ఆత్మహత్యా యోగాలు-జియాఖాన్ జాతకం
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 18-06-13 01:21:00
'ఒక బ్లాగ్మిత్రురాలు నిన్న మెయిల్ చేస్తూ ఇలా అడిగింది.'జియాఖాన్ జాతకం ఒకసారి చూస్తారా? ఆమె ఆత్మహత్య చేసుకోడానికి జ్యోతిష్యపరంగా కారణాలు ఏమున్నాయో కొంచం చూడగలరా?'గురువు రాశిమారిన తర్వాత ఇలాటివి జరుగడం,చాలామంది జీవితాలలో అనూహ్య మార్పులు రావడం ఊహించినదే గనుక ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.జ్యేష్టమాస జాతకంలో కూడా ఆడపిల్లలు ప్రేమలో పడి మోసపోయే కోణం ప్రస్తావించాను.కాని మిత్రురాలు అడిగిన తర్వాత ఒకసారి ఈ నటి జాతకం చూద్దామనిపించింది.సామాన్యంగా నేను చనిపోయినవారి జాతకాలను చూడను.అయితే(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సర్వతోభద్ర చక్రం - భవిష్య దర్శనం
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 17-06-13 02:07:00
'భవిష్యత్తులోకి తొంగిచూడటానికి భారతీయ జ్యోతిశ్శాస్త్రంలో అనేక పద్ధతులున్నాయి.అలాగే ప్రశ్న జ్యోతిష్యంలో కూడా అనేక విధానాలున్నాయి. ప్రాచీనులు దీనిలో ఎంత పరిశోధన చేశారో తలచుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.అసలు భవిష్యత్తును తెలుసుకోవడం అవసరమా?దానివల్ల ఉపయోగం ఏమిటి? అనే సందేహాలు వెలిబుచ్చే మనమే తెలివైనవారిమని విర్రవీగడం సరికాదు.ప్రాచీన జ్యోతిశ్శాస్త్ర ప్రవర్తకులు మహర్షులనీ,మన ఊహకందని తెలివి వారికుందనీ గ్రహిస్తే మన క్షుద్ర సందేహాలు పటాపంచ లౌతాయి.ఇప్పుడు మనకొస్తున్న సందేహాలను వారు అప్పుడే చర(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఏదో పరవశ వేదనలో...
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 16-06-13 02:02:00
'నీవెవరో నాకు తెలుసేమో !! నీవేమిటో నాకు తెలియదు;నేనేమిటో నీకు తెలుసుగాని నేనెవరో నాకే తెలియదు!! తనకోసం నిన్ను ఖాళీ చేసిన నీవు నీలోని తనకోసం నన్ను మరచిన నేను ఒక్కసారైనానన్ను చూడని నీవుఒక్కక్షణమైనానిన్ను వీడని నేనునిన్ను మరచి తనలో మునిగిన నీవు నన్ను విడిచినీలో తనను చూచిన నేను ఎప్పుడూ ఒకటి కాకున్నా ఎప్పుడూ ఒక్కరుగా ఉంటున్న ఎప్పటికీ ఒకటే అయిన ఇద్దరమేగా మనం?తనకోసం నీవున్నావునీకోసం నేనున్నానుతానే నీవైనప్ప(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చాలా రోజులైంది...
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 12-06-13 03:03:00
'చాలా రోజులైంది నిన్ను నేను మరచిపోయి నాలోనే మునిగిపోయి చాలా రోజులైంది.నీ ధ్యాసను విడచిపెట్టినన్ను నేను ప్రేమించిచాలా రోజులైందినాలోపల దాగిఉన్న నా తల్లిదండ్రులకు తర్పణాలు ఒదిలిపెట్టిచాలా రోజులైంది నన్ను నేను సంహరించి నగ్నత్వపు సీమ నిలిచి నవ్వుకుని నవ్వుకుని చాలా రోజులైంది నట్టేటను నిన్ను ముంచి నా దారిన నేను పోయి కొండకొమ్ము నుంచి దూకి చాలా రోజులైంది కాళ్ళనున్న మట్టి తుడిచికల్మషాల కడిగివేసికాళీ పదముల నంటిచాలారోజులైంద(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నరేంద్ర మోడీ జాతకం- 1
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 11-06-13 15:58:00
'నిన్న నరేంద్రమోడీ మీద ఉంచబడిన బాధ్యతను గమనిస్తే ఆయన జాతకం ఒకసారి చూద్దామనిపించింది.ఎందుకోగాని,చాలాసార్లు చాలా మంది ప్రముఖులవి అసలైన జాతక వివరాలు దొరకవు.ఒకవేళ దొరికినా అవి సరియైనవో కావో తెలియదు. కనుక తప్పు వివరాలతో జాతకాలు వెయ్యడం సరికాదు గనుకా ఒకవేళ వేసినా అవి ఎలాగూ సరిపోవు గనుకా ఆ ప్రయత్నం చెయ్యడం సాహసమే అవుతుంది.అయినా సరే కొంత ప్రయత్నం చేసి చూద్దాం.మోడీ జనన వివరాల కోసం వెదికితే మూడు రకాలైన సమాచారం దొరుకుతున్నది.జననతేదీ 17-9-1950;వాద్ నగర్;మెహసాన జిల్లా;గుజరాత్.ఇంతవరకూ (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
జ్యేష్ట శుక్ల పాడ్యమి-దేశజాతకం
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 10-06-13 00:40:00
'జ్యేష్ట శుక్ల పాడ్యమి కుండలి పరిశీలించి రాబోయే నెల దేశానికి ఎలా ఉంటుందో చూద్దాం.8-6-2013 న 22-25 గంటలకు గ్రహస్తితి ఇలా ఉన్నది.శనివారం మృగశిరా నక్షత్రం కుజ హోరలో జ్యేష్టమాసం మొదలైంది.దశమంలో శపితయోగం వల్ల పరిపాలన ఏమంత బాగుండదు.అధికారులకు చికాకులు తప్పవు.శుక్ర శనుల మధ్య కోణదృష్టి వల్ల సెక్స్ సంబంధమైన వివాదాలలో అధికారులు చిక్కుకుంటారు.దీనికి కారణం వారిమధ్యన గల పరస్పర విభేదాలే కారణం అవుతాయి.కుజ శనుల మధ్య ప్రతికూల దృష్టి వల్ల షేర్ మార్కెట్ కల్లోలాలకు లోనౌతుంది.మేధావులకు తెలివి మందగిస్తుంద(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
త్రిశంకు స్వర్గం
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 09-06-13 03:00:00
'ఎన్నో జన్మల ఆరాటంలోకనిపించిందొక స్వర్గం ఎన్నో ఏళ్ళ సంఘర్షణలో అందిందొక పుంజం ఎన్నో దారుల వెతుకులాటలో ఎదురైందొక గమ్యం ఎన్నో తరాల తపోఫలంగా ఎగసిందొక హర్మ్యం అందరికీ అందరాని ఈ స్వర్గం కొందరికైనా అందించే సంకల్పం వద్దని వారించారు సహచరులు వృధా ప్రయాసన్నారు ఖేచరులు ఒక ప్రయతం చేద్దామనుకున్నా ఒక వెలుగుల తెర తీద్దామనుకున్నాప్రాణజలపు కాంతి సరస్సుకునలుగురినైనా నడుపుదామనుకున్నా నా వంతు ప్రయత్నం చేస్తే నాతో వచ్చేవారికోసం చూస్తేక(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆఖరి మజిలీ
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 08-06-13 03:38:00
'కొండల్లో కోనల్లో తిరిగా ఎన్నాళ్ళో బాధలతో ఒంటరిగాఅడవుల్లో లోయల్లో వెతికా ఎన్నేళ్ళో వేదనలో మౌనంగానాకోసం నాలోపల నేనే వెతికా నీకోసం లోకపు దారుల్లో వెతికాఅంతులేని వ్యధార్త అన్వేషణలో ఏళ్లకు ఏళ్ళంటూ మౌనంగా గడిపాఎన్నో కన్నుల ఎడారుల్లో వెతికా నీ కన్నుల నదిజాడల కోసం ఎన్నో మోముల సంజెల్లో వెతికానా హృదయపు గుడినీడల కోసంగతస్మృతుల చీకటి సమాధుల్లో గడిచాయెన్నో నిరాశా నిశీధులు సుమధుర భావాల వెన్నెల వీధుల్లో మెరిశాయెన్నో వెలుగుల తెలిమబ్బులు ఎందరి(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
వడ్లమూడి వెంకటేశ్వరరావుగారితో సంభాషణ -2
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 06-06-13 14:45:00
'శ్రీచక్రము విశ్వానికి సూచిక అని అంటారు కదా.ఒకాయన ఇలా అడిగారు.'అదేంటండి. అందులో అన్నీ గజిబిజిగా త్రికోణాలే ఉన్నాయి.విశ్వం వర్తులాకారం కదా. మరి పొంతన ఎలా కుదురుతుంది?'ఒకరోజున రోడ్డుమీద పోతుండగా ఒక బండిదగ్గర పుచ్చకాయకు గాటుపెట్టి ఒక ముక్కను కోస్తున్నాడు అమ్ముకునే అబ్బాయి.ఆ ముక్క త్రికోణంలాగా బయటకు వచ్చింది.అడిగిన అతనికి చూపించాను. 'చూడు వర్తులం నుంచి త్రిభుజం వచ్చింది కదా.అలాగే అనేక త్రిభుజాలతో నిండియున్న వర్తులం విశ్వం.దానికి సూచిక శ్రీచక్రం' అని చెప్పాను.Sri Chakra is a re(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శ్రీ విద్యోపాసకులు వడ్లమూడి వెంకటేశ్వరరావుగారితో సంభాషణ - వనదుర్గా మహావిద్య
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 02-06-13 08:53:00
'నేను తమ్ముడూ అని ప్రేమగా పిలిచే వ్యక్తులలో సాయికిరణ్ ఒకరు. బ్లాగర్ కొండముది సాయికిరణ్ గురించి చాలామందికి చాలా కొద్దిగానే తెలుసు.అతనికి ఆవకాయ.కాం ఉన్నదనీ ఈ మధ్యనే 'అంతర్యానం' అని భావకవితల సంపుటిని ప్రచురించాడనీ,మంచి బ్లాగర్ అనీ కొంతమందికి తెలుసు.కాని అతనిలో దాగిఉన్న దేవీఉపాసకుడు చాలామందికి తెలియడు.అతను శ్రీవిద్యాదీక్షాపరుడనీ,ఉగ్రదేవతల రహస్య ఉపాసకుడనీ, అవసరం అయితే ప్రయోగం చెయ్యగల శక్తి ఉన్నవాడనీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.సాయికిరణ్ మామగారే వడ్లమూడి వెంకటేశ్వరరావుగారు.ఆయన గుంటూర(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సముద్ర ఘోష
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 31-05-13 10:43:00
'నింగీ నేలా కొండా కోనా చెట్టూ పిట్టా నదీ కడలీ నా నేస్తాలు.అవి నాతో మాట్లాడతాయి.తమ భావాలను నాతో చెప్పుకుంటాయి.మేం ఒకళ్ళ ఊసులను ఒకళ్ళతో చెప్పుకుంటాం.బాధలను కలబోసుకుంటాం.కలసి పయనం సాగిస్తాం.మా స్నేహం మచ్చలేనిది.మాయామర్మం ఎరుగనిది.కల్మషపు చేదును తెలియనిది.మొన్నొక రోజున ఏకాంతవాసంలో భాగంగా కడలి ఒడ్డున కొన్ని గంటలు మౌనంగా గడిపాను.తను నాతో ఎన్నో ఊసులు చెప్పింది.మనసు విప్పి మాట్లాడింది.తన వేదనను నాతో పంచుకుంది.ఆ భావాలు మీరూ వినండి.కెరటాల ఘోష విని బెదరు వారేగాని అవి జెప్పు భాషను (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
గురుగ్రహ రాశిమార్పు -- ఫలితాలు
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 29-05-13 09:59:00
'31-5-2013 న ఇప్పటివరకూ తానున్న వృషభరాశినుంచి మారి గురుగ్రహం మిధునరాశిలోకి ప్రవేశించ బోతున్నది. అక్కడ ఏడాది పాటు ఉంటుంది.ఆ సమయంలో మృగశిర ఆర్ద్ర పునర్వసు నక్షత్రాల మీద సంచరిస్తుంది. పన్నెండు రాశులవారికి ఈ గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.మేషరాశి:లోకంతో సంబంధాలు విస్తృతం అవుతాయి.సమాజంలో పరిధి పెరుగుతుంది. కమ్యూనికేషన్ ఎక్కువౌతుంది.ప్రయాణాలు ఉంటాయి.ధైర్యం పెరుగుతుంది. గేమ్స్ స్పోర్ట్స్ లో పాల్గొంటారు.రచయితలకు మంచి కాలం మొదలౌతుంది. కొత్త అవకాశాలు వస్తాయి.కొత్త రచనలు చేస్తారు.వృషభర(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
గుడ్డి గురువులు-పిచ్చి శిష్యులు
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 28-05-13 09:09:00
'లోకంలో అజ్ఞానం ఎంత దట్టంగా అలముకుని ఉందో అనడానికి మొన్న జరిగిన ఒక సంఘటనే ఉదాహరణ.'సాయిబాబా ప్రసాదం తీసుకోండి' అని ప్రసాదం ఇచ్చాడు ఒక మిత్రుడు.ప్రసాదాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నా.'సాయి మాస్టర్ గారని ఒకాయన వచ్చారు మీకు వీలైతే దర్శనం చేసుకోండి?' అన్నాడు.'పొద్దున్నే బుక్కై పోయాన్రా బాబూ' అని పరమ చిరాకేసింది నాకు.ఆ ఒక్కమాటలోనే విషయం మొత్తం అర్ధం అయింది.ఇతనికి కాస్త జ్ఞానోపదేశం చేద్దాం అనుకున్నా.'అంటే ఈయన సాయిబాబాకి మాస్టారా?ఏ సాయిబాబాకి? శిరిడీనా? పుట్టపర్తా? ఏ మాష్టారు? (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బుద్ధమతం అదృశ్యానికి కారణం
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 25-05-13 17:53:00
'ప్రతి సంవత్సరమూ నేను అతి పవిత్రమైన రోజులుగా పరిగణించే కొన్ని రోజులలో బుద్ధపూర్ణిమ ఒకటి. ఈరోజుకోసం నేను నిజానికి ఎదురు చూస్తాను.కారణం ఏమంటే,బుద్ధుని నేను ఎంతో ఆరాధిస్తాను అభిమానిస్తాను.బుద్ధునివంటి మహానుభావుడు కొన్నివేల సంవత్సరాలకు గాని జన్మించడం జరగదు అనేది సత్యం.బౌద్ధం మనదేశం నుంచి అదృశ్యం కావడానికి శంకరులు కారణం అని కొందరు దురుద్దేశ్య పూర్వకంగా బురద చల్లారు.అది పూర్తి నిజం కాదు.ఒక్క వ్యక్తివల్ల ఒకమతం నాశనం కావడం ఎన్నటికీ జరగదు.శంకరులు బౌద్ధులను వాదంలో జయించినంత మాత్రాన దేశం మొత్తం(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఒకరికొకరు దొందూ దొందే
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 24-05-13 17:34:00
''మంచివాళ్లకి మంచివాళ్ళే దొరుకుతారు. ఏలినవారికి నేను దొరికాను' - అందిట ఒకామె అనవసరంగా తనను తిడుతున్న భర్తతో.మన ప్రభుత్వాలను ప్రజలనూ చూస్తె నాకు పై సామెతే గుర్తుకొస్తుంది.అన్ని వనరులూ ఉన్న అన్నపూర్ణలాంటి దేశాన్ని ఎంత అధ్వాన్నంగా పరిపాలించవచ్చో, ఎన్ని రకాలుగా దాన్ని భ్రష్టు పట్టించవచ్చో నిరూపిస్తున్నారు నేటి పాలకులు.ఇక ప్రజలు మాత్రం తీసిపోయారా? పాలకులను మించిన దొంగల్లాగా వీళ్ళూ తయారయ్యారు.ఎవడికీ కామన్ సెన్స్ ఉండదు.కనీసం సివిక్ సెన్స్ కూడా ఉండదు.ఆరోజు పబ్బం ఆరోజుకి గడవటమే మన ప్రజల లక్ష్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
తిక్కస్వామి తరగతిలో....
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 23-05-13 03:44:00
'తనలో తానుండు వరకు తనకున్నతి రాబోదోయ్ తనను తాను దాటినపుడె తత్వమొంట బట్టేనోయ్ వేషధారులందరికి వెంబడించి చెబుతున్నా తత్వమెరుగ వలెనంటేతనను తాను దాటిపోయి తటిల్లతల లోకంలో తళతళమని మెరవాలోయ్ వీధులలో తిరుగువాడు ఇంటిలోకి చేరలేడు ఇంటిలోనె యుండువాడు వీధి సొగసు కానలేడు దాగియున్న గుట్టునొకటి విప్పి చెప్పబోతున్నా ఇంటా బయటా నెగ్గిన ఇష్టగురుని దీక్షబూని ఇతరములన్నియు వద్దని ఇలను చెలగి రావలెనోయ్ (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఎండా చలీ లేని చోటు
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 19-05-13 06:56:00
'వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి ఆహ్వానించడానికి చరణ్ పొద్దున్నే వచ్చాడు.మాటామంతీ అయ్యాక 'అబ్బ ఒకటే ఉక్కగా ఉన్నది అన్నగారు చెమటలు కారిపోతున్నాయి. నలభై అయిదు డిగ్రీలు దాటినట్లుంది.' అన్నాడు.'రోహిణీ కార్తె దగ్గరకు వస్తుంటే గుంటూరులో చెమటలు కారక ఇంకేం కారతాయి' అన్నాను నవ్వి.'హైదరాబాద్ లో అయితే చల్లగా ఉంటుందేమో కాస్త' అన్నాడు.'లేదు నాయనా పేపర్ చూచావా? అక్కడ కూడా వాతావరణం బాగా చెడిపోయిందిట.మొన్న బెంగుళూర్ నుంచి వచ్చిన ఒక ఫ్రెండ్ చెప్పాడు.అక్కడ కూడా మునుపటిలా చల్లదనం లేదట.మనమే ప్రకృతిని పాడుచేసు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శూన్యసముద్రం దిశగా...
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 18-05-13 13:52:00
'నేలకట్లు తెంచుకోని నీలిమబ్బు అలలు దాటిశూన్యసముద్రం దిశగా మనసు ఎగసిపోయింది కుళ్ళు కంపు కొట్టుచున్న మానవ బంధాలు దాటి శుద్ధజలపు గంగోత్రిని జలకమాడ యేగింది మమతలన్ని మాయలనెడిమహాసత్యమును దెలిసి మాయాతీతపు స్వేచ్చను మనసు వెదకి చూచింది నానామోహ భ్రమలను నగుబాట్లను నిలువరించు సత్యాయుధ ఖడ్గమొకటి మనసుకంది వచ్చింది తనను పట్టి బంధించిన మురికినత శుద్ధి చేయు తన్మయ సరోవరాన మనసు మునకలేసింది అంతులేని శూన్యసీ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సెక్స్ స్కాండల్స్ - రాహు కుజ శుక్రుల పాత్ర
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 15-05-13 13:29:00
'భారత నేవీలో భార్యలను మార్చుకునే తతంగం (వైఫ్ స్వాపింగ్) నడుస్తోంది రక్షించమంటూ నేవీ అధికారుల భార్యలు న్యాయం కోసం పోరాడటం బయటకి వింతగా కనిపించినా,ఇలాంటివి హై సొసైటీ సర్కిళ్లలో కొన్నిచోట్ల సర్వ సాధారణమని చాలా ఏళ్ళనుంచీ వార్తలున్నాయి.కొన్నికొన్ని హై సర్కిళ్లలో జాకెట్ల పండుగలు జరుగుతాయని నేను ముప్ఫై ఏళ్ళ క్రితమే చాలా నికార్సైన సమాచారాన్ని,అందులో పాల్గొన్న వ్యక్తి నుంచి విన్నాను.తన సహచర అధికారులతోనూ ఉన్నత అధికారులతోనూ గడపమంటూ తన భర్తే తనను హింసిస్తున్నాడని ఒక యువతి మొరపెట్టుకోవడంతో ఈ ఉదంత(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
దిష్టిమేకలు
రచయిత
: సత్యనారాయణ శర్మ
బ్లాగు
: ఆలోచనా తరంగాలు
టపా తేది
: 13-05-13 09:11:00
'ఈ మధ్య ఒక మంత్రివర్యులు తమ మీదకు ముంచుకొచ్చిన ఒక ఆపదను తప్పుకోడానికి దిష్టిమేకను బలిచ్చారని విన్నాం.ఈ సంఘటన నిజమో కాదో మనకు తెలియదు.కాని చాలామంది ఉన్నతాధికారులకు, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారికి ఇలాంటి మూఢ నమ్మకాలుంటాయన్నది మాత్రం నిజం.కాకపోతే వారిలో చాలామంది కుహనా స్వాముల,కుహనా జ్యోతిష్కుల మాటలనే నమ్ముతారు.దానికి కారణం వారి స్వార్ధం.అసలైన రేమేడీలు చెప్పేవారు వీరికి నచ్చరు.పరిహారాల ద్వారా చెడుకర్మను పోగొట్టుకోవచ్చు అన్నది నిజమే.దీనికి శాస్త్ర ప్రమాణం ఉన్నది.కర్మ ఉన్నప్పుడు దానికి (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి