Skip Navigation Links


తేలును జూడగ భయమున తేలునుగా మనసు మనకు తెలియుము నిజ...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 375 (తేలు)      వ్యాఖ్యనించిన తేది: 16-06-13 22:26:14

తేలును జూడగ భయమున తేలునుగా మనసు మనకు తెలియుము నిజమున్తేలును విషమున తేడా తేలును మరి ఖలుని బుద్ధి తేటగ గనినన్.


పూనకము తోడ రారాజు పూని చెప్పె వాదమేలయ్య వినవయ్య య...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా :      వ్యాఖ్యనించిన తేది: 16-06-13 22:11:27

పూనకము తోడ రారాజు పూని చెప్పె వాదమేలయ్య వినవయ్య యాదవయ్య సంధి సేయము సమరమ్ము సలుప గలము పానకములోని పుడుకలు పాండుసుతులు.


లోగిలిలో తోటలలో మూగిన పిల్లలకునెంతొ ముచ్చట గొలుపున...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 373 (దాఁగిలి మూఁతలు)      వ్యాఖ్యనించిన తేది: 15-06-13 01:18:11

లోగిలిలో తోటలలోమూగిన పిల్లలకునెంతొ ముచ్చట గొలుపున్దాగిలి మూతలనాడగదాగుడుమూతను పలుకుచు దండాకోరున్


కనుమిది నాన! నాన! మరి కష్టము నాకిది చంపకమ్మనన్ వి...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : సమస్యాపూరణం – 1080 (నననన నాననా ననన)      వ్యాఖ్యనించిన తేది: 15-06-13 01:18:09

కనుమిది నాన! నాన! మరి కష్టము నాకిది చంపకమ్మనన్ వినుమిక చెప్పుదింక నొక వీనులవిందగు మంత్రమొక్కటే ననుచును చెప్పె దండ్రి కన నా లతొ గూడిన నవ్య మంత్రమే నననన నాననా ననన నానన నానన నాననా ననా!


నరుల శుద్ధులజేయగా నదిగ దిగెను మురికి కూపమ్ము జేసె...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా :      వ్యాఖ్యనించిన తేది: 14-06-13 22:28:48

నరుల శుద్ధులజేయగా నదిగ దిగెను మురికి కూపమ్ము జేసెను మూర్ఖ నరుడుబుద్ధి లేనట్టి నరునికై భువికి వచ్చి పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె.


గన్నవరపు నరసింహమూర్తి గారికీ వారి కుటుంబసభ్యులకు ...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : గన్నవరపు వారికి శుభాకాంక్షలు!      వ్యాఖ్యనించిన తేది: 10-06-13 13:28:14

గన్నవరపు నరసింహమూర్తి గారికీ వారి కుటుంబసభ్యులకు అభినందనలు.నూత్నవధూవరులకు శుభాకాంక్షలు. హారిక వధువై వెలుగగ నారాయణ మూర్తి తగిన నవవరుడవగాఆరయ నరసింహునికిని వారందరికిని శుభమును వాంఛింతునుగా.


పల్లియ కన్నియ చూడుడు మల్లెలనే కట్టుచుండె మాలగ, నె...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 368      వ్యాఖ్యనించిన తేది: 10-06-13 13:28:13

పల్లియ కన్నియ చూడుడు మల్లెలనే కట్టుచుండె మాలగ, నెదుటే అల్లన మెల్లన తిరిగెడు తెల్లనిపక్షులనుజూచి తేటగ నవ్వెన్.


ఎగ్గులు జేయు సంఘటనల నేమియు ధర్మము దప్పకుంటచే ...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా :      వ్యాఖ్యనించిన తేది: 08-06-13 22:58:44

ఎగ్గులు జేయు సంఘటనల నేమియు ధర్మము దప్పకుంటచే నుగ్గుగ జేయ కౌరవుల నూతన తేజము లొప్ప దీవెనల్ తగ్గవిధమ్ము కృష్ణుడును తాముగ శూలియు మారుతీయగా ముగ్గురు, పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే!


కారది మారెను చూడగ కారడవులు పెరిగియున్న కారణ మునన...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 367 (వర్షము)      వ్యాఖ్యనించిన తేది: 08-06-13 22:45:16

కారది మారెను చూడగ కారడవులు పెరిగియున్న కారణ ముననే కారుచునుండెను వర్షము కారగ నానందము మన కన్నులలోనన్.


హిందూ మత భావమ్మును పొందికగా లోకమునకు బోధించుటకై...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 366 (హిందూ ధర్మసమ్మేళనము)      వ్యాఖ్యనించిన తేది: 07-06-13 22:58:05

హిందూ మత భావమ్మును పొందికగా లోకమునకు బోధించుటకై అందరు గురువులు నిలచిన సుందర దృశ్యమ్ము మిగుల శోభన్ గూర్చెన్.


ప్రేమగ నఖముల బెంచెను ప్రేమయె తా గోళ్ళరంగు ప్రీతిగ...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా :      వ్యాఖ్యనించిన తేది: 07-06-13 22:45:26

ప్రేమగ నఖముల బెంచెను ప్రేమయె తా గోళ్ళరంగు ప్రీతిగ వేసెన్ ప్రేమించి మేన బావగు రాముఁడు 'శూర్పణఖ' నపుడు రహిఁ బెండ్లాడెన్.


మిస్సన్న గారూ! ధన్యవాదములు.

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :సమస్యల 'తో ' రణం ('పూ'రణం )      టపా : వర్ణ(న)చిత్రం - మాయాబజారు.      వ్యాఖ్యనించిన తేది: 07-06-13 21:48:14

మిస్సన్న గారూ! ధన్యవాదములు.


తడిజేసి చేతి వ్రేళ్ళతొ పడిపడితా మినపపప్పు పట్టుచు...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : సమస్యాపూరణం – 1075 (పిడి కొస లెరుపెక్క)      వ్యాఖ్యనించిన తేది: 07-06-13 03:48:14

తడిజేసి చేతి వ్రేళ్ళతొపడిపడితా మినపపప్పు పట్టుచు రుబ్బన్ వడిదిప్ప బట్టి పొత్రపు పిడి, కొస లెరుపెక్క బతినిఁ బిలచెను సతియే.


మానవుడనగ నొక కొల మానముండు మానమేయది దానిని మానవలదు ...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 365 (మానవుఁడు - దానవుఁడు)      వ్యాఖ్యనించిన తేది: 07-06-13 03:48:14

మానవుడనగ నొక కొల మానముండుమానమేయది దానిని మానవలదుమానమన్నది లేకుండ మనినయెడల మానవుండగు నిక్కము దానవునిగ.


మాస్టరు గారూ ! ధన్యవాదములు...దోష సవరణ చేయుచున్నాను...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 364 (పిడుగుపాటు)      వ్యాఖ్యనించిన తేది: 06-06-13 22:05:50

మాస్టరు గారూ ! ధన్యవాదములు...దోష సవరణ చేయుచున్నాను...ఓరీ పిడుగా!పడెదవెఈరీతిగ కూలివార లెటునిలబడినా ఘోరంబులు జేసెడి ఘన చారిత్రుల మీద పడిన చరితార్ధుడవే !


ఆర్యా ! ధన్యవాదములు. నువు .. నూ గా మారింది. సవరణత...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 364 (పిడుగుపాటు)      వ్యాఖ్యనించిన తేది: 06-06-13 21:13:52

ఆర్యా ! ధన్యవాదములు. నువు .. నూ గా మారింది. సవరణతో...ఓరీ పిడుగా!నువు ప్రతి సారీ కూలీల పైనె సరిగా పడెదవ్ ఘోరంబులు జేసెడి ఘన చారిత్రుల మీద పడిన చరితార్ధుడవే !


ఆర్యా ! ధన్యవాదములు. ముస్లిం యువతిని పెండ్లాది, క...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : సమస్యాపూరణం – 1074 (వేంకటశాస్త్రికి మనుమలు)      వ్యాఖ్యనించిన తేది: 06-06-13 21:13:51

ఆర్యా ! ధన్యవాదములు. ముస్లిం యువతిని పెండ్లాది, క్రిస్తియన్ మతం పుచ్చుకున్నాడని నాభావం...సవరణతో...జంకక హసీన బట్టెను మంకుగ కొడుకే యవనుల మతమే మారెన్ ఇంకేమి చెపుదు చూడగ వేంకట శాస్త్రికి మనుమలు విల్సన్ ఖాదర్


మూర్తి గారూ ! చక్కని ఆలోచన...భేష్ .

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : సమస్యాపూరణం – 1074 (వేంకటశాస్త్రికి మనుమలు)      వ్యాఖ్యనించిన తేది: 05-06-13 22:51:11

మూర్తి గారూ ! చక్కని ఆలోచన...భేష్ .


మాస్టరుగారూ !బహు చక్కని పూరణ .. బాగుంది. పండిత నే...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా :      వ్యాఖ్యనించిన తేది: 05-06-13 22:34:26

మాస్టరుగారూ !బహు చక్కని పూరణ .. బాగుంది.పండిత నేమాని వారు, మధు గారి పూరణలు వైవిధ్యంగా ఉన్నాయి.


ఓరీ పిడుగా నూ ప్రతి సారీ కూలీల మీద సరిగా పడెదవ్ ఘ...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 364 (పిడుగుపాటు)      వ్యాఖ్యనించిన తేది: 05-06-13 21:50:36

ఓరీ పిడుగా నూ ప్రతి సారీ కూలీల మీద సరిగా పడెదవ్ఘోరంబులు జేసెడి ఘన చారిత్రుల మీద పడిన చరితార్ధుడవే !


జంకక ఖాదర్ బీ నే మంకుగ పెండ్లాడి కొడుకు మతమే మారెన...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా :      వ్యాఖ్యనించిన తేది: 05-06-13 21:50:35

జంకక ఖాదర్ బీ నేమంకుగ పెండ్లాడి కొడుకు మతమే మారెన్ ఇంకేమి చెపుదు చూడగ వేంకట శాస్త్రికి మనుమలు విల్సన్ ఖాదర్


పేరేమొ ' సాధ్వి ' యామెది హీరోయిను మోజు మీ...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా :      వ్యాఖ్యనించిన తేది: 03-06-13 22:44:24

పేరేమొ ' సాధ్వి ' యామెది హీరోయిను మోజు మీద హే ! చెన్నైకే చేరెను పస్తులు మాపగ రారమ్మని పిల్చె' సాధ్వి ' రంజిల విటులన్.


ఆకాశయానమ్ము నవలీలగా సేయు పవన పుత్రుడతడు బాల్యమందు ...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 361 (జై హనుమాన్!)      వ్యాఖ్యనించిన తేది: 03-06-13 10:45:45

ఆకాశయానమ్ము నవలీలగా సేయుపవన పుత్రుడతడు బాల్యమందుఅగ్నులెగయు రవి నరచేతనే పట్టె జలనిధినే దాటె శౌర్య ధనుడు పుడమిపుత్రిక జాడ బుద్ధిబలము జూపిస్వామికే జెప్పె నసాధ్యుడతడురోమరోమమునందు రాముడే కనిపించు భావి బ్రహ్మ యమిత బాహుబలుడు పంచభూతములాయన పట్టునుండు పంచబాణునివైరి యా పరమ శివుడె పంచవక్తృడు మారుతి భక్త జనుల పంచనుండును మనకెట్టి భయము వలదు.


సత్యభామ పాత్ర సరసంబుగా వేసి నాటకంబునందు నలుగురెదు...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : సమస్యాపూరణం – 1071 (భర్త భామ యయిన)      వ్యాఖ్యనించిన తేది: 03-06-13 10:03:03

సత్యభామ పాత్ర సరసంబుగా వేసి నాటకంబునందు నలుగురెదుట మెప్పునంది తేగ 'కప్పు ' నొక్కటి నాడు భర్త "భామ" యయిన భార్య మురిసె


చలన చిత్రంబునాతడు శకుని మామ పవన సుతునకు గుడికట్టె...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : సమస్యాపూరణం – 1069 (శకుని ధర్మాత్ముఁ డనఘుఁడు)      వ్యాఖ్యనించిన తేది: 01-06-13 05:18:20

చలన చిత్రంబునాతడు శకుని మామ పవన సుతునకు గుడికట్టె భక్తుడతడు తోటివారికి గుంటూరు ధూళిపాళ్ళ శకుని ధర్మాత్ముఁ డనఘుడు సత్పురుషుడు !


ఎన్నియున్నగాని యిలలోన మనుజుడా ! నిన్ను నీవు తెలిసి...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 359 (తత్త్వమసి)      వ్యాఖ్యనించిన తేది: 01-06-13 05:18:19

ఎన్నియున్నగాని యిలలోన మనుజుడా !నిన్ను నీవు తెలిసి నిజముగాను"తత్వమసి " తలచుచు తపనతో తగినట్లు బ్రతికి పొంద వలయు పరమ పదము


taanu kaalucunna tana vaarikeppuDu velugu paMcuva...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 357 (మిత్రుఁడు)      వ్యాఖ్యనించిన తేది: 30-05-13 23:42:30

taanu kaalucunna tana vaarikeppuDu velugu paMcuvaaDu viSwamaMdu niyama mepuDu daaTaneekuMDa melagucu melaguvaaDu cooDa mitruDagunu.


pillalu peddalaMdarunu vEDini taaLaka vEgucuMDagaa...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : సమస్యాపూరణం – 1067 (చల్లగ నయ్యె నీ ప్రకృతి)      వ్యాఖ్యనించిన తేది: 30-05-13 23:42:30

pillalu peddalaMdarunu vEDini taaLaka vEgucuMDagaa allana vaayuguMDamadi yaMbudhipainanu tirGucuMDegaanallani mEghamaaalikalu NaaTyamujEyucu noogucuMDagaa చల్లగ నయ్యెనీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చి నంతనే !


poga cooru needu tittulu pogulucu neevaaru tiTTi p...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 358 (పొగ త్రాగెడువాఁడు)      వ్యాఖ్యనించిన తేది: 30-05-13 23:42:29

poga cooru needu tittulupogulucu neevaaru tiTTi pOseda rakaTaa pogabeTTa vaari bratukuna poga riMgula kanabaDenu kapOlamu needE !


poga cooru needu tittulu pogulucu neevaaru tiTTi p...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 358 (పొగ త్రాగెడువాఁడు)      వ్యాఖ్యనించిన తేది: 30-05-13 23:42:29

poga cooru needu tittulupogulucu neevaaru tiTTi pOseda rakaTaa pogabeTTa vaari bratukuna poga valadane vadala nee kapOlamu kanumaa!


అరుగును నేనే వీధిని యరిగెడు ఓ బాట సారి యలసితి వేమ...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 356 (వీధి యరుగు)      వ్యాఖ్యనించిన తేది: 28-05-13 22:19:50

అరుగును నేనే వీధిని యరిగెడు ఓ బాట సారి యలసితి వేమో అరిగిన యరుగక యున్నను తిరుగక నూ సేద తీర తీరే మారున్.


ద్రౌపది ధర్మరాజుతో.. తమ్ములు పోవరులే పం తమ్ముల...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా :      వ్యాఖ్యనించిన తేది: 28-05-13 22:08:43

ద్రౌపది ధర్మరాజుతో..తమ్ములు పోవరులే పంతమ్ములు తమ మాట వినును తగ నైదగు భూ తమ్ములు మీరే కన నా తమ్ములు నూరైన గాని తమసరి రారే !


పతిని పోల్చుట కానాడు పడతి చంద్ర మతికి నుపయోగ పడె...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 355 (చంద్రమతి మాంగల్యము)      వ్యాఖ్యనించిన తేది: 27-05-13 22:51:47

పతిని పోల్చుట కానాడు పడతి చంద్ర మతికి నుపయోగ పడె నిట్టి మహిమ కాదెపుస్తె భర్తయె తా దప్ప పుడమి నెవరు చూడ జాలని వరమద్ది చూడుడయ్య.


మహిష మర్దని స్తోత్రమ్ము మనసుదలచి పూజ జేయుచు పదముల...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా :      వ్యాఖ్యనించిన తేది: 27-05-13 22:40:03

మహిష మర్దని స్తోత్రమ్ము మనసుదలచి పూజ జేయుచు పదముల పూలు వేసి నీవె దిక్కని వేడగా నెందు కామె కామితార్ధమ్ము లొసఁగదు ? కనకదుర్గ.


పట్టిన నశ్యపు పట్టును బట్టలు పాడౌను చేర భార్యయు ...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 354 (నస్యము)      వ్యాఖ్యనించిన తేది: 26-05-13 22:38:46

పట్టిన నశ్యపు పట్టును బట్టలు పాడౌను చేర భార్యయు తిట్టున్ పట్టును తిత్తుల క్యాన్సరు పట్టును వీడుచును దాని పడవేయవలెన్.


ధూమ పత్రంబు పొయి మీద దోరగాను చూచి వేయించి నెయి వ...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 354 (నస్యము)      వ్యాఖ్యనించిన తేది: 26-05-13 22:18:17

ధూమ పత్రంబు పొయి మీద దోరగాను చూచి వేయించి నెయి వేసి చూర్ణముగను సున్నమింతయు గలుపుచు సొగసుగాను చేసి పీల్చిన స్వర్గమ్ము చేరువగును.


స్తపతి విదేశము వెడలెను నృపులెండరొ కాన్కలీయ నేరుగ ...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా :      వ్యాఖ్యనించిన తేది: 26-05-13 22:06:40

స్తపతి విదేశము వెడలెను నృపులెండరొ కాన్కలీయ నేరుగ దెచ్చెన్ విపులముగా చూపగ తన కు, పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్.


ఆర్యా ! ధన్యవాదములు.. మా నర భక్షక బదులు భక్షయ గా ...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : సమస్యాపూరణం – 1064 (వానర సైన్యమ్మె రక్ష)      వ్యాఖ్యనించిన తేది: 26-05-13 02:01:32

ఆర్యా ! ధన్యవాదములు..మా నర భక్షక బదులు భక్షయ గా టైపాటు...సవరణతో...ఆనర పతి రామునకీవానర సైన్యమ్మె రక్ష, పంక్తిముఖునకున్మా నరభక్షక సైన్యము మానరు సరి రక్ష జేయ మాదే గెలుపౌ.


ఛందస్సనగా వేదము ఛాందసుడన వేదములను చదివిన వాడే ...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : పద్య రచన - 353 (ఛాందసుఁడు)      వ్యాఖ్యనించిన తేది: 26-05-13 01:11:06

ఛందస్సనగా వేదము ఛాందసుడన వేదములను చదివిన వాడే అందదు అర్థంబది గన ఛాందసుడమాయ కుడునగు జనులకు నేడే.


రామ రావణ యుద్ధ సమయం లో ఒక లంకావాసి స్వగతం.. ఆనర...

వ్యాఖ్యాత: :గోలి హనుమచ్ఛాస్త్రి     బ్లాగు :శంకరాభరణం      టపా : సమస్యాపూరణం – 1064 (వానర సైన్యమ్మె రక్ష)      వ్యాఖ్యనించిన తేది: 26-05-13 01:11:06

రామ రావణ యుద్ధ సమయం లో ఒక లంకావాసి స్వగతం..ఆనర పతి రామునకీ వానర సైన్యమ్మె రక్ష, పంక్తిముఖునకున్ మానర భక్షయ యసురులుమానరు సరి రక్ష జేయ మాదే గెలుపౌ.



భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦