల్ స్వయం గా--క్రీడా గ్రామాన్ని ముఖ్య క్రీడా ప్రాంగణం న(...)
భాగ్యమా--బంగారమా
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 23-08-10 15:51:00
స్పెన్సర్ రేట్లుఅప్పుడెప్పుడో, పోచారం వారి అల్లుడనుకుంటా ఆయన పనిచేసే ప్రభుత్వ శాఖకి--పిన్ కుషన్లూ, పేపర్ వెయిట్లూ లాంటివి కూడా బంగారం తో తయారైతే యెంత రేటు వుంటాయో అంత పెట్టి కొనేశాడట. దానిపై గొడవ జరిగితే, పోచారం "మా అల్లుడు బంగారం" అన్నట్టు గుర్తు.ఇక ఇప్పుడు--మన కామన్వెల్త్ కమిటీ, ఈఎస్ గ్రూప్ అనే ఓ బ్రిటిష్ కంపెనీనించి క్రీడా వేదికల వద్ద వాడకానికని కొన్ని వస్తువులు, అవి ప్లాటినం తో తయారయితే యెంత రేటు వుంటాయో, అంతరేటు కి కొనేసిందట! ఈ విషయం "గార్డియన్" పత్రిక ప్రచురించిందట.ఆ రేట్లు ఇల(...)
మావిస్టుల కంచుకోటలో మమత
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 12-08-10 18:33:00
బాగా యెడం ప్రక్కకి తిరిగిన తృణమూలాలుఈ పిచ్చక్కకి చిలకమర్తివారి గణపతి వాళ్లమ్మకి చేయించిన వైద్యం చేయిస్తేనే గానీ కుదరదనుకుంటా!2004లో రాశ్శేఖర్రెడి యెన్నుకున్న 'పులిమీద స్వారీ'నే తన విజయానికి బాటగా స్వీకరించినట్టుంది ఈవిడ.యేచూరీ! నారాయణా! మిష్టర్ & మిసెస్ కారత్! బర్ధన్!--వాట్ ఈజ్ యువర్ స్ట్రేటజీ?దిగ్విజయ్! మొయిలీ! ఆంటొనీ! వయలార్! షీలా! ప్రణబ్! మన్మోహన్! సోనియా! వాట్ ఈజ్ యువర్.......?
'మెమరీ' అనే ఙ్ఞాపక శక్తి
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 29-07-10 17:53:00
"గూ......'గుల్ల'యితే" ..........అవుతుందా? యేమో! ఈ ప్రపంచం లో యేదైనా జరగవచ్చు!ఓ పన్నెండేళ్ళ క్రితం, ప్రైవేట్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం అక్షరాలా మూడువేల రూపాయలు చెల్లించి, నెలకి ఐదో, యెనిమిదో వందలు వాడికి చదివించుకుంటూ, 256 కే బీ పీ ఎస్ మోడెం తో, (వర్షాలు వచ్చి చెన్నై ములిగి పోయింది కదండీ--ఇంకో వారం దాకా నెట్ కనెక్ట్ అవక పోవచ్చు--మా ఇంజనీర్లు పాపం ఆ వానలోనే ప్రయత్నిస్తున్నారు--లాంటి క్లారిఫికేషన్లతో) "కనెక్ట్" అన్న తరవాత ఓ పావు గంటకి--అయితే--అయ్యే కనెక్షన్లతో, నెట్ బ్రౌజింగ్--ఓ తప్పని(...)
ధూమ(రహిత)శకటాలు
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 28-07-10 15:53:00
లజ్జారహిత మంత్రిణి150 మంది మృతి చెందిన ఙ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ ప్రమాదం "సర్కారు అంటే గిట్టనివారు పన్నిన కుట్ర"ట.63 మంది అశువులుబాసిన వనాంచల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం వెనుక రైల్వేలని "బదనామ్ చెయ్యాలనుకుంటున్న వర్గాల ప్రమేయం వుందని" అనుమానం ట.ఢిల్లీ స్టేషన్ లో, రైలు వస్తూందనగా, ప్లాట్ ఫామ్ మార్చామని ప్రకటించి, అందరూ మెట్లెక్కుతుండగా, మళ్లీ అది తప్పు అనీ, ఇదివరకు అనౌన్స్ చేసిన ప్లాట్ ఫామ్ మీదకే వస్తుందనీ చెప్పడం తో, తొక్కిసలాటలో అనేక మంది గాయ పడ్డారు, ఇద్దరు మరణించారు. "తప్పంతా జనాలదే! బు(...)
ఐ ఆర్ సీ టీ సీ
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 18-07-10 18:44:00
ఇంకో బ్లాగర్ల విజయంమామూలు రిజర్వేషనులూ, తత్కాల్ రిజర్వేషనులూ వుదయం 8.00 గంటలకే ప్రారంభించడం తో, ట్రాఫిక్ యెక్కువై, ప్రయాణీకులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఆ శాఖ విజిలెన్సు తదితర అధికారులు (బహుశా ఐ ఆర్ సీ టీ సీ వాళ్ళతో చర్చించి) నిర్ధారణ చేసుకున్నారట.శుభవార్తేమిటంటే, తత్కాల్ రిజర్వేషనులని వుదయం 10.00 గంటలకి మాత్రమే ప్రారంభించి, మామూలు రిజర్వేషనులని 8.00 గంటలకే ప్రారంభిస్తారుట.ఇది నిశ్చయం గా మన బ్లాగర్ల విజయమే!కానీ అప్పుడే చంకలు గుద్దేసుకోకండి. ఇది పాక్షిక విజయం మాత్రమే. యెందుకంటే ఇందు(...)
నివాళులు
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 06-07-10 08:05:00
శ్రథ్థాంజలులుఓ నాయకుడో ప్రతినాయకుడో మరణిస్తే, నివాళులు అర్పించడం ఓ వెర్రి అయిపోయింది జనాలకి.రాశ్శేఖర్రెడ్డి పోయినప్పుడు, మంత్రులే ఇడుపులపాయకి వెళ్ళలేనంతగా జనాలు యెగబడ్డారంటే, యేమనుకోవాలి?ఆయన పోయి యేడాది అవుతున్నా, ప్రతిరోజూ యెక్కడో అక్కడ యెవరో ఒకళ్ళో, కొంతమందో నివాళులు అర్పిస్తూనే వున్నారు.మొన్న 'అజాద్' అనే మావోయిస్ట్ ఎంకౌంటర్ అయిపోతే, నివాళులు అర్పించడానికి యెగబడ్డ జనాలనీ, లైవ్ కవరేజ్ ఇచ్చిన టీవీ వాళ్ళనీ యేమనుకోవాలో!వీళ్ళ దృష్టిలో కాసిని గులాబీ రేకులో యేవో శవం మీదో, ఫోటో మీదో జల్లి(...)
అంకెలు
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 26-06-10 16:21:00
ఒకటి నించి పదిఒకటీ ఓ చెలియరెండూ రోకళ్ళుమూడూ ముచ్చెలకనాలుగూ నందన్నఐదూ బైదీలుఆరూ దారాలుయేడూ బేడీలుయెనిమిదీ యెనమందతొమ్మిదీ తోకుచ్చుపదీ పట్టెడ.ఇది బాల శిక్షల్లో వుందో లేదో తెలియదు. అమ్మమ్మలు పిల్లలకి అంకెలు నేర్పడానికి ఇలా చెప్పేవారు!ఇందులో కొన్ని పదాలకి నాకు ఇప్పటికీ అర్థం తెలియదు.పట్టెడ అనే ఆభరణం ఒకటి వుండేది అని తెలుసు. ఇప్పుడెవరూ వాటిని ధరించడం లేదు అనుకుంటా.అన్నట్టు, ఓ ముఫ్ఫై యేళ్ళ క్రితం, కడియాలూ, కంటెలూ, కాసుల పేర్లూ, పలకసర్లూ, చంద్రహారాలూ--ఇవన్నీ మోటు నగలు!సింపుల్ గా ఒంటిపేట చెయ(...)
బ్యూరాక్రసీ
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 11-05-10 17:10:00
యంత్రాంగమా, గాడిదాంగమా?మొన్న రాత్రి మళ్ళీ ఇండోనేషియా సముద్రం లో భూకంపం వచ్చింది--సునామీ బయలుదేరిందని వార్తలు వచ్చాయి.ఇదివరకు ఇలాంటి భూకంపమే సునామీ తో మన తీర పట్టణాల కొంప ముంచింది.ఇప్పుడు అందుకే అధికారులు ఉరుకులూ పరుగులూ పెట్టి, ఆఖరికి యేమీ లేదని ఊపిరి పీల్చుకున్నారు.దేవుడు రక్షించాడుకాబట్టి సరిపోయింది.....లేకపోతే.....?!2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ మన తీర ప్రాంతాల్ని వణికించడం తో, కేంద్ర ప్రభుత్వం 'సునామీ హెచ్చరిక కేంద్రాలు' స్థాపించాలని నిర్ణయించి, మన రాష్ట్రానికి ఆరు కేంద్రాలు మ(...)
బండారం......
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 25-04-10 16:09:00
.....బయట పడిందిలేదా, బయట పెడతాను అని బెదిరిస్తారు--లలిత్ మోడీ లాంటి వాళ్ళు.అసలు యెక్కడిదీ 'బండారం'?'భాండాగారము'--అంటే, కుండలు నిక్షిప్తం చేసే చోటు.అప్పట్లో లోహపాత్రలు లేవుకాబట్టి, కుండలలోనే నిలువ చేసేవారు సమస్త సంపదల్నీ--బంగారం వెండీ కావచ్చు, నెయ్యీ నూనీ కావచ్చు, పప్పులూ వుప్పులూ కావచ్చు, పుస్తకాలు కావచ్చు--యేమైనా. ఆ చోటునే ఫలనా 'భాండాగారం' అనేవారు.అవసరాన్ని బట్టి, అవి నేలమాళిగల్లో కూడా వుండేవి. శత్రువుల నించి ప్రమాదం వుంటే, అవి రహస్య స్థావరాల్లో కూడా వుండేవి. అక్కడకి వెళ్ళడానికి పట(...)
'మద్యం' దిన మార్తాండులు
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 12-04-10 16:14:00
మద్యో రక్షతి రక్షితఃకాంగీరేసులు పుట్టినప్పటి నుంచీ మేనిఫెస్టోలో, "దశలవారీ మద్య నిషేధానికి కట్టుబడి వున్నాం" అని వాగ్దానిస్తారు.చంద్రబాబు టైములో ఏ పీ బెవరేజస్ కార్పొరేషన్ అని ఓ ప్రత్యేక కార్పొరేషన్ మద్యం సరఫరాని నియంత్రించేది.రెడ్డిగారు వచ్చాక, దానికి గవర్నమెంటు డిపార్ట్ మెంటునే యేర్పాటు చేసి, డిస్టిలరీ డెవలప్ మెంట్ బోర్డ్ అని పేరు పెట్టి, అభివృధ్ధిని చూపించమన్నారు!2004 లో మన రెడ్డిరాజుగారు పీఠమెక్కాక, దాదాపు 2006 వరకూ బెల్టు షాపులు వందల్లో వుండేవి. పైగా, మద్యం సీసాలని వాటిపై ముద్రిం(...)
సమాధులూ.....
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 01-04-10 16:13:00
"ఇదోరకం వేలం....."కుక్క మనిషిని కరిస్తే, అది వార్త కాదు. అదే మనిషి కుక్కని కరిస్తే, అది వార్త!--ఇది శతాబ్దాలుగా వాడుకలో వున్న మాట.ఈ మధ్య టి.నరసాపురం మండలం యేపుగుంట గ్రామం లో ఓ కోటిలింగం అనే ఆయనకి చెందిన కోడి పెట్ట 'కొక్కొరోకో!' అని కూస్తోందట. ఇదో వార్తే కదా.ఆ మధ్య యేలూరులో అదేదో కట్టడానికి తవ్వుతుంటే, కొన్ని సమాధులు బయట పడ్డాయట. అవి మునుపు అక్కడ పనిచేసిన బ్రిటిష్ వాళ్ళవని నిర్ధారించారట. కొన్నాళ్ళకి పురావస్తుశాఖవారు వాటిని స్వాధీనం చేసుకున్నారట. మొన్న వాటిని 'చారిత్రక ప్రాధాన్యం ' వు(...)
కరెంటు కష్టాలు
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 14-03-10 17:43:00
కోతలు--పరిష్కారాలుప్రతీ సంవత్సరం (సుబ్బారాయుడు మంత్రిగా వున్నా, మరో డబ్బా రాయుడు మంత్రి అయినా) తప్పని తద్దినాలే--ఈ కరెంటు కోతలు.అయినా ప్రతీ యేడూ కొత్త కొత్తగా, మన ఉగాదిలా అలరిస్తూ వుంటాయి మన ప్రజలని.ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన టైములో, పగలూ రాత్రీ అనక కరెంటు తీసేస్తారు--ప్రతీ యేడూ!మళ్ళీ ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలూ, రాస్తా రోకోలూ, సిబ్బందిని వాళ్ళ కార్యాలయాల్లో బంధించి తాళం వెయ్యడాలూ, కొంతమందిని నడ్డి విరగదన్నడాలూ, మామూలుగా జరిగితే, అప్పుడు రాత్రి పూట కోతలు వుండవు! ఓ క్రమ(...)
రచయితలు
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 09-03-10 14:39:00
సినిమా పాటలు'ఆహా! యేం వ్రాశాడండీ.....ఫలానా ఆయన!' అంటారు సినిమాపాటలో సాహిత్యం నచ్చితే.'ఉరుముకు జడిసే నెచ్చెలి, అడుగక ఇచ్చెను కౌగిలీ' అన్నా, 'క్షణం ఆగనంటూంది వోణీ' అన్నా--ఇదే మాట.మరి సినిమా పాటలు ఆడ కవయిత్రులు యెందుకు వ్రాయరో?('ఆడ' అని ప్రత్యేకం గా అంటున్నానని కోప్పడకండి. ఇప్పుడున్నారో లేదో గానీ, ఇదివరకు మగ రచయిత్రులూ, కవయిత్రులూ కూడా వుండేవారు.)సమాధానం 'చింపులూ'!--నిర్మాతా, దర్శకుడూ, సంగీత దర్శకుడూ వగైరాలతో పాటల 'డిస్కషన్' లో రాత్రి తెల్లవార్లూ కూచోవాలి--స్టార్ హోటళ్ళలో--అందుకని.ఆడ ర(...)
నిపుణులు
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 07-03-10 15:49:00
నైపుణ్యంమన సీ పీ ఐ నారాయణ అరెస్టయి వ్యానులో విసిరేస్తే నడ్డి విరక్కొట్టించుకోడం లోనే కాకుండా ఇంకో విషయం లో కూడా ఎక్స్ పర్ట్ అని నిరూపించుకున్నాడు!మొన్న హైదరాబాదులో 'అరటి ఆకు' అనే (ఇంగ్లీషు) పేరుతో ఒక రెష్టారెంటు ప్రారంభించి, కోడి, పీతలపులుసు ఆరగించారట. ఆయన కోడి తొడననుకుంటా కొరుకుతూ ఫోటో కూడా వేయించుకున్నారు పేపర్లో! "ఇంట్లో మామూలుగా చెట్నీతో రెండు ఇడ్లీ, సాంబారుతో నాలుగు ఇడ్లీ లాగిస్తాను. అదే కోడికూరతో, డజను ఇడ్లీ లాగిస్తాను!" అని వ్యాఖ్యానించారు కూడా!మనలో మనమాట--ఇడ్లీ పచ్చడిలోనో, స(...)
సినిమాలు
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 28-02-10 16:31:00
మన తెలుగులో లెజెండ్ లూ, స్టార్ లూ, హీరోలూ, దర్శకులూ, కమెడియన్లూ, టెక్నీషియన్లూ తమ తమ్ముళ్ళూ, కొడుకులూ, మనమలూ, మేన కోడుకులూ, అల్లుళ్ళూ మొదలైన వారిని అందరినీ హీరోలు చేసేస్తూ, వివిధ రాష్ట్రాలనించి హీరోయిన్లని దిగుమతి చేసుకొంటూ, వాళ్ళ అందాలని ఆరబోయిస్తూ, తెలుగు భాషని ఖూనీ చేస్తూ, చేయిస్తూ, భవిష్యత్తులో యెప్పుడో తియ్యవలసిన సినిమాలని ఇప్పుడే తీసేస్తూ, కోట్లు ఖర్చుపెట్టి, లాభాలు రాకపోయినా, టీవీ చానెళ్ళకీ, సీడీలుగానూ అమ్ముకొంటూ, చింతించకుండా హంగామా చేస్తుండగా, బాలీవుడ్ వాళ్ళు ఇంకా షారుఖ్, స(...)
వివాహ భోజనంబు
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 27-02-10 15:25:00
ఘటోత్క(రో)శయ్యముఖ్యమంత్రిగా రోశయ్య మొదటిసారి పశ్చిమ గోదావరి జిల్లాకి వస్తున్నారట--27-02-2010 న.ఆ సందర్భం గా, ఆరోజున ఆయన మధ్యాహ్న భోజనం కోసం క్రింది మెనూ ని సిధ్ధం చేశారట."అన్నంతో పాటు కొబ్బరి అన్నం, మరో యెనిమిది రకాల అన్నాలు, పులిహోర, చక్రపొంగలి, పెరుగావడ, గారె, గుత్తివంకాయ కూర, అరటికాయ కూర, బెండకాయ పులుసు, తోటకూర పెరుగు, బొబ్బట్లు, బిర్యానీ, కారప్పొడి, కరివేపాకు పొడి, శనగపొడి, నేతి ఆనపకాయ కూర, టమోటా...మునక్కాడ...జీడిపప్పు కూర, పెసరట్టు, మజ్జిగ చారు, పెరుగు, ఉలవచారు, సాంబారు, రసం, ద(...)
తెలుగు
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 25-02-10 14:20:00
జాతీయాలు'జీవగర్ర' 'పట్టుగొమ్మ' లాంటి పదాల్ని జాతీయాలు అంటారు--మన తెలుగుకే ప్రత్యేకమైనవి!ఇక మన టీవీవాళ్ళు విరివిగా వుపయోగిస్తున్న 'పెద్దపీట' వెయ్యడం, లాఠీలు 'ఝుళిపించడం' 'పని చెప్పడం' 'నొక్కి చెప్పడం' 'వుధ్ఘాటించడం' లాంటివి కూడా!మనలో మన మాట అది 'ఝుళిపించడం' కాదు--'ఝళిపించడం'! జడిపించారు, జడుసుకున్నారు లాంటి పదాలు వున్నాయి. జడిపించడం అంటే భయపెట్టడం--కొంచెం గ్రాంధికంగా 'ఝళిపించడం' అంటారు!వాచీలుఓ ముఫై యేళ్ళ క్రితం చేతి వాచీ ని ఓ ఆభరణం గా భావించేవారు. యెవరైనా కొత్తగా వాచీ పెట్టుకొంటే, '(...)
అదుగో పులి
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 02-02-10 18:32:00
వైష్ణవిగత మూడురోజులుగా టీవీ '24 గంటల న్యూస్ ' చానెళ్ళు బ్రతుకుతున్నది ఈ మాట పైనే!అది యెంతవరకూ వెళ్ళిందంటే, కాంగీరేసు, టీడీపీ, తెరాస, చిన్నా పెద్దా నాయకులూ, చిరంజీవీ, దత్తాత్రేయలే కాకుండా, తెలంగాణా జే యే సీ లో సంతాప తీర్మానం చేసీ, మీడియాలో దాని కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామి రెడ్డి 'వైష్ణవి, ఆమె తండ్రి మరణాలు మమ్మల్ని కలచివేశాయి ' అనేదాకా!ఇంకా కొంతమంది యెంతవరకూ వెళ్ళారంటే, రేపు తెలంగాణా ఇచ్చేస్తే, విజయవాడ ఆంధ్ర ముఖ్యపట్టణమైతే, శాంతిభద్రతలు ఇలావుంటాయి అని చెప్పడానికి ఇదో హెచ్చరిక--అనేదా(...)
యాయవారం
రచయిత
"Osaamaa....."'
బ్లాగు :"Osaamaa...."
టపా తేది: 01-02-10 15:17:00
శుభాకాంక్షలుమనకి స్వాతంత్ర్యదినం; రిపబ్లిక్ దినం; బాలల దినం; ఉపాధ్యాయుల దినం; అమరవీరుల దినం--ఇలా కొన్ని ఆల్రెడీ వున్నాయి. ఫారిన్ వాళ్ళ పుణ్యమాని, వేలంటైన్ దినం, ప్రేమికుల దినం లాంటివి దిగుమతి అయ్యాయి. ఐ. రా. స.--యువకుల దినం, యువతులదినం లాంటి మరిన్ని ప్రకటిస్తూ వుంటుంది. ఇక శుభాకాంక్షలు చెప్పుకోడానికి దాదాపు ప్రతి రోజూ యేదో ఒక దినం వుంటుంది. మన టీవీ వాళ్ళయితే, ఆ దినానికి ఓ మూడు రోజుల ముందూ, 4 రోజుల తరవాతా కూడా చెపుతూనే వుంటారాయె. ఇంకా యే దినం గుర్తుకి రాకపోతే, మరో మార్గం వుంది.(...)