’కొంకణి’ని క్రైస్తవులతో,
’బేంకాక్’ ముస్లిముల తోడ వ...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1074 (వేంకటశాస్త్రికి మనుమలు)
వ్యాఖ్యనించిన తేది: 05-06-13 23:07:09
’కొంకణి’ని క్రైస్తవులతో,’బేంకాక్’ ముస్లిముల తోడ వియ్యంబందెన్ సంకుచిత భావ రహితుడు -వేంకటశాస్త్రికి మనుమలు విల్సన్, ఖాదర్!
తొండ యొకటి తిండి మెండుగా మేసెనో -
తోక బలిసి ఇంక తొ...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం - 697 (తొండ ఘీంకరించె)
వ్యాఖ్యనించిన తేది: 01-06-13 22:38:10
తొండ యొకటి తిండి మెండుగా మేసెనో -తోక బలిసి ఇంక తొండ మయ్యె!దాని తోడు నింక దాని గర్వము హెచ్చె!తొండ ఘీంకరించె తొండ మెత్తి!!
వేదములు నాల్గు; పంచమ
వేదము భారతము గాగ, విదుడొకడు భ...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా :
వ్యాఖ్యనించిన తేది: 01-06-13 22:14:42
వేదములు నాల్గు; పంచమవేదము భారతము గాగ, విదుడొకడు భువిన్వేదమె ’మార్క్సిజ” మిపుడని -వేదము లాఱని గణించె విజ్ఞులు మెచ్చన్!
నేమాని గారు!
"వాక్యావసానంబున సంధి లేమి దోషంబు...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1066 (కామితార్ధమ్ము లొసఁగదు)
వ్యాఖ్యనించిన తేది: 28-05-13 11:59:44
నేమాని గారు!"వాక్యావసానంబున సంధి లేమి దోషంబు గాదని యార్యులండ్రు" - చిన్నయ సూరి. ఉదాహరణలు : " ... సర్వ వేదసమధి గమము సత్యంబుతో సమము గావుఎరుగు మెల్ల ... " - ఆంధ్ర భారతము"పడగనున్న హనుమ భయవిహ్వలుడు కాడుఅరదమునకు ... " - ఆంధ్ర భారతముకాబట్టి మీ మధ్యాక్కరలో కూడ విసంధి దోషం కాదు.అయితే యడాగమం కూడదు.
శపియించిన నేమి తనను
విపరీతంబనగ పగటి వేళ - నిశన్, త...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1065 (కుపతిని గని మెచ్చె సాధ్వి)
వ్యాఖ్యనించిన తేది: 26-05-13 23:01:49
శపియించిన నేమి తననువిపరీతంబనగ పగటి వేళ - నిశన్, తానపర తిలోత్తమనని బొంకు పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్ !
పద్మార్పిత గారు!
వనజా వనమాలి గారు!
ధన్యవాదాలు!
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:మౌక్తికం
టపా : తిట్టు కవిత్వం
వ్యాఖ్యనించిన తేది: 23-05-13 11:58:34
పద్మార్పిత గారు!వనజా వనమాలి గారు!ధన్యవాదాలు!
మిస్సన్న గారు!
నేననుకొన్న భావనతోనే మీరు పూరించారు....
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1059 (భూతప్రేతపిశాచసంఘమును)
వ్యాఖ్యనించిన తేది: 20-05-13 23:05:28
మిస్సన్న గారు!నేననుకొన్న భావనతోనే మీరు పూరించారు.మీ పద్యం అద్భుతంగా, రసవత్తరంగా ఉంది. ఇక నేను పూరించినా అంత అందంగా రాదేమో!మీకు నా హృదయ పూర్వకాభినందన!
నా పద్యంలో మరియింత స్పష్టత పెంచే ప్రయత్నం ...
మా ...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1058 (రాయలు రచియించెనంట)
వ్యాఖ్యనించిన తేది: 20-05-13 22:51:39
నా పద్యంలో మరియింత స్పష్టత పెంచే ప్రయత్నం ...మా యమ గోదమ్మ కథను వ్రాయంగ నది యొక పెద్ద రామాయణమౌ!శ్రీ ’యామున చరిత’ గలిపి,రాయలు రచియించె నట్టి రామాయణమున్!
సహదేవుడు గారు!
మీ పద్యం ఉత్కృష్టంగా ఉంది. అభినందన!...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1058 (రాయలు రచియించెనంట)
వ్యాఖ్యనించిన తేది: 20-05-13 22:51:39
సహదేవుడు గారు!మీ పద్యం ఉత్కృష్టంగా ఉంది. అభినందన!
శ్రేయమునిడు శ్రీరంగడు,
మా యమ గోదమ్మ కథను మరి వివరి...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1058 (రాయలు రచియించెనంట)
వ్యాఖ్యనించిన తేది: 20-05-13 09:45:19
శ్రేయమునిడు శ్రీరంగడు,మా యమ గోదమ్మ కథను మరి వివరింపన్నాయది రామాయణమగు -రాయలు రచియించెనంట రామాయణమున్!
ఖిన్నుడనై రణంబున స్వకీయ విషాదము నర్జునుండ, నే
వెన్...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా :
వ్యాఖ్యనించిన తేది: 17-05-13 22:34:31
ఖిన్నుడనై రణంబున స్వకీయ విషాదము నర్జునుండ, నేవెన్నుని తోడ జెప్ప, తన విశ్వ విశాల మనోజ్ఞ రూపమున్కన్నయ చూపి, ’గీత’ను ప్రకాశ మొనర్చగ - మ్రొక్కి భక్తితోకన్నులు మూసి, కాంచితి ధగద్ధగ కాంతుల నాకసంబునన్.
మీ పోస్ట్ చదివాక నేను 2001 లో మాస్కో వెళ్ళినప్పుడు...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:వార్తా వ్యాఖ్య – భండారు శ్రీనివాస రావు
టపా : లెనిన్ సమాధి పునరుద్ధరణ
వ్యాఖ్యనించిన తేది: 17-05-13 13:57:24
మీ పోస్ట్ చదివాక నేను 2001 లో మాస్కో వెళ్ళినప్పుడు లెనిన్ భౌతిక కాయాన్ని దర్శించిన సందర్భం స్ఫురణకు వచ్చింది. ఆ సందర్భంగా నేను వ్రాసుకొన్న పద్యాలను ఈ లింక్ ద్వారా చదువండి.http://dracharyaphaneendra.wordpress.com/2012/05/01/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE-%E0%B0%B6%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%82-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF/
"కయ్యము నాతో సలుపును -
నెయ్యము రుక్మిణికి గూర...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1055 (తొయ్యలి తాలింపున నిడె)
వ్యాఖ్యనించిన తేది: 17-05-13 11:57:55
"కయ్యము నాతో సలుపును -నెయ్యము రుక్మిణికి గూర్చు - నిలువెల్ల విషంబయ్యో! శ్రీ కృష్ణుని" కనితొయ్యలి తాలింపున నిడె తులసీ దళముల్!
సుబ్బారావు గారు!
మీ పద్యం సరళ సుందరంగా చమత్కార బంధ...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:subbarao
టపా : తొయ్యలి తాలిం పున నిడె దుల సీ దళముల్
వ్యాఖ్యనించిన తేది: 17-05-13 11:23:55
సుబ్బారావు గారు!మీ పద్యం సరళ సుందరంగా చమత్కార బంధురంగా అమరి అలరించింది.మీకు నా అభినందన!
అక్త్రము రాక్షస రూపము;
వక్త్రజుడే చూడ లోన! వల్లించ...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1054 (వక్త్రంబుల్ పది గలిగిన)
వ్యాఖ్యనించిన తేది: 16-05-13 11:45:05
అక్త్రము రాక్షస రూపము;వక్త్రజుడే చూడ లోన! వల్లించు సదావక్త్రమునన్ శివ నామము!వక్త్రంబుల్ పది గలిగిన వానికి జేజే!
సుబ్బారావు గారు!
నోరూరించే పద్యాన్ని అందించారు. అభ...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:subbarao
టపా : పూతరేకులు
వ్యాఖ్యనించిన తేది: 13-05-13 00:54:16
సుబ్బారావు గారు!నోరూరించే పద్యాన్ని అందించారు. అభినందన!ఒక చిన్న సూచన - మూడవ పాదాన్ని "శుచిగ నుండు, నాస్వాదింప రుచిగ నుండు" అని మారిస్తే ’మరియును’ వంటి వ్యర్థ పదాన్ని పరిహరింప వచ్చు. అంతే కాకుండా బిందు పూర్వక ’డ’కారం అనుప్రాసగా వచ్చి పద్యం అందగిస్తుంది. ఈ అనుప్రాసకు కొనసాగింపుగా నాలుగవ పాదంలో "రండి" బదులు "రండు" అంటే మరింత అందగిస్తుంది. అలాగే .. "వాటిని" అసాధు రూపం. "వానిని" సాధు రూపం. సరి దిద్దిన పద్యం -"పూతరేకులు సేసి మా పొరుగ(...)
ప్రియ్ మిత్రులు శ్రీ శంకరయ్య గారు!
తెలుగు భాషా మతల...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : పద్య రచన - 339 (మాతృదేవత)
వ్యాఖ్యనించిన తేది: 12-05-13 13:37:37
ప్రియ్ మిత్రులు శ్రీ శంకరయ్య గారు!తెలుగు భాషా మతల్లికి మీరు చేస్తున్న సేవ ముందు నా కృషి ఏపాటిది చెప్పండి. మీకు నా ధన్యవాదాలు!
పొట్టను రూపమిచ్చి, పలు పోటుల నోర్చుచు తొమ్మిదిన్ న...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : పద్య రచన - 339 (మాతృదేవత)
వ్యాఖ్యనించిన తేది: 12-05-13 12:15:44
పొట్టను రూపమిచ్చి, పలు పోటుల నోర్చుచు తొమ్మిదిన్ నెలల్,గట్టిగ వచ్చు నొప్పులను కాదనకుండ సహించి, బిడ్డకున్ పెట్టియు జన్మ భిక్ష, తగు పేరిడి, ప్రేముడి పంచి పెంచి తాపట్టుచు పాలు, బువ్వ, గుణవంతుగ దీర్చెడి తల్లి! నీకు జై!
అంధకార గృహము నందు నడలి, యడలి,
తెరచె తలుపు రెక్క న...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1048 (రణముఁ గాంచి వగచె)
వ్యాఖ్యనించిన తేది: 10-05-13 11:12:29
అంధకార గృహము నందు నడలి, యడలి, తెరచె తలుపు రెక్క నొకింత, తెరపి గోరి - శూలమటు గ్రుచ్చుకొను సీత చూపు బోలురవి కిరణము గాంచి వగచె రామమూర్తి!
మూడవ పాదంలో ఒక లఘువు ఎక్కువయ్యిందని సరిచేసి ప్రచుర...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1044 (నెలతప్పిన రాజుఁ గాంచి)
వ్యాఖ్యనించిన తేది: 05-05-13 01:05:04
మూడవ పాదంలో ఒక లఘువు ఎక్కువయ్యిందని సరిచేసి ప్రచురించబోతే ఎందుకో మళ్ళీ అదే ప్రచురితమయింది. ఇప్పుడు సరి చేసి ప్రచురిస్తున్నాను.అల పున్నమి జాబిలి గనిపిలుచుచు పసిబిడ్డ కతని పేరును జెప్పన్పలుకక, అమవస మును వెన్నెల తప్పిన రాజు గాంచి ’నెలరా’జనియెన్!
అల పున్నమి జాబిలి గని
పిలుచుచు పసిబిడ్డ కతని పేరున...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1044 (నెలతప్పిన రాజుఁ గాంచి)
వ్యాఖ్యనించిన తేది: 05-05-13 00:45:18
అల పున్నమి జాబిలి గనిపిలుచుచు పసిబిడ్డ కతని పేరును జెప్పన్పలుకక, అమవస పిదప వెన్నెల తప్పిన రాజు గాంచి ’నెలరా’జనియెన్!
అల పున్నమి జాబిలి గని
పిలుచుచు పసిబిడ్డ కతని పేరున...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1044 (నెలతప్పిన రాజుఁ గాంచి)
వ్యాఖ్యనించిన తేది: 05-05-13 00:45:18
అల పున్నమి జాబిలి గనిపిలుచుచు పసిబిడ్డ కతని పేరును జెప్పన్పలుకక, అమవస పిదప వెన్నెల తప్పిన రాజు గాంచి ’నెలరా’జనియెన్!
శ్యామలీయం గారు!
"శరాఘాతమ్ము అని చెప్పటం జరిగ...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1042 (కరమొప్పారెను వాని దేహము)
వ్యాఖ్యనించిన తేది: 03-05-13 13:04:07
శ్యామలీయం గారు! "శరాఘాతమ్ము అని చెప్పటం జరిగింది కాబట్టి ఒక్క శరము యొక్క ఆఘాతము అనే చెప్పుకోవాలి." అన్నది తప్పుడు వ్యాఖ్యానం అవుతుంది.’బిల్వ పత్రార్చన’ అంటే ఒక్క బిల్వ పత్రంతోనే చేసే అర్చన కాదు గదా!
అందరికీ వందనం!
నిన్నటి నా చర్చా స్ఫూర్తిని మన &quo...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1041 (దారా రమ్మని పిల్చె)
వ్యాఖ్యనించిన తేది: 02-05-13 20:40:34
అందరికీ వందనం!నిన్నటి నా చర్చా స్ఫూర్తిని మన "శంకరాభరణం" సభ్యులు తప్పుగా అర్థం చేసుకొన్నట్టున్నారు. ఎవరేమి తప్పులు చేసినా ఎవరూ సరిదిద్దడం లేదు.లక్ష్మీదేవి గారు!మీ పద్యంలో "మనమోహనా" ప్రయోగం తప్పు. అలాగే, "సతిన్ యంచు" అని ధృతం మీద యడాగమం చేయడం తప్పు.వాటిని సరిదిద్దండి. అంచిత రసోత్పత్తికి దోహదపడని ఏ తప్పునైనా సరిదిద్దవలసిందే!నేమాని వారి "మద్ధృదారామ మందారా!", మీ "భక్త మందారా!" ప్రయోగాలు ఉదాత్తంగా ఉన్నాయి.మిస్సన్న గారు!మీ "కారే జంటలు(...)
శ్యామలీయం గారు!
నేను పాండిత్యం, కవిత్వం .. మధ్య తే...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1040 (కుండెడు పాలు బోసి యిడె)
వ్యాఖ్యనించిన తేది: 01-05-13 05:45:20
శ్యామలీయం గారు!నేను పాండిత్యం, కవిత్వం .. మధ్య తేడాను వివరించానే గాని, వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏమీ అనలేదే! చర్చ మాత్రమే చేసాం గాని, ఇందులో నేను మిమ్మల్ని అపార్థం చేసుకోడానికి ఏముంది?సరళంగా చెప్పాలంటే - పాండిత్యం(వ్యాకరణం,ఛందస్సు,అలంకార శాస్త్రం మొదలైనవి) మరియు కవిత్వం అన్నవి సైన్స్, ఇంజినీరింగ్ లేక చట్టం, న్యాయవాద వృత్తి లాంటి యుగళాలు. వీటిలో మొదటివి గైడ్ లైన్స్ అందిస్తే రెండవవి వాటి ఆధారంగా ప్రజోపయోగమైన పనులు చేస్తాయి. వీటిలో రెండవ పని చేసేవారు కార్య సాధనలో కొంత వారి ’ఇంటర్ ప్రిటేషన(...)
అఖండ యతిని వేయాలా? వద్దా? ... అన్నది ఒక భావాన్ని ప...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1040 (కుండెడు పాలు బోసి యిడె)
వ్యాఖ్యనించిన తేది: 01-05-13 03:26:58
అఖండ యతిని వేయాలా? వద్దా? ... అన్నది ఒక భావాన్ని పద్యంలో చెబుతున్నప్పుడు ఆ పరిస్థితిని బట్టి రస దృష్టి విచక్షణతో ఆ కవి మాత్రమే తీసుకోవలసిన నిర్ణయమే గాని; పెద్ద కవి, చిన్న కవి అని వ్యక్తిగతంగా కాదు. ఆ పరిస్థితి ఒకానొక భావ ప్రకటనలో పెద్ద కవికీ రావచ్చు. చిన్న కవికీ రావచ్చు. అలాంటి పరిస్థితులలోనే పూర్వకాలంలో కూడ పెద్ద కవులు సైతం అఖండ యతిని ప్రయోగించింది. నేటి చిన్న కవులైనా అఖండ యతిని పరిహరించే నెపంతో పద్యాన్ని రస హీనం చేయకూడదు. మొత్తానికి రస దృష్టి ప్రధానమన్నది నా ఉద్దేశ్యం. రసంపై ప్రధ(...)
శంకరయ్య గారు!
రసాత్మకంగా మలిచేప్పుడు అఖండ యతిని అం...
వ్యాఖ్యాత: :డా.ఆచార్య ఫణీంద్ర
బ్లాగు
:శంకరాభరణం
టపా : సమస్యాపూరణం – 1040 (కుండెడు పాలు బోసి యిడె)
వ్యాఖ్యనించిన తేది: 30-04-13 23:57:58
శంకరయ్య గారు!రసాత్మకంగా మలిచేప్పుడు అఖండ యతిని అంతగా పట్టించుకోవలసిన పని లేదేమో!రస మాధుర్యాన్ని త్యాగం చేసి, మరీ మడి గట్టుకోవలసిన అవసరముందా? ... అనిపిస్తుంది నాకు. "మానసమం దెదో తళుకు మన్నది పుష్ప విలాప కావ్యమై" - (కరుణశ్రీ పద్య పాదం) హృదయానికి హత్తుకొని నరుల నాల్కల పైన శాశ్వతంగా నాట్యమాడడం లేదా? ఏ లక్షణకారుడైనా రీతినో, రసాన్నో, ధ్వనినో .. కావ్య లక్షణాలుగా పేర్కొన్నారు గాని, కేవల వ్యాకరణాన్నో, ఛందస్సునో కావ్య లక్షణంగా చెప్పలేదన్నది వాస్తవం.మీరు సున్నిత హృదయులు .. ఎవరినీ నొప(...)