డాll దేవగుప్తాపు సూర్య గణపతి రావు ఛత్ర బంధము.
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 06-09-10 12:50:00
డాll దేవ గుప్తాపు సూర్య గణపతి రావు ఛత్ర బంధము.అత్యద్భుత విషయం ఏమిటంటే ప్రముఖ వైద్యులైన డా.సూర్య గణపతిరావు భిషగ్వరులే కాదు. ప్రముఖ కవి వరులు కూడా. ఈ విషయం పైన గల సీసపద్య గర్భిత ఛత్రబంధం తెలియఁ జేస్తుంది. వారికి అభినందనలు మరియు ధన్యవాదములు.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు
సహృదయ పూజ్యులైన ఉపాధ్యాయులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు.
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 05-09-10 08:14:00
సుజన మనోభిరామముగ శోభిల శిష్యుల తీర్చి దిద్దుచున్సృజనతఁ గొల్పు చుండి గుణ శేముషి వెల్గ ప్రబోధఁ జేయుచున్ప్రజల హితంబునే వలచు ప్రాజ్ఞులు వెజ్జలు. వారి కెల్లెడన్ప్రజల విశేష గౌరవము భక్తి ప్రపత్తులు గల్గు గావుతన్.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సహృదయ పూజ్యులైన ఉపాధ్యాయులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.జై శ్రీరామ్.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు
శ్రీ వల్లభ వఝల నరసింహ మూర్తి కవి గారి నక్షత్రబంధ త్రయము.
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 02-09-10 01:41:00
జైశ్రీరామ్.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు
మానవాళికి జీవితానుభవ సారం.
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 01-09-10 01:52:00
శ్లోllక్షాంతిశ్చేత్ కవచేన కిం కిమరిభి: క్రోధో2స్తి చేద్దేహినాం,ఙ్ఞాతిశ్చే దనలేన కిం యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం,కిం సర్పైర్యది దుర్జనా: కిము ధనైద్విద్యా2నవద్యావ్రీడా చేత్ కిము భూషణై: సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్ ?తే.గీllక్షాంతి కలిగిన కవచంబుఁ గలుగ నేల?కలుగ క్రోధము శత్రువు కలుగ నేల?జ్ఞాతి కలిగిన యగ్నిని కలుగ నేల?కలుగ సన్మిత్రు లౌషధి కలుగ నేల?కలుగ దుష్టులు సర్పముల్ కలుగ నేల?కలుగ సద్విద్య ధనములు కలుగ నేల?కలుగ సిగ్గు సుభూషలు కలుగ నేల?కవి జనాళికి రాజ్యంబు కలుగ నేల?భావము:-ఓర్పు కల వానిక(...)
శకట; షడ్గోపురద్వార; బంధరచనలలో శ్రీ నేమాని వారి నిపుణత.
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 31-08-10 09:03:00
జైశ్రీరామ్.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు
మేలిమి బంగారం మన సంస్కృతి 101.
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 30-08-10 03:49:00
శ్లోllతుల్యం పరోపతాపిత్వం , క్రుద్ధయో: సాధునీచయో:న దాహే జ్వలతోర్భేధ:, చందనేంధనయో: క్వచిత్.ఆ.వె.llమంచివారలైన వంచితు లైననుకోపగింప పరులు తాపమొందు.అగ్ని తుమ్మచెట్టు నటులె గంధపు చెట్టునంటుకొన్నఁ గాల్చు నవనిపై. భావము:-కోపం మంచి వారికి వచ్చినా, చెడ్డ వారికి వచ్చినా అది ఇతరులను బాధించును. గంధపు చెట్టునయినా , తుమ్మ చెట్టునయినా అగ్ని ఒకే విధముగా దహించి వే్యును కదా? కోపం అగ్ని వంటిదన్న మాట. అది ఇతరులనే కాదు, మనలనీ దహించి వేస్తుంది. అందుకే పెద్దలు శాంతముగా ఉండవలెనని సూచిస్తూ అన్ని కార్యక(...)
ఉపాధ్యాయ దినోత్సవానికి వారం రోజుల ముందుగానే ఉపాధ్యాయులకు సన్మానం
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 29-08-10 05:01:00
గురుదేవోభవ అని సెప్టెంబరు ఐదవ తేదీన గురు పూజా మహోత్సవం జరిపి అత్యంత భక్తి భావంతో గురువులను పూజించడం మన సప్రదాయ సంస్కారాలకు తార్కాణం.వారం రోజుల ముందుగానే ఓ.యూ.లో బీ.యీ.డీ. స్పాట్ వేల్యూషన్ కు హాజరౌతున్న గురుదేవులను అత్యంత శ్రద్ధాసక్తులతో భలే  గొప్ప సత్కారం చేసిన చేయించిన మహనీయులందరికీ వారి సభ్యతా సంస్కారాలకు నా జోహార్. జోహార్. జోహార్.మహానుభావులు ప్రొఫిసర్ కోదండరామ్ గారు ఈ విషయంలో ఎంత అమోఘంగా స్పందిస్తారో మనమంతా వేచి చూడవలసిందే.జైశ్రీరామ్.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్(...)
ఆనంద రూపుఁడగు ఆత్మా రామునికి నిత్య పుష్పార్చన.
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 29-08-10 03:11:00
ప్రియ పాఠక బంధువులారా!మన హృయంలో కొలువైయున్నఆత్మారామునికి మనం నిత్యమూ వాడని శ్రేష్టమైన పుష్పములతో అర్చించే భాగ్యాన్ని మనం ఆత్మ సాక్షిగా పొందగలం. మనస్పూర్తిగా ఆ పరమాత్మను హృదయంలో ధ్యానించి ఈ క్రింది పద్యమును భావ యుక్తముగా భావించి పఠించ గలిగితే నిత్య పూజ చేసినవారమగుదుము.ఇంతటి ఉపయోగకరమైన పద్య రచన చేసిన దెవరో కాదు. అవధాని శ్రీ నేమాని రామ జోగి సన్యాసిరావుగారే.ఆ పద్యాన్ని మీరు చూచి యోగ్యమైనదే అనుకొంటే తప్పక పఠించ గలరు. సీllఇది  "అహింస"  యనెడు నింపైన పుష్పంబు - "ఇంద్రి(...)
మెఱుగుమిల్లి క్రొత్త బ్లాగు మన కోసం.
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 28-08-10 02:30:00
ప్రియ సాహితీ బంధువులారా! ఈ రోజు నుండీ మనకు మరొక క్రొత్త తెలుగు బ్లాగు ఆనందం కలుగ జేస్తోంది. జూలై 31వ తేదీన ఆంధ్రామృతంలో చూపించిన చీ.యమ్.ఆర్. పురస్కార గ్రహీత డా.మెఱుగుమిల్లి వేంకటేశ్వర రావు " Merugumilli " అనే పేరుతో మనముందుంచారు. http://merugumilli.blogspot.com ద్వారా మనం ఆ బ్లాగును చూడగలము. దానిని మీకు ప్రత్యక్షంగా చూడడం నిమిత్తం మీ ముందుంచుతున్నాను.MerugumilliTHURSDAY, AUGUST 26, 2010sarvepalliTHURSDAY, AUGUST 26, 2010sarvepalliమిణుగురు  మిన్నంటి  మిహిర  స(...)
ముంబై నుండి యన్. ప్రసాద్ గారి దత్తపది పూరణ అద్భుతం.
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 25-08-10 15:43:00
ప్రియ సాహితీ బంధువులారా! ముంబై నివాసులైన ఆంధ్రామృత పాఠకులు శ్రీ యన్. ప్రసాద్ గారు. మన ఆంధ్రామృతంలో పూరణకై దత్తపదిని చూచి ఎంతో ఉత్సాహంతో అద్భుతంగా పూరించి మన బ్లాగుద్వారా పదిమంది ఔత్సాహికులూ చదివే అవకాశంకల్పించడానికి వీలుగా పంపిరి.ఆ ప్రసాద్ గారి పూరణను వారి స్వదస్తూరీలోనే మీ ముందుంచుతున్నాను. చదివి చూడండి.దత్తపదిని ఐన ఇడ్లీ పూరీ ఉప్మా కాఫీ అనే వాటితో ముంబై మారణ కాండను గజేంద్ర మోక్ష సన్నివేశానికి అన్వయిస్తూ పూరణ చేయవలసినదిగా నేను చేసిన మనవికి స్పందించి తన పూరణను పంపిన శ్రీ య(...)
శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు కవి ఏమంటున్నారో చూద్దామా?
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 24-08-10 14:50:00
మllసుమనస్సేవ్యము సాధు వాఙ్మయము  సుశ్లోకంబు సౌవర్ణ యుక్తము శ్రావ్యంబు విశిష్ట భావ రస పౌష్కల్యంబునౌ యాంధ్ర భాష మహిన్ భాషల కెల్ల భూషణము నై సందీప్తమౌ తన్మహత్వము నాంధ్రామృత బ్లాగులో గనుచు మోదంబందుడీ ధీనిధుల్.ఇట్లునేమాని రామ జోగి సన్యాసి రావు.విశాఖ పట్టణము.తే.24 - 8 - 2010.పాఠకులారా! మనలను ప్రోత్సహిస్తున్న అవధాని సన్యాసిరావు కవి గారికి సహృదయత ప్రశంసనీయము.వారికి హృదయ పూర్వక ధన్యవాదములు.జై శ్రీరామ్.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు
జ్యోతిశ్శాస్త్రజ్ఞులు శ్రీవల్లభవఝల వారు ప్రముఖ బంధకవి కూడాను.
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 23-08-10 16:51:00
శాllవిశ్వస్తుత్య గుణ ప్రశస్త వరదా! విశ్వేశ్వరా! శ్రీధరా!విశ్వ శ్రేయ శుభాశ్రితా! భవ హరా! విశ్వంభరా! మాధవా!పశ్వావశ్య విలోక గోప వరమై భాసిల్లు భాగ్యేశ్వరా!రాశ్వాసా! విభవా విశేష పరమా! రా సత్యవాచా! వరా!ప్రియ పాఠకులారా! మీ ఆంధ్రాభిమానాన్ని పద్యకవితాసక్తినీ అభినందిస్తూ ఆంధ్రామృతం గ్రోలుతున్న మీకు ధన్యవాదాలు తెలియఁ జేసుకొంటున్నాను.ఇక పైన గల చక్ర బంధ శార్దూలాన్ని చూచాం కదా!ఇంతటి రచనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించిన మహా కవి యెవరో కాదు. ఒక్క సారి చూస్తే దానిలోని మర్మాన్ని గ్రహించి దానిని అలవో(...)
చెట్టుకు నమస్కరించి అనుమతి కోరి పూలు కోసుకోవాలి.
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 21-08-10 04:19:00
పువ్వులను కోసేముందు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ కోయాలని పెద్దలు చెప్పరు.శ్లోllనమస్తే కుసుమా ధారే, నమస్తే కమలాలయేపుష్పాణి విష్ణు పూజార్థం, ఆహరిష్యే తవాజ్ఞయా!తే.గీ.llవందనము నీకు పుష్ప సౌభాగ్యధారి!వృక్ష రాజమ! హరికి నే బ్రీతి తోడపూజ సేసెద పూలతో. పూలు కోయనానతిని వేడు చుంటి. నా కానతిమ్ము.జైశ్రీరాం.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు
శ్రీరామ చంద్రా! నీ గాన మాధుర్యానికి ముగ్ధులైన అభిమానుల అభినందనలందుకో! జైశ్రీరామ చంద్రా!
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 16-08-10 02:06:00
ఆంధ్ర దివ్య జ్యోతిస్వరూపాన్ని తన గాత్రంద్వారా యావద్భారాతీయులూ మహదానంగంతో తిలకించేలా భారతాంబ పులకరించేలా చిఱునగవులొలుకు ముఖారవిందంనుండి తేనె వాగులా జాలువారించిన ఆంధ్ర మాత గర్వ కారకుఁడైన శ్రీరామ చంద్రను తమ కడుపు పంటగా బడసిన తల్లిదండ్రులకు ఆంధ్రామృతం అభినందనలు తెలియఁ జేస్తోంది.నిరంతర విజయ పరంపరలతో  తనకు తనను కడుపార గన్న తల్లిదండ్రులకు ఆంధ్ర మాతకు స్వర్ణ భారతాంబకు దినదిన ప్రపంచ ప్రఖ్యాతిని కలిగిస్తూ పురోగమించాలని మనసారా కోరుకొంటూ ఆపరమాత్మ పరిపూర్ణ ఆయురారోగ్య ఆనంద సద్గుణ సౌభాగ్(...)
యావద్భారతీయులకూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 15-08-10 00:10:00
వందే భారత మాతరమ్ సు గుణ దామ్! వందే జగన్మాతమ్!Prayer of Bharat MataMeaning :I pay my obeisance to mother Bharat, whose feet are being washed by the ocean, who wears the mighty Himalaya as her crown, and who is exuberantly adorned with the gems of traditions set by Brahmarsis and Rajarsis.కం:-సాగర క్షాళిత పదములు.బాగగు హిమవత్ కిరీట భాసిత శిరమున్,యోగులు బ్రహ్మర్షులతోబాగరియగు భరత మాత! వందనమమ్మా!సోదర భారతీయులారా! ఆంధ్రామృత పాఠకులారా!దివ్య భారతి బిడ్డ లందరికీ అభినందనలు.తేదీ. 15 - 8 - 2010(...)
ఇదిగో లంచం. తీసుకొని ఆ కిటుకేంటో చెప్పవే నెమలీ!
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 13-08-10 03:48:00
కంద - గీత - గర్భ ఉllఓ నెమలీ! సఖీ! ఎటుల నోచి మదీయుని కృష్ణుఁ  జేరి శ్రీజ్ఞాన మతిన్ సదా చతుర! కామ్య ఫలంబును చక్క నందితో?నీ నమనంబునన్ శిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు. పోనీనునినున్. కృపన్ తెలిపి నేర్పును గొల్పుము దివ్యుఁ జేరగా!కllనెమలీ! సఖీ! ఎటుల నోచి మదీయుని కృష్ణుఁ  జేరి శ్రీ జ్ఞాన మతిన్.నమనంబునన్ శిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు. పోనీనునినున్.తే.గీllఎటుల నోచి మదీయుని కృష్ణుఁ  జేరి చతుర! కామ్య ఫలంబును చక్క నందిశిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు.తెలిప(...)
ఇదిగో లంచం. తీసుకొని ఆ కిటుకేంటో చెప్పవే నెమలీ!
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 13-08-10 03:41:00
కంద - గీత - గర్భ్హ ఉllఓ నెమలీ! సఖీ! ఎటుల నోచి మదీయుని కృష్ణుఁ  జేరి శ్రీజ్ఞాన మతిన్ సదా చతుర! కామ్య ఫలంబును చక్క నందితో?నీ నమనంబునన్ శిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు. పోనీనునినున్. కృపన్ తెలిపి నేర్పును గొల్పుము దివ్యుఁ జేరగా!కllనెమలీ! సఖీ! ఎటుల నోచి మదీయుని కృష్ణుఁ  జేరి శ్రీ జ్ఞాన మతిన్.నమనంబునన్ శిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు. పోనీనునినున్.తే.గీllఎటుల నోచి మదీయుని కృష్ణుఁ  జేరి చతుర! కామ్య ఫలంబును చక్క నందిశిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు.తెలిపి న(...)
ఇదిగో లంచం. తీసుకొని ఆ కిటుకేంటో చెప్పవే నెమలీ!
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 12-08-10 18:27:00
కంద - గీత - గర్భ్హ ఉllఓ నెమలీ! సఖీ! ఎటుల నోచి మదీయుని కృష్ణుఁ  జేరి శ్రీజ్ఞాన మతిన్ సదా చతుర! కామ్య ఫలంబును చక్క నందితో?నీ నమనంబునన్ శిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు. పోనీనునినున్. కృపన్ తెలిపి నేర్పును గొల్పుము దివ్యుఁ జేరగా!కllనెమలీ! సఖీ! ఎటుల నోచి మదీయుని కృష్ణుఁ  జేరి శ్రీ జ్ఞాన మతిన్.నమనంబునన్ శిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు. పోనీనునినున్.తే.గీllఎటుల నోచి మదీయుని కృష్ణుఁ  జేరి చతుర! కామ్య ఫలంబును చక్క నందిశిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు.తెల(...)
మనం గ్రహించ గలిగినా గ్రహించ లేకపోయినా ఇది మాత్రం నిజం.
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 10-08-10 02:16:00
శ్లోllపుణ్యస్య ఫల మిచ్ఛంతి , పుణ్యం నేచ్ఛంతి మానవా:న పాపఫల మిచ్ఛంతి , పాపం కుర్వంతి యత్నత:తే.గీ.llపుణ్య కార్యము లొనరింపఁ బోరు  కానిపుణ్య ఫలము కోరుదు రయ్య! పుడమిఁ జనులు.పాప కార్యము లొనరింత్రు. పాప ఫలమువల దటంచును తలతురు. భావ్య మౌనె?భావము:-మానవులు  పుణ్యం చేయడానికి ఎంత మాత్రం ప్రయత్నం చేయరు. కాని పుణ్యం వలన వచ్చే ఫలితం మాత్రం తమకి దక్కాలని తెగ ఆరాట పడి పోతూ ఉంటారు. నిత్యం అనేక పాపాలు చేస్తూనే ఉంటారు కానీ, ఆ పాప ఫలితం మాత్రం తమకు రాకూడదని కోరుకుంటూ ఉంటారు ! మన అనుభవా(...)
శార్దూలాన్నే చక్రబంధం చేసిన మహాకవి ఎవరో తెలుసా?
రచయిత
చింతా రామకృష్ణారావు.'
బ్లాగు :ఆంధ్రామృతం
టపా తేది: 09-08-10 07:58:00
(చక్రంపై క్లిక్ చెయ్యండి)పాఠక మహాశయులారా!కవి కంఠీరవముగా చెప్ప దగిన అవధాని శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు కవి ఏకంగా శార్దూలాన్నే చక్ర బంధం చేసి మనముందుంచారు. ఆహా! ఎంతటి అద్భుతం!!!ప్రయత్నం చేస్తే చేయలేని పనంటూ ఉండదని మనకు ప్రబోధించడానికే తానీ విధంగా ఉదాహరణ ప్రాయంగా వ్రాసి చూపారని మనం గ్రహించఁ గలిగితే ప్రయత్నం చేసినట్లైతే మనమూ సాధించ గలమనే నేను విశ్వసిస్తున్నాను.ఆ చక్ర బంధమైన శార్దూల అసలు స్వరూపాన్ని చూద్దామా?శాllవిప్రస్తుత్య గుణప్రసస్త! వరదా! విశ్వాధిపా! శ్రీధరా!సుప్రీతా(...)