Skip Navigation Links


బాగు ! భలే విశేష మిది !భాస్కర శర్మను గూర్చి మాకు మ...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :బ్లాగ్ లోకం      టపా : లాస్య రామకృష్ణ తో కష్టేఫలే గారి ఇంటర్వ్యూ      వ్యాఖ్యనించిన తేది: 30-04-13 13:31:28

బాగు ! భలే విశేష మిది !భాస్కర శర్మను గూర్చి మాకు మీ బ్లాగు ముఖా ముఖిన్ దెలియు భాగ్యము గూర్చిరి లాస్య గారు !మా బ్లాగరు లందు శర్మ యన భక్తి ప్రపత్తులు మెండు - అట్టె , మా బ్లాగరు లన్న వారి కనురాగము మిన్న - ముదంబు గూర్చెడిన్ .


తెలుగు బ్లాగుల పూదోట తీర్చి నట్లు , పైన జలతారు వె...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :జలతారు వెన్నెల      టపా : సరదా సరదాగా...      వ్యాఖ్యనించిన తేది: 18-04-13 13:25:13

తెలుగు బ్లాగుల పూదోట తీర్చి నట్లు , పైన జలతారు వెన్నెల పరచి నట్లు , పిల్ల తెమ్మెర పలుకులు చల్లి నట్లు మనసు దోచెను - మమ్ము" శ్రీ "మాయ జేసి


అబ్బు డెబ్బుడో ప్రియ కనిపిచ్చినది , ని న్నిడిసి ప...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :ఫోటాన్      టపా : తొలి కవిత      వ్యాఖ్యనించిన తేది: 27-03-13 15:27:44

అబ్బు డెబ్బుడో ప్రియ కనిపిచ్చినది , ని న్నిడిసి పెట్టి యాడి కెల్దు గాని -ఈక్వెషన్ను ముందు ఇడిసి పెట్టుము హర్ష !'మంచు చెలియ' కవిత మంచి గుంది.


గ్రామీణ తెలుగిండ్ల కథన చాతురి కల్మి భాషా మతల్లికి...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :శర్కరి      టపా : ముఖాముఖి      వ్యాఖ్యనించిన తేది: 26-03-13 06:56:06

గ్రామీణ తెలుగిండ్ల కథన చాతురి కల్మి భాషా మతల్లికి పట్టు గొమ్మ తెలుగుపై మమకార మొలుకు నాలోచనన్ పాఠశాల నడుపు పంతులమ్మ సునిశిత శోథనా జనిత శేముషి కల్మి కుదురైన రచనలన్ చదువులమ్మ నవ నవోన్మేష ప్రజ్ఞా విశేష ప్రక్రియల్ కల్మి విరిసిన ప్రతిభల విరుల కొమ్మ కాదు పొగిడింపు – జ్యోతమ్మ కలము లోన కలవు ప్రత్యేకతలు – తెల్గు కలలు మీరు , భాషలో భావమున కూడి పరిఢవిల్లి రచన లందున తెలుగిట్లు గ్రాల వలయు .


కొంటె పిల్లతో కాసేపు… పై వెంకట రాజారావు . లక్కాకుల వ్యాఖ్యలు

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :జాజిమల్లి      టపా :      వ్యాఖ్యనించిన తేది: 22-03-13 23:05:14

గ్రామీణ తెలుగిండ్ల కథన చాతురి కల్మి భాషా మతల్లికి పట్టు గొమ్మ తెలుగుపై మమకార మొల్కు నాలోచనన్ పాఠశాల నడుపు పంతులమ్మ సునిశిత శోథనా జనిత శేముషి కల్మి కుదురైన రచనలన్ చదువులమ్మ నవ నవోన్మేష ప్రజ్ఞా విశేష ప్రక్రియల్ కల్మి విరిసిన ప్రతిభల విరుల కొమ్మ కాదు పొగిడింపు - జ్యోతమ్మ కలము లోన కలవు ప్రత్యేకతలు - తెలుగుల కలలు మీరు , భాషలో భావమున కూడి పరిఢవిల్లి రచన లందున తెలుగిట్లు గ్రాల వలయు .


చదువుకు పనికి రాక , అల్లరి చిల్లరగా తిరిగి , ఎందుక...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :పని లేక ..      టపా : "తెలుగు న్యూస్ పేపర్లు చదవకురా చెడేవు."      వ్యాఖ్యనించిన తేది: 21-03-13 14:30:40

చదువుకు పనికి రాక , అల్లరి చిల్లరగా తిరిగి , ఎందుకూ పనికి రాక తుదకు మన తెలుగు పత్రికల పుణ్యాన న్యూస్ కంట్రిబ్యూటర్ అవతార మెత్తిన వాళ్ళిందులో ప్రథాన పాత్ర పోషిస్తున్నారు . నెలంతా పని చేసినా వీళ్ళకిచ్చే డబ్బులు వెయ్యి దాటవు . కానీ , కొన్ని వర్గాలను బెదిరించి బాగానే సంపాదిస్తున్నారు . పై పెచ్చు గవర్నమెంటు వీళ్ళకు ఐడీ కార్డులిచ్చి ప్రోత్సహిస్తున్నారు కూడాను . వీళ్ళ కోసమైనా మీరు తెలుగు పత్రికలు చదవండి సారూ !


మంచి అంశాన్ని చర్చకు పెట్టినందుకు ముందుగా మీకు అభి...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :జలతారు వెన్నెల      టపా : లేడీ బాస్-ఆఖరి భాగం      వ్యాఖ్యనించిన తేది: 21-03-13 13:48:58

మంచి అంశాన్ని చర్చకు పెట్టినందుకు ముందుగా మీకు అభినందనలు . పాశ్చాత్య జీవన విథానం మన జీవన విథానం కంటే నిర్ద్వంద్వంగా మెరుగైనది . మనం ఒప్పుకోము గాని , మనం మనగొప్ప డప్పాలు కొట్టు కుంటూ , నిరంతరం సహజత్వానికి దూరంగా బ్రమలలో బతుకీడుస్తుంటాం . పిల్లల కోసమే బతుకు తున్నామనే ఆదర్శాన్ని వల్లిస్తూనే , కొడుకూ - కోడలూ ఆనందంగా ఉంటే చూచి ఓర్చుకో గలిగిన తల్లిదండ్రు లెందరున్నారిక్కడ ? తల్లిదండ్రుల పెన్షన్ డబ్బులు మాకివ్వడం లేదే ? ఈ వయస్సులో కూడా వీళ్ళకు డబ్బూ దస్కం స్వేఛ్ఛా అవసరమా ? అనుకోని కొడుకూ కూ(...)


ఇన్ జనరల్ 'మనుషులంతా ఒకటే' అనే ఏకాభిప్రాయ...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :జలతారు వెన్నెల      టపా : లేడీ బాస్-3      వ్యాఖ్యనించిన తేది: 15-03-13 15:17:45

ఇన్ జనరల్ 'మనుషులంతా ఒకటే' అనే ఏకాభిప్రాయమున్నా , తూర్పు - పడమరల తేడాలు తప్పని సరి కదా! ఇదే కథకు ముగింపేమో!


హటాత్తుగా ఊడి పడ్డ ఎండల వేడిమికి మీ కవిత ఓ గ్లాసె...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :meraj fathima      టపా :      వ్యాఖ్యనించిన తేది: 09-03-13 10:44:25

హటాత్తుగా ఊడి పడ్డ ఎండల వేడిమికి మీ కవిత ఓ గ్లాసెడు కొత్త కూజా నీళ్ళు


టీచర్లే దిక్కు .... నిజాయితీగా ఒప్పుకో గల్గితే న...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :meraj fathima      టపా : దిక్కు (లేని)మాలిన సమాజం      వ్యాఖ్యనించిన తేది: 06-03-13 11:20:57

టీచర్లే దిక్కు .... నిజాయితీగా ఒప్పుకో గల్గితే నిజాయితీ లేని టీచర్ల వల్లే అది దిక్కుమాలింది .


పరమ పావన 'రామపాదాలు' సోకి భరత ధాత్రి పవిత...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :స్మరణ      టపా : "రామానుగ్రహం" ... నా ఆనందక్షణాలు      వ్యాఖ్యనించిన తేది: 02-03-13 08:59:06

పరమ పావన 'రామపాదాలు' సోకి భరత ధాత్రి పవిత్ర చరిత యయ్యె 'రామ రామా' యన్న నామాక్ష రాలతో నిలువెల్ల నేల పునీత యయ్యె 'రాముని తిరునాళ్ళ' రమణీయతల దేలి ఊరువాడల పుణ్య ముత్సహించె 'రామ కళ్యాణ' పర్వాల నిర్వహణచే నా పల్లె పల్లె ధన్యతలు గాంచె మనసు రామయ్య తలపుతో తనివి తీర తడిసి ముద్దయ్యె 'స్మరణ వ్రాతలు' గనంగ కనులు చమరించె 'రాముని కథ' వినంగ భారతీ ! మీరు ధన్యులు ! భక్తి ధనులు !


విషయ సేకరణ ప్రావీణ్యతలు జూడ బుధ జనులకు కూడ ముచ్చట...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :స్మరణ      టపా : తనో వినయశీలి... తనే మన "రసజ్ఞ"      వ్యాఖ్యనించిన తేది: 25-02-13 23:00:24

విషయ సేకరణ ప్రావీణ్యతలు జూడ బుధ జనులకు కూడ ముచ్చట యగు విషయ విభాజ్య వివేచనలు జూడ పరిణతి దెలియు ఏ పఠిత కైన తెలుగున ప్రాయు ఆ తీరు తెన్నులు జూడ భాషపై తన కున్న పట్టు తెలియు వివిథాంశముల యందు దవిలిన గురి జూడ విజ్ఞాన పరిథి సంవిథము దెలియు అన్నిటికి మించి పఠితల మన్ననలను పొంది బ్లాగ్వనమందు వెల్గొందు చున్న ఇట్టి శ్రీ రసజ్ఞ ను గూర్చి యిచట వ్రాయ మీరు ప్రతిభకు తగు పురస్కార మిడుటె .


ఒక అంశాన్ని చర్చకు పెట్టడమంటే దానికి సంబంధించిన పల...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :Praja (Voice Of People)      టపా : చర్చ దేనికి? చర్చ ఎలా ఉండాలి? ఎలా ఉండ కూడదు?      వ్యాఖ్యనించిన తేది: 25-02-13 11:55:44

ఒక అంశాన్ని చర్చకు పెట్టడమంటే దానికి సంబంధించిన పలు వాదనలు ఆహ్వానించడమే . చర్చలో పాల్గొన్న వ్యక్తులు అంశాన్ని వీడి వాదించరాదు . చర్చ అంటేనే వాదోప వాదాలని అర్థం . వాదనలను కేవలం తన సొంత అభిప్రాయాలు గానే కాకుండా చారిత్రకాది ఆధారాలతో బలపరచుకోవడం ఉత్తమమైన పధ్ధతి . వాదనలో తన అభిప్రాయం తప్పని తేలినప్పుడు పిడివాదనకు దిగకుండా తన అభిప్రాయాన్ని మార్చుకో గల సంస్కారం కూడా ఉండాలి . వాదనలో పాల్గొన్న వ్యక్తులను కించపరచడం , పిడి వాదనలకు దిగడం , చర్చను పక్కదారి పట్టించడం చర్చకు భంగకరాలు . అత్యధికుల (...)


సకల జీవరాసుల మదిలో తొలుత మెదిలేది భావమే . వేన వేల ...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :Praja (Voice Of People)      టపా : భాష ముఖ్యమా? భావం ముఖ్యమా? రెంటిలో ఏదో ఒకటి చూడాల్సి వస్తే ఏది ముఖ్యం?      వ్యాఖ్యనించిన తేది: 19-02-13 12:37:16

సకల జీవరాసుల మదిలో తొలుత మెదిలేది భావమే . వేన వేల సంవత్సరాల పరిణామ క్రమంలో మానవులు మాత్రమే భావ వ్యక్తీ కరణకు భాషను ఏర్పరచుకో గలిగినారు . మిగతా జీవరాశికి ఇది సాధ్యం కాలేదు . ఐనా అన్ని జీవరాసులూ భావ వ్యక్తీకరణ జరుపుకుంటూనే ఉన్నవి . సమస్త జీవరాసుల పరంగా విశ్లేషిస్తే భావమే అన్నిటికీ సహజాతం . భాష సాధించుకొన్న పరిణామం . కాబట్టి భావానికే తొలి ప్రాధాన్యత . మానవులు మాత్రమే సాధించుకొన్న 'భాషా ' సాధనాన్ని వ్యక్తులు తమ తమ మనస్తత్వాన్ని బట్టి , అబిరుచిని బట్టి ,గుణ గణాలను బట్టి , పరిస్థి(...)


అతని పిలుపు కన్న నాపాత మథురమౌ పాట లేదను ప్రియ భావ...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :శర్కరి      టపా : నీకో అరుదైన బహుమానం ఇవ్వాలని....      వ్యాఖ్యనించిన తేది: 14-02-13 12:45:19

అతని పిలుపు కన్న నాపాత మథురమౌ పాట లేదను ప్రియ భావన గన అతని కన్న భువిని నత్యంత సంపన్ను డుండ బోడు ప్రేమ భాగ్య శాలి


నేటి సమాజానికి సాయి నాథుడే రక్ష భారతి గారూ , ధన్యవ...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :సుజన - సృజన      టపా : శ్రీ సాయి నాథుని సర్వదేవతా సత్తాక మూర్తి మత్వం      వ్యాఖ్యనించిన తేది: 14-02-13 11:08:51

నేటి సమాజానికి సాయి నాథుడే రక్ష భారతి గారూ ,ధన్యవాదములు .


రామ నామ మధుర రస ధార సేవనా నంద మహిమ లెన్న నాతరంబె...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :స్మరణ      టపా : ఇదో అనిర్వచనీయమైన ఆనందానుభూతి.      వ్యాఖ్యనించిన తేది: 14-02-13 02:05:42

రామ నామ మధుర రస ధార సేవనానంద మహిమ లెన్న నాతరంబెసాయి రాము డనగ సర్వోన్నతుడ వీవెశ్రీని వాస సాయి ! శిరిడి రాజ ! శ్రీ రాము పత్ని , జనకజ ,గారాముల భూమి పుత్రి , కమనీయ ,దయావారాశి , సీత నీవయికారుణ్య రసాబ్ధి దేల్చి కావర సాయీ ! శ్రీరాము బంటు , అంజనిగారాముల కూర్మి సుతుడు , కరుణాంబుధి , మాకారాధ్యు డైన మారుతినీరూపున గాంచు వరము నియ్యర సాయీ !


మేథస్సు కంటే నమ్మకం మనిషి మీద ఎక్కువ ప్రభావం చూపుత...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :Praja (Voice Of People)      టపా : వాస్తులో వాస్తవం ఎంత ? వాస్తు శాస్త్రం ఎవరి ప్రయోజనాలకోసం?      వ్యాఖ్యనించిన తేది: 12-02-13 12:44:45

మేథస్సు కంటే నమ్మకం మనిషి మీద ఎక్కువ ప్రభావం చూపుతోంది . వాస్తు , జ్యోతిషం , క్రతువులు , మంత్ర తంత్రాలు , శాంతులు తుదకు పూజలు - ఇవన్నీ వేలాది సంవత్సరాలుగా నమ్మకం ఆధారంగా మానవ మష్తిష్కం పై సవారీ చేస్తున్న బలమైన అంశాలు . సిధ్ధాంతి సూచన మేరకు తగు మార్పులు చేసి , ఇంటిలోని ఇబ్బందులు తొలిగినట్లు నమ్మకమనే బ్రమలో శాంతిని పొందడమే ఇందులోని కిటుకు . కానీ , తర తరాలుగా తలకెక్కిన నమ్మకాలివి . ఇంకా నిష్కర్షగా చెప్పాలంటే తరతరాలుగా ఒక భారతీయ మేథో వర్గం భారతీయ సమాజాన్ని తమ అజమాయిషీలో ఉంచుకొని తద్వా(...)


తెలుగు పద్యమందు తెలియని యభిమాన మొకటి దప్ప నేమి యొ...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :ఆంధ్రామృతం      టపా : ఈ సమస్యను పూరించే సమర్థులు మీరు కాక మరెవరు?      వ్యాఖ్యనించిన తేది: 12-02-13 11:37:55

తెలుగు పద్యమందు తెలియని యభిమాన మొకటి దప్ప నేమి యొప్పు లేదు మెప్పు మీ సుగుణము మిత్రమా ! ధన్యవా దములు శర్మగారు ! విమల మతులు


పరసతి మీది మోహమతి పాపము ,దైవబలంబు కూడియున్ సరిపడద...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :ఆంధ్రామృతం      టపా : ఈ సమస్యను పూరించే సమర్థులు మీరు కాక మరెవరు?      వ్యాఖ్యనించిన తేది: 12-02-13 06:10:49

పరసతి మీది మోహమతి పాపము ,దైవబలంబు కూడియున్ సరిపడదీ దురాగతము ,శైవవరాంథుడు బాహు గర్వితా సురపతి రావణాసురుడు చూడుడు ! రాముని పత్ని దెచ్చి తా వెరవును లావు చేవయును వీరము బీరము గల్గి యోడెనే!


భగ్న ప్రేమికుడు ----- వాతెర మీది ఆ మథుర వాగ్ఝరి ...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :ఆంధ్రామృతం      టపా : ‘మధుర వాగ్ఝరి మన్నన మాయఁ జేసె’ కందంలో పూరించగలరు.      వ్యాఖ్యనించిన తేది: 10-02-13 12:11:37

భగ్న ప్రేమికుడు ----- వాతెర మీది ఆ మథుర వాగ్ఝరి , మన్నన మాయజేసె,నిస్సీ!తెరవా! కడుంగడు విచిత్రముగానిటు మోసపోయినన్ నీతికి నిల్చి నీసుఖమె నేను పదంపడి కోరుకొంటి - స్త్రీ జాతిని సున్నితంబనుట చాల అసత్యము,రాతిగుండియల్ .....ఘనులగు పండిత జనుల పదునగు చతుర భాషణలు , మథుర వాగ్ఝరి , మ న్నన - మాయజేసెడు గనుక చనరెదురుగ నన్నుబోలు జడు లయ్యెడకున్ . -----సుజన-సృజన


విధికి తలొగ్గి , ధర్మజుడు వేసరి తమ్ములు తాను యోగ్య...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :ఆంధ్రామృతం      టపా : సమస్య నాది. పూరణ మీది. ‘చెదరిన జీవియయ్యె వెత జెందెను దైవ కృపాభిషిక్తుడై’      వ్యాఖ్యనించిన తేది: 08-02-13 12:20:53

విధికి తలొగ్గి , ధర్మజుడు వేసరి తమ్ములు తాను యోగ్యతా పథమును దప్పి , కూటికయి బ్రాహ్మణ వేషము దాల్చి వీర్యముల్ చెదిరిన జీవియయ్యె , వెత జెందెను - దైవకృపాభిషిక్తుడై తుదకు సుయోధనున్ గెలిచి దోర్బలమొప్ప గడించె రాజ్యమున్ . -----సుజన-సృజన


ఎదుటి వారి భావన గౌరవించు గొప్ప హృదయ సంస్కార మున్న...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :ఆంధ్రామృతం      టపా : ‘కన్యను ధార పోయమన, కాదని పొమ్మనె. పుణ్యమూర్తి తా’ ఈ సమస్యను మీరైతే సముచితంగా పూరిస్తారు.      వ్యాఖ్యనించిన తేది: 08-02-13 11:50:02

ఎదుటి వారి భావన గౌరవించు గొప్ప హృదయ సంస్కార మున్న సౌహిత్య మూర్తి !లలిత లలితంపు పలుకుల చెలిమి విరియు మీరు కుశలమా ? సంపత్ కుమార శాస్త్రి !


ధనము , విద్య , వీర్యము - కొందరికి మదమెక్కిస్తాయి ....

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :వరూధిని      టపా : చదువా ధనమా వీరమా ?      వ్యాఖ్యనించిన తేది: 07-02-13 01:48:40

ధనము , విద్య , వీర్యము - కొందరికి మదమెక్కిస్తాయి . కొందరికి వినయాన్నితెస్తాయి . అంటే ... వీటిలో ఏగొప్పా లేదు . గొప్పతనం గానీ , అల్పత్వం గానీ ఉండేది మనుషుల్లోనే మరి .


ధన్యడు త్యాగ రాజు , శతథా జనపాలురు మెచ్చి , గీతికా ...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :ఆంధ్రామృతం      టపా : ‘కన్యను ధార పోయమన, కాదని పొమ్మనె. పుణ్యమూర్తి తా’ ఈ సమస్యను మీరైతే సముచితంగా పూరిస్తారు.      వ్యాఖ్యనించిన తేది: 06-02-13 09:30:07

ధన్యడు త్యాగ రాజు , శతథా జనపాలురు మెచ్చి , గీతికా కన్యను ధారవోయుమన , కాదని పొమ్మనె ,పుణ్యమూర్తి ,తా నన్యమెఱుంగడా యిన కులాన్వయ రామనృపాలు దప్ప , సౌ జన్య విభూషణుల్ ధన వశమ్మున జిక్కరు మోక్ష కాములై . ----- సుజన-సృజన


జ్ఞాన మగ్ని , యగ్ని కాల్చి యన్నింటిని ఒక్క తీరు ద...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :స్మరణ      టపా : స్త్రీల సందేహాలు      వ్యాఖ్యనించిన తేది: 05-02-13 21:17:35

జ్ఞాన మగ్ని , యగ్ని కాల్చి యన్నింటిని ఒక్క తీరు దెచ్చు నుర్వి యందు హృదయ మందిరాన కొలువైన పరమాత్మ గొలుచు జ్ఞాన మొదవ తొలగు శంక .


ఓనమాల్ దిద్దించు నొజ్జకు మ్రొక్కుటే పరమేశ్వరున కి...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :శర్కరి      టపా : అక్షర నీరాజనం      వ్యాఖ్యనించిన తేది: 05-02-13 12:51:21

ఓనమాల్ దిద్దించు నొజ్జకు మ్రొక్కుటే పరమేశ్వరున కిడు పాద పూజ ఆమ్మ , ఆవుల తోటి ‘ అఆ ‘ లు దిద్దుటే పాలిచ్చు తల్లికి పాద పూజ సుమతి , వేమన పద్య సూక్తులు పాడుటే భాషా మతల్లికి పాద పూజ తియ్య తియ్యగ నేర్చి తెలుగు మాటాడుటే పంతులు గారికి పాద పూజ ఇచట బుట్టిన ‘ జ్యోతి ‘ వెల్గించు ‘ దివ్వె ‘‘ తెలుగు దీప్తులు ‘ జల్లి విత్తిన ‘ మొలకలు ‘‘ తెలుగు పూదోట ‘ గా తీరి , ‘ వెలుగు పూలు ‘పూచి , పరిమళ భరితమై మురియు గాత !


ఏ వేదములో జెప్పిరి భూ విభులకు జూదములు ప్రమోదములనుచ...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :ఆంధ్రామృతం      టపా : దత్త పది:- మోదము - రోదము - వేదము - జూదము . భారతం లోని కథ. స్వేఛా ఛందములో వ్రాయ గలరు.      వ్యాఖ్యనించిన తేది: 04-02-13 09:02:14

ఏ వేదములో జెప్పిరిభూ విభులకు జూదములు ప్రమోదములనుచున్ చేవలు చెడి కురు శౌర్యము బ్రోవగ హరి యుండి కూడ రోదము బొందెన్


సమకాలీన సామాజిక దుర్వినీత గాజు పెంకుల్ని కూడా నలగ ...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :meraj fathima      టపా :      వ్యాఖ్యనించిన తేది: 03-02-13 13:55:16

సమకాలీన సామాజిక దుర్వినీత గాజు పెంకుల్ని కూడా నలగ ద్రొక్కి శిక్షించ గల చైతన్య శక్తి మంతాలు మీ కవితా పాదాలు .


పక్షి గాని , నిరక్షర కుక్షి గాని పండితోత్తముడై పే...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :ఆంధ్రామృతం      టపా : (దత్త పది)"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి".అనే పదాలనుపయోగించి భగవంతునికీ భక్తునికీ అనుసంధాన పరచండి.      వ్యాఖ్యనించిన తేది: 02-02-13 22:35:24

పక్షి గాని , నిరక్షర కుక్షి గాని పండితోత్తముడై పేరు పడిన గాని మదిని భక్తి సుభిక్షమై మను నతండె ఆ జగద్రక్షకుని వాడు , హరికి హితుడు . -----సుజన-సృజన


రమణ గారూ , 1.తల్లిదండ్రులు , 2.ఉపాథ్యా...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :పని లేక ..      టపా : స్త్రీలని గౌరవించండి.. లేదా అడుక్కుతినండి! (మా స్కూలు కబుర్లు)      వ్యాఖ్యనించిన తేది: 02-02-13 12:24:44

రమణ గారూ , 1.తల్లిదండ్రులు , 2.ఉపాథ్యాయులు బాధ్యత వహించ గల్గితే మంచి సమాజాన్ని రూపొందించ వచ్చు . నాటి తరమే దీనికి నిదర్శనం .నేడు ఈ రెండు వ్యవస్థల వైఫల్యము కొట్టొచ్చినట్లు కన్పిస్తూ ఉంది . ఆ తరం హైస్కూలు ప్రథానోపాథ్యాయులు , ఉపాథ్యాయులు విద్యార్థుల బాగు , సమాజ హితం తప్ప కల్మషమెరుగరు . పేదరికం తాండవిస్తున్నా నియమం తప్పని మహానుభావులు . విద్యార్థులను గాలి కొదిలే వారు కాదు . కాస్త కఠినంగా వ్యవహరించినా వాళ్ళవి స్వచ్చమైన దృక్పథాలు . ఇప్పుడది కొరవడింది . అన్ని వృత్తుల (...)


సకల సృష్టి యందు సర్వేశ్వరుని గాంచు దివ్య దృష్టి గ...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :స్మరణ      టపా : ఆహా... వారు మరింత చతురులు కదా !      వ్యాఖ్యనించిన తేది: 01-02-13 03:17:14

సకల సృష్టి యందు సర్వేశ్వరుని గాంచు దివ్య దృష్టి గల్గు ధీర మతులు చతుర భాషణముల శక్తి సంపన్నులు శ్రీ రమణులు - మనసు సేద తీరె


పాయని దయకు నిథానము , హాయికి కడ లేని చోటు , అమృత మయ...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :స్మరణ      టపా : ఆహా.....ఎంతటి చతురత!      వ్యాఖ్యనించిన తేది: 27-01-13 21:30:19

పాయని దయకు నిథానము ,హాయికి కడ లేని చోటు , అమృత మయమౌ నీ యెదపై తల నానిచి హాయిగ ఏడ్వంగ నాకు ఆశర సాయీ ! శ్రీ రమణా ! పురుషోత్తమ !కోరిన కోరికలు దీర్చు కూరిమి సఖుడా !చేరి భవదీయ పదముల నోరారగ నిన్భజించు నోపిక ఇమ్మా !


మదిని ఊరించే కొత్తావకాయ పై వెంకట రాజారావు . లక్కాకుల వ్యాఖ్యలు

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :జాజిమల్లి      టపా :      వ్యాఖ్యనించిన తేది: 26-01-13 22:58:28

ధీమమ్మున పౌరాణిక హేమపు జలతారు దెచ్చి , హృదయంగమమౌ ‘ గ్రామీణ తెల్గు పద సుమ దామము ‘ కొత్తావకాయ తానల్లె నహో ! రేపల్లె కధల తోనూ , ఆపయి శృంగార నాయి కాళి రచనలన్ దీపించి తెల్గు తేనియ తీపులతో తెల్గు నేల తృప్తిం గాంచెన్


శర్మ కాలక్షేపంకబుర్లు-స్వర్గానికి ప్రేమ యానం. పై వెంకట రాజారావు . లక్కాకుల వ్యాఖ్యలు

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :కష్టేఫలే      టపా :      వ్యాఖ్యనించిన తేది: 26-01-13 13:15:48

జీవమునకు చిరునామా భూవలయము నందు మొక్క , పుణ్యుడ ! తమ - ఆ శ్రీ విలసిత స్వర్గ తలము త్రోవలలో ప్రేమ యాత్ర తోషం బయ్యెన్ .


తల్లి యశోద మాట జవ దాటని యచ్చపు తల్లిచాటు ఆ యల్లరి...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :హరిసేవ      టపా : కన్నయ్య జన్మభూమి      వ్యాఖ్యనించిన తేది: 26-01-13 12:11:58

తల్లి యశోద మాట జవ దాటని యచ్చపు తల్లిచాటు ఆ యల్లరి పిల్లవాడు జగమంతటికిన్ గురు డన్న సత్య మా తల్లికి , గోప గోపికవితానముకున్ తన మోహ బంధమన్ పిల్లన గ్రోవి నూది కనిపింపగ నీని హరిం దలంచెదన్ .


మదిని ఊరించే కొత్తావకాయ పై వెంకట రాజారావు . లక్కాకుల వ్యాఖ్యలు

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :జాజిమల్లి      టపా :      వ్యాఖ్యనించిన తేది: 26-01-13 07:33:55

ధీమ్మున పౌరాణిక హేమపు జలతారు దెచ్చి , హృదయంగమమౌ ' గ్రామీణ తెల్గు పద సుమ దామము ' కొత్తావకాయ తానల్లె నహో ! రేపల్లె కధల యందున నాపయి శృంగార నాయి కాళి రచనలన్ దీపించి తెల్గు తేనియ తీపులతో తెల్గు నేల తృప్తిం గాంచెన్


తెలుగున నింగ్లీషు పదము లలవోకగ వాడు చుండ , ననువాదప...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :తెలుగు పద్యం      టపా : సాపుటేరుపై సరదా పద్యం      వ్యాఖ్యనించిన తేది: 24-01-13 13:06:46

తెలుగున నింగ్లీషు పదము లలవోకగ వాడు చుండ , ననువాదపు మా టలతో క్లిష్టత లేలా ?చెలువము చెడు , బమ్మి తిమ్మి చేయగ నేలా ? టలు మారి మనోజ్ఞత చెడి


' బస్సు చక్రం ప్రగతికి చిహ్నం ' - అంటే ఇద...

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :meraj fathima      టపా :      వ్యాఖ్యనించిన తేది: 22-01-13 01:23:46

' బస్సు చక్రం ప్రగతికి చిహ్నం ' - అంటే ఇదేనేమో!


కృష్ణ ‘ప్రియమైన బ్లాగర్’ పై వెంకట రాజారావు . లక్కాకుల వ్యాఖ్యలు

వ్యాఖ్యాత: :వెంకట రాజారావు . లక్కాకుల     బ్లాగు :జాజిమల్లి      టపా :      వ్యాఖ్యనించిన తేది: 21-01-13 12:37:47

సరదాగా నవ్వించుట వరము గదా కృష్ణ ప్రియకు , పాఠకులకు మీ పరిచయ భాగ్యము కల్గెను అరుదు గదా కృష్ణ లాంటి హాస్య రచయితల్

పుట 1 , మొత్తం 3 1 2 3 తరువాత తుది పుట



భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦