స్టార్ బక్స్ & 'బక్స్'వంతుడు - బ్రాండ్ లోకం
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 07-09-10 04:24:00
స్టార్ బక్స్ వాడు బ్రాండ్ పేరుతో కాఫీ ని - డాలర్ ల లో అమ్ముతాడు. బ్రాండింగ్ లోకం లో అన్నిటికి డిమాండ్ ఉంది. బ్రాండ్ బాగా చేస్తే - మన భాజా బజంత్రీలు బ్రహ్మాండం గా వెలుగు తాయి. మన ఐపిఎల్ లాగ అన్న మాట.'కాసే దాన్ కడవులప్పా అన్నాడు ఒక తమిళ కవి. డబ్బుకు లోకం దాసోహం అని వాపోయాడు తెలుగు కవి.మొత్తం మీద మన భగవంతుడు కూడా - 'బక్స్' వంతుడు అయిపోయే! బ్రాండింగ్ లోకం లో మా తిరుపతి కొండ దేవర ని కూడా పోటీ కి నిలబెట్టి - వాడి లడ్డూలకి కూడా బ్రాండింగ్ పెట్టి - మా దేవరలు - వెంకన్నని ' బక్స్' వంతుడు గా (...)
క్రష్ణా 'బాగా' నే 'బారో'
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 05-09-10 18:30:00
అప్పు చేసి పప్పు కూడు చిత్రం చూసాక - కృష్ణా నీవే బేగనే బారో అన్న కన్నడ పద జాలానికి నవ్వొచ్చింది. కృష్ణా బాగా నే బారో అన్నట్టుందే ఇది అని!అయినా ప్రస్తుత జమానాలో - క్రెడిట్ లేనిదే దునియా లేదన్నుట్టుంది! ప్రతి ఒక్కటి క్రెడిట్ లో కొనాల్సొచ్చే రోజులు అయి పోయేయీ!కాబట్టి - ఎట్లాగు క్రెడిట్ తప్పదు - సో బేగనే బాగా బారో చేసి - పప్పు కూడు తినవలె ! ఇది విస్సన్న చెప్పిన వేదం ఈ కాలానికి !( ఈ బ్లాగు మాత్రం ఏమి క్రెడిట్ మీద కాదూ రాస్తున్నది ? బ్లాగర్ వాడు స్పేస్ అరువిస్తే - అందులో మన రాతలు తెల్ల (...)
వాక్కు- మనస్సు- మేధస్సు - కర్మణ్యం
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 22-08-10 17:06:00
కర్మణ్యం అన్న పదం ఉన్నదా నాకైతే తెలియదు.కర్మణ్యే వాధి కారస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీతా వాక్కును అను సరించి పై పదం వాడడం జరిగినది.మనస్సుకి, వాక్కుకి, మేధస్సు కి సంబంధం ఏమిటి?మనో వాక్కాయ కర్మ ణే అన్న పద పల్లవిలో - ఈ మూడింటి ని కలిపి - ఒకే మార్గం లో ఉపయోగించాలని పెద్దల ఉవాచ.ఈ సమీకరణం లో మేధస్సు ఉపయోగం ఉందా? లేక హృదయం ఈ మూడింటిని సందిస్తుందా ?చీర్స్జిలేబి.
చింతన - చైతన్యం - సృష్టి
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 20-08-10 05:30:00
ఒక ఆలోచన స్రవంతి ఐ మేధస్సుని మదించిచైతన్యాన్ని కలుగ జేస్తేఆ చైతన్యం ఉత్తేజాన్ని పుంజుకుని కార్య సాధనలోసఫలీకృతమై తే -అందులోనించి ఉద్భవం - సృష్టిఆ సృష్టి కాలం పరిమితం - దాని వైశాల్యం పరిమితంకాని దాన్ని సృష్టించిన చైతన్యం, ఆలోచన అపరిమితంసృష్టి కి మూలకారణం చైతన్యం, ఆ చైతన్యానికి మూల కారణం ఆలోచన ఐతేమరి ఆ ఆలోచనకి మూల కారణం ఏమిటి ?చీర్స్జిలేబి.
సత్యానికి చోటు దొరకలే నా దేశంలో
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 18-08-10 20:57:00
దేశం లో సత్యానికి కూడా బెయిలు దొరక లేసత్యం దూరమయి పోయే దేశంలోఅయినా సత్యానికి బెయిలు దొరకలేసత్యమేవ జయతే అనే దేశంతెల్ల బట్టలు ధరించే నాయకులూ -కాషాయం ధరించే స్వాములు ఏక పత్నివ్రతం పాటించే భర్తలు , భార్యలు అమ్మా నాన్నల మాటలు జవదాటని పిల్లలు దేశం బానే ఉంది- ఈ విషయాలలో -అయినా - ఈ సత్యానికి మాత్రం ఎందుకో అంత వెరపు మనకి? సత్యాన్ని ఎందుకిలా బందీ చేసేసాం మనం? అబ్బే - హరివిల్లు మనకు నచ్చదా ?ఏమో ప్రిజం లో నించే మనం జీవితాని సాగించాల? చీర్స్జిలేబి.
జ్యోతిష్యం ఒక కళ
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 15-08-10 17:25:00
కళ అంటే మనసుకి విశ్రాంతి ని కలుగ జేసేది. మానసోల్లాసం మానసిక వికాసం. మనసు ఆరాటం తీర్చేది. కాస్త శాంతి, కాస్త ఊరట, కూసింత ఓదార్పు - దానికి పెద్ద లక్ష్యాలంటూ ఉంటె - మానవ సేవయే .ఏమండి మా అమ్మాయీ వివాహం ఎప్పుడో కాస్తా చూసి చెబ్తుదురూ అంటే - దానికే మున్దమ్మ చూసేద్దాం అని ఊరట ఇచ్చే జ్యోతిష్యులు తరుచు కనబడుతూనే ఉంటారు. కొద్ది పాటి జ్యోతిష్య జ్ఞానం ఉన్న ఎ వ్యక్తీ ఐన కూడా ఈ ఊరట ఓ తల్లి కి ఇవ్వ గలడు - ఆ ఊరట - అమ్మాయి పెళ్లి అవుతుందో లేదో గాని కొన్ని మార్లు విజయం - ఆ సమయానికి ఆ తల్లి ఆరాటం సద్ద(...)
జ్యోతిష్యం ఒక సైన్సు - మేథమేటిక్స్ కూడాను
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 13-08-10 16:43:00
సైన్సు అన్న పదం ఇరవై శతాబ్దం లో కాకుంటే పంతొమ్మిదవ శతాబ్దం లో వచ్చిన పదం.అంతకు మునుపు ఫిలోసోఫి అనే వాళ్ళు.ఉదాహరణకి - న్యూటన్ పుస్తకం పేరు ప్రిన్సిపెల్స్ అఫ్ నేచురల్ ఫిలోసఫి.ఫిలోసఫి అర్థం తీసుకుంటే- అది లవ్ ఫర్ సం థింగ్. ఈ అర్థం లో తీసుకుంటే జ్యోతిష్యం ఒక ఫిలోసఫి. సైన్సు. దీన్ని చదివిన వాళ్ళు, చదవడానికి ఉత్సుకత చూపే వాళ్ళు ఓ పాటి జిజ్ఞాస తో - దాని మీద "వ్యామోహం" తో కాకుంటే- సందేహం తో ప్రారంభించి ఓ లాంటి పరిణితి వచ్చిన తరువాయీ దాని వెనుక ఉన్న నిగూఢ అర్థాలని వెలికి తీయడం లో తమ ఇంట్యూషన(...)
జ్యోతిష్యం ఒక నమ్మక వాహిని
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 12-08-10 05:24:00
నమ్మకం అన్నదానికి అర్థం - తర్కికానికి ఆవల ఒక దాన్ని విశ్వసించడం అనుకో వచ్చు.ఈ డెఫినిషన్ కింద ఆలోచిస్తే - జ్యోతిష్యం నమ్మే కొద్దీ దాని ప్రభావం మన జీవితాలలో పెరగడం దీన్ని నమ్మే వాళ్ళలో చాల మంది గమనించడం జరగడం సర్వ సాధారణం. - ఇందులో తల మునకలైన వాళ్లకి - ప్రతి విషయం జ్యోతిష్యం అలా చెప్పినందు వాళ్ళ ఇలా జరగడం అయ్యిందన్న మాట అని సరిపెట్టుకోవడం కాకుంటే దానికి పరిష్కారం చూడాలనుకోవడం లాంటి మరిన్ని "బై ప్రొడుక్ట్స్ " కింద వెళ్ళిపోవడం గమనించ వచ్చు.సో, దీన్ని పాటిస్తే - ఓ మోస్తరు - అందులో నే మన (...)
జ్యోతిష్యం నమ్మకమా లేక సాయిన్సా లేక కళా?
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 10-08-10 18:41:00
నమ్మకంసాయిన్సుకళఈ మూడు మూడు విధాలు నమ్మితే సాయిన్సు అక్కరలేసాయిన్సు అనుకుంటే - నమ్మకాల పని లేదు కళ - మనోల్లాసం ఇంతకీ ఈ అంతు పట్టని జ్యోతిష్యం లెక్కల గారిడీయా లేక సాయిన్సా లేక కళా లేక నమ్మకమా? చేసుకున్న వారికి చేసుకున్నన్త !నమ్మకం ఉంటె ఫలితం !శాంతి అన్నిటికి ఉండనే ఉంది !ఉపశాంతి కూడా ఉంది !కిటుకు ఎక్కడ ఉంది?మన ఆలోచనా విధానం లో నా?కర్మ సిద్ధాంతం లో నా?లేక - ఈ మధ్య బడా బడా దేశాలు - చేసే తుక్కు టమారం చెత్త చెదారం డంప్ చేస్తున్నట్టు పాతకాలం లో అర కోర - లెక్కల జ్యోతిష్యం - మన దేశం లో ఇం(...)
బలపం పట్ట కుండానే భామ ఒళ్ళో వాలు తారా ?
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 09-08-10 18:26:00
అదేదో పాత పాట లా - బలపం పట్టి భామ ఒళ్ళో - అ ఆ ఇ ఈ నేర్చుకున్న అన్నట్టు - మన చిరంజీవి గారు - ఈ మధ్య బలపం పట్టకుండానే - భామ వళ్ళో అంటే - కాంగిరేసు వళ్ళో - వాల తారేమో అని జన సందోహం సందేహం !ఈ నేపధ్యం లో - జీవి గారి వ్రాక్కులు - నర్మ గర్భం గా ఉంటున్నాయీ కూడా!ఎ పొట్టలో ఎ వోట్లు ఉన్నాయో ఎవరికీ ఎరుక ఎంకటేసా ? ఆ మధ్య అన్న గారు తిరుపతి కొండ కాలి బాటన ఎక్కితే - అయి - మా ఆదికేశవుల తరువాయి - మా చిరు ఎ - మా కొండ దేవరని కొలుచు నన్నారు మా ఊరోళ్ళు !ఇప్పుడు- అడక్కుండానే - రోశయ్య గారు - చిరుగారి సహ(...)
భగవంతుడు ఉన్నాడా?
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 09-08-10 05:02:00
చాల పాత ప్రశ్న భగవంతుడు ఉన్నాడా?సరికొత్త జవాబు - ప్రతి మనిషి తన జీవితం లో వెతుక్కోవాలని చూడడం ఈ ప్రశ్న మహాత్మ్యం!మానవ పుట్టుక నించి నేటిదాకా - ఇంకా చెప్పా లంటే - భవిష్యత్తు లో కూడా ఈ ప్రశ్న ఎవెర్ తాజా ప్రశ్నే!కలడు కలమ్డనేవాడు కలడో లేదో అన్న సందేహం ఉత్పన్నమవుతూనే ఉంటుంది.ప్రతి మానవుడు తన పరిధిలో నించి దీనికి సమాధానం ఇస్తాడు.ప్రతి సమాధానం ఈ ప్రశ్న కి ఖచ్చిత మైన సమాధానం లా అనిపించిడం ఈ ప్రశ్న గొప్పతనంఅందుకని ఈ ప్రశ్న చాలా నిగూడమైన ప్రశ్న గూడ కాదు!ఉన్నాడా లేదా?అంతే!ఆ పాటి దానికి ఎం(...)
సనాతన ధర్మ ఉద్దీపకుడు క్రీస్తు ప్రభువు
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 06-08-10 04:46:00
ఈ మధ్య మా బాబాయి అబ్బాయి స్కూల్లో "బ్రిటిష్ వాళ్ళు ఇండియా కి రాకుండా ఉంటె ప్రస్తుతం మన భారత దేశం ఎట్లా ఉండేది ?" అన్న దాని మీద వక్తృత్వ పోటి పెట్టటం - ఆ టాపిక్ పై ఆలోచిస్తే - బ్రిటిష్ వాడు రాకుండా ఉంటె భారత దేశం లో హిందూ ధర్మ నిలిచి ఉండేదా అని సందేహం కలిగింది. ఎందు కంటే పక్క దేశాలైన మలేసియా ఇండోనేసియా లాంటి దేశాల్ని చూస్తె - బ్రిటిష్ వాడు రాకుండా మునుపు దేశం ఇస్లాం వైపు మొగ్గు వేస్తూన్నట్టు గా కనిపిస్తుంది. ముసల్మాను రాజుల దండ యాత్రలు - ఆ పై మన దక్షిణ భారత దేశం లో కూడా శ్రీ కృష్ణ (...)
బందీ ఐన భగవంతుడు
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 29-07-10 05:13:00
ఆ పై వాడు ఈ ప్రపంచాన్ని సృష్టించినాడుఈ మన వాడు ఆ ప్రపంచం నాది అన్నాడు నేను సర్వాంతర్యామిని అని చెప్పక చెప్పాడు ఆ పైవాడు ఛత్- జానతా నై అని రాయిలో ఆ పైవాన్ని బందీ చేసాడు మన వాడు పోనీ లే ఈ రాయిలోనే సెటిల్ అయిపోదామనుకున్నాడు ఆ పైవాడు ఉండనివ్వలె మన వాడు- ఊరూరా తిప్పి - ఊరేగించి బిజినెస్ చేసాడు మనవాడు విష్ణు మాయ అనుకున్నాడు ఆ పై వాడు నా హం కర్తా కర్తా హరిహి అని 'నీటి' వాక్యాలు రాసాడు మన వాడు!యద్దామ పరమం మమ ?చీర్స్జిలేబి.
వెంకన్నాస్ గోల్డ్ - గోల్మాల్ గోవిందా !
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 03-07-10 06:48:00
కొన్ని నెలల క్రితం - వెంకన్నాస్ గోల్డ్ గురించి రాసాను. మళ్ళీ ఇప్పుడు - రాయల వారి బంగారం గురించి - మా కొండ దేవర - తిరపతి వెంక టేశ్వర స్వామీ వారి ఆభరణాల గురించి వార్త !ఐదు వందల సంవత్సరాల తరువాయి - రాయల కాలం నాటి కాళహస్తి గోపురం ధమాల్ఐదు వందల సంవత్సరాల తరువాయి - రాయల బంగారు ఆభరణాల కానుకలు - గోవిందా గోవిందా -వీటి గురించి చదువుతూంటే - మన జీవిత కాలం లో - డబ్బులకోసం, పదవులకోసం, కీర్తి కండూతి కోసం మనం చేసే కార్యాలన్నీ బేవార్సు - సుద్ధ పనికి మాలిన పనుల లాగ అనిపిస్తోంది. బాల్చీ తన్నేసాక - మనం(...)
జ్యోతిష్యం ఎంత వరకు ఉపయోగం?
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 30-06-10 05:36:00
ఈ మధ్య తెలుగు యోగి శర్మ గారు వరుసగా జ్యోతిష్యం గురించి బ్లాగ్ ఆర్టికల్స్ రాస్తున్నారు. అది చదివిన తరువాయీ ఈ శీర్షిక - జ్యోతిష్యం గురించి ఆలోచిస్తుంటే - అసలు అంతా ఆల్రెడీ నిర్ణయించ బడి ఉంటె మన కర్మలు ఆల్రెడీ డిసైడ్ అయి పోయి ఉంటె- ఇక మానవ మాత్రులం మనం ఎందుకు కష్టించాలి? మనం ఎందుకు ప్రయత్నించాలి అన్న సందేహం రాక మానదు. ఈ ఒక్క లాజిక్ చాలు జ్యోతిష్యాన్ని తీసి పారేయడానికి. కాని దీనికి కారణం చెబ్తారు- జ్యోతిష్యులు- అంటే- మీ జాతకం లో - మీరు కష్టించి పైకి వస్తారని ఉంది కాబట్టి- మీ ఆలోచన ఆ (...)
చిత్తూరు పాల కోవా గురించి కేరళ టీ వీ లో
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 28-06-10 05:53:00
మన ఊరిగురించి ప్రక్క రాజ్యం వాళ్ళు ఓ ఎపిసోడ్ టీవీ లో చూపితే ఎవరికైనా చూడ బుద్దేస్తోంది. అదీను పొగడ్తల తో కాకుంటే ఓ మోస్తరు మనకు తెలిసిన విషయం గురించి షో పెడితే ఇంకా నచ్చుతుంది. అంతే కాకుండా అది ప్రక్క రాజ్యం గాకుండా ఇంకా కొంత దూరం లో ఉన్న రాజ్యం లో చూపెడితే - ఔరా మన ప్రదేశం గురించి ఇంత ముచ్చట గా చూపెట్టారే అని మరీ మురిసి పోవడం కద్దు. ఆ బాణీ లోనే ఈ కేరళ భామ ఫేవరెట్ ఇండియా షో - కైరలి టీవీ లో ఈ మధ్య చిత్తూరు గురించిన షార్ట్ ఎపిసోడ్ - లింక్: http://www.youtube.com/watch?v=RNUqGUAEtUMచీర్(...)
కాలం - కలం - కల కలం
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 20-06-10 14:22:00
కాలంకలంసాయం కాలంకల కలంకలల కడలి కదలిందికాలం - కారుణ్యంకాలమై న కలల కలంసుఫలాం సస్య శ్యామలాం అన్నదిమరి జీవనం జీవిత గమ్యం అయ్యిందాకాకపొతే జీవితం జీవనం గమ్యం అయ్యిందా?తెలుసా మీకేమైనా?జిలేబి.
హృదయం - మనస్సు
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 10-06-10 20:29:00
హృదయం - మనస్సు రెండూ ఒకటేనా ? కాకుంటే వేరు వేరా? మీకేమైనా ఈ విషయం గురించి తెలిసి ఉంటె చెప్పగలరు. ఆధ్యాత్మిక పుస్తకాలలో చాల మటుకు ఈ మనస్సు గురుంచిన ప్రస్తావన వస్తూ వుంటుంది. కొన్ని మార్లు హృదయం తో మాట్లాడండి లాంటి పదాలు కూడా చదవడం కద్దు. మీ కేమైనా తెలిసి ఉంటె విశదీకరించగలరు.చీర్స్జిలేబి.
విన్నూత్న 'వరుడు' - వధువు ఎక్కడ?
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 08-06-10 04:54:00
పై చిత్రం- పల్లెకు పోదాం అంటున్న ముఖ్య మంత్రి- సిమిలారిటీ ఫోటో- వరుడు- ఆడియో లాంచ్ -వధువు ఎక్కడ మరి?చీర్స్జిలేబి.
మనః ద్వయం
రచయిత
Zilebi'
బ్లాగు :వరూధిని
టపా తేది: 06-06-10 13:13:00
మాట మౌనంచేత అచేతనంస్వరం నిశ్శబ్దంగమనం అగమ్యంవీరం నిర్వీర్యంమనః ద్వయం చంచలంఅచంచలం మహా బాహో -కిం కర్తవ్యమ్ మమ ?చీర్స్జిలేబి.